Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> మెరుపు కలలు

merupukalalu

అశ్విని, కళ్ళ నిండా కలలు, జీవితంలో పెద్ద స్థాయి కి చేరాలని,  మంచి హోదా ని పొందాలని. ఒక మంచి జీవితం  గడపాలని పట్టుదల. మంచిదేగా కల, ఆశ పడడం?. కానీ పేద కళ్ళు కనే కలలు నిజమాయెన?. పేదవారు  మంచి జీవితం పొందడం  చాలా అరుదుగా చూస్తాం మనం.

అశ్విని  ఒక పేద కుటుంబం లో  జన్మించిన అమ్మాయి. తండ్రి కూలిపని చేస్తారు. అమ్మ ఇంటింటా పనులు చేస్తుంది. ఒక తమ్ముడు, 8 వ తరగతి. ఇద్దరు కష్టపడి  పిల్లలిద్దర్నీ చదివిస్తున్నారు.

పెద్దపెద్ద కలలు అశ్వినివి. లేనివారికి తెలుస్తుంది దేని విలువైన, ఇది నిజం. అశ్విని కి కష్టం అంటే ఎంతో తెలుసు, ఆ కష్టం కి కారణం తెలుసు, అది నిర్మూలము అవ్వాలంటే ఎం చేయాలో తెలుసు. తల్లి తండ్రులు ఎన్నో రాత్రులు కడుపులు మాడ్చుకోవడం  కళ్లారా చూసింది. అందరి పిల్లల్ని చూసి తనకి కోరికలు పుట్టచ్చేమో మనసులో, నా దగ్గర కుడా ఇలాంటిది ఉంటే బావుండేది, నేను కూడా ఇలా చేస్తే ఎంత బావుణ్ణు అని, కానీ తన కోరికలు తన బుద్ధిని తప్పు త్రోవ  పట్టనివ్వలేదు.  తన ప్రతి కోరికని తన స్ఫూర్తి గా మలుచుకుంది, దారిచూపే బాటసారిగా మార్చుకుంది. ఇప్పుడు లేనివన్ని నా జీవితంలో పొందుతాను అన్న ప్రబల ఆత్మ విశ్వాసం తనది. బాధలు ఎలా గట్టెక్కించాలో అన్నదే తన ప్రయత్నం.

అశ్విని కి తన కుటుంబం అంటే అంతులేని  ప్రేమ. ఆత్మాభిమానం, తల్లి తండ్రి ఎవరి ముందు తలవంచుకోకూడదు, సిగ్గుతో కళ్ళు దించి మాట్లాడకూడకు ఎన్నడూ అన్నది తన ఆశయం. సివిల్స్ పరీక్ష వ్రాసి తల్లి తండ్రి కి కష్టాల నుండి బయటకు తెద్దామని కష్టపడి చదువుతోంది. వినయం, ఆచరణ  అశ్విని ఆభరణాలు. మృదు భాషిణీ, చలాకీగా ఇల్లంతా పరుగులు తీస్తూనే ఉంటుంది. అమ్మ వెనకాలే తీరుగుతూ ఇంటి పనంత చేస్తుంది,అమ్మ కి సాయం చేయాలి అనే అందమైన మనసున్న  అమ్మాయి.

స్వయంకృషితో ఎవరి సహాయం లేకుండా తనంత తానే చదువుకుంటూ ఇంత వరకు వచ్చింది.ఒక సహాయం చేస్తే తిరిగి ఏదైనా కోరే సమాజం మనది. మా ఇంటి ఎదురుగా ఉన్న చిన్న గుడిసె లో ఉంటుంది. . తనకోసం ఎదో చేద్దామని ఎక్కడో మనసులో ఒక బలమైన కోరిక ధృడంగా. ఎందుకో కారణం తెలియదు కాని  తనని మొదటి రోజు చూసిన దగ్గరనుండి  ఎదో హాయి మనసుకి . లేడిపిల్లలా ఇటు అటు తిరుగుతూ పని చేసుకుంటూ మధ్యలో మా ఇంటి వైపు చూసి చిరునవ్వుతో పలకరిస్తు, తనని చూస్తేనే మనసుకి ఎదో ఆహ్లాదం.  ఎన్నో ఏళ్లుగా చూస్తున్న ఆ అమ్మాయిని.

ఒక రోజు మా ఇంటి నుండి నవ్వి సైగ చేసి ఇంటికి రమ్మన్నా. ఒక్కసారి పిలిచేసరికి భయపడి దేనికి అని  ఆడిగింది. వస్తే గా తేలుస్తుంది అన్నా. అమ్మ పనికి వృల్లింది వచ్చేక అడిగి వస్తా అంది. అలాగే చేయి అన్నా. భయం, బిడియం, సిగ్గు అన్ని మూట కట్టి డోర్ బెల్ మ్రోగించింది

టింగ్ టోంగ్... అని అది కూడా ఒక్కసారే. సిగ్గు పడుతూ చిన్న చిరునవ్వుతో నమస్తే ఆంటీ అని పలకరించింది. లోపల కి రమ్మని కూర్చోమన్న సోఫాలో. ఎదో మనసులో బిడియం సోఫా లో కూర్చోవచ్చా అని అమాయకపు చిరునవ్వు పెదవి పై. పర్లేదు హాయిగా  కూర్చో అని చెప్పా.  చెప్పండి ఆంటీ దేనికి పిలిచేరు అని ప్రశ్నించింది?

దేనికి తొందర అని అడిగా?ఇంటికి వెళ్ళాలి అమ్మ  ఎదురు చూస్తుంది  భోజనం కోసం అంది. రోజు తనని తన కుటుంబాన్ని చూస్తా అయిన తన నోటితో విందామని అడిగా మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, మీ నాన్నగారు ఎం చేస్తారు అని, అన్నిటికి జవ్వాబు చెప్పింది సన్నని గొంతుతో.

నీ జీవితంలో ఏం సాధించాలి అని అనుకుంటున్నావ్ అన్నా? 21ఏళ్ళు వచ్చేసరికి బాగా స్థిరపడిపోవాలి ఆంటీ అంది. తథాస్తు అన్నా. పక్కున నవ్వింది, చేత్తో నోరు అడ్డు పెట్టుకుని. పుస్తకాలు నేను ఇస్తా, ఏ అవసరం అయిన , సందేహాలున్న వెంటనే మొహమాటం పడకుండా  వచ్చి అడుగు  లేదా ఫోన్ చెయ్ అని ఫోన్ నెంబర్ ఇచ్చి, టచ్ లో ఉండమని చెప్పి బుక్స్ కావలసినవి తనకి ఇచ్చి పంపించా.

3 ఏళ్ళు గడియనే గడిచేయి కష్టపడి చడివుతోంది పగలు రాత్రి అని తేడా లేకుండా. గ్రాడ్యుయేషన్ కూడా మంచి మార్కులతో పాస్ అయింది. అలా ఒక్కో అడుగు వేసి ఎత్తుకి ఎదుగుతున్న అశ్విని ని చూస్తే ఎందుకో గొప్పగా అనిపించేది. రోజు ఒకమాటు కిటికీ వైపు చూసి చేతులు ఊపి నవ్వేది. ఆఫ్ఫ్శ్ఛ్ పరీక్షలు రాసింది.ఫలితాలకు ఎదురుచూస్తున్నాయి ఆ కళ్ళు.ఎదో చేయాలని తనకోసం తనని ఈ స్థాయి కి తెచ్చిన తల్లి తండ్రులు కోసం, తన తమ్ముడు మంచి జీవితం కోసం. ఆఫ్ఫ్శ్ఛ్ పరీక్షలు రాసి ఇంటికి వచ్చింది. అశ్విని పరీక్షలు ఎలా రాసేవ్  అని అడిగా నోట్లో స్వీట్ పెట్టి. ఏమో ఆంటీ భయంగా ఉంది అంది. భయం దేనికి నువ్వు పాస్ అవుతావని నమ్మకం తోనే  ఈ స్వీట్ నీ నోటీలో పెట్టా అని చెప్పా. పగబడి నవ్వింది, ఆంటీ మీరు జోకులు బాగా వేస్తారు అని.

నాకు నీమీద ఉన్న నమ్మకం అది అని చెప్పా.అశ్విని ఇలాంటి విషయాల్లో నీతో నేను వెటకారం అడనుగా అన్నా. నిజమా ఆంటీ, మీ నమ్మకం నిజం అవ్వాలని నేను కూడా కోరుకుంటా అంది. నన్ను మర్చిపోవుగా జీవితం లో అలా ఎత్తుకి ఎదుగుతూ సరదాగా అన్నా.అశ్వని కళ్ళలో నీళ్ళు. ఆ రోజు మీరు పిలిస్తే కిటికీ లో నుంచి ఎంతో భయపడ్డాను ఆంటీ కానీ మీ దగ్గనుండి ఇంత స్ఫూర్తి, నమ్మకం, ప్రేమ దొరుకుతాయని కలలో కూడా ఊహించలేదు. మా తల్లితండ్రులు కూడా నా కోసం ఇంత మంచిగా  కలలు కనీ ఉండరేమో అంది. వంగి కాళ్ళకి నమస్కరించింది. మీరు, మీ నవ్వు, మీ స్ఫూర్తి ని జీవితాంతం మర్చిపోలేను ఆంటీ. మీతో ఇలా జీవితం లో కలుస్తాను అని కూడా ఊహించలేదు ఎప్పుడు అని వెళ్ళిపోయింది ఆనంద భాష్పాలతో.

పరీక్ష ఫలితాలు రానే వచ్చాయి. తనకన్నా నాకు ఎదో తెలియని అలజడి మనసులో. కలని నిజం చేసుకోడానికి తాను పడిన శ్రమ, పడిన కష్టం, నా నమ్మకాన్ని నిజం చేయడానికి తను పడిన  తాపత్రయం, ఎక్కడో చిన్న లోపంవల్ల ఏదైనా ఇటు అటు అయితే ఇప్పుడు నవ్వే ఆ కళ్ళు ఆ అమాయకపు చిరునవ్వు కి బదులు కళ్ళలో నీళ్ళు చూడలేమో అన్న ఆలోచన,  మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకున్న, తను పడిన కష్టం వృధా కాదు అని, ఇలా ఆలోచనలు పొంగి పొర్లుతుండగానే  

టింగ్ టోంగ్... డోర్ బెల్ మ్రోగింది. ఎదురుగా అశ్విని, కళ్ళలో ఆనందంతో నిండిన కన్నీళ్లు, పెదవులపై ఆనందం, చేతిలో మిఠాయి డబ్బా, గెంతుకుంటు లోపలకి వచ్చి మీరు పాస్ ఐపోయేరు ఆంటీ అంది. మీ కల నిజం అయిందని మంచి రాంక్ వచ్చింది  అని శుభవార్త చెప్పింది. ఎదో తెలియకుండానే నా కళ్ళు చెమ్మబడ్డాయి.. ఆనందం తో దగ్గర తీసుకున్నా, గర్వంగా అనిపించింది, నా కల తీరింది అని కాదు, తన ఆశయం నెరవేరింది అని. అనుకుంటే  సాధించలేనిది ఏముంది.

"కృషితోనాస్తి దుర్భిక్షం" అన్నారు పెద్దలు.

ఒకరికి స్ఫూర్తి అవ్వాలంటే డబ్బు పెట్టాలి అని వేనకాడుతారేమో, అన్నిటికి డబ్బు అవసరం లేదు. జీవితం లో ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ఉండాలి, నేను ఉన్నాను అన్న ఒక్క మాట చాలు,  ప్రతి అశ్విని కల నిజం అవుతుంది, ఈ అశ్విని ఆశయం పూర్తి  అయ్యిందంటే  అతిశయోక్తి లేదు.ఎవరికోసం వారు  ఎప్పుడు జీవిస్తారు, ఒక్కసారి ఎదుటివారికోసం జీవించి ఆ ఆనందం అనుభవించి చూడండి, ఎదుటివాళ్ళకళ్లలో మెరుపు చూసి మనకళ్లు చెమ్మపడితే అది జీవితం.అంటే. తలవంచి కింద ఉన్నవాళ్ళని చూస్తే మనం ఎప్పుడు బాధపడాల్సిన అవసరమే ఉండదు. ఎప్పుడు పైవారిని చూసి నా దగ్గర లేదు అని అనుకుంటే జీవితం లో ఎప్పుడు ఎదో ఒక లోటు ఉంటూనే ఉంటుంది. ఒక మాట సహాయం చేసి చూడండి అది పది రెట్లయి మీకు వస్తుంది. సంతోషం లో అందరూ తోడుంటారు, ఒక్కసారి ఎవరి బాధనైన పంచుకుని చూడండి, జీవితానికి ఒక అర్ధం దొరుకుతుంది.

మరిన్ని కథలు
attakodalu