Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> మేఘా సందేశం

megha sandesham

పెళ్లి-  ఒక అందమైన ఊహ. రెండు మనసులు, మనుషులు, కుటుంబాలు ఒకటి అయ్యే అందమైన బంధం. ప్రతి ఆడపిల్ల యుక్త వయస్సు రాగానే కనే  కల పెళ్లి . తన రాబోయే జీవితం  ఇలా ఉండాలి, ఇలా ఉంటుంది, తన భర్త ఇలా ఉండాలి అని ఎన్నో ఊహిస్తూ కలలు కంటుంది. అన్ని కలలు నిజం అయిపోతే ఇక కల కి ఆ పేరు ఎందుకు?.  కానీ తరచు ఆ ఊహాలు, కలలు గానే మిగిలిపోతాయి. అలా అని వివాహ వ్యవస్థ ని కించపరచడం లేదు.   కళ్ళ ఎదుట జరిగిన ఒక నిజం మనోభావాలు ఇలా బయటకి వచ్చినట్లు చేసేయ్.

మేఘా, తన తల్లి, తండ్రి, అన్నయ్య కి గారాలపట్టి. అందం, అన్ని పనుల్లో తనకి తానే సాటి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని  కంప్యూటర్స్ కోర్స్ చేసింది. ఉద్యోగం  కూడా చేసేది. తల్లి తండ్రులు తెచ్చిన సంబంధం ఒప్పుకుని పెండ్లి చేసుకుంది. ఆమె భర్త  రోహిత్ ఒక కంపెనీ లో  మధ్య తరగతి ఉద్యోగి. అత్త మామలు, ఆడపడుచు, మరిది ఇది  వాళ్ళ కుటుంబం.

కొత్త ఇల్లు, అలవాట్లు, పెద్ద కోడలిగా బాధ్యతలు, కొంచం ఆందోళన కి గురిచేసిన, కొత్త కదా అవే అలవాటు అవుతాయి అనుకుని ముందంజ వేసింది. కొత్త కోడలు కొంచం అందరి సహకారం కోరుకుంటుంది బయట చెప్పలేకపోయిన. అత్తవారింట కూడా వాళ్ళ బాధ్యత వాళ్ళ పద్ధతులు అలవాట్లు నేర్చుకోవడంలో తనకి సహాయపడడం, ఎవరు కాకపోయినా భర్త భాద్యత అది, భార్య ని అర్ధం చేసుకోవడం అన్నిట్లో తనకి సహాయ సహకారాలు అందించడం.

ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి అన్ని వదులుకుని పెళ్లి అన్న రెండు అక్షరాల బంధం, వేసిన మూడు ముళ్ళకి తాను అంత విలువ ఇచ్చి , కొత్త ఇంట్లో అంత మన అనుకుని సేవ చేస్తుంది. భాద్యత ఎప్పుడు ఆమెదే కాదు, ఇంట్లో ఉన్న ప్రతివారు కి   కూడా ఇంటికి వచ్చిన కొత్త సభ్యురాలు పట్ల గౌరవం, భాద్యత ఉండాలి, అప్పుడే తనకి కూడా, ఎక్కడికో వేరే ఇంటికి వచ్చేనన్న  భావన రాదు. కానీ అలా చాలా అరుదు. అంతలా అర్ధం చేసుకున్న భర్తే దొరకడం చాలా కష్టం. భర్తే అర్ధం చేసుకోకపోతే ఇక వాళ్ళ ఇంటి వాళ్ళ నుండీ ఏంటి ఆశించేది. మన అమ్మాయి అత్తవారింట్లో సుఖంగా ఉండాలి, అల్లుడు కూతురు మాట వినాలి, అదే కోడలు మాత్రం పరాయి అమ్మాయి, కొడుకు కోడలు మాట వింటే తాను ఆడంగి అయిపోతారు. ఈ నీచమైన భావాలు, స్త్రీ కి స్త్రీ ని శత్రువు గా చేసింది. ఈర్ష్య, మూర్ఖత్వం, సంకుచిత స్వభావం, ఈ రోజు ఎన్నో సంసారాలు రోడ్ పై పడే స్థితి కి తెచ్చేయి.

మొదటి రోజు నుండే చిన్న చిన్న భేదాలు, పెరిగి పెద్దవైయ్యాయి కాలక్రమేణా. ఈ తగాదాలు మధ్యలో పెద్దమ్మాయి ప్రాణం పోసుకుంది. సంతోషం అతిథిలా వచ్చి వెళ్ళిపోయింది. మళ్ళీ కధ మొదటికి వచ్చింది. పెద్దమ్మాయి తో మేఘా జీవితం ముందుకు సాగుతోంది. కానీ పరిస్థితుల్లో మెరుగు మాత్రం లేదు. ఒకర్ని ఒకరు అర్ధం చేసుకోవడం పరిస్థితుల్ని కలిసి మెరుగు పరుచుకుందామనే ఆలోచన లేదు, అవి విషపూరితమౌతూనే ఉన్నాయి.

మేఘా ఆరోగ్యం దెబ్బ తింది ఈ పరిస్థితుల్లో. అయినా ఇంటి పని తప్పదుగా, పైగా సహాయం కూడా లేదు వెనక. డాక్టర్ దగ్గరకి వెళ్ళింది. మళ్ళీ గర్భవతి అని చెప్పేరు, టెస్ట్స్ చేసి.

ఇక మగపిల్లవాడి  ఒత్తిడి పెరిగింది. మంత్ర తంత్రాలు, తావీజులు, బాబాలు అన్ని విఫలమైయ్యాయి, మళ్ళీ అమ్మాయి పుట్టింది . పరిస్థితులు మెరుగు పడే అవకాశం ఇక శూన్యం అయినట్టే. ఇద్దరమ్మాయిలు, పని ఒత్తిడి, ఇంటి పరిస్థితులు, పైగా భర్త ప్రేమ అనురాగలకి దూరమై, ఎంత వరకు భరిస్తుంది ప్రాణం . అలా రోజులు నెలలు, నెలలు సంవత్సరాలుగా మారేయ్.

13 సంవత్సరాలు గడిచేయి, ఇంటి పట్ల, పిల్లల పై అసలు శ్రద్ధ వహించడం పూర్తిగా మానేసేడు రోహిత్. ట్యూషన్స్ చెప్తూ పిల్లల్ని పుట్టింటి వారి సహాయం తో తన సంసారాన్ని ఒంటి చేతితో ముందుకు కోనసాగిస్తోంది. అత్తమామలు సాధింపులు, భర్త ప్రవర్తన తనని  లోలోపన  కృంగపడేలా చేసేయ్, ఇల్లు వదిలి  పుట్టింటికి వచ్చేసింది మేఘా.  తప్పు తెలుసుకుని రోహిత్ వచ్చి మేఘా ని పిల్లలని ఇంటికి తీసుకుని వెళ్తాడేమో అని ఎదురు చూసింది, కానీ ఏం ప్రయోజనం లేకుండా పోయింది. ఇక భరించలేక అన్యాయాలు కి వ్యతిరేకంగా కోర్ట్ లో కేస్ దాఖలు చేసి పోలీసులకు అప్పగించింది. బయటకి వచ్చేసేడు వెంటనే జామీను పై, ఆ కేస్ లు అలా నడుస్తూనే ఉన్నాయి. పిల్లలకి యుక్త వయస్సు రానే వచ్చింది. వాళ్ళకి ఒక మంచి జీవితం ఇవ్వాలని  ఈ పరిస్థితుల ప్రభావం వాళ్లపై ఇక పడకూడదని  విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

కోర్ట్ లో కేస్ వేసింది,భర్త గా ఎప్పుడు ఏ సుఖం పొందలేదు మేఘా, ఇక ఇప్పుడు ఎం ఆసిస్తుంది?. కానీ  వయసు వచ్చిన ఇద్దరమ్మాయిలని చదివించి, పెద్దచేసి, పెళ్లి చేయాల్సిన బాధ్యత కాదన్న సరే రోహిత్ కి ఉంది. అదే ధైర్యం తో అలిమోనీ ని కోరింది. ఆ కేస్ అలా నడుస్తూనే ఉంది కోర్ట్ లో, మేఘా  నిర్జీవంగా అలా పని చేస్తూనే  ఉంది. ఇంట, బయట అన్ని తానే చేసేసరికి చివరికి తనకి మిగిలేది , విరహం, ఒంటరితనం. ఎన్నో తిప్పలు పెట్టి, ఎంతో మనోవేదన తర్వాత అలిమోని డబ్బు వచ్చింది. పిల్లల పేరున అవి ఫిక్స్డ్ డిపాసిట్ చేసింది. తల్లి, తండ్రి  ప్రేమ పిల్లలు ఎప్పుడు ఆస్వాదించలేదన్న బాధ మేఘా ని ఎక్కడో తనని తాను ప్రశ్నించుకునే ల పీడిస్తోంది.

తప్పు ఎవరిది అని? తనదా, రోహిత్ దా లేదా పరిస్థితులు వా? ఏది ఏదైనా నిండు జీవితాలు ప్రేమ అన్న అనుభూతి కి దూరం ఐయ్యేరు.జీ వితం కొత్త రీతిలో మళ్ళీ మొదలెట్టాలన్నా పట్టుదలతో ఉద్యోగం చేయడం మొదలెట్టింది. పిల్లలు కి.తల్లి తండ్రి తానై మంచి జీవితం ఇవ్వగలిగింది.

*భార్య భర్తలంటేనే ఒకరి మాటని ఒకరు,ఒకరి గౌరవం ని ఒకరు కాపాడుకోవడం. ఒకరికోసం ఒకరు చిన్న చిన్న త్యాగాలు చేసుకోవడం, అర్ధం చేసుకోవడం. కొట్లాటలు లేని భార్య  భర్తలని ఎరుగుదర ఎవరైనా?  మనిషి అంటేనే తప్పులు చేసే ప్రవృత్తి కలిగిన వాడు. కొన్ని చూసి చూడనట్టు ఇద్దరు కూడా వదిలేస్తేనే ఆ బంధం గట్టి పడుతుంది. పెళ్లి అంటేనే ఒకరికోసం ఒకరు జీవించడం. 'నా, 'నీ  కలిసి "మన" గా మార్చే బంధమే ఆ మాంగల్యం. 2 అక్షరాల పెళ్లికి, 3 ముళ్ళకి, 7 అడుగుల వివాహ వ్యవస్థ కి ఇప్పుడు కూడా గౌరవిస్తున్నారంటే  అది ఆ బంధం గొప్పతనం.దాన్ని గౌరవించడం రావాలి.

వివాహం పట్ల  ఈ తరం యువత కి తగ్గుతున్న నమ్మకాన్ని ధృడపరిచే ప్రయత్నం చేయాల్సిన అవసరం భాద్యత ప్రతి ఒక్కరికి ఎంతైనా ఉంది. భావితరానికి పెళ్లి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాలి.  మన పురాణాలని, వాటి విలువల్ని కూడా నేర్పాలి. ఒక పెళ్లి నిలబడలేదు అనడానికి కేవలం భర్త ఒక్కడే కారకుడు అనడానికి కూడలేదు, భార్య కూడా అంతే కారకురాలు అవుతుంది. ఒక్కోసారి పరిస్థితులు కూడా తోడురావు. అందుకే గా  ఒకరిని ఒకరు అంతలా అర్ధం చేసుకోవాలి అనేది.

ఈ నా కధనం లో మేఘా కి పెళ్లి ఒక శాపం అయింది. ఇక ముందైన ఒక మంచి జీవితం పిల్లలకి  తనకి దొరకాలని, వాళ్లు జీవితం లో మంచి భాద్యత గల పౌరులు  ప్రపంచానికి మంచి స్ఫూర్తి ఇచ్చే వారవ్వాలని,మనస్ఫూర్తిగా ఆశిద్దాం.

మరిన్ని కథలు
manchi chesina manishi