Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నీ పేరు తలచినా చాలు

nee peru talachina chalu

గత సంచికలోని నీ పేరు తలచినా చాలు సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి... http://www.gotelugu.com/issue322/824/telugu-serials/nee-perutalachina-chalu/nee-peru-talachina-chalu/

(గత సంచిక తరువాయి)...  విభ్రమ నుంచి తేరుకున్న తరువాత అందరూ పకపక నవ్వేశారు. శమంతకంగారు చెప్పినది విన్నాక మెల్లగా ఈ లోకం లోకి వచ్చిపడ్డాడు శంకర్రావు. తాపీగా రిలాక్సయ్యాడు.

“మౌక్తికా మాడమ్… రాత్రి మేడ మీద కనబడింది మీరేనా! నేనింకా దెయ్యమేమోనని హడలి చచ్చాను. భలే జర్కిచ్చారు మాడమ్ గారూ…’’ అన్నాడు తేలికగా నవ్వేస్తూ.

అతడు మనుషుల్లో పడడం చూసి మౌక్తిక రిలీఫ్ గా ఫీలౌతూ “సారీ శంకర్రావ్… నేను నిన్ను ఇబ్బంది పెట్టాను’’ అంది మౌక్తిక కాస్త గిల్టీనెస్ ని స్వరంలో మిళితం చేసి.

“మొత్తానికి మౌక్తిక గారు… మన ఈ ట్రిప్ ని మరచిపోలేని విధంగా చేశారు…ఇటీజె థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్…’’ మధుకిరణ్ బిగ్గరగా నవ్వాడు.

అతడంత పెద్దగా నవ్వడం మొదటిసారి చూస్తోంది మౌక్తిక. దోషిలాగా తల దించుకుంది.

“ఆపాటి థ్రిల్ లేకపోతే మనం ఈ పిక్నిక్ ని, ఈ రాజా వారి దివాణాన్ని గుర్తుంచుకుంటామా చెప్పండి! ఈ ఊరు పేరు చెప్పగానే జరిగిన హంగామా అంతా గుర్తు రావాలి మనకు. ఇదొక వండర్ ఫుల్ మెమరీ…’’ రమ్య అంది మధుకిరణ్ ని బలపరుస్తూ.మొహమాటంగా నవ్వేసింది మౌక్తిక.

“రియల్లీ అయాం వెరీ సారీ శంకర్రావ్…’’ మరోసారి క్షమాపణలు చెప్పింది.

“భలేవారే మాడమ్…మీరు నాకు సారీ చెప్పడం దేనికి? మీరేమీ కావాలని చేయలేదు కదా! నేనే అనవసరంగా భయపడి అల్లరి చేశాను.’’ అమె పట్ల గౌరవం ఉట్టిపడింది శంకర్రావు స్వరంలో.

“అయినా అమ్మాయ్…కొత్తచోటు… పైగా అర్ధరాత్రి… అందునా ఆడపిల్లవి. ధైర్యంగా డాబాపైన తిరగడానికి నీకు భయమేయలేదూ! పెద్దముండావాడిని. నా మాట విని ఇంకెప్పుడూ ఇలాంటి సాహసాలు చేయకు…’’ మందలించారు శమంతకం గారు.

ఆ మందలింపులో నిండిన ఆప్యాయత, విజ్ఞత,పెద్దరికం, అన్నీ కలిసి తనకు జాగ్రత్తలు చెబుతున్నట్లుగా అనిపించింది మౌక్తికకు. “అలాగేనండీ’’ అంది నమ్రతగా.

“అయినా బావగారూ…మా ఊళ్ళో అలాంటి భయాలేమీ ఉండవు… ఏ దెయ్యాలు, దేవతలు మీద వాలకుండా మా కోదండరాముడే కాపాడుతాడు…’’ ఎనలేని భక్తిప్రపత్తులు ఉట్టిపడుతూండగా అన్నారు సంగమేశ్వర రావుగారు.

“పదండి…పదండి…ఇప్పటికే బారెడు పొద్దెక్కింది. ముందు గుడికెళ్ళి రాముడి దర్శనం చేసుకుని, తరువాత బ్రేక్ ఫాస్ట్ చేసి దివాణం చూడడానికి వెళ్దాం…’’ అందరినీ అదిలించారు శమంతకంగారు.

శంకర్రావు   గారికి క్షమాపణలు చెప్పడంతో మౌక్తిక మనసు కుదుటపడింది.  మౌక్తిక విషయం లో ఇటువంటి విచిత్ర సంఘటనలు ఎన్ని జరిగాయో తెల్సుకోవాలంటే వచ్చే శుక్రవారం విడుదలయ్యే సంచికలో  చూడండి.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
prema enta madhram