Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
murisipoyina seetarama sastry

ఈ సంచికలో >> సినిమా >>

యువకులకు షాకిచ్చే సింగీతం

youth shocking by singeetham


సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు వెండితెరపై అద్భుతాలే సృష్టించారు. ఆయన తెరకెక్కించిన చాలా సినిమాలో ‘అహో.. అద్భుతం..’ అన్పించేలా వుంటాయి. సీనియర్ దర్శకుడైనా ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ఆయన స్పెషాలిటీ. ఎప్పటికప్పుడు కొత్తదనం గురించి తెలుసుకోవాలనే తపనతో వుండే సింగీతం, తన వయసువారితో కన్నా, యంగ్ పీపుల్ తో ఇంటరాక్ట్ అయ్యేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.

టీషర్ట్ లు, షార్ట్ లు వేసుకుని యంగ్ లుక్ తో కన్పిస్తారు సింగీతం. వయసు మీద పడ్తున్నదనే భావన మనసులో కలగకూడదనీ, అలా కదిలితే కాలంతో పోటీ పడలేమంటారాయన. ఇప్పటికీ యంగ్ గానే తాను ఫీలవుతానని చెప్పే సింగీతం శ్రీనివాసరావు, టెక్నాలజీ గురించి యువతరాన్ని అడిగి తెలుసుకుంటుంటారట.

మొబైల్స్, వాటిల్లో యాప్స్ వంటి వాటి గురించి ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుంటారట సింగీతం శ్రీనివాసరావు. ఇంతకీ ఆయన వయసెంతో తెలుసా? జస్ట్ 82 సంవత్సరాలు మాత్రమే. శరీరానికి వయసొచ్చినా, మనసు ఇంకా యంగ్ ఊహల్లోనే తేలుతుందని చెప్పే అక్కినేని నాగేశ్వరరావు డ్రెస్సింగ్ విషయంలో పెద్ద తరహాగా వ్యవహరిస్తారు. సింగీతం మాత్రం, టీషర్ట్ లో కుర్రాడిలా కన్పించేందుకు ప్రయత్నిస్తారు. దటీజ్ సింగీతం.

మరిన్ని సినిమా కబుర్లు
charmi about her hardwork