Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Nani start new movie

ఈ సంచికలో >> సినిమా >>

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' అంచనాలకు మించి.!

Laxmis NTR 'beyond expectations!

ఎన్టీఆర్‌ జీవిత చరిత్రని బయోపిక్స్‌గా తెరకెక్కిస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి ముఖ్యంగా 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'పైనే నెలకొంది. అందుకు కారణం వెన్నుపోటు ఎపిసోడ్‌. ఎన్టీఆర్‌ జీవితంలో వెన్నుపోటు ఎపిసోడ్‌ అత్యంత కీలకమైనది. వర్మ ఆ ఘట్టాన్ని ఉన్నది ఉన్నట్లుగా, యదార్ధంగా తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్‌ అయ్యాయి. అన్నింటికీ మించి లేటెస్ట్‌గా విడుదలైన 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' ట్రైలర్‌ అంచనాల్ని వెయ్యి రెట్లు పెంచేసింది. ట్రైలర్‌లో చిన్నపాటి సినిమానే చూపించేశారు వర్మ. ఎన్టీఆర్‌ జీవితంలోని అత్యంత కీలకమైన లక్ష్మీపార్వతి ఎంట్రీ, ఆ తర్వాత ఆయన జీవితంలో వచ్చిన మార్పులు, రాజకీయాల్లోని ప్రకంపనలు ఇలా.. తదితర సంబంధిత ఘట్టాలను సన్నివేశాలుగా వర్మ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'లో చూపించబోతున్నారు. ట్రైలర్‌ రాక ముందు అసలు వర్మ ఏం చూపించబోతున్నారనేదానిపై ఆశక్తి ఉంది. ట్రైలర్‌ వచ్చాక చాలానే చూపించబోతున్నారనే ఉత్కంఠ మొదలైంది.

అలా 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' అంచనాలను మించిపోయింది. రంగస్థల నటుడు విజయ్‌ ఎన్టీఆర్‌ పాత్రకు ప్రాణం పోస్తే, చంద్రబాబు పాత్రలో శ్రీతేజ అతికినట్లు సెట్‌ అయిపోయాడు. ఆయన చూపుల్తోనే అన్ని భావాలూ పలికించేస్తున్నారు. కన్నడ నటి యజ్ఞాశెట్టి లక్ష్మీపార్వతి న్యాయం చేసింది. లవర్స్‌డే రోజు లవ్‌ స్టోరీగా విడుదలైన ట్రైలర్‌ ఆ తర్వాత అనేక అనుమానాలకు దారి తీసింది. ఏది ఏమైనా వర్మ ఏమనుకుంటారో అదే చేసి తీరతారు. 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'తో వర్మ చూపించబోయే 'వెన్నుపోటు' రాజకీయంగా టీడీపీ శ్రేణుల్లో ఎలాంటి వణుకు పుట్టించనుందో చూడాలిక. 

మరిన్ని సినిమా కబుర్లు
Root changed rattaalu