Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
prema enta madhram

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.....http://www.gotelugu.com/issue311/801/telugu-serials/katyayani/katyayani/
 

 

(గత సంచిక తరువాయి)....."కాత్యాయని గారూ, మిమ్మల్ని ‘ఆ’ దృష్టితో చూసిన నేను, మీరు దగ్గరయ్యాక నాలో అనూహ్యమైన మార్పు కలిగింది. నా మీద నాకే అసహ్యం కలిగింది. మీరెళ్లిపోయాక నేను ఊరు వదిలేశాను. దారీ తెన్నూ తెలియనట్లు ఎన్నోచోట్ల తిరిగాను. అన్నట్టు నా సంగతి సరె, ఇంతకీ మిమ్మల్ని బయటకు పంపించేశాక మీ హస్బెండ్ మిమ్మల్ని కాంటాక్ట్ చేశారా?"
లేదన్నట్టు తల అడ్దంగా ఊపింది.

"ఇప్పుడు ఆయనెలా ఉన్నారని మీరనుకుంటున్నారు?"

"నాకు తెలియదు. కాని నన్ను పంపించాక ఆయన కూడా పశ్చాత్తాపంతో దహించుకుపోతున్నారేమో, మానసికంగా కుమిలి పోతున్నారేమోననిపిస్తోంది"

"మీ ఊహ నాకు నవ్వు తెప్పిస్తోంది. మీ కొద్ది క్షణాల దగ్గర తనం నన్ను మార్చేస్తే, మీ అన్నాళ్ల సాహచర్యం అతనికి ఇసుమంత గుర్తుకు రాకపోగా.."అని కాస్త ఆగాడు.

’అతను ఏం చెప్పబోతున్నాడో’ అన్న ఆత్రుత వాళ్లిద్దరి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.  

"మిమ్మల్ని వదిలించుకుని, హాయిగా పెళ్లి చేసుకున్నాడు. ఇదిగో వాళ్ల పెళ్లి ఫోటోలు"అని సెల్లో తను సేకరించిన ఫోటోలు చూపించాడు.
హేమ, కాత్యాయనిలు వాటిని ఆశ్చర్యంతో కళ్లింతలు చేసుకుని చూశారు. ఆ వెంటనే కాత్యాయని కళ్లలో నీళ్లు నిలిచాయి.

"అగ్ని సాక్షిగా పెళ్లాడిన తను, నేనే లోకమని చెప్పిన తను, నిజానిజాలు తెలుసుకోకుండా అలా ఎలా చేశాడోనండి" బాధగా అశ్రునయనాలతో అంది.

"ఆ రాస్కెల్ పని నేను పడతాను. మహిళా మండళ్లను సంప్రదించి వాడి తిక్క కుదురుస్తాను" కోపంతో ఎర్రని ముక్కుపుటాలు అదురుతుండగా, ఆవేశంగా అంది హేమ.

"వద్దు హేమా, అతని పాపం అతనే అనుభవిస్తాడు. నన్ను అతను కాదనుకుని, బయటకు గెంటేసిన రోజునే మా బంధం తెగిపోయింది"

"మరి నీ జీవితం?"

"నేను అతని దగ్గరకు వెళ్లాలని ఏనాడూ అనుకోలేదు. ఆ ప్రయత్నాలూ చేయలేదు. నాకు దేవుడు ఏదో ఓ దారి చూపిస్తాడని నా నమ్మకం"
ఆ మాట విని నీరు గారిపోయింది హేమ. "రామరాజ్య కాలం నుంచి ఈనాటి దాకా మన స్త్రీలం అంతే! అడవిలాంటి లంక నుంచి తనను తెచ్చుకున్న రాముడు, గుండెల్లో పొదువుకుంటాడని సీత అనుకుందిగాని, అనుమానంతో మళ్లీ అడవులకు పంపుతాడనుకోలేదు. నీలాంటి వాళ్లు ఉన్నంతకాలం వాళ్ల పప్పులు అలా ఉడుకుతూనే ఉంటాయి"అంది.

కొంతసేపు మౌనం వాళ్లందరి మధ్యా తిష్ఠవేసుకుంది.

తర్వాత తేరుకున్న హైమ "అన్నట్టు మీరెందుకు కాత్యాయనిని కలవాలనుకుంటున్నట్టు?"అంది.

మనోహర్ ఒకసారి హైమను, ఆ తర్వాత కాత్యాయనిని చూసి "ఎందుకంటే..?" అంటూ చెప్పడం ప్రారంభించాడు.

*****

కాత్యాయని భర్త రెండో పెళ్ళి చేసుకున్నాడని తెలిసి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే.. ..వచ్చే శుక్రవారం దాకా ఎదురు చూడాల్సిందే....

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్