Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cartoons

ఈ సంచికలో >> శీర్షికలు >>

01-02-2019 నుండి 07-02-2019 వరకు వారఫలాలు - - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

 ఈవారం బంధువులను కలుస్తారు వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. గతంలో చేపట్టిన పనుల వలన సమాజంలో మంచి పేరు లభిస్తుంది. కోపాన్ని తగ్గించుకోవడం వలన మేలుజరుగుతుంది, అవతలి వారి సూచనలు పరిగణలోకి తీసుకోండి. ఆర్థికపరమైన విషయాల్లో అలాగే రుణపరమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. పెద్దలతో నూతన పరిచయాలు ఏర్పడుతాయి. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది .  

 


 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

 ఈవారం విదేశీప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు యోగకాలం , కాస్త శ్రమించుట ద్వారా ఉన్నతమైన ఫలితాలు పొందుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా పడుటకు ఆస్కారం ఉంది. చర్చలకు అవకాశం ఉంది. ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండుట సూచన. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచితం. అధికారులతో మీ ఆలోచనలు పంచుకుంటారు.

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈవారం బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఆరోగ్యం విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకోండి. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి, సర్దుబాటు విధానం మంచిది. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి వచ్చిన సమాచారం మీకు ఉపయోగపడుతుంది. సంతానం విషయంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు.

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈవారం మిత్రులతో లేదా బంధువులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. ఉద్యోగంలో కీలకమైన విషయాలు చర్చలకు వచ్చే ఆస్కారం ఉంది, పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. తండ్రితరుపు బంధువులతో విరోధాలు లేదా మాటపట్టింపులకు వెళ్ళకండి. విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. సొంతనిర్ణయాల కన్నా అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి.
 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

ఈవారం సంతానపరమైన విషయాల్లో ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపార పరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు ఆస్కారం ఉంది. తల్లితరుపు బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. మానసికంగా కొంత ఇబ్బందులు తప్పక పోవచ్చును , సాధ్యమైనంత మేర వివాదాలకు దూరంగా ఉండుట సూచన. మిత్రులతో సమయం గడుపుతారు.

 

 

 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

 ఈవారం వ్యాపారపరమైన విషయాల్లో ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. తలపెట్టిన పనుల వలన నలుగురిలో మంచి పేరుబ లభిస్తుంది. బంధువులను కలుసుకుంటారు, వారినుండి నూతన విషయాలు తెలుస్తాయి. సంతానం విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాల వలన ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంది. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే ఆస్కారం కలదు, ప్రయత్నాలు ముందుకు సాగుతాయి.

 

 


తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

ఈవారం ఆత్మీయులను కలుస్తారు, వారినుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో కాస్త చూసిముందుకు వెళ్లడం సూచన. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అధికారులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబపరమైన విషయాల్లో కాస్త చికాకులు, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఉన్నత విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన.

 

.

 
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈవారం విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా చేస్తరు. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి ముఖ్యమైన సమాచారం పొందుతారు. తండ్రితరుపు బంధువులను కలుస్తారు. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. స్వల్పదూరప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆత్మీయులనుండి సహకారం లభిస్తుంది. కుటుంబంలో పెద్దలనుండి పూర్తి సహకారం లభిస్తుంది. సంతానం విషయంలో సంతృప్త్తికరమైన ఫలితాలు పొందుతారు.

 


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారం నూతన పరిచయాలకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. అధికారుల నుండి వచ్చిన సూచనల విషయంలో బాగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. రావాల్సిన ధనం కాస్త  ఆలస్యంగా చేతికి అందుతుంది. చర్చల్లో వేగంగా పాల్గొంటారు, మీ నిర్ణయాలకు సహకారం పొందుతారు.

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈవారం అధికారులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. వారినుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. విలువైన వస్తువులను నష్టపోయే ఆస్కారం ఉంది. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. ఆత్మీయులను కలుస్తారు , వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. దూరప్రదేశంలో ఉన్న బంధువులతో చర్చలు చేయుటకు అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచితం. వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది.

 

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారం ఆరంభంలో ఉన్న ఉత్సాహం చివరి వరకు ఉండకపోవచ్చును. చేపట్టు పనుల విషయంలో స్పష్టత అవసరం. రావాల్సిన  ధనం సమయానికి చేతికి అందిన , ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. కుటుంబంలో శుభకార్యక్రమాల విషయంలో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార సమ్భణ్డామైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. వాహనాల కోసం ఖర్చులు చేయుటకు అవకాశం ఉంది. స్వల్పఅనారోగ్యసమస్యలు మిమ్మల్ని ఇబ్బందుటకు ఆస్కారం ఉంది, చర్చల్లో పాల్గొంటారు. కొన్ని కొన్ని విషయాల్లో ఓపిక అవసరం.

 

 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారం మీ ఆలోచనల్లో స్వల్ప మార్పులు వస్తాయి. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత కలిగి ఉంటారు. మీ ఆలోచనల వలన అధికారులకు దగ్గర అయ్యే అవకాశం ఉంది. సంతానం విషయంలో మాత్రం కాస్త ఒత్తిడికి గురయ్యే ఆస్కారం కలదు. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడుతాయి. ముఖ్యమైన పనులకు ముందు అవకాశం ఇవ్వండి. బంధువులతో మాటపట్టింపులకు పోకండి, కాస్త కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. రావాల్సిన ధనం కొంత చేతికి అందుతుంది. మిత్రులనుండి ఊహించని సహకారం లభిస్తుంది. మంచి పేరును పొందుతారు.

 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

 
మరిన్ని శీర్షికలు
Children do not need manuals how to grow.