Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> మరపు రానిమరో నిర్భయ

marpu rani maro nirbhaya

ఆల్వాల్ హెడ్ కానిస్టేబుల్ నరసింగ రావు ఇల్లు.

కాలేజీకి తయారైన కావ్యా, స్కూల్ కు తయారైన కార్తీక ముందు రూము లోకి వచ్చి తల్లికి టాటా చెప్పబోయి టీవీ లో వస్తున్న వార్తలను వింటూ భయంతో బిగుసుకు పోయి నిలబడిపోయారు.

అప్రయత్నంగా అమ్మా! అంటూ గావు కేక పెట్టారు. ఎక్కడో పనిలో వున్న తల్లి శరణ్య భయంతో పరుగెత్తుకొచ్చి కూతుళ్లను అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది.

" అమ్మా! వార్తలు విను. యెంత ఘోరం జరిగిపోయిందో చూడు."

యిద్దరి మాటలు అర్ధం కానట్లు " నాకు లోపల పని వుంది. టీవీ చూసే టైమ్ లేదు." అనేసింది.

" అమ్మా! టీవీ చూడు అంటే నువ్వు రోజు చూసే చెత్త సీరియల్సు గురించి కాదు. ఆరేళ్ళ పసిపాప మీద అత్యాచారం చేసి యెవడో చంపేశాడని చెప్తున్నారు."

అప్పుడు అర్ధం చేసుకున్న శరణ్య టీవీ చూడడం మొదలు పెట్టింది.

“ 21 మార్చ్ 2019 హోళీ పండుగ. కామ దహనం చేయవలసిన రోజున, ఒక మదమెక్కిన కాముకుని కామానికి బలై పోయిన చిన్నారి నిర్భయ.

ఆరేళ్ళ పసి పాపను  పొదల్లోకి ఎత్తుకెళ్ళి రెండు సార్లు రేప్ చేసి గొంతులో ఇనుప చువ్వ గుచ్చి  బాలికకు నరకం చూపించి చంపేసాడు.
హత్య చేసిన దుర్మార్గుడు పోలీసులకు చిక్కాడు.

బాలికను నమ్మించి తీసుకెళ్ళింది మొదలు తాను బాలిక పట్ల వ్యవహరించిన తీరు వివరిస్తుంటే, వింటున్న పోలీసులకే ఒళ్ళు గగుర్పొడిచింది అంటే వాడు చూపిన నరకం అర్ధమవుతుంది. హోలీ పండుగ నాడు తన  స్నేహితులతో ఆడుకుంటున్న ఆరేళ్ళ పాపను రంగులు యిప్పిస్తానని మాయ మాటలు చెప్పి పొదల్లోకి తీసుకెళ్ళి రెండు సార్లు రేపు చేసి గొంతులో యినుప చువ్వను గుచ్చి హత్య చేసాడు. హైదరాబాద్ అల్వాల్ లో జరిగిన ఈ సంఘటన అందరిని భయభ్రాంతులకు గురిచేసింది.

హంతకుడు బీహార్ కు చెందిన రాజేష్. వాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చిన్నారి తలిదండ్రులు మెదక్ జిల్లా నుండి వలస వచ్చి అల్వాల్లో యిద్దరు కుమార్తెలతో బ్రతుకుతున్నారు. తండ్రి స్థానిక డైరీలో పని చేస్తుంటే, తల్లి నాలుగు ఇళ్ళల్లో పని చేసుకుంటూ బ్రతుకు వెళ్ళదీస్తున్నారు.

అదే ప్రాంతంలో అద్దెకు వుఒటున్న బీహారీ ధర్మేంద్ర హోలీ నాడు తన ఫ్రెండ్స్ ను యింటికి ఆహ్వానించాడు. వారిలో ఒకడైన రాజేష్ చూపు ఆరేళ్ళ చిన్నారిపై పడింది. ఫలితం రేపు, హత్య.

చిన్నారులపై అత్యాచారం చేస్తే మరణ శిక్షే సరి అని ఏడాది క్రితం మంత్రి వర్గం ఆమోదించినా అమలుకు నోచుకోని చట్టం.విచ్చలవిడిగా పెరిగి పోతున్న నేరాలు.

గల్ఫ్ దేశాలలో నేరాలు గణనీయంగా తగ్గడానికి కారణాలు కఠినమైన శిక్షలు అమలు చేయడమేనని నిపుణుల అభిప్రాయం.

మన దేశంలో చట్టమైన శిక్షలే అమలు జరగడం లేదు. నేరాలు ఎలా తగ్గుతాయని ప్రజలు నాయకులని ప్రశ్నిస్తున్నా సిగ్గు లేని నాయకులు నిస్సిగ్గుగా తలెత్తుకు తిరుగుతున్నారు. కారణం ప్రజల గోడు వినని ప్రభుత్వం. కళ్ళు లేని న్యాయవ్యవస్థ.

గత రెండు నెలల్లో జరిగిన సంఘటనలు.

ఫిబ్రవరి నుండి యిప్పటి వరకు గ్రేటర్ లో 42 అత్యాచారాలు వెలుగు చూసాయి. ఇవి గాక వెలుగు చూడని అకృత్యాలు ఎన్నో. దేశం మొత్తం మీద సగటున రోజుకు 168 కేసులు నమోదవుతున్నాయి. అంటే, లైంగిక దాడులు యెంత తీవ్రంగా వున్నాయో ఊహకే అందని విషయం.”
టివిలో వార్తలు వింటున్న కావ్య, కార్తీకలు తల్లిని కౌగలించుకొని ఏడ్చేసారు.

“అమ్మా! ఆడ పిల్లలకు రక్షణే లేదా? రక్షించ లేని తలిదండ్రులు యెందుకు కంటారు? ”

కావ్య అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్ప లేని తల్లి శరణ్య మౌనంగా వుండి పోయింది.

అప్పుడే స్టేషన్  నుండి పని మీద యింటికి వచ్చిన అల్వాల్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ నర్సింగరావు భార్యను, పిల్లలను ఆస్థితిలో చూసి చలించిపోయాడు.

“ నాన్న! ఘోరం చూడండి! జరిగింది మీ స్టేషన్ దగ్గరే అంటున్నారు.” పిల్లలు యిద్దరు వచ్చి తండ్రిని వాటేసుకొని యేడ్చేశారు.

“అమ్మలు! యేడవకండి. వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జైలుకు పోతాడు.”

“డాడీ! అరెస్ట్ చేస్తే యేమవుతుంది? బెయిలు అంటారు. నాలుగు రోజుల్లో బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ ఏ పసిపాపనో పాడు చేసి చంపేస్తాడు. అంతేగా? ”

కాలేజీలో చదువుతున్న కావ్య తండ్రిని అడిగింది.

“అవును, నిజమే అయినా మనం ఏమి చేయగలం? చెప్పు? ”

“డాడీ మీరు పోలీస్. మీరే యిలా మాట్లాడితే ప్రజలను రక్షించేది ఎవరు?

డాడీ! ఆరు సంవత్సరాల పాప. పాపం కదా డాడీ?”

“అవునమ్మా! ఘోరమైన సంఘటన. అత్యాచారం చేసి గొంతులో ఇనుప చువ్వ గుచ్చి చంపేశాడు.”

“డాడీ! రేపు మాకు కూడా యిలా జరగొచ్చు. మమ్మల్ని ఎవరు రక్షిస్తారు? ”

కూతురి ప్రశ్నకు సమాధానం చెప్పలేక తల దించుకున్నాడు. కార్తీక వచ్చి “నాన్నా! నాకు యిప్పుడు పదిహిను యేళ్ళు. అటువంటి వాళ్ళు యిక్కడ కూడా వుంటారా? ”భయం భయంగా అడిగింది.

కార్తీకను దగ్గరకు తీసుకొని ఓదార్చి భయం పోగొట్టాడు నర్సింగరావు. 

“ డాడీ! కార్తీక అడిగిన ప్రశ్నలో నిజం వుంది. రేపు మాకూ యిలా జరగదు అనే గ్యారెంటీ వుందా? యిటువంటి మృగాలు బజార్లో తిరుగుతూ పిల్లల్ని బ్రతకనిస్తారా? ” కావ్య నిలదీసింది.

“అవున్రా.. నువ్వు చెప్పిన దాంట్లో సత్యం వుంది. ఆడపిల్లల తలిదండ్రులు ఈ ఘోరాన్ని టీవీలలో చూసి, పేపర్లలో చదివి భయపడిపోతూ వుంటారు.”

“డాడీ! ఆడపిల్లగా పుట్టడమే నేరం అంటారా? అంటే ఆడపిల్లలకు సంఘంలో రక్షణ వుండదా? రక్షణ కల్పించలేని తలిదండ్రులు ఎందుకు కంటారు డాడీ?

స్కూల్లో టీచర్లే కీచకులు అవుతున్నారు. బస్సుల్లో, ఆటోల్లో యెక్కడ చూసినా అమ్మాయిల్ని ఏడిపించే వారే. ఈ మధ్య పేపర్లలో రాస్తున్నారు, గుళ్లలో పూజారులు చర్చిల్లో ఫాదర్స్ కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారని. అంటే స్త్రీకి రక్షణే లేదా? మరి మీ పోలీస్ డిపార్ట్ మెంట్ ఎందుకు డాడీ? రక్షక భటులు అంటారు మిమ్మల్ని. ఎవరిని రక్షిస్తున్నారు? కారుల్లో తిరిగే నాయకులనా? కష్టాల్లో కూరుకు పోతున్న ప్రజల్నా ? రేపులకు గురై ప్రాణాలు కోల్పోతున్న మావంటి ఆడపిల్లల్నా ? గుండె మీద చెయ్యేసుకుని చెప్పండి.”

కూతురు కావ్య అడిగిన ప్రశ్నకు ఏమి చెప్పాలో అర్ధం కానీ నర్సింగ రావు తల దించుకున్నాడు.

“బోర్డర్లో మనకు అపకారం చేయడానికి వస్తున్న శత్రువుల్ని మన జవాన్లు కాల్చి చంపేసి దేశాన్ని రక్షిస్తున్నారు. అదే పని పోలీసులెందుకు చేయలేక పోతున్నారు? ఇటువంటి రాక్షసుల్ని కాల్చి చంపేస్తే దేశంలో వున్న చెత్త వెధవలకు భయం వుంటుంది. ఆడపిల్ల మీద చెయ్యి వెయ్యాలఒటే భయంతో చచ్చి పోతారు. కొన్ని దేశాల్లో ఇటువంటి శిక్షలు అమలు చేస్తుంటే మన దేశంలో ఎందుకు అమలు చేయరు? నిన్న చిన్న పాపను ఛంపేసిన వెదవ జైలు నుండి వచ్చి యింకెంత మందిని రేప్ చేసి చంపేస్తాడో? ఎవరూ ఆలోచించరా?

చెప్పండి డాడీ?”

“ఏమి చెప్పమఒటావు తల్లి! దేశం నిండా లంచాలు, అవినీతి. ఎవరిని చూసినా స్వార్ధమే తప్ప ఎదుటి వారికి మేలు చేయాలి అనే వుద్దేశమే లేదు. నువ్వు అన్నావు జవానులు అని. దేశాన్ని రక్షించే రక్షణ వ్యవస్థలో కూడా అవినీతి తాండవమాడుతోంది. జవానుల ప్రాణాలకే రక్షణ లేకుండా పోయింది. నువ్వు చదివే వుంటావు మొన్న జరిగిన పుల్వామా ఉగ్ర ఘాతుకం. నలభై మందికి పైగా జవానులు చని పోయారు. కారణఒ ఎవరైనా ఎంతోమంది జవానుల కుటుంబాలు అనాధలయ్యాయి.”

“నిజమే డాడీ!మరి దీనికి పరిష్కారం యేమిటి?”

“నువ్వు అడిగింది వాస్తవమే. కానే సమాధానం ఏమిటో తెలియడం లేదు.”

“డాడీ !మీకు ఎదురుగా కాటేయడానికి పాము వస్తే ఏమి చేస్తారు? ఒక పిచ్చికుక్క కరవడానికి వస్తే ఏమి చేస్తారు?”

“చంపేస్తాను.”

“మరి మీరు పోలీస్ కదా? అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయరా?”

“పామునా? కుక్కనా?”

“అవును పాముని, కుక్కనే. అవీ ప్రాణమున్న జంతువులే కదా? కానీ వాటిని చంపేస్తారు. కానీ ఆరు సంవత్సరాల చిన్నారిని పాడు చేసి చంపేస్తే వాడిని అరెస్ట్ చేసి రక్షణ కల్పించి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. వాడిని కూడా చంపేయవచ్చు కదా?”

“న్యాయం అంగీకరించదు. కావ్యా నువ్వు చిన్న దానివి నీకు మన వ్యవస్థ గురించి తెలియదు.”

“అవును డాడీ! నాకు ఏమీ తెలియదు. మీరు  న్యాయం అన్నారు? అవునా?

ముక్కు పచ్చలారని ఆరేళ్ళ చిన్నారిని చంపడం న్యాయం? చంపిన వాడిని చంపడం వ్యవస్థకు అన్యాయం. ఓహ్! ఏమి సమాజం? వద్దులే డాడీ! పోలీస్ వంటి చెత్త డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్న మిమ్మల్ని అని కూడా లాభం లేదు. మమ్మల్ని మీరు కన్నారు. అలాగే మరెవడో చంపేస్తాడు. అడిగితే న్యాయం చేసే వాడే లేడు.

అయినా అమ్మా నాన్నలు కంటూనే వుంటారు, ఇటువంటి కిరాతకుల దౌర్జన్యానికి బలి పెడుతూనే వుంటారు. ఆడపిల్లగా పుట్టడమే మేము చేసుకున్న పాపం. కనడం వరకే మీ బాధ్యత. పెంచే స్తోమత, రక్షించే సమర్ధత లేనప్పుడు ఎందుకు కంటారు డాడీ ?”

మేము ఇప్పటి నుండి చదువులు మానేస్తాము. బయట ఇటువంటి క్రూర మృగాలు తిరుగుతూ వుంటే మావఒటి ఆడపిల్లలము ఎలా తిరగగలమో మీరే చెప్పండి. పైగా వీడు మన లోకాలిటీ మృగం. రేపు జైలు నుండి వచ్చి ఎంత మందిని మట్టిలో కలిపేస్తాడో కనీసం వూహకు అందని విషయం." ఏడ్చుకుంటూ చెల్లెలు కార్తీకను తీసుకొని లోపలికి వెళ్లి పోయింది కావ్య.

నరసింగరావు సిగ్గుతో తల వంచుకొని ఆలోచనలో పడి పోయాడు.

**************

“ఇదిరా! నా కూతురుతో నిన్న జరిగిన సంఘాషణ. జనరేషన్ మారి పోయింది. అభిప్రాయాలూ మారి పోతున్నాయి. ఒక విధంగా చూస్తే తను చెప్పిందే రైట్ అనిపిస్తోంది. మరీ ఘోరంగా ఆరేళ్ళ పాప మీద అత్యాచారం చేసి చంపేసి కేసును పక్క దారి పట్టించడం కోసం గొంతులో ఇనుప చువ్వ గుచ్చేశాడు.  వాడు మనిషే కాదు.”

ఆల్వాల్ పోలీస్ స్టేషన్లో తన కొలీగ్ కానిస్టేబుల్ బాషతో తన బాధ చెప్పాడు నర్సింగ రావు.

“అవును భాయీ! నీ బేటీ చెప్పింది నిజమే. వీడిని మనం పోలీస్ కస్టడీ మధ్య కోర్టులో సబ్మిటు చేయాలి. తిరిగి మర్యాదలతో తీసుకొచ్చి సపర్యలు చేయాలి. మనది కూడా ఒక బ్రతుకేనా? అనిపిస్తుంటుంది.”

“కరక్టే.. యింతకీ నువ్వు ఏమంటావు?”

“నీదీ బేటీ చెప్పింది నిజమే.  సువ్వర్కి బచ్చా ఆరు సంవత్సరాల పసి పాను రేప్ చేసి చంపేస్తే అక్కడే నరికి వేయాలి. కానీ మనది భారత దేశం. నాకు నలుగురు అమ్మాయిలు, నీకు యిద్దరు అమ్మాయిలు. ఇటువంటి జంతువుల్ని యిలా వదిలేస్తే ఏ పిల్లల్ని బతకనివ్వరు. ఏదో ఒకటి చెయ్యాల్సిందే.” బాషా వాపోయాడు.

“అయినా మనం ఏమి చేయ గలం చెప్పు. మరో గంటలో కోర్టుకు బయలు దేరాలి.

డ్యూటీ నీకు నాకే వేశారు.”

నర్సింగ్ భాయీ!  డిపార్ట్ మెంట్ లో మంచి పేరున్న పోలీస్ వి. నీకున్న ఇంఫార్మర్ నెట్ వర్క్ సంగతి నాకు తెలుసు. నీ కూతురు అడిగింది న్యాయమైన కోరిక. సమజ్ గయానా?

“మంచిది. మనతో వస్తున్న డ్రైవర్  ఎవరు?”

“వాడే! పాతవాడే. యాదగిరి.”

“ అయితే నేను ఒకటి చెప్తాను జాగ్రత్తగా విను.”

“నర్సింగ్ భాయీ! నీదీ బ్రెయిన్ అంటే...!”

“ పొగడ్తలు వద్దు. సెటిల్ చేద్దాము. తాచు పామును పక్కన పెట్టుకొని ప్రాణాల మీదకు తెచ్చుకోము. నువ్వు చూస్తూ వుండు.”
నర్సింగ రావు బాషా భుజం మీద చెయ్యెసి చెప్పాడు.

************

మర్నాడు వుదయఒ టీవీలో వస్తున్న వార్తలను వింటూ తండ్రిని సంతోషంతో చుట్టేశారు కావ్య కార్తీకలు.

“నిన్న ఆరేళ్ళ పాప మీద అత్యాచారం చేసి గొంతులో ఇనుప చువ్వదించి చంపేసిన రాజేశ్ అనే బీహారీ నేరస్తుడిని సంకెళ్ళు వేసి కోర్టుకు తరలిస్తుండగా ట్రాఫిక్ సిగ్నల్  సమయంలో జీప్ ఆగిన  టైంలో రోడ్ మీదకు దూకి పారి పోవాలనే ప్రయత్నంలో వున్నప్పుడు వెనుక నుంచి మోటార్ బైక్ మీద వచ్చిన ఆగంతకులు వాడిని రోడ్డు మీద ఆపి క్రింద పడేసి బొడ్డు  క్రింది భాగంలో యాసిడ్ పోసి పారిపోయారు. వాడు చావు బ్రతుకుల మధ్య కొట్టాడుతున్నాడు. తలలకు హెల్మెట్స్ వుండడం వలన వారి ముఖాలను ఎవరూ గుర్తు పట్ట లేక పోయారు. బైకులకు నెంబర్ ప్లేట్స్ లేని కారణంగా వెహికల్స్ ను ఎవరూ గమనించ లేదు. ఇందులో పోలీసుల నిర్లక్ష్యం ఏ మాత్రం లేదని, క్లోజుడు వ్యానులో తరలించ వలసిన నేరస్థుల్ని ఓపెన్ జీపుల్లో తరలించడం పోలీస్ వ్యవస్థ అసమర్ధతకు నిదర్శనమని ప్రజలు భావిస్తున్నారు.

ఏది ఏమైనప్పటికి చిన్నారి మీద అత్యాచారం చేసిన నేరస్తుడికి హెల్మెట్లు ధరించిన ముసుగు మనుషులే తగిన శిక్ష విధింఛారని నగరం లోని మహిళా సంఘాలు హర్షం వ్యక్తఒ చేశాయి. ఇక ముందు యిటువంటి నేరఒ చేసే మృగాలకు ఇటువంటి శీక్షలే విధిస్తే ఏ వెధవలకీ ఏ ఆడపిల్లలను కన్నెత్తి చూసే ధైర్యం వుండదని మహిళా సంఘాలు తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని ప్రభుత్వానికి సమర్పించ బోతున్నాయని భోగట్టా.

ఇకముందు క్లోజుడు వ్యానులలో మాత్రమే నేరస్తులను తరలిస్తామని పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రకటిఒచింది.  టీవీలో వస్తున్న ఆవార్తలు వింటూ “డాడీ! యూ ఆర్ ఎ రియల్ హీరో. మేము మాటలు వెనక్కి తీసుకుంటున్నాము.

రేపటి నుండి నేను కాలేజీకి కార్తీక స్కూల్ కి వెళ్తున్నాము.

ఈ ఒక్కడు పోయినంత మాత్రాన సమాజం బాగు పడి పోతుందని కాదు.

కానీ మా వఒటి సగటు ఆడపిల్లలకి మనో ధైర్యాన్నిస్తుంది. కనీసం మన ఏరియాలో వుంటున్న ఒక మదమెక్కిన క్రూర మృగం చచ్చింది అనే ఫీలింగ్ ధైర్యాన్ని కలిగిస్తుంది.

దొడ్డిలో ఒక్క మొక్కకు చీడ వస్తే మందు కొట్టి నాశనం చేస్తాము. ఉపేక్షిస్తే మొత్తం మొక్కల్నే పాడు చేస్తుంది. సమాజం కూడా అటువంటిదే. మొదటి ఛీడనే నాశనం చేసేస్తే అది వ్యాపించే అవకాశం వుండదు. నిన్న వాడు సగం చచ్చింది యాసిడ్ దెబ్బకే  అయినా కర్త కర్మ క్రియ మీరేనని తెలుసు. నీకు కూతుళ్లుగా పుట్టడం మాకు గర్వ కారణం. మా ఆడపిల్లలకు మీ లాంటి తండ్రి వుంటే ఏ ఆడపిల్లా భయపడే పరిస్థితే రాదు.” అంటూ ముద్దుల వర్షం కురిపించారు కావ్య కార్తీకలు.                                       

మరిన్ని కథలు
devudu teerchina korika