Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nee peru talachina chalu

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమ ఎంత మధురం

prema enta madhram

గత సంచికలోని ప్రేమ ఎంత మధురం   సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి... http://www.gotelugu.com/issue322/823/telugu-serials/prema-enta-madhuram/prema-enta-madhram/

 

(గత సంచిక తరువాయి)... అయిదు నిమిషాల పాటు ఇద్దరు అదే భంగీమలో ఉండిపోయారు. ముందుగా మిత్రవింద తేరుకుంది. సిగ్గు పడుతూ దూరంగా తప్పుకుంది.

“నీ బాధ నాకు అర్ధమైంది మిత్రవింద. ఏయిర్ పోర్ట్ రాకపోవటానికి చాల బలమైన కారణం ఉంది”అన్నాడు అపాలజటిక్ గా.
“అంత అర్జంట్ పని ఏమోచ్చింది”అడిగింది కళ్ళు తుడుచుకుంటు మిత్రవింద.
“మీ ఎంబసి స్టాఫ్ లిస్ట్ మా దగ్గరకు వచ్చింది. అందులో కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళ పేర్లు మాత్రం ఉన్నాయి. వాళ్ళలో నీ పేరు కూడా ఉంది. మీ గురించి పూర్తిగా ఎన్ క్వైరీ చెయ్యమని మాకు ఆర్డర్స్ వచ్చాయి. ఇలా జరగటం మాములే కనుక నేను పెద్దగా ఆశ్చర్యపోలేదు. మాకు తెలిసిన పద్దతిలో మీ గురించి చెక్ చేశాం.మీ బ్యాక్ గ్రౌండ్ మీ కుటుంబం గురించి అంతా ఆరా తీశాం. ముఖ్యంగా మీకు ఇంతకు ముందు ఎప్పుడైన క్రిమినల్ రికార్డ్ ఉందేమో కూడా చూశాం. అందరి రికార్డ్  క్లీన్ గా ఉంది. ఆ పనిలో బిజీగా ఉండటం వల్ల నువ్వు వస్తున్న విషయం పూర్తిగా మరిచిపోయాను. కొంచం కూడా గుర్తులేదు. ఆ పని పూర్తయ్యే సరికి రాత్రి పన్నెండు దాటింది. అప్పుడు నీ విషయం అప్రయత్నంగా గుర్తుకు వచ్చింది. వెంటనే కాల్ చేసి క్షమాపణ కోరాలని అనుకున్నాను. కాని ఎందుకులే అని మానుకున్నాను. ఆ రోజు మరో అఫీషియల్ పని తల మీద పడింది. అందుకే ఈ రెండు మూడు రోజులు నీతో టచ్ లో లేకపోయాను”అన్నాడు.
“ఎన్నిసార్లు కాల్ చేసిన నువ్వు రెస్పాండ్ కాలేదు. దాంతో నాకు చాల భయం వేసింది. ఈ ప్రపంచంలో నాకంటు ఎవరు లేరు. అమ్మ నాన్న చెల్లీ అందరు నన్ను విడిచివెళ్ళిపోయారు. ఈ ప్రపంచంలో నా కుంటు ఉన్నది నువ్వే. నీ మీద నమ్మకంతోనే నా దేశం విడిచి ఈ దేశం వచ్చాను. దాదాపు రెండు రోజులనుంచి నీతో మాట్లాడాలని ప్రయత్నించాను. కాని వీలుకాలేదు. కనీసం పార్టిలో అయిన పలకరిస్తావని భావించాను. కాని కనీసం నువ్వు నా వైపు చూడనుకూడా లేదు. పలకరింపుగా నవ్వలేదు. నీ ప్రవర్తన నాకు అనుమానం కలిగించింది. నా వాళ్ళలాగే నువ్వు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతున్నావని ఒక పిచ్చి భయం కలిగింది. అందుకే ఇలా ప్రవర్తించాను. ఏం అనుకోకు”అంది మిత్రవింద.
అబ్బాస్ మాట్లాడలేదు. మిత్రవింద వైపు కళ్ళార్పకుండ చూశాడు.
“ఏమిటి అలా చూస్తున్నావు. ఎప్పుడు చూడనట్టుగా”అంది మిత్రవింద.
“సరిహద్దు ఫెన్సింగ్ దాటివచ్చిన మిత్రవింద ఇప్పుడు నా ఎదురుగా ఉన్న మిత్రవింద ఒక్కరేనా అని అనుమానం కలుగుతోంది”అన్నాడు అబ్బాస్.
“నీకు అంతా నవ్వులాటగా ఉంటుంది. నా పరిస్ధితిలో నువ్వు ఉంటే తెలిసేది”అంది భారంగా మిత్రవింద.
అబ్బాస్ ఆమె చేతిని తన చేతులలోకి తీసుకున్నాడు.
“నీ పరిస్ధితి నేను అర్ధంచేసుకోగలను. అందుకే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. ఇంకో కొత్త సిమ్ తీసుకున్నాను. ఆ నెంబర్ ఇస్తాను. నాతో మాట్లాడాలని అనుకుంటే ఆ నెంబర్ కు కాల్ చెయ్యి. ఈ క్షణం నుంచి నా పాత నెంబర్ కు కాల్ చెయ్యకు.”
“ఎందుకు?
“ఏ సమయంలో ఏం జరుగుతుందో చెప్పలేము. పైగా అది నా అఫీషియల్ కాంటాక్ట్ నెంబర్. ఒక్కోక్కోసారి మా అధికారులు మా ఫోన్ చెక్ చేస్తారు. అందులో ఉన్న నెంబర్స్ ను నోట్ చేసుకుంటారు. సమయం వచ్చినప్పుడు వాటిని చెక్ చేస్తారు. ఎక్కడ నుంచి ఆ నెంబర్ వచ్చింది, ఎవరు చేశారు మొదలైన వివరాలు తెలుసుకుంటారు. ఈ విషయం నాకు నిన్ననే తెలిసింది. అందుకే వెంటనే ఇంకో సిమ్ తీసుకున్నాను. ఇంతకు ముందు నువ్వు చేసిన కాల్స్ అని ఫోన్ లోంచి డిలీట్ చేసేశాను. ప్రస్ధుతానికి ఏం ప్రమాధం లేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేము. ఆ లోగా మన పెళ్ళయిపోతుంది. ఆ తరువాత వాళ్ళు అనుమానించిన లాభం ఉండదు”అన్నాడు.
“మనం పెళ్ళేప్పుడు చేసుకుందా”అంది మిత్రవింద.
“ఇంకా కొన్ని రోజులు ఆగాలి.”
“ఎందుకు ఆగాలి. ఇప్పుడు మనకు ఏ సమస్యలు లేవుగా.”
“సమస్యలు లేకపోవచ్చు. కాని పరిస్ధితులు బాగా లేవు.”
“ఏమిటా పరిస్ధితులు.”
“కొన్ని రోజులకు ముందే మన రెండు దేశాల మద్య చారిత్రాత్మక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కొన్ని విషయాల మీద రెండు దేశాలు సంతకాలు కూడా చేశాయి. సమావేశం ముగిసిన అదే రోజున ఉగ్రవాదులు బారముల్లా మీద దాడిచేశారు. కొన్ని వందలమందిని పొట్టనపెట్టుకున్నారు. రక్తపుటేరులు పారించారు. ఈ దారుణమైన సంఘటనను ఇంకా రెండు దేశాలు పూర్తిగా మరిచిపోలేదు. ముఖ్యంగా భారత్ ఈ విషయాన్ని చాల సీరియస్ గా తీసుకుంది. ఆరునూరైన ఇంత దారుణం చేసిన ఉగ్రవాదులను పట్టుకోవటానికి ప్రయత్నిస్తోంది. వాళ్ళు ఎప్పుడే భారత్ సరిహద్దులు దాటి మా దేశంలోకి వచ్చేశారు. ఇప్పుడు వాళ్ళను పట్టుకునే బాధ్యత మా మీద పడింది. ముఖ్యంగా నా మీద పడింది. వాళ్ళ ఆచూకి గురించి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను. వాళ్ళు దొరికేంతవరకు భారత్ ఊరుకోదు.  మా మీద వత్తిడి తెస్తునే ఉంటుంది.ఈ పరిస్ధితిలో మనం పెళ్ళిచేసుకుంటే సమస్య ఇంకా తీవ్రతరమవుతుంది. ఒకవేళ రిజిస్టార్ అఫీసులో చేసుకున్న ఈ సంగతి బయటపడుతుంది. దాన్ని మీడియా పెద్దగా హైలెట్ చేస్తుంది. ఉన్నది లేనిది ఊహించుకుని ఇష్టంవచ్చినట్టు రాస్తుంది. అందుకు మీ ప్రభుత్వం కూడా తోడవుతుంది. “
“దాంతో మా దేశం మీద ఇంకా వత్తిడి ఎక్కువుతుంది. ముఖ్యంగా నా మీద ఎక్కువవుతుంది. పైగా మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి నా మీద కంటే నీ మీదే ఎక్కువ అనుమానం ఉంటుంది. నువ్వు మాములుగా పొలిటికల్ అటాచివి కావని అనుమానిస్తుంది. ఆ ఉద్యోగం అడ్డం పెట్టుకుని భారత్ ఏజంటువని మా దేశం నిన్ను భావిస్తుంది. ఒకసారి అనుమానం అంటు రాకూడదు. వస్తే చాల ఇబ్బందులు కలుగుతాయి. మొదటగా నిన్ను అరెస్ట్ చేసి జైలులో పెడుతుంది. నువ్వు ఏజంటా కాదా అని తెలుసుకోవటానికి చిత్రహింసలు పెడుతుంది. ఆ టార్చర్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. మనిషైన వాడు ఆ చిత్రహింసలను భరించలేడు. అంతకంటే ఆత్మహత్య చేసుకోవటం నయం అనుకుంటాడు. నీకు ఆ పరిస్ధితి రాకూడదు. అందుకే  కొంచం ఆగమని చెప్పుతున్నాను.”
“ఇంకా ఎన్ని రోజులు ఆగాలి” అంది మెల్లగా మిత్రవింద.
ఆమె మొహంలో కళ పూర్తిగా ఇంకిపోయింది.
“అంతగా భయపడకు మిత్రవింద. పరిస్ధితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. త్వరలోనే ఆ ఉగ్రవాదులను నేను పట్టుకుంటాను. అప్పుడు అన్ని సమస్యలు తీరిపోతాయి. ముఖ్యంగా మీ దేశానికి మా దేశం మీద ఉన్న అనుమానం పూర్తిగా తొలగిపోతుంది. మళ్ళి మన రెండుదేశాలు స్నేహంగా ఉంటాయి. ముఖ్యంగా ఒకరి మీద ఒకరికి పూర్తి నమ్మకం కలుగుతుంది. అప్పుడు మన పెళ్ళిజరిగితే ఎవరికి ఆక్షేపణ ఉండదు. అందుకే కొంచం ఓపికతో కొన్ని రోజులు ఆగమంటున్నాను. నన్ను అర్ధంచేసుకుంటావని అనుకుంటున్నాను”అన్నాడు అబ్బాస్.
మిత్రవింద ఏం మాట్లాడకుండ మౌనంగా ఉండిపోయింది. ఏదో ఆలోచిస్తున్నట్టు కళ్ళు మూసుకుంది. ఆమె మనస్సులో ఎలాంటి బడబాగ్నులు రగులుతున్నాయో అబ్బాస్ ఊహించగలడు. ఆమె ఒక అమ్మాయి. వెనుక ముందు ఎవరు లేని అమ్మాయి. ఉద్యోగం మీద మక్కువతో దేశం కాని దేశం వచ్చింది. ఆమెకు ఒక అబ్బాస్ మాత్రమే ఈ దేశంలో తెలుసు. అతను తప్ప చుట్టాలు కాని బందువులుకాని, స్నేహితులు కాని, ఎవరు లేరు. అబ్బాస్ ను పూర్తిగా నమ్మకుని ఇంత దూరం వచ్చింది. ఇప్పుడు అతను పెళ్ళి వాయిదా వేస్తున్నాడు. అందుకే కొంచం కలవరపడుతుంది.
రెండు క్షణాలపాటు ఎవరు మాట్లాడలేదు. వాళ్ళ మద్య పూర్తిగా నిశబ్ధం అలుముకుంది. పైన చెట్టుమీద పక్శులు కిలకిలమంటు చప్పుడు చేస్తున్నాయి. సన్నగా గాలి వీస్తోంది.
“సరే అబ్బాస్ నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం. ఇంకా కొన్ని రోజులు ఆగుదాం”అంది మిత్రవింద నవ్వుతూ. ఆ నవ్వు మాములు నవ్వులా లేదు. తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉంది. ఆ విషయం అబ్బాస్ గ్రహించాడు.
“నీ ఆందోళన నేను అర్ధంచేసుకోగలను. నా పరిస్ధితి కూడా నువ్వు గమనించాలి. నేను మాములు సివిలియన్ అయితే నిన్ను లేవదీసుకుపోయి పెళ్ళిచేసుకునేవాడిని. కాని నేను ఒక మిలిట్రి అధికారిని. నువ్వు ఇండియన్ ఎంబసిలో పనిచేస్తున్న పొలిటికల్ అటాచివి. అందుకే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవలసివచ్చింది.”అన్నాడు.
నిజమే అన్నట్టుగా తలూపింది మిత్రవింద.
అబ్బాస్ చేతి గడియారం చూసుకున్నాడు.
“మిత్రవింద నేను బయలుదేరుతున్నాను. ఇదిగో నా కొత్త నెంబర్. వీలుచూసుకుని కాల్ చేస్తూ ఉండు. ఇప్పటికి సెలవు. నా కోసం మంత్రిగారు చూస్తుఉంటారు. నేను వెళ్తాను. నువ్వు వెంటనే బయలుదేరకు. రెండు క్షణాలు ఆగి తరువాత బయలుదేరు. అప్పుడే ఎవరికి అనుమానం రాదు”అన్నాడు అబ్బాస్.
ఆ తరువాత అబ్బాస్ వెళ్ళిపోయాడు. వెళ్ళేముందు ఆమెకు తన కొత్త నెంబర్ ఇచ్చాడు. దాన్ని తన సెల్ లో లోడ్ చేసుకుంది మిత్రవింద. ఇప్పుడు ఆమె మనస్సు ప్రశాంతంగాఉంది. అంతవరకు కలవరపెడుతున్న సమస్యకు ఆమెకు జవాబు దొరికింది. అబ్బాస్ కలిసి మాట్లాడింది. దాంతో అంతవరకు అలుముకున్న అనుమానాలన్ని పటాపంచలైయ్యాయి.
రెండు క్షణాల తరువాత బయలుదేరింది మిత్రవింద. ఆమె హాలులో కి వెళ్ళేసరికి పార్టీ తారస్ధాయిని అందుకుంది. అందరు తాగుతూ తూలుతూ ఎంజాయ్ చేస్తున్నారు. దానికి తగినట్టు జ్యూక్ బాక్స్ లోంచి సంగీతం పెద్దగా వినిపిస్తోంది. అబ్బాస్ కోసం చూసింది మిత్రవింద. అతను రక్షణమంత్రి వెనుక నిలబడిఉన్నాడు. ఇండియన్ అంబాసిడర్ ఆయన సతీమణి ఇద్దరు రక్షణమంత్రితో పిచ్చాపాటిలో పడ్డారు.
రాత్రి పదకొండువరకు పార్టీ జరిగింది. ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయింది మిత్రవింద.
“పాకిస్ధాన్ రాజకీయాల గురించి మీకేం తెలుసు మిస్ మిత్రవింద”అడిగాడు నవ్వుతూ ఇండియన్ అంబాసిడర్.
సమయం పదిగంటలు కావస్తోంది. స్టాఫ్ అంతా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. మిత్రవింద కూడా ఒక ముఖ్యమైన ఫైలు తీసి చూస్తోంది. అప్పుడే అటెండర్ వచ్చి అంబాసిడర్ గారు పిలుస్తున్నారని చెప్పాడు. ఆయన ఎందుకు పిలుస్తున్నాడో చూచాయిగా ఊహించింది మిత్రవింద. దానికి సిద్దంగానే ఉంది. తను తయారుచేసుకున్ననోట్స్ తీసుకుని చాంబర్స్ లోకి వెళ్ళింది.
“కూర్చోండి మేడం”మర్యాదగా అన్నాడు అంబాసిడర్.
పుస్తకం టేబుల్ మీద పెట్టి కూర్చుంది మిత్రవింద.
ఉపోద్గాతం లేకుండ అంబాసిడర్ పాకిస్ధాన్ రాజకీయాల గురించి అడిగాడు. ఆయనకు జవాబు చెప్పటానికి సిద్దంగానే ఉంది మిత్రవింద. పాకిస్ధాన్ లో అడుగుపెట్టిన వెంటనే తన పని మొదలుపెట్టింది. అక్కడ దొరికే ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ అన్ని సంపాదించుకుంది. వాటిని పూర్తిగా చదివి ఆకళింపుచేసుకుంది. నెట్ లో పాకిస్ధాన్ అసలు పరిస్ధితి గురించి తెలుసుకుంది. అందులో ఉన్న విషయాలు కూడా ఆమెకు చాల ఉపయోగపడ్డాయి. వాటిని పేపర్ ద్వార సంపాదించిన వార్తలను క్రోడికరించుకుని ఒక రిపోర్ట్ తయారుచేసుకుని సిద్దం చేసుకుంది. ఇది ఎప్పటికైన ఉపయోగపడుతుందని ఆమె నమ్మకం. ఆమె ఊహించినట్టుగానే అంబాసిడర్ ఆ విషయం గురంచి అడిగాడు.
“పాకిస్ధాన్ రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పటానికి ఏంలేదు. ఇంచుమించి మన దేశంలో లాగే ఇక్కడ కూడా ఉంది. పేరుకు ప్రజాస్వామ్య దేశం కాని ఇక్కడ అధికారమంతా మిలిట్రి అధికారులది. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్న దాన్ని పాటించితీరాలి. అది మంచిదైన చెడ్డదైన ఒప్పుకుని తీరాలి. ఎవరు నోరెత్తటానికి వీలులేదు. పేరుకు మాత్రమే ప్రధానమంత్రి. కాని నిర్ణయాలు తీసుకునేది మాత్రం మిలిట్రి అధికారులది. “
“దీనికి ముఖ్య కారణం దిలావర్ దాదా అతని పార్టీ. అంతకుముందు ఎన్నికలలో దిలావర్ దాదా పార్టీ ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసింది. చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పింది. రైతులకు ఉచిత కరెండ్ ఇస్తామని వాగ్దానం చేసింది. స్ర్తీలకు ప్రతి ఏరియాలో ప్రాతి నిధ్యం కల్పిస్తామని గట్టిగా చెప్పింది. అన్నిటికంటే ముఖ్యంగా ఆదివాసలకు లెక్కలేనన్ని వాగ్ధానాలు చేసింది. కాని దిలావర్ దాదా ఒక్క వాగ్గానం నెరవేర్చలేదు.
“ప్రజలు అయిదుసంవత్సరాలు ఓపికగా కాచుకున్నారు. కాని ఏం ఫలితం కనిపించలేదు. ఈ సారి ఎన్నికలు జరిగినప్పుడు అతనికి ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలని తీర్మానించుకున్నారు ప్రజలు. వాళ్ళకు తోడుగా ప్రతిపక్షం కూడా నిలబడింది. ఈ విషయం తెలుసుకున్న దిలావర్ దాదా చాల కంగారుపడ్డాడు. ఈ సారి ఎన్నికలలో తను తప్పకుండ ఓడిపాతానని అతనికి భయం పట్టుకుంది. అందుకే ఒక అద్భుతమైన పధకం ఆలోచించాడు.
రహస్యంగా అతను మిలిట్రి అధికారులను సంప్రదించాడు. ఎన్నికల ప్రచారంలో తనకు సహయం చెయ్యాలని కోరాడు. దానికి ప్రతిఫలంగా వాళ్ళకు తగిన ప్రాధాన్యత ఇస్తానని వాగ్దానం చేశాడు. వాళ్ళు దానికి సరే అన్నాడు. గత సంవత్సరం పాకిస్ధాన్ లో మళ్ళి ఎన్నికలు జరిగాయి. ఈ సారి మిలిట్రి అధికారులు ప్రచారంలో పాల్లోన్నారు. దిలావర్ దాదాకు ఓటువేసి గెలిపించాలని గట్టిగా చెప్పారు. అలా చెయ్యకపోతే అందరి అంతు చూస్తామని బెదిరించారు. పోలీసులు బెదిరిస్తే ఆశ్చర్యపోనవసరం లేదు. కాని దేశాన్ని కాపాడుతున్న మిలిట్రి అధికారులు బెదిరిస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళకు అర్ధంకాలేదు. మిలిట్రి వాళ్ళతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో వాళ్ళకు తెలుసు. అందుకే అందరు దిలావర్ దాదా పార్టీకి మళ్ళి ఓటు వేశారు. దాంతో అతను అతని పార్టీ మళ్ళి గెలిపించింది.  ఇటివల జరిగిన ఎన్నికలలో కూడా దిలావర్ దాదా పార్టీ ఎన్నో వాగ్ధానాలు చేశారు. ఇది చేస్తాం అది చేస్తాం అని నమ్మబలికారు. కాని ఒక్క పని కూడా చెయ్యలేదు. దానికి ఇంకో కారణం మిలిట్రి అధికారులు. దిలావర్ దాదా అధికారంలోకి రావటంతోనే మిలిట్రి అధికారులు ప్రభుత్వాన్ని ఖబ్జా చేశారు.”
“పేరుకు మాత్రమే పాకిస్ధాన్ లో ప్రజాస్వామ్యం ఉంది. కాని అధికారం ప్రజలు ఎన్నుకున్న నాయకుల చేతులలో ఎంతమాత్రం లేదు. మిలిట్రి అధికారుల చేతులలో ఉంది. వాళ్ళు ఏం చెపితే అది చెయ్యాలి. ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళే తీసుకోవాలి. దేశప్రధాన మంత్రి అయిన దిలావర్ దాదా కాని సహచరలు కాని అడ్డుచెప్పటానికి వీలులేదు. నోరు మూసుకుని చెప్పిన చోట సంతకం చెయ్యాలి. లేక పోతే ఏం జరుగుతుందో దిలావర్ దాదాకు తెలుసు. అంతకుముందు ఎన్నోసార్లు పాకిస్ధాన్ మిలిట్రి ప్రభుత్వాన్ని కూలదోసింది. అధికారాన్ని తమ హస్తగతం చేసుకుంది. అడ్డు చెప్పినవాళ్ళను జైలులో పెట్టింది. ఈ విషయం దిలావర్ కు తెలుసు. అయిన అతను మిలిట్రిల సహయం కోరాడు. వాళ్ళు తనకు సహకరిస్తారని భావించాడు. కాని మిలిట్రి అధికారులు తమ బుద్ధి చాటుకున్నారు. తమ అధికారదాహాన్ని బహిర్గతం చేసుకున్నారు. దాంతో దిలావర్ దాదా వాళ్ళ చేతుల్లో పావు అయిపోయాడు. వాళ్ళు ఎటు కదిపితే అటు కదులుతున్నాడు. ఏం చెప్పితే అది చేస్తున్నాడు. తన కంటు సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేడు. ఒకవేళ తీసుకున్న దాని ఆమోదం కోసం మిలిట్రి అధికారులను సంప్రదించాలి. వాళ్ళు అతని నిర్ణయాన్ని ఒప్పుకోవచ్చు. ఒప్పుకోకపోవచ్చు. అది అధికారుల మూడ్ మీద ఆధారపడి ఉంటుంది.”
“ప్రజలు తాము రెండోసారి మోసపోయామని గ్రహించారు. వాగ్ధానం చేసిన ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అమలుకాలేదు. నిరుద్యోగం కొండలా పేరిపోయింది. దేశంలో నేరాలు హత్యలు మానభంగాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. పోలీసు వ్వవస్ధ పూర్తిగా నిర్విర్వమై పోయింది. ఏ క్షణంలో ఏం జరుగుతందో ఎవరికి అర్ధంకావటంలేదు. ప్రతి క్షణం ప్రజలు బిక్కుబిక్కుమంటు బతుకుతున్నారు. ఈ అరాచాకాన్ని కొంతమంది చదువుకున్న యువకులు సహించలేకపోయారు. వాళ్ళంతా ఒక కూటమిగా ఏర్పాడ్డారు. రోడ్డు మీద దర్నాలు చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శించసాగారు. మరికొంత మంది రాస్తోరోకోలు చేశారు. మరి కొంతమంది అధికారులను గెరావ్ చేశారు. ఏం చేసిన ఏది చేసిన అంతా శాంతియుతంగా చేశారు. అందుకే ప్రభుత్వం కాని అధికారులు కాని వాళ్ళను పట్టించుకోలేదు. వాళ్ళందరిని పిచ్చివాళ్ళ కింద జమకట్టింది.
“ఎన్నిరోజులు ఆందోళన చేసిన ప్రభుత్వం వాళ్ళను పట్టించుకోలేదు. కనీసం పిలిచి మాట్లాడలేదు. దాంతో వాళ్ళు కోపంతో రెచ్చిపోయారు. శాంతియుతంగా ఏం చేసిన ప్రభుత్వం పట్టించుకోదని వాళ్ళకు అర్ధమైంది. అందుకే హింసను ఆశ్రయించారు. మొదటిసారిగా ఒక రాజకీయనాయకుడి మీద దాడిచేశారు. అతను దిలావర్ ప్రభుత్వంలో ఒక మంత్రి. ఆ రోజు మంత్రి సిటికి పక్కనే ఉన్న ఊరిలో తన సెక్యురిటితో సమావేశానికి వెళ్ళాడు. సమావేశం తరువాత తిరిగివస్తుంటే అకస్తాతుగా కొంత మంది అతని కాన్వాయ్ మీద దాడిచేశారు. ఆ దాడిలో  సెక్యురిటితో పాటు మంత్రి కూడా చనిపోయాడు. మరికొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయి.”
“ఊహించని ఈ సంఘటన చూసి ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే పోలీసులను రంగంలోకి దింపింది. ఆ తరువాత విప్లవకారులు అని పిలువబడే వీళ్ళు మరికొన్ని దాడులు చేశారు. కాని ఏది చేసిన చాల పకడ్భందిగా ఒక ప్లాన్ ప్రకారం చేసేవాళ్ళు. చిన్న క్లూ కాని ఆధారం కాని విడిచిపెట్టేవాళ్ళుకారు. దాంతో వీళ్ళను పట్టుకోవటం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిపోయింది.  ఇలా తరుచు ప్రభుత్వ అధికారుల మీద మంత్రులమీద దాడిచేస్తూ రక్తపాతం సృష్టిస్తున్నారు. దాంతో సామాన్యప్రజలు రోడ్డు మీద తిరగటానికి విపరీతంగా భయపడిపోతున్నారు. ఏ క్షణంలో ఎక్కడ బాంబు పేలుతుందో అని ఆందోళనపడుతున్నారు. చీమచిటుక్కుమన్నా భయపడుతున్నారు. పోలీసులు రక్షణసంస్ధలు విప్లవకారులను పట్టుకోవటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కాని ఏం లాభం లేకుండ పోతుంది. విప్లవకారులు ఎక్కడ ఉన్నారో ఎక్కడ దాక్కున్నారో ఎవరికి తెలియదు. సమయం వచ్చినప్పుడు ప్రత్యేక్షమవుతారు. పనిపూర్తిచేసుకుని మెరుపులా మాయమై పోతున్నారు´”
“ప్రస్ధుతం పాక్ ప్రభుత్వానికి వీళ్ళు పెద్ద తలనొప్పిగా తయారయ్యారు” అని ముగించింది మిత్రవింద.
“ఎక్సలెంట్ మిస్ మిత్రవింద. చాల చక్కగా చెప్పారు. మీరు ఇక్కడికి వచ్చి కొద్దిరోజులే అయింది. అయిన పాకిస్ధాన్ రాజకీయాలగురించి ఈ దేశపరిస్ధితుల గురించి చక్కగా అవగాహన చేసుకున్నారు. మీరు తెలుసుకున్న విషయాలను ఒక రిపోర్ట్ గా తయారుచెయ్యండి.దాన్ని నా టేబుల్ మీద పెట్టండి. నేను సంతకం చేసిన తరువాత దాన్ని డిప్లమెటిక్ పౌచ్ లో ప్రధానమంత్రి ఆఫీసుకు పంపించండి. ఈ పని వెంటనే జరగాలి”అన్నాడు అంబాసిడర్.
అలాగే అని తలూపింది. తరువాత అంబాసిడర్ చాంబర్స్ నుంచి బయటకు వచ్చింది. తన చాంబర్స్ లోకి వెళ్ళి అంబాసిడర్ చెప్పినట్టు చేసింది. తను తెలుసుకున్న విషయాలను ఒక రిపోర్ట్ గా తయారుచేసి దాని అంబాసిడర్ టేబుల్ ముందు పెట్టింది. ఆయన వెంటనే దాని మీద సంతకం చేశాడు. ఆ కాగితాలను జాగ్రర్తగా ఒక కవరులో పెట్టి సీల్ చేసింది. తరువాత ఆ కవరును డిప్లమెటిక్ పౌచ్ లో పెట్టి అదే రోజు ఇండియా పంపించింది.    

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్