Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

7-06-2019 నుండి 13-06-2019 వరకు వారఫలాలు - - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

 ఈవారం కుటుంబపరమైన విషయాలలో నూతన ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తారు. తలపెట్టిన పనులను తోటివారి సహకారంతో విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. గతంలో తీసుకున్న నిర్ణయాల విషయంలో నూతన ఆలోచన మొదలయ్యే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడుతుంది. చిన్న చిన్న విషయాలను సైతం పట్టించుకోవడం వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది.

 

 


 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

ఈవారం సోదరులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. ప్రయాణాలు చేయునపుడు నూతన పరిచయాలకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. మీ ఆలోచనల వలన సమాజంలో మంచి పేరు లభిస్తుంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. విలువైన వస్తువుల కోసం ధనం ఖర్చు పెట్టె అవకాశం ఉంది. బంధువులనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది, వారితో చర్చలకు అవకాశం కలదు.

 

 

 

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈవారం ఆర్థికపరమైన విషయాల్లో ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. గతంలో చేపట్టిన పనులకు లేదా నిర్ణయాలకు సమాధానం చెప్పవలసి వస్తుంది. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. విదేశీప్రయాణప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేసే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోయే ఆస్కారం ఉంది. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది, మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. వాహనాల విషయాల్లో ఒకింత జాగ్రత్తగా ఉండుట సూచన.

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈవారం నూతన పరిచయాలకు అవకాశం ఉంది, వారితో సమయాన్ని శ్రధగా గడుపుటకు ఆస్కారం ఉంది. మీ నిర్ణయాల వలన అధికారులకు దగ్గరయ్యే అవకాశం ఉంది, మంచి గుర్తింపును పొందుతారు. సోదరులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. వ్యాపారపరమైన విషయాల్లో అలాగే పెట్టుబడుల విషయాల్లో మాత్రం ఏమాత్రం తొందరపాటు వద్దు. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది. తండ్రితరుపు బంధువుల నుండి వచ్చే సూచనలు పరిగణలోకి తీసుకోవడం మంచిది. చర్చల్లో నిదానం అవసరం.

 

 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

 ఈవారం ఆరంభంలో ఒకింత పనిఒత్తిడి ఉండుటకు అవకాశం ఉంది,సర్దుబాటు విధానం అవసరం. సంతానం నుండి వచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకోండి అలాగే మీ ఆలోచనలు వారికి తెలియజేయుట సూచన. కుటుంబంలో ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్దగా ఉండకండి. ఉద్యోగంలో నూతన అవకాశాల కోసం చేసిన ప్రయత్నాలు కలిసి వస్తాయి. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. చర్చాపరమైన విషయాలకు సమయం ఇస్తారు.

 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

ఈవారం ముఖ్యమైన విషయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం సూచన. చేపట్టిన పనులను పూర్తిచేయుటకు మిత్రుల సహకారం తీసుకోవడం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన లావాదేవీలకు అవకాశం ఉంది, రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. సోదరులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. కోపాన్ని తగ్గింన్చుకోవడం ద్వారా మేలుజరుగుతుంది. ఉద్యోగంలో బాగానే ఉంటుంది, చర్చల్లో పాల్గొనే ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది.

 

 

తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

ఈవారం ఉద్యోగంలో నూతన అవకాశాల కోసం చేసిన ప్రయత్నాల్లో ఆశించిన మేర ఫలితాలను పొందుతారు. బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వద్దు, ఊహించని ఖర్చులకు ఆస్కారం ఉంది. తల్లితరుపు బంధువులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. చర్చాపరమైన విషయాల్లో మీ నిర్ణయాలు అలాగే ఆలోచనల విషయంలో స్పష్టత అవసరం.

 

.

 

 
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈవారం పెద్దలనుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. చిన్న చిన్న విషయాలను సైతం అశ్రద్ధ చేయకండి. దైవపరమైన విషయాల్లో సమయం గడపండి. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. ఉద్యోగంలో బాగాఉంటుంది, అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. మీ మాటతీరు కొంతమందికి నచ్చక పోవచ్చును. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఇబ్బందులకు అవకాశం ఉంది, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. ఊహించని ఖర్చులకు ఆస్కారం ఉంది. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది, జాగ్రత్త.

 


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు తప్పక పోవచ్చును. చిన్న చిన్న విషయాలకే అందోళన చెందుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. రావల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. మానసికంగా దృడంగా ఉండుట సూచన. చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి.
 

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈవారం పెద్దలను కలుస్తారు, వారినుండి నూతన విషయాలు తెలుస్తాయి. బంధువులను కలుస్తారు వారితో కలిసి నూతన పనులను మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న వారు స్వదేశానికి తిరివచ్చే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది, కొనుగోలు చేసే విషయంలో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది. చర్చల విషయంలో ఆసక్తిని కలిగి ఉంటారు.

 

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారం మిత్రులను కలుస్తారు. వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి. అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. చర్చాపరమైన విషయాల్లో సమయం గడుపుతారు. సంతానం విషయంలో ముఖ్యమైన ఆలోచనలు చేస్తారు, వారికి అర్థం అయ్యేలా తెలియజేయడం మంచిది. బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. కుటుంబపరమైన విషయాల్లో మీ ఆలోచనలను పెద్దలకు తెలియజేస్తారు, శుభకార్యక్రమాలు జరుగుటకు అవకాశం ఉంది. వాహనాలను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది.

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారం సంతానంతో సమయం గడుపుతారు. మానసికంగా దృడంగా ఉండుట సూచన. సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వాహనాల వలన ఇబ్బందులు ఏర్పడుతాయి. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. చర్చల్లో సమయం గడుపుతారు.

 

 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

మరిన్ని శీర్షికలు
Your inner environment, your external environment