Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> రక్తాభిషేకం

raktabhishekam

ఇద్దరు రాక్షసులు రాగానే నాలో కోపం ,వ్యతిరేకతను చూసారు. ఒకడు నన్ను గట్టిగా పెట్టుకొంటే ఇంకొకడు  నా రెండు కాళ్ళను మంచానికి రెండువైపులా కట్టి పడవేశారు.

"ఏయ్ కాస్సేపు అలాగే విశ్రాంతి  తీసుకో. మేము మొత్తం ఆరు మంది ఉన్నాం .ఈ రాత్రి అంతా నీతో .....” అన్నాడు.

“ముందు మేమందరం మందు వేసుకొని ఒక రౌండు పూర్తి అయ్యాక ఒక్కొక్కరం వస్తాం." ఇంకొకడు అన్నాడు.ఇద్దరూ గది దాటి హాలుకు వెళ్లారు.తలుపు గడియపెట్టి  లోనికి వస్తున్న వ్యక్తిని చూడగానే అంత బాధలోనూ  నాలో  ఒక పెద్ద అగ్ని పర్వతం  బద్దలైంది. తాతయ్య కన్నా ఎక్కువ వయసు కల వీడికి అత్యాచారం చెయ్యాలన్న కోరికా .....వయసు చూస్తుంటే డెబ్భై ఐదు పైననే ఉండవచ్చు. వీడికి మనవరాలు అంటూ లేదా  అనుకొంటున్న నాలో  కోపం పెద్దఎత్తున లావాలా  పెల్లుబికింది.  ఎంతకోపం ఉన్నాఏమీ చేయలేని ఆసక్తురాలినయ్యాను. ముసలి రాక్షసి వెదవ రాగానే  నా చెంప ఛెళ్ళు  మనిపించాడు.  వాడాలా కొడతాడని ఊహించి ఉంటే నా రెండు చేతులతో గొంతు పిసికి చంపివేసేదాన్ని.

"ఎక్కడ పని చేస్తున్నావ్...."  కోపంతో అడిగాడు. వాడికి సమాధానం చెప్పడం ఇష్టం లేక ముఖాన్ని అటువైపు అసహ్యంతో తిప్పుకున్నాను.  ఇంతకు ముందు వచ్చిన రాక్షసులు నా రెండు కాళ్లను రెండువైపులా మంచానికి గట్టిగా కట్టివేసారు.  లేకుంటే ఈ ముసలి రాక్షసుడిని రెండు కాళ్లతో బలవంతంగా తన్నివేద్దామన్న కోపము...... దూరంగా టేబుల్ మీదున్న నా బాగ్ తెరచి చూశాడు.    నా ఐడెంటిటీ కార్డు చూసి “ఓహ్... ఐ.టీ. కంపెనీలో పెద్ద ఉద్యోగస్థురాలివి . అంటే పెద్ద డిగ్రీలు ఉంటుంది. ఇన్ని డిగ్రీలు చదివిన దానివి ఆ రాక్షసుల నుండి కాపాడుకొనే తెలివి తేటలు లేనప్పుడు ఈ ఉద్యోగం ఎందుకు .. ఈ చదువులు ఎందుకు." మెల్లగా అన్నాడు .

ఆ మాటలతో  నాకు ఏదో సహాయం చేయడానికి వచ్చారని ఊహించాను .   "క్షమించండి సార్, కాల్ టాక్సీ కోసం  చూడసాగాను.  అనుకోకుండా మెరుపులా ఒక టాక్సీలో వచ్చిన వీళ్ళు నా ప్రక్కనే నిలబెట్టి డోర్ తెరచి ఎదురు చూడని విధంగా లోనికి లాక్కున్నారు. ఎంత ప్రతిఘటించిన ఆ రాక్షసుల ముందు ....."    అన్నాను.

“ మొత్తం వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా” విసుగ్గా అన్నాడు.

"ఇంతకు ముందు నా కాళ్ళు కట్టిపడేసిన ఆ రాక్షసులు ‘మొత్తం ఆరుమంది ‘ఉన్నట్లుగా తెలిపారు." కన్నీళ్లతో   అన్నాను.

“చూడమ్మా నేను ఈ పామ్ హౌస్ కు కొత్తగా చేరిన నౌకరును. నీపై ఎటువంటి అత్యాచారం జరగకుండా ఎలాగైనా కాపాడాలన్న ఆలోచనతో   దైర్యం చేసి నీ పై  మోజు ఉందని  చెప్పగానే అంగీకరించారు. ఎందుకలా అంగీకరించారో నాకు అర్థం కాలేదు.  ఇలాంటి సమయంలో ఏడుపు కాదు ....ఏమి చెయ్యాలా అని ఆలోచించు”

“సార్ నేను  ఆడదాన్ని ...ఆ రాక్షసులను ....."

“నిర్భయ చట్టం వచ్చినా మగరాక్షసులు నిర్భయంగా తిరుగుతున్నారని తెలీదా .ఒక చిన్న కత్తి అయినా రక్షణ కోసం ఉంచుకోవాలన్న ఇంగిత జ్ఞానం లేదా……. ఒక  చిన్న  కత్తి  నీ  చేతిలో  ఉండిఉంటే నేను ఆబాలను ఆడదాన్ని అని ఉండేదానివి కాదు . ఝాన్సీ లక్ష్మి బాయ్ ఒక ఆడది అన్న సంగతి మరచిపోయావా....ఈ కత్తి  తీసుకొని  దాచుకో. ఆ వచ్చే వాడ్ని చంపాలి. ఆతరువాత అదే కత్తితో నీ కాళ్లకున్న కట్లు విడిపించుకొని, నీ సెల్ ఫోన్ ద్వారా పోలీసులకు చెప్పు .” అన్నారు.

"క్షమించండి సార్ నా సెల్ ఫోన్ ఆ రాక్షసుల చేతిలో" అన్నాను కన్నీళ్లతో

" నా దగ్గర కూడా సెల్ ఫోన్ లేదు "అన్నారు

" సార్ నా చేతిలో చచ్చే వాడిదగ్గర  సెల్ ఫోన్ ఉంటె సమస్యే లేదు. వాడ్ని చంపిన తరువాత వాడి సెల్ ఫోన్ ద్వారా చెప్ప వలసిన వారందిరికీ చెబుతాను."అన్నాను.ఆ మాటలన్న తరువాత ఒక్క క్షణం అలోచించి ఇంత దైర్యంగా నమ్మకంతో ఎలా అన్నాను అనుకొంటున్న నాలో నాకే ఏదో తెలియని ఆశ్చర్యం భయం కలిగింది.

“ఒకవేళ వాడి దగ్గర సెల్ ఫోన్ లేకుంటే  "తలపైన పిడుగు పడినంత ప్రశ్న వేశారు.

“ఔను సార్ ఏమి చేయాలి "అయోమయంతో అడిగాను

" ఈ బాత్ రూమ్ నందున్న వెంటిలేటర్ కు గ్లాస్ లు ఉన్నాయి సులభంగా తీయవచ్చు ఆ స్టూల్ సహాయంతో తీసి పారిపో.  ప్రక్కనే మెయిన్ రోడ్ వస్తుంది ఎలాగోలా పోలీసులకు కబురు పెట్టు. నీపై ఎటువంటి అత్యాచారం కలగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .జాగ్రత్త " అంటూ వెళ్ళారు.తలుపులు తెరవగానే "ఎరా ముసిలోడా మోజు తీరిందా...అయినా నేను చెప్పానుగా ఆ ముసిలోడు ఏమి చేయలేడు అని. కొత్త నౌకరు అని మనం భయపడే పని ఉండకూడదనే వీడు అడగగానే సరేఅన్నాను. ఇక వీడు మనకు కుక్కలా విశ్వాసంతో పని చేస్తాడు "అంటున్న మాటలు వినపడింది

" ఒరేయ్  ముసిలోడా మందుకు తీసుకొని వచ్చినది తక్కువగా ఉంది వంట గదిలో అన్నీ ఉన్నాయి  కారంగా ఏదైనా చేసి తీసుకునిరా" ఇంకొకడి మాటలు వినపడింది.కొంత సమయం తరువాత ఒక రాక్షసుడు లోనికి వచ్చి తలుపులు గడియపెట్టి తూలుతూ రావడం గమనించాను. నేను ఎక్కువ శ్రమ పడకుండానే వాడ్ని పొడిచి చంపాను. వాడి జేబులో ఉన్న సెల్ ఫోన్ తీసుకొని మొదట పోలీసులకు ఆ తరువాతా ముఖ్యమైన వారికి ఫోన్ చేసాను. పోలీసుల జీప్ శబ్దం విన్నాను. ఆ తాతయ్య "అమ్మా తలుపులు తెరువమ్మా పోలీసులు వచ్చి వారిని అదుపులో తీసుకొన్నారు."అన్నారు.

ఆ రాక్షసుడి  రక్తం గడ్డకట్టుకొని పోయిన నా  చేతులతో కృతజ్ఞతాపూర్వకంగా దేవుడు లాంటి తాతయ్య కాళ్ళను పట్టుకొని భోరుమని విలపించసాగాను.

మరిన్ని కథలు
amtakarasuddhi