Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nee peru talachina chalu

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమ ఎంత మధురం

prema enta madhram

గత సంచికలోని ప్రేమ ఎంత మధురం   సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి....http://www.gotelugu.com/issue324/828/telugu-serials/prema-enta-madhuram/prema-enta-madhram/

(గత సంచిక తరువాయి).... అబ్బాస్ తో మాట్లాడిన తరువాత మిత్రవింద సమయం చూసింది. గోడ గడియారం మూడుగంటలుచూపిస్తోంది. ఇంకో మూడు గంటలలో ఆమె అబ్బాస్ చెప్పిన చోటుకు వెళ్ళాలి. అది ఏమంత పెద్ద విషయం కాదు. కాని ఒక విషయం మాత్రం మిత్రవిందకు అర్ధంకావటంలేదు. మాల్ కు వెళ్ళి బురఖా వేసుకోమని మరిమరిచెప్పాడు అబ్బాస్. దానికి కారణం ఏమిటో ఆమె ఊహకు అందటంలేదు. కాని ఒక విషయం మాత్రం నిజం. ఏదో ముఖ్యమైన పని ఉంటే కాని అబ్బాస్ బురఖా వేసుకోమని చెప్పడు. అయితే ఆ పని ఏమిటో మిత్రవింద ఊహకు అందటంలేదు.

ఆ విషయం గురించి ఆలోచిస్తూ టైం పాస్ చేసింది. సరిగ్గా నాలుగు గంటలకు అంబాసిడర్ తన చాంబర్స్ నుంచి బయటకు వచ్చాడు. ఆయన ఏదో ముఖ్యమైన పనిమీద బయటకు వెళుతున్నాడు. ఎప్పుడు తిరిగివస్తాడో తెలియదు. అయిదు నిమిషాల తరువాత అంబాసిడర్ వెళ్ళిపోయాడు. ఆయన అఫీషియల్ కారు గేటు దాటటం మిత్రవింద చూసింది.

దాంతో రిలాక్స్ గా వెనక్కి వాలింది మిత్రవింద. ఆమె ఆలోచనలన్ని అబ్బాస్ చుట్టు తిరుగుతున్నాయి. పాకిస్ధాన్ వచ్చిన తరువాత ఇంతవరకు ఆమ అబ్బాస్ తో ఒక్కసారి కూడా బయటకు వెళ్ళలేదు. దానికి కారణం ఆమెకు తెలుసు. అందుకే దాని గురించి పెద్దగా ఫీల్ కాలేదు. కాని ఈ రోజు అనుకోకుండ అబ్బాస్ బయటకు రమ్మని పిలిచాడు. పైగా బురఖా వేసుకుని మరి రమ్మన్నాడు. కారణం ఏమిటో ఆమెకు తెలియదు. కాని ఏదో ముఖ్యమైన కారణం కోసమే అబ్బాస్ అలా చెప్పాడని ఆమెకు అర్ధమైంది. అదృష్టవశతు ఒక బురఖా డ్రస్సు ఆమె దగ్గర ఉంది.

పాకిస్ధాన్ బయలుదేరుతున్నప్పుడు షాపింగ్ కు వెళ్ళింది. మాములు డ్రస్ మెటిరీయల్ తీసుకుంది. అప్పుడే ఆమె చూపులు ఒక బురఖా డ్రస్సు మీద పడింది. అది చాల అందంగా గ్రేస్ ఫూల్ గా ఉంది. పైగా మెటిరియల్ కూడా చాల నాణ్యమైనదిగా ఉంది. ఆమె వెళుతోంది ఒక ముస్లిం దేశం. ఈ బురఖా అక్కడ ఎప్పుడైన ఉపయోగపడవచ్చు. అందుకే ముచ్చటపడి దాన్ని కొనుక్కుంది. కొనుక్కుని చాల రోజులైన దాన్ని వేసుకునే అవకాశం ఆమెకు ఎప్పుడు కలగలేదు. కలుగుతుందని కూడా అనుకోలేదు.

కాని ఈ రోజు ఆ అవకాశం వచ్చింది. మొదటిసారి బురఖా వేసుకుని బయటకు వెళుతోంది. అది తలుచుకుంటే ఆమెకు చాల ధ్రిల్లింగ్ ఫీలింగ్ కలిగింది. ఏదో అద్భుతం జరగబోతుందని ఆమె సిక్స్త్ సెన్స్ హెచ్చరిస్తోంది.

మరో రెండు గంటలలో ఆఫీసు పని పూర్తిచేసింది. సరిగ్గా అయిదుగంటలకు తన క్వార్టర్స్ చేరుకుంది. గబగబ స్నానం చేసి మంచి చీర కట్టుకుంది. తరువాత బ్యాగ్ లో బురఖా డ్రస్సు మరికొన్ని సామానులు పెట్టుకుని రెడి అయింది. బ్యాగ్ తీసుకుని క్వార్టర్స్ లోంచి బయటపడింది. ఇంటికి తాళం వేసి పార్కింగ్ స్పేస్ వైపు నడిచింది.

మిత్రవిందకు కారు డ్రైవింగ్ తెలుసు. పాకిస్ధాన్ వచ్చిన కొత్తలో నేర్చుకుంది. కాని ఎప్పుడు డ్రైవ్ చేసే అవకాశం రాలేదు. మాములుగా అయితే తనే ధైర్యంచేసి డ్రైవ్ చేసుకుంటు వెళ్ళేది. కాని అబ్బాస్ ఒక నియమం పెట్టాడు. డ్రైవర్ ను తీసుకుని రమ్మని చెప్పాడు. అతను ఎందుకు అలా చెప్పాడో ఆమెకు తరువాత అర్ధమైంది.

ఎంబసి రూల్ ప్రకారం స్టాఫ్ ఎక్కడికైన బయటకు వెళ్ళవచ్చు. ఎవరితో అయిన గడపవచ్చు. కాని రాత్రి ఎనిమిది గంటలకు ఎంబసిలో రిపోర్ట్ చెయ్యాలి. ఒకవేళ ఆ టైం దాటిపోతే అంబాసిడర్ కు ఎక్స్ ప్లేనేషన్ ఇవ్వాలి. ఎందుకు ఆలస్యంఅయిందో వివరంగా చెప్పాలి. అది సహేతుకంగా ఉంటే ఏం జరగదు. లేకపోతే ఆ స్టాఫ్ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోబడుతుంది.

ఎప్పుడు ఎంబసిలో ఇద్దరు డ్రైవర్లు అందుబాటులో ఉంటారు. వాళ్ళలో ఒకడిని పిలిచింది మిత్రవింద. అతను కారు తాళాలు తీసుకుని డ్రైవింగ్ సీటులో కూర్చున్నాడు. మిత్రవింద బ్యాగ్ తో వెనుక సీటులో కూర్చుంది.

“ఎక్కడికి వెళ్ళాలి మేడం”అడిగాడు డ్రైవర్.

“జీన్నా స్క్వేర్ దగ్గరకు వెళ్ళు. నేను మాల్ లోకి వెళ్ళి కొన్ని సరుకులు తీసుకుంటాను. ఈ లోగా నువ్వు కారుతో పార్కింగ్ లాట్ లో వెయిట్ చెయ్యి”అంది మిత్రవింద.

అలాగే అని తలూపాడు డ్రైవర్. తరువాత కారు  వేగంగా ముందుకు దూసుకుపోయింది. గంట తరువాత కారు జిన్నా స్క్వేర్ దగ్గర ఆగింది. మిత్రవింద క్యాజువల్ గా పక్కకు చూసింది. ఎదురుగా మాల్ కనిపించింది. అది చాల పెద్ద మాల్. ఇస్లామాబాద్  ఉన్న ముఖ్యమైన మాల్ లో అదిఒకటి.

“ఒక గంటలో తిరిగివస్తాను. అంతవరకు కాచుకుని ఉండు”అని డ్రైవర్ తో చెప్పింది మిత్రవింద. తరువాత బ్యాగ్ తీసుకుని మాల్ లోకి నడిచింది. అటు ఇటు చూసింది. ఎడంవైపు రిఫ్రెష్ రూమ్ కనిపించింది. అందులోకి వెళ్ళి  గడియపెట్టుకుంది. గబగబ బ్యాగ్ తెరిచి అందులోంచి బురఖా తీసి పైన వేసుకుంది. అద్దం ముందు నిలబడి తనని తాను ఒకసారి చూసుకుంది. ఆ డ్రస్సులో తను ఎంతో గ్రేస్ ఫూల్ గా ఉన్నట్టుగా తోచింది మిత్రవిందకు.

తరువాత బ్యాగ్ తీసుకుని రిఫ్రెష్ రూమ్ లోంచి బయటకు వచ్చింది. నింపాదిగా మాల్ మెయిన్ హాలులోకి నడిచింది. అక్కడనుంచి తిన్నగా కొంచం ముందుకు నడిచింది. కుడివైపు ఆమెకు ఇంకో ఎంట్రన్స్ కనిపించింది. అది మెయిన్ రోడు కు దారితీస్తుంది. ఆ ఎంట్రన్స్ నుంచి బయటపడింది మిత్రవింద.

ఎదురుగా మెయిన్ రోడ్డు అవతలవైపు అబ్బాస్ కనిపించాడు. అతని పక్కన ఒక కారు ఉంది. ఆ రోజు అబ్బాస్ మిలిట్రి యూనిఫారమ్ లో లేడు. సివిలియన్ డ్రస్సులో ఉన్నాడు. నీలంరంగు జీన్స్ దాని మీద తెల్లటీషర్డ్ వేసుకున్నాడు. దానిమీద పంచ్ మీద హియర్ అని ఉంది. పక్కన తళతళమెరుస్తున్న కారు ఉంది.

మిత్రవింద పేవ్ మెంట్ మీద నిలబడి అబ్బాస్ ను చూసి చెయ్యి ఊపింది. అతను కూడా ఊపాడు. తనవైపు రమ్మని చెయ్యిఊపాడు అబ్బాస్. మిత్రవింద మెల్లగా రోడ్డు క్రాస్ చేసి అవతలవైపుకు చేరుకుంది.

“హమ్మయ్య క్షేమంగా వచ్చావు అంతే చాలు”అన్నాడు ఆమె చెయ్యిపట్టుకుంటు అబ్బాస్.

“ఏమిటిదంతా నాకేం అర్ధం కావటం లేదు. ఈ బురఖా ఎందుకు తీసుకురమ్మని చెప్పావు?

“అంత తొందరపడకు. అన్ని విషయాలు నీకే తెలుస్తాయి. ముందు కారులో కూర్చుని బురఖా వేసుకో”అన్నాడు అబ్బాస్. మిత్రవింద కారులోకి వెళ్ళి బురఖా వేసుకుంది. తరువాత డ్రైవింగ్ సీటు పక్కన కూర్చుంది. అబ్బాస్ డ్రైవింగ్ సీటులో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు.    “మనం ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాం”అడిగింది మిత్రవింద.

“తినబోతూ రుచులు అడగటం ఎందుకు. అన్ని విషయాలు కొంచంసేపట్లో తెలుస్తాయి. అంతవరకు ఓపికపట్టు చాలు”అన్నాడు అబ్బాస్. అతని చూపులు తీక్షణంగా ముందు ఉన్న రోడ్డు వైపు చూస్తున్నాయి.

ఇంకేం మాట్లాడలేకపోయింది మిత్రవింద. మెయిన్ రోడ్డు వైపు చూస్తూ మౌనంగా ఉండిపోయింది. అరగంట తరువాత  కారు పాకిస్ధాన్ డిఫెన్స్ క్వార్టర్స్ లో ఒక ఇంటి ముందు ఆగింది. మెయిన్ గేటు దగ్గర ఇద్దరు మిలిట్రి జవాన్లు కాపలా కాస్తున్నారు. అబ్బాస్ కారును చూడగానే అటెన్షన్ లో నిలబడి గేటు తెరిచారు. కారును పోర్టికోలో ఆపాడు అబ్బాస్.

ముందు అబ్బాస్ దిగాడు. తరువాత నింపాదిగా మిత్రవింద దిగింది. అది అబ్బాస్ ఇల్లని ఆమె గ్రహించింది. కాని ఉన్నట్టుండి తన ఇంటికి ఎందుకు తీసుకువచ్చాడో మాత్రం ఆర్ధంకాలేదు. వీళ్ళు వచ్చిన విషయం లోపల తెలిసినట్టుగా ఉంది. క్షణం తరువాత షబ్నమ్ హారతి పళ్ళెంతో వీళ్ళ దగ్గరకు వచ్చింది.

అబ్బాస్ పక్కన బురఖాలో ఉన్న మిత్రవింద వైపు ఆశ్చర్యంగా చూసింది. తరువాత అబ్బాస్ వైపు చూసింది. అబ్బాస్ కళ్ళతోనే ఆమెకు జవాబు చెప్పాడు.

షబ్నమ్ ఇద్దరికి దిష్టితీసింది.

“కోడలు పిల్లా మొదటిసారి మా ఇంటికి వస్తున్నావు. కుడికాలు పెట్టి లోపలికి రా”అంది షబ్నమ్.మిత్రవింద షాక్ అయినట్టు చూసింది. మొహం మీద బురఖా ఉండటం వల్ల ఆమె భావాలు బయటకు తెలియలేదు. ఇద్దరు లోపల అడుగుపెట్టారు. షబ్నమ్ వాళ్ళిద్దరిని లోపలి గదిలోకి తీసుకువెళ్ళింది. అక్కడ టేబుల్ మీద ఇద్దరికి కొత్త బట్టలు ఉన్నాయి.

“మిత్రవింద ఇక బరుఖా తీసేయ్యావచ్చు”అన్నాడు అబ్బాస్.

ఆ మాట కోసమే ఆమె ఎదురుచూస్తోంది. వెంటనే బురఖా విప్పి చేత్తో పట్టుకుంది. ఒకరకమైన ట్రాన్స్ లో ఉన్నట్టు షబ్నమ్ మిత్రవింద అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆమె మొహంలో అంతుతెలియని సంతోషం కనిపిస్తోంది. తనకు కాబోయే కోడలు చాల అందంగా ఉంటుందని ఆమెకు తెలుసు. అబ్బాస్ మిత్రవింద ఫోటో చూపించినప్పుడు ఎంతో మురిసిపోయింది. కాని ఇప్పుడు ప్రత్యేక్షంగా ఆమెను చూస్తుంటే షబ్నమ్ కు నోట్లోంచి మాట రాలేదు. ఫోటోలో కంటే పది రెట్లు అందంగా కనిపిస్తున్న మిత్రవిందను సభ్యత మరిచి అలాగే చూస్తూ ఉండిపోయింది.

మిత్రవింద మాత్రం  సిగ్గుతో తలవంచుకుంది. ఈ పరిణామం అబ్బాస్ కు మాత్రం ఎంతో సంతోషం కలిగించింది. తను ఎంతో గాఢంగా ప్రేమించిన అమ్మాయిని తల్లి మెచ్చుకోలుగా చూస్తుంటే అతనికి తను మిత్రవిందను ఎన్నుకుని మంచి పనే చేశాడనిపించింది.

“నువ్వు చాల అందంగా ఉన్నావు మిత్రవింద”మిత్రవింద చేతులు పట్టుకుని అంది షబ్నమ్.

మిత్రవింద ఏం మాట్లాడకుండ సిగ్గుతో చిన్నగా నవ్వింది.

“లోపలికి రామ్మా. మొదటి సారి ఈ ఇంట్లోకి అడుగిపెడుతున్నావు. కుడికాలు తీసి లోపల పెట్టు”అంది షబ్నమ్.

ఈ తతంగం అంతా ఎందుకో మిత్రవిందకు కొంచం కూడా అర్ధం కాలేదు. అబ్బాస్ ఏమైన చెప్తాడేమో అని అతని వైపుచూసింది. అబ్బాస్ కు ఆమె అనుమానం అర్ధమైంది. అయిన ఏం మాట్లాడకుండ నవ్వి ఊరుకున్నాడు.షబ్నమ్ చెప్పినట్టుగానే మిత్రవింద కుడికాలు తీసి లోపలికి అడుగుపెట్టింది. ఆమె వెనుక అబ్బాస్ వెళ్ళాడు. హాలులో టేబుల్ మీద హారతిపళ్ళెం, కొత్త బట్టల ప్యాకెట్స్ ఉన్నాయి.

“మీరిద్దరు పక్కపక్కన నిలబడంది. హారతి తీస్తాను”అని చెప్పి షబ్నమ్ టేబుల్ దగ్గరకు వెళ్ళ హారతి పళ్ళెం చేతిలోకి తీసుకుంది. ఈ లోగా మిత్రవింద అబ్బాస్ పక్కపక్కన ఆనుకుని నిలబడ్డారు. ఇద్దరికి హారతి తీసి పళ్ళెం తీసుకుని లోపలికి వెళ్ళింది షబ్నమ్. రెండు క్షణాల తరువాత తిరిగి కొత్త బట్టలు చెరో జత ఇద్దరికి ఇచ్చింది.

“మీ మీ గదిలోకి వెళ్ళి బట్టలు మార్చకుని రండి”అంది షబ్నమ్.అలాగే అని తలూపి తన బట్టలు తీసుకుని ఒక గదిలోకి వెళ్ళింది. అబ్బాస్ తన బట్టలు తీసుకుని వేరే గదిలోకి వెళ్ళాడు. బట్టలతో లోపలికి వచ్చిన మిత్రవిందకు అంతా కలలాగా తోస్తుంది. షబ్నమ్ ఉద్దేశం ఏమిటో ఆమెకు చూచాయిగా అర్ధమైంది.  అది తలుచుకుంటే మిత్రవింద శరీరం ఆనందంతో పులకరిస్తోంది. ఈ శుభసమయం కోసమే ఆమె చాల రోజులనుంచి ఎదురుచూస్తోంది. అది ఈ రోజు తీరబోతుంది. ఈ శుభసమయంలో తల్లి తండ్రి చెల్లెలు లేకపోవటం ఎంతో దురదృష్టకరం. వాళ్ళు ఎక్కడ ఉన్నా తనని తప్పకుండ మంచిమనస్సుతో ఆశీర్వదిస్తారని అనుకుంటోంది మిత్రవింద.

తను వేసుకున్న బట్టలు విప్పి కొత్త బట్టలు వేసుకుంది. అది కంచిపట్టుచీర.అబ్బాస్ ఈ చీరను ఎక్కడ కొన్నాడో ఆమెకు తెలియదు. అబ్బాస్ కూడా చెప్పలేదు.  ఇప్పుడు జరుగుతున్న శుభకార్యం కూడా అబ్బాస్ ఆమెకు చెప్పలేదు. కనీసం చూచాయిగా కూడా హింట్ ఇవ్వలేదు. బట్టలు మార్చుకుని గదిలోంచి బయటకు వచ్చింది మిత్రవింద. అప్పటికే అబ్బాస్ కొత్త బట్టలు కట్టుకుని ఆమెకోసం తయారుగా ఉన్నాడు. అతను వేసుకున్న పట్టు పంచె తెల్లషర్ట్ చూసి ఆశ్చర్యంతో నవ్వు కూడా వచ్చింది మిత్రవిందకు. అతి కష్టం మీద వస్తున్న నవ్వును ఆపుకుంటు వెళ్ళి అబ్బాస్ పక్కన నిలబడింది.

ఇద్దరికి చేరో దండ ఇచ్చి ఎదుటివాళ్ళ మెడలో వెయ్యమని చెప్పింది. ముందు మిత్రవింద తన చేతిలో ఉన్న దండను అబ్బాస్ మెడలో వేసింది. తరువాత అబ్బాస్ మిత్రవింద మెడలో వేశాడు. అదే సమయంలో ఒక ఆర్డర్లీ టేబుల్ మీద ఉన్న టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. అందులోంచి కమ్మగా పెళ్ళి మంత్రాలు వినిపిస్తున్నాయి.

మిత్రవింద ఆశ్చర్యంగా అబ్బాస్ వైపు చూసింది.

“అంతా శాస్త్ర ప్రకారం జరగాలని మా అమ్మగారు మరిమరిచెప్పారు. ఒక వేళ మీ అమ్మ నాన్న బతికిఉంటే అంతా ఒక పద్దతిలో జరిగేది. కాని వాళ్ళు లేరుకనుక కనీసం పెళ్ళి మంత్రాలు అయిన శాస్త్రోక్తంగా ఉండాలని అమ్మ మరిమరి పట్టుపట్టింది. అందుకే ఈ ఏర్పాటు చేశాను”అన్నాడు అబ్బాస్.

టేప్ రికార్డర్ లోంచి పెళ్ళి మంత్రాలు వస్తుంటే షబ్నమ్ అబ్బాస్ కు తాళిబొట్టు ఇచ్చి మిత్రవింద మెడలో కట్టమని చెప్పింది. అబ్బాస్ తన మెడలో తాళికడుతుంటే మిత్రవింద ఉద్వేకంతో జలధరించిపోయింది. ఆమె శరీరం ఆమె ప్రమేయం లేకుండానే సన్నగా వణికింది. పెళ్ళి మంత్రాల మద్యఅబ్బాస్ మిత్రవింద మేడలో తాళికట్టాడు.

తరువాత ఇద్దరు ముందు షబ్నమ్ కు నమస్కారం చేశారు.

“లేవండి. ఇద్దరు సంతోషంగా పిల్లా పాపలతో సుఖంగా ఉండండి”అంటు ఇద్దరిని పైకి లేపింది. అంతవరకు బిగపట్టుకున్న ఆనందం దుఖ్ఖం ఒక్కసారిగా మిత్రవిందలో కట్టలు తెంచుకుని బయటపడింది. బోరున ఏడుస్తూ షబ్నమ్ ను చుట్టుకుపోయింది ఆమె. ఊహించని ఈ పరిణామానికి అబ్బాస్ బిత్తరపోయాడు. తమ వల్ల ఏదైన పొరపాటు జరిగిందా అని భయపడ్డాడు.

“ఊరుకో మిత్రవింద. ఈ శుభసమయంలో మీ వాళ్ళు లేరని బాధపడకు. ఈ క్షణం నుంచి అన్ని నేనే నీకు. నాలో నువ్వు నీ తల్లిని తండ్రిని చూసుకో. నేను కూడా నీలో కూతురుని చూసుకుంటాను. ఈ రోజు నుంచి నీ మొహంలో సంతోషం తప్ప విచారం బాధ ఏం కనిపించటానికి వీలులేదు. అబ్బాస్ నీకు కూడా చెప్పుతున్నాను. ఎట్టిపరిస్ధితిలోను అమ్మాయిని ఏడ్పించకు.పరుషంగా మాట్లాడకు. ఆమె ఏం కోరిన చెప్పిన విను. ఆమె కళ్ళలో చిన్న కన్నీటి బొట్టు చూసిన నేను సహించను”అంది షబ్నమ్.

షబ్నమ్ మాటలతో కొంచం తేరుకుంది మిత్రవింద. కళ్ళు తుడుచుకుని నవ్వుతూ అత్తగారి వైపు చూసింది.

“మీ చల్లని నీడ దొరికిన తరువాత ఇక జన్మలో ఎప్పుడు ఏడ్వను. విచారంగా ఉండను. ప్రతి క్షణం మీ నీడలో సంతోషంగా జీవిస్తాను. నా భర్తకు అత్తకు సేవలు చేసుకుంటు ఆనందంగా గడుపుతాను. ఈ రోజు నుంచి మిమ్మల్ని అమ్మ అని పిలుస్తాను. మీకేం అభ్యంతరం లేదుకదా”అంది మిత్రవింద.

“ఈ మాట నేనే చెప్పాలని అనుకున్నాను. నువ్వె అన్నావు. అంతకంట్ నాకు మాత్రం కావల్సింది ఏం ఉంది. అలాగే పిలువు”అంది షబ్నమ్.
“మీరిద్దరు నా గురించి కూడా కొంచం పట్టించుకోండి. నాకో ఎంతో ఆకలిగా ఉంది. వెంటనే భోజనం వడ్డించు అమ్మా. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. భోజనం చేసిన తరువాత ఎనిమిది గంటలలోగా మిత్రవింద ఎంబసి ఆఫీసు చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యం అయిన ఆఫీసర్ గారికి సంజాయిషి చెప్పుకోవలసివస్తుంది”అన్నాడు చలోక్తిగా అబ్బాస్.

అప్పుడు కాని ఇద్దరికి తాము ఏ పరిస్ధితిలో ఉన్నామో అర్ధంకాలేదు. వెంటనే ఇద్దరు వేరుపడ్డారు. వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గరకు చేరుకునేసరికి ఆర్డర్లీ అంతా సిద్దం చేసాడు. ఒక మూలగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు.

“నువ్వు వెళ్ళు. ఈ రోజు నేను వడ్డిస్తాను”అంది షబ్నమ్ ఆర్డర్లీతో.

వినయంగా నమస్కారం చేసి ఆర్డర్లీ అక్కడనుంచి వెళ్ళిపోయాడు.  మిత్రవింద అబ్బాస్ పక్కపక్కన కూర్చున్నారు. వాళ్ళకు వడ్డించిన తరువాత షబ్నమ్ కూర్చుంది. పళ్ళెంలో ఉన్న పదార్ధాలను చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది మిత్రవింద. అంతా వెజిటేరియన్ వంటలే. వాటిలో ఒకటి కూడా నీచు లేదు. ఆమెకు తెలిసినంతవరకు రోజు నీచులేనిదే అబ్బాస్ భోజనం చెయ్యాడు. ఈ విషయం అతను స్వయంగా మిత్రవిందతో చెప్పాడు. కాని ఈ రోజు విచిత్రంగా అన్ని వెజిటేరియన్ వంటకాలే ఉన్నాయి.

ఆమె ఉద్దేశం అర్ధం చేసుకుంది షబ్నమ్. చిన్నగా నవ్వి అంది.

“నీతో పరిచయం అయిన తరువాత అబ్బాస్ పూర్తిగా మాంసాహరం మానేశాడు. పూర్తిగా వెజిటేరియన్ గా మారిపోయాడు. నాకు ఒక్కదానికి నాన్ వెజ్ ఎందుకుని నేను కూడా పూర్తిగా మానేశాను. నీతో పరిచయం అయిన రోజునుంచి మేమిద్దరం పూర్తిగా శాఖాహారులుగా మారిపోయాం”

మిత్రవింద  విస్తూబోయింది. ఆమెకు ఏం మాట్లాడాలో వెంటనే అర్ధంకాలేదు. ఒక రకమైన ట్రాన్స్ లో ఉన్నట్టు తల్లి కొడుకులను చూస్తూ ఉండిపోయింది. ప్రపంచంలో మంచివాళ్ళు ఉంటారని తెలుసు. కాని ఇంత మంచివాళ్ళుంటరని ఆమెకు తెలియదు. మొదటిసారి అలాంటివాళ్ళను చూస్తోంది. వాళ్ళు ఇద్దరు తన వాళ్ళు కావటం ఆమె అదృష్టం. ఏం చెయ్యాలో దీనికి ఎలా స్పందించాలో మిత్రవిందకు అర్ధం కాలేదు. ఎలోగో తేరుకుని భోజనం ముగించింది. అందరు భోజనం ముగించేసరికి దాదాపు ఎనిమిది కావస్తోంది. మిత్రవింద ఇంటికి వెళ్ళే సమయం దగ్గరఅయింది. ఎనిమిది గంటలకల్లా స్టాఫ్ అంతా ఎంబసిలో ఉండాలి. ఒక వేళ లేటు అవుతుందని అనుకుంటే ముందే అంబాసిడర్ గారికి కాల్ చేసి కారణం చెప్పాలి. ఆ కారణం సహేతుకంగా ఉండాలి. అప్పుడే అంబాసిడర్ ఆ స్టాఫ్ మీద ఎలాంటి చర్య తీసుకోడు. ఈ విషయం మిత్రవిందకు బాగా తెలుసు. అందుకే వెళ్ళటానికి తయారయింది. షబ్నమ్ ను ఆ ఇంటిని విడిచివెళ్ళాలంటే ఆమెకు లోపల చాల బాధగా ఉంది. కాని వెళ్ళక తప్పదు.

తన దృష్టిలో ఆమెకు అబ్బాస్ కు పెళ్ళయింది. కాని ఇంకా ఈ విషయం బయటవాళ్ళకు చెప్పటానికి ఇంకా సమయం రాలేదు. అవకాశం రాలేదు. అవి వచ్చేంతవరకు ఈ పెళ్ళి విషయం చాల రహస్యంగా ఉంచవలసిన అవసరం ఇద్దరి మీద ఉంది.

తన గదిలోకి వెళ్ళి కట్టుకున్న చీర విప్పేసి  మాములు బట్టలు వేసుకుంది. ఈ లోగా అబ్బాస్ కూడా తన డ్రస్సు మార్చుకున్నాడు. ఇద్దరు గదిలోంచి వచ్చి షబ్నమ్ కాళ్ళకు మళ్ళి నమస్కారం చేశారు. “జాగ్రర్తగా వెళ్ళిరా తల్లి. తొందరలోనే నువ్వు ఈ ఇంటికి కోడలుగా రావాలని మనసారా కోరుకుంటున్నాను”అంది షబ్నమ్. కన్నీళ్ళతో అలాగే అని తలూపింది మిత్రవింద. విడవలేక విడుస్తున్నట్టుగా షబ్నమ్ ను విడిచిపెట్టి అబ్బాస్ తో ఇంట్లోంచి బయటకు వచ్చింది. అది మిలిట్రి క్వార్టర్స్ కనుక చుట్టు పక్కల ఇంట్లో దేదిప్యమానంగా లైట్లు వెలుగుతున్నాయి. అబ్బాస్ డ్రైవింగ్ సీటులో కూర్చున్నాడు. మిత్రవింద అతని పక్కన కూర్చుంది. వెంటనే కారు స్టార్ట్ చేశాడు. కారు వేగంగా ముందుకు దూసుకుపోయింది. ఇస్లామాబాద్ లైట్ల వెలుగులో కొత్త పెళ్ళికూతరిలా మెరిసిపోతుంది. అబ్బాస్ రోడ్డు వైపు చూస్తూ డ్రైవ్ చేస్తునే ఓరగా మిత్రవింద వైపు చూశాడు.ఆమె ఈ ప్రపంచంలో లేదు. వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉంది. ఆమె కుడిచెయ్యిమాత్రం మెడలో ఉన్న తాళిని ఆప్యాయంగా తడుముతోంది.ఆ దృశ్యంఎంతో అద్భుతంగా తోచింది అబ్బాస్ కు, డ్రైవ్ చేస్తున్నాడు కనుక సరిపోయింది. లేకపోతే అలాగే చూస్తూ ఉండిపోయేవాడు. తాళిబొట్టుకు ఆమె ఇస్తున్న ప్రాధాన్యత గౌరవం చూసి అతనికి ఎంతో ముచ్చటవేసింది. తనను అబ్బాస్ చూస్తున్నాడని మిత్రవిందకు తెలియదు. జరిగిన శుభకార్యం తలుచుకుని లోలోపల ఎంతో మురిసిపోతుంది. తాళిబొట్టుని స్పశిస్తూ అదో రకమైన ఆలౌకికమైన ఆనందంలో మునిగిపోయింది. అరగంట తరువాత కారు సూపర్ బజార్ ముందు అగింది.

“మిత్రవింద సూపర్ బజార్ వచ్చేసింది”అన్నాడు అబ్బాస్ మెల్లగా మిత్రవింద చెవిలో. హిప్నటిక్ ట్రాన్స్ లోంచి బయటపడినట్టుగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది మిత్రవింద. “సారీ ఎందుకో కారణం తెలియదు కాని బాగా నిద్రపట్టేసింది”అంది నవ్వి.

“ఫర్వాలేదు. నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి”అన్నాడు అబ్బాస్. “చెప్పు”అంది మిత్రవింద.   “మన ఇద్దరికి పెళ్ళయిన విషయం మూడో మనిషికి తెలియటానికి వీలులేదు. అందుకే తాళిబొట్టును ఎవరికి కనిపించకుండ దాచుకో”అన్నాడు.

“అంటే ఈ తాళిబొట్టుని వేసుకోకూడదని అంటావు”అంతేగా అంది నిరుత్సాహంగా.

“నీకు పరిస్ధితి అంతా తెలుసు. ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రస్ధుతం మన రెండు దేశాల మద్య అపార్ధాలు నెలకొని ఉన్నాయి. ఎంతో మంది అమాయకులను చంపిన ఉగ్రవాదుల గురించి మీ వాళ్ళు తరుచూ అడుగుతున్నారు. ఇంకా వాళ్ళ గురించి ఆచూకి దొరకలేదని చెప్పుతున్నాం. పదేపదే ఈ మాట చెప్పటం నాకు మా డిపార్ట్ మెంట్ కు ఎంతో సిగ్గుగా ఉంది. అలాగని మా ప్రయత్నంలో ఎలాంటి లోపం లేదు. రాత్రి పగలు అని తేడా లేకుండ వాళ్ళ కోసం గాలిస్తునే ఉన్నాం. అయిన వాళ్ళ గురించి చిన్న క్లూ కూడా దొరకలేదు. అయిన ఏం ఫర్వాలేదు. ఈ రోజు కాకపోయిన రేపయిన వాళ్ళు దొరక్క పోరు. కాకపోతే కొంచం ఓపికగా వెతకాలి. ఆ పని మా వాళ్ళు చేస్తున్నారు. నా అద్వర్యంలో ఒక టీమ్ వాళ్ళను వెతకటానికి ఎప్పుడో బయలుదేరింది”అన్నాడు అబ్బాస్.

“ఇంకా ఎన్ని రోజులు ఇలా మనం దొంగచాటుగా కలుసుకుంటం”అంది మిత్రవింద. ఆమె మొహంలో అంతకుముందు ఉన్న సంతోషచాయలు లేవు. వాటి స్ధానంలో నీలి నీడలు కమ్ముకున్నాయి. అబ్బాస్ ఆప్యాయంగా ఆమె చేతిని తన చేతులలోకి తీసుకున్నాడు. “నువ్వేం వర్రికాకు మిత్రవింద. అల్లా దయవల్ల మన పెళ్ళి జరిగిపోయింది. అలాగే మన చుట్టు కమ్ముకున్న సమస్యలు కూడా తొందరలోనే తొలగిపోతాయి. నువ్వు మాత్రం నేను చెప్పినట్టు నడుచుకో. ధైర్యంగా ఉండు. ఒకసారి ఉగ్రవాదలు నా చేతుల్లో పడిన తరువాత ఇంకే సమస్యలు ఉండవు. వాళ్ళను మీ ప్రభుత్వానికి అప్పగించి నా బాధ్యత తీర్చుకుంటాను. కాకపోతే కొన్ని రోజులు పడుతుంది. అంతవరకు మన విషయం ఎవరికి తెలియటానికి వీలులేదు. అనవసరంగా లేనిపోని సమస్యలలో మనం ఇరుక్కోకూడదు. అర్ధమైందనుకుంటాను”అన్నాడు మెల్లగా.

అలాగే అని తలూపింది మిత్రవింద.   “సరే ఇక బయలుదేరు. ఇప్పటికే ఆలస్యమైంది. మీ ఆఫీసర్ కు కోపం రావచ్చు”అన్నాడు అబ్బాస్.    మిత్రవింద అబ్బాస్ చేతిని మెల్లగా నొక్కి తన బ్యాగ్ తీసుకుంది. విడవలేక విడిచి వెళుతున్నట్టు అతన్ని విడిచి ముందుకు కదిలింది. రోడ్డు క్రాస్ చేసి అవతలవైపుకు చేరుకుంది. అక్కడ నిలబడి అబ్బాస్ కు టాటా అంటు చేతులు ఊపింది. అబ్బాస్  కూడా చేతులు ఊపాడు.    ఒక్క క్షణం ఆలస్యం చెయ్యలేదు మిత్రవింద. బ్యాగ్ భుజానికి తగిలించుకుని గబగబ సూపర్ బజార్ లోపలికి వెళ్ళింది. మామలుగా ఉత్తచేతులతో వెళ్ళితే స్టాఫ్ తో పాటు అంబాసిడర్ కు కూడా అనుమానం వస్తుంది. అందుకే కొన్ని కాస్మోటిక్స్ కొనుక్కుని సంచిలో పెట్టుకుని సూపర్ బజార్ నుంచి బయటకు వచ్చింది. అప్పుడే డ్రైవర్ ఆమెకు ఎదురువచ్చాడు. చాలసేపటినుంచి మిత్రవింద రాకకోసం అతను ఎదురుచూస్తున్నాడు. ఆమె ఎంతకు రాకపోయేసరికి ఏమైందో అని కంగారుపడుతూ సూపర్ బజార్ లోపలికి వెళ్ళుతున్నాడు.
“మీరు బాగానే ఉన్నారు కదా మేడం”అన్నాడు డ్రైవర్ కంగారుగా.

“నాకేం కాలేదు. నేను బాగానే ఉన్నాను. అనుకోకుండ నా స్నేహితురాలు లోపల కలిసింది. ఇద్దరం కాఫీతాగుతూ కబుర్లు చెప్పుకునేసరికి ఈ వేళ అయింది”అంది మిత్రవింద.

“మీరు వెళ్ళి చాల సేపయింది.ఎంతకి రాకపోయేసరికి కొంచం కంగారుపడి ఇప్పుడే మీ కోసం లోపలికి రాబోతున్నాను. ఈ లోగా మీరే వచ్చారు. పది వెళదాం. ఇప్పుటికే ఆలస్యమైంది”అంటు కారు దగ్గరకు నడిచాడు డ్రైవర్.

మిత్రవింద కారుడోర్ తెరిచి వెనుక సీటులో కూర్చుంది. డ్రైవర్ ముందు సీట్లో కూర్చుని కారుస్టార్ట్ చేశాడు. వాళ్ళి ఎంబసికి చేరుకునేసరికి ఎనిమిదిన్నర కావస్తోంది. గేటు దగ్గర ఉన్న సెక్యురిటి వీళ్ళ కోసమే ఎదురుచూస్తున్నట్టుగా గేటు తెరిచి కూర్చున్నాడు. కారు వేగంగా లోపలికి దూసుకుపోయి పార్కింగ్ స్పేస్ లో ఆగింది. మిత్రవింద దిగి మెల్లగా లోపలికి వెళ్ళి చూసింది. అంబాసిడర్ చాంబర్స్ లో ఇంకా లైట్లు వెలుగుతున్నాయి. లోపల అంబాసిడర్ ఏదో ముఖ్యమైన పనిలో ఉన్నాడని మిత్రవిందకు అర్ధమైంది. ఒక్కోక్కోరోజు అంబాసిడర్ రాత్రంతా తన చాంబర్స్ కూర్చుని పనిచేస్తూ ఉండటం మిత్రవిందకు తెలుసు.

తాళిని జాగ్రర్తగా లోపలికి తోసి తన క్వార్టర్స్ వైపు నడిచింది మిత్రవింద. తలుపు తాళం తీసి లోపలికి వెళ్ళింది. తరవాత తలుపులు గడియపెట్టి తన బెడ్ రూంలోకి వెళ్ళింది. బ్యాగ్ ను మంచం మీద పెట్టింది. అందులోంచి బురఖా తీసి జాగ్రత్తగా బీరువాలో పెట్టింది. ప్రస్ధుతానికి దాని అవసరం ఇప్పుడు లేకపోవచ్చు. కాని భవిష్యత్తులో దాని అవసరం రావచ్చు. మంచం పక్కనే అలమారాలో ఆమె తల్లి తండ్రి కలిసి దిగిన ఫోటో ఉంది. దాని ముందు భక్తితో నిలబడి కళ్ళు మూసుకుంది మిత్రవవింద.

“అమ్మా నాన్న నాకు పెళ్ళిఅయిపోయింది. మీరు కోరినట్టుగానే జహీర అబ్బాస్ తో నా పెళ్ళి జరిగిపోయింది. ఈ రోజు కోసం మీరు ఎంతో ఆశతోఎదురుచూశారు. అది ఈరోజుకు నేరవేరింది. మీరు ఈ శుభకార్యం చూడలేనందకు నాకు ఎంతో బాధగా ఉంది. మీరు లేని లోటు స్పష్టంగా కనిపించింది. కాని అబ్బాస్ తల్లిని చూసిన తరువాత నా విచారం పటాపంచలైపోయింది. నన్ను తన కోడలుగా కాకుండ కన్న కూతురిలా ఆదరించింది. అక్కున చేర్చుకుంది. నాలో ఉన్న బాధను విచారాన్ని చేత్తో తీసేసినట్టుగా తీసేసింది. ఇప్పుడు నాకు చాల సంతోషంగా ఉందమ్మా. నీ కూతురిని ఇంకా ఏ లోటు లేదు. జహీర్ అబ్బాస్ నీడలో నా జీవితం సుఖంగా సాగిపోతుంది. జహీర్ అబ్బాస్ లాంటి భర్త షబ్నమ్ లాంటి అత్తగారు నాకు దొరకటం నిజంగా నా అదృష్టం. ఇంతకంటే నేను ఇంకేం కోరుకోను. మీరు ఎక్కడ ఉన్నా మీకు మనశాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను”అంది మెల్లగా.

తల్లి తండ్రి గుర్తుకురావటంతో మిత్రవింద కళ్ళలో నీళ్ళు  చిప్పిల్లాయి. కొన్ని క్షణాలపాటు ఫోటో ముందు కళ్ళు మూసుకుని నిలబడింది. తరువాత తిరిగి బెడ్ రూంలోకి వచ్చింది. బట్టలు మార్చుకుని మంచం మీద పడుకుంది. ఇప్పుడు ఆమె మనస్సు చాల ప్రశాంతంగా ఉంది. ఎలాంటి అలజడి కాని అనుమానాలు కాని లేవు. కొన్ని రోజులకు ముందు ఇస్లామాబాద్ లో అడుగుపెట్టినప్పుడు చాల భయపడింది కంగారుపడింది. ముఖ్యంగా ఆమెకు భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపించింది. అలాగని అబ్బాస్ మీద నమ్మకం లేకకాదు. అతని మీద ఆమెకు ఎప్పుడు నమ్మకం ఉంది. అంతగా నమ్మకపోతే ఇంత దూరం వచ్చేది కాదు. ఇండియాలోనే ఎక్కడో అక్కడ ఉద్యోగం సంపాదించుకునేది. కేవలం ఇష్టంతోనే ఆమె ఈ ఉద్యోగంలో చేరలేదు. ప్రతి క్షణం అబ్బాస్ నీడలో గడపవచ్చని అతనితో మాట్లాడవచ్చని తరువాత పెళ్ళిచేసుకోవచ్చని భావించి ఇక్కడకు వచ్చింది. ఆ కోరిక ఈ రోజుతో తీరిపోయింది. అనుకున్నట్టుగానే అబ్బాస్ తో ఆమె పెళ్ళి జరిగిపోయింది. అది అతని తల్లి సమక్షంలో. ఇంతకంటే మిత్రవిందకు కావల్సింది ఏంఉంది.

జహీర్ అబ్బాస్ తన చాంబర్స్ లో కూర్చుని ఉగ్రవాదులకు సంబంధించిన ఫైలు చూస్తున్నాడు. అతను నియమించిన ఏజంట్లు నసీర్ , మజీద్ ఖాన్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అయిన ఇంతవరకు వాళ్ళ ఆచూకి దొరకలేదు. ఆ ఇద్దరు ముష్కరులు ఎక్కుడ దాక్కున్నారో ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. కనీసం వాళ్ళు ఎక్కడ ఉండగలరో కూడా ఊహించలేకపోతున్నారు.

ఇప్పటికే రక్షణసంస్ధలు ఆ ముష్కరుల కోసం దేశం అంతా గాలించాయి. మూలమూలలు వెతికాయి. కాని వాళ్ళ గురించి చిన్న క్లూ కూడా దొరకలేదు. ఎక్కడ ఉన్నారో ఎక్కడ దాక్కున్నారో అబ్బాస్ ఊహకు కూడా అందటం లేదు. వాళ్ళను పట్టుకోవటం అతని వృత్తి ధర్మం మాత్రమే కాదు, వ్యక్తిగత సమస్య కూడా. వాళ్ళను పట్టుకుంటే కాని దేశం మీద ఉన్న అపవాదు తొలగిపోదు. అదే సమయంలో రెండు దేశాలమద్య నెలకొని ఉన్న అపార్ధాలు తొలగిపోతాయి. మళ్ళి రెండు దేశాలు స్నేహభావంతో మెలుగుతాయి. దీని వల్ల అతనికి మిత్రవిందను పెళ్ళిచేసుకోవటం చాల తేలికవుతుంది. వాళ్ళ పెళ్ళికి ఎవరు అభ్యంతరాలు చెప్పరు. కాని అది అంత తేలిక కాదని అతనికి తెలుసు. ఇంకా ఆ ఇద్దరు ఆచూకి తెలియలేదు. తెలిసిన తరువాత వాళ్ళను పట్టుకుని అతను స్వయంగా భారత్ అధికారులకు అప్పచెప్పాలి. అప్పుడు కాని అతని మెషిన్ పూర్తికాదు.

ఈ విషయం తలుచుకుంటే అబ్బాస్ మూడ్ బాగా అప్ సెట్ అయింది. దానికితోడు అతని తల్లి షబ్నమ్ కోడలు పిల్లను ఎప్పుడు తీసుకువస్తావని పోరుపెడుతోంది. ఇంకో వైపు మిత్రవింద తనని భార్యగా అందరికి పరిచయం ఎప్పుడు చేస్తావని అడుగుతోంది. ఈ ఇద్దరి మద్య అతను పొకచెక్కలా నలిగిపోతున్నాడు. ఇద్దరి సమస్య తీరాలంటే ఒక్కటే మార్గం. ఆ ససీర్ మజీద్ ఖాన్ ఆచూకి తెలుసుకుని వాళ్ళను బందించటం. అందుకే ఈ రోజు పెందళాడే ఆఫీసుకు వచ్చాడు. అతని ఆలోచనలకు బ్రేక్ వేస్తూ టేబుల్ మీద టెలిఫోన్ మోగింది.

“సార్ నేను జీరాఫిని మాట్లాడుతున్నాను”అవతలనుంచి ఒక గొంతు వినిపించింది. కాల్ చేసింది ఎవరో జహీర్ అబ్బాస్ కు తెలుసు. అతను అబ్బాస్ ఇన్ ఫార్మర్. అతని అసలు ఎవరికి తెలియదు. కాని అందరికి అతను జీరాఫిగా మాత్రమే తెలుసు.

“చెప్పు జీరాఫి. ఏమిటి విషయం”? అడిగాడు అబ్బాస్. “అన్ని చోట్ల తిరిగాను సార్. నా వాళ్ళందరిని యాక్టివేట్ చేశాను. కాని ఆ ఇద్దరి ఆచూకి మాత్రం ఇంకా తెలియదు. కొండలు కోనలు నదులు అడవులు అన్ని చోట వెతికాను. కాని ఇంతవరకు వాళ్ళ గురించి చిన్న క్లూ కూడా దొరకలేదు”అన్నాడు అతను నిరుత్సాహంగా.“కనీసం వాళ్ళ గురించి చిన్న సమాచారం కూడా దొరకలేదా”అడిగాడు అబ్బాస్. అతని మనస్సు ఓటమితో కుతకుతలాడిపోతుంది. “ఇంకా లేదు సార్. మా వాళ్ళు ఫోటో పుచ్చుకుని గల్లీ గల్లీ తిరిగారు. మనుష్యులు ఉండలేని చోటుకు కూడా వెళ్ళి వాకబు చేశారు. చివరకు కొండలు లోయలు అడవులలో కూడా గాలించారు. కాని ఏం ఫలితం కనిపించలేదు. వాళ్ళగురించి చిన్న ఆధారం కూడా దొరకలేదు. గాలిలో కలిసిపోయినట్టుగా మాయమైపోయారు. అయిన మీరేం వర్రికాకండి. రెట్టించిన ఉత్సాహంతో ఇంకా మా ప్రయత్నం కొనసాగిస్తాం. రెండు మూడు రోజులలో మీకు వాళ్ళ గురించి కనీసం చిన్న సమాచారం అయిన ఇస్తాం”అన్నాడు జీరాఫి. అబ్బాస్ భారంగా నిటుర్చి “అలాగే నీ కాల్ కోసం ఎదురుచూస్తూ ఉంటాను”అనిచెప్పి రిసివర్ క్రెడిల్ చేశాడు. తరువాత కూర్చిలో కూర్చుని భారంగా వెనక్కి వాలాడు.ఇంతలో మళ్ళి టెలిఫోన రింగ్ అయింది. ఈ సారి కూడా అతను ఏర్పాటుచేసిన ఏజంట్ కాల్ చేశాడు.

“క్యాప్టన్

“ఎంత వెతికిన నసరీ, మజీద్ ఖాన్ ఆచూకి ఇంకా దొరకలేదు. మన వాళ్ళు విసుగుపడకుండ అన్ని ప్రదేశాలు గాలిస్తున్నారు. కొన్నిచోట్ల హౌజ్ టూ హౌజ్ ఆపరేషన్ కూడా చేస్తున్నారు. ఆ దేశద్రోహులకు ఎవరైన ఆశ్రయం ఇస్తే తీవ్రపరిణామాలు ఎదురుకోవలసివస్తుందని కూడా హెచ్చరించాం. మన వాళ్ళు రాత్రిపగలు అని తేడాలేకుండ వాళ్ళకోసం గాలిస్తున్నారు. ఈ రోజు కాపోయిన రేపయిన వాళ్ళు దొరుకుతారు. మీరేం వర్రికాకండి. తొందరలోనే వాళ్ళ ఆచూకి తెలుసుకుంటాం”అన్నాడు అతను.

“ఓకే మీ ప్రయత్నాలు మీరు చెయ్యండి. మీ కాల్ కోసం ఎదురుచూస్తూ ఉంటాను బై “అని లైన్ కట్ చేశాడు అబ్బాస్. తరువాత రిసివర్ క్రెడిల్ చేసి భారంగా వెనక్కి వాలాడు. పది నిమిషాల తరువాత మరో కాల్ వచ్చింది. ఆ కాల్ చేసిన మనిషి కూడా నసీర్ గురించి మజీద్ ఖాన్ గురించి కాని శుభవార్త చెప్పలేదు. మిగతవాళ్ళు చెప్పినట్టుగానే రొటిన్ రిపోర్ట్ ఇచ్చాడు. అప్పుడే అప్రయత్నంగా అతనికి మిత్రవింద గుర్తుకువచ్చింది. దాంతో పాటు రేపు ఆమె పుట్టినరోజని కూడా జ్ఞాపకానికి వచ్చింది. చప్పున జేబులోంచి ఇంకో సెల్ తీసి ఆమెకు కాల్ చెయ్యబోయాడు. కొద్దిరోజులకు ముందే ఆ సెల్ నెంబర్ మిత్రవిందకు ఇచ్చాడు.

సెల్ తీసి రింగ్ చెయ్యబోతుంటే అదే సెల్ చప్పుడు చేసింది. డిస్ ప్లే మీద మిత్రవింద నెంబర్ కనిపించింది. ఉత్సాహంగా ఆన్ చేసి “చెప్పు మిత్రవింద అన్నాడు.

“నా గురించి పూర్తిగా మరిచిపోయినట్టున్నావు”అంది నిష్టురంగా.

అబ్బాస్ జవాబు చెప్పకుండ చిన్నగా నవ్వాడు. ఆమె ఎందుకు ఆ మాట అన్నదో అబ్బాస్ ఊహించకపోలేదు.

“నేను విచారంగా ఉంటే నీకు నవ్వులాటగా ఉందా”అంది చిరుకోపంతో.

“నీమీద కోపగించుకుంటే నేను బతకగలనా.”

“మళ్ళి ఎందుకు నవ్వుతున్నావు.?

“నీ పసిపిల్ల మనస్తతత్వానికి నవ్వు వచ్చింది. అందుకే నవ్వాను. సరే ఆ విషయం పక్కన పెట్టు. ఇంతకి ఎందుకు కాల్ చేసినట్టు”అడిగాడు అబ్బాస్. “ఎందుకు కాల్ చేశావని అడుగుతున్నావంటే నా విషయం నీకు గుర్తులేదని తెలుస్తోంది”అంది మిత్రవింద.“నువ్వు ఏ విషయం గురించి ఆడుగుతున్నావో నాకు బాగా తెలుసు. రేపు నీ పుట్టిన రోజు అంతేగా”అన్నాడు అబ్బాస్ నవ్వుతూ. “అబ్బా ఇప్పటికి ట్యూబ్ లైట్ లాంటి అయ్యగారి బుర్ర వెలిగింది”అంది మిత్రవింద మళ్ళి గట్టిగా నవ్వుతూ.“నీ బర్తడేకు ఎలాంటి ప్రజంటేషన్ కావాలి”మెల్లగా అడిగాడు అబ్బాస్. నిజానికి ఈ రోజు సాయంత్రం వెళ్ళి ఒక మంచి డ్రస్ కొనాలని అనుకున్నాడు అబ్బాస్. ఈ విషయం మిత్రవిందకు చెప్పకుండ సస్పెన్స్ లో పెట్టాలని అనుకున్నాడు.“ప్రత్యేకంగా ఇదే కావాలని అడగను. నీకు ఇష్టమైంది ఏం ఇచ్చిన తీసుకుంటాను”అంది మిత్రవింద.    “అయితే నాకు ఇష్టమైందే నీకు ప్రెజంట్ చేస్తాను. ఏం ఇస్తానో మాత్రం ఇప్పుడు నీకు చెప్పను. చూసిన తరువాత నీకే తెలుస్తుంది”అన్నా అబ్బాస్.

“అబ్బాస్ నాదో చిన్న కోరిక”అంది మిత్రవింద.

“ఆజ్ఞాపించు. ఈ సేవకుడు తప్పకుండ తీరుస్తాడు.” “నవ్వులాటకు కాదు. సీరియస్ గానే చెప్పుతున్నాను. రేపు మనం ఎక్కడికైన వెళదాం.” “ఎక్కడికి వెళదాం? అది కూడా నువ్వే చెప్పు”అన్నాడు అబ్బాస్ నవ్వుతూ. “రేపు సాయంత్రం మంచి రెస్టారెంటుకు వెళ్ళి భోజనం చేద్దాం”అంది మిత్రవింద. “అలాగే తప్పకుండ వెళదాం. ఏ హోటల్ కు వెళదాం”అడిగాడు అబ్బాస్. “నాకేం తెలుసు. నువ్వే డిసైడ్ చెయ్యి. ఇంకో చిన్న రిక్వెస్ట్”మెల్లగా అంది మిత్రవింద. “ఏమిటో చెప్పు.? “అత్తగారిని కూడా మనతో తీసుకువెళదాం.” “నాకు ఆవిడను ప్రతిచోటుకు తీసుకువెళ్ళాలనే ఉంది. కాని ఆవిడ మాత్రం ఇంటినుంచి కదలదు. ఎన్నోసార్లు చెప్పిచూశాను. బ్రతిమాలాను. అయిన తన మొండి పట్టువిడువలేదు ఆవిడ. రోజు ఇరవైనాలుగు గంటలు తన గదిలో కూర్చుని ఖురాన్ చదువుతూ గడుపుతుంది. ఎన్నోసార్లు మా ఆఫీసులో జరిగిన పార్టీలకు గెట్ టూ గెదర్ కు తీసుకువెళ్ళాలని ప్రయత్నించాను. కాని లాభం లేకుండ పోయింది. ఒక్కసారి కూడా నా కోరిక మన్నించి ఆవిడ నాతో రాలేదు. ఎంత బ్రతిమాలిన ఆవిడ తన వైఖరి మార్చుకోదని నాకు అర్ధమైంది. అందుకే అప్పటినుంచి అడగటం మానేశాను” అన్నాడు అబ్బాస్. అతని గొంతులో అంతులేని నిరాశ కనిపించింది. తల్లి సన్యాసినిలా బతకటం అతను తట్టుకోలేకపోతున్నాడు.

అతని గొంతులో కనిపించిన బరువును చూసి మిత్రవింద కూడా ఫీలయింది. ఒక్క క్షణం పాటు ఆమె కూడ మాట్లాడలేకపోయింది.టున్నావా మిత్రవింద”మెల్లగా అడిగాడు అబ్బాస్.“వింటున్నాను. వింటుంటేనే ఇంత బాధగా ఉంది. నీకు ఎలా ఉంటుందో ఊహించుకోగలను. కాని ఈ సారి మాత్రం మనం ఊరుకోము. చేతులు కట్టుకుని  నిలబడం. తప్పకుండ మనతో ఆవిడను కూడారెస్టారెంటుకు తీసుకువెళతాం”అంది మిత్రవింద దృఢంగా.“ఎలా మిత్రవింద? అమ్మ గురించి నీకు పూర్తిగా తెలుసు. చాల మొండి మనిషి. తను ఏదైన నిర్ణయం తీసుకుంటే అంత తేలికగా మార్చుకోదు”అన్నాడు అబ్బాస్.

“మొదటిసారి కలుసుకున్నప్పుడే ఆవిడ మనస్తత్వం వ్యక్తితత్వం నాకు పూర్తిగా అర్ధమైంది. ఆవిడది ఒక విశిష్టమైన వ్యక్తితత్వం అని అప్పుడే నాకు తెలిసింది. అందుకే నేను చెప్పినట్టు చెయ్యండి. తను బయటకు రాకపోతే మిత్రవింద కూడా వెళ్ళదని గట్టిగా చెప్పండి. అప్పుడు తప్పకుండ ఒప్పుకుంటుంది”అంది మిత్రవింద. “అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు?“నేనంటే తనకు ఎంత ఇష్టమో ఆ రోజే నాకు బాగా తెలిసింది. నా సంతోషం కోసం ఆనందంకోసం ఆవిడ ఏమైన చేస్తుంది. దేనికైన ఒప్పుకుంటుంది. ఇంకేం అనుమానం పెట్టుకోకుండ నేను చెప్పినట్టు చెప్పు. ఫలితం తెలుసుకుని నువ్వే ఆశ్చర్యపోతావు”అంది మిత్రవింద.

“సరే నువ్వు ఇంతగా చెప్పుతున్నావు కనుక తప్పకుండ మాట్లాడతాను”ఎలాగు లైన్ లోకి వచ్చావు కనుక నీ పుట్టినరోజుకు నా అడ్వాన్స్ అభినందనలు అందుకో. మెనీ హాపీ రిటర్స్స్ ఆఫ్ ది డే. ఉంటాను ఇప్పటికే ఆలస్యమైంది. బై “అన్నాడు. అబ్బాస్.“రేపు కలుసుకుందాం బై”అని లైన్ కట్ చేసింది మిత్రవింద. అబ్బాస్ కూడా సెల్ఆఫ్ చేసి వెనక్కి వాలాడు. మాటవరుసకు మిత్రవిందతో తల్లిని ఒప్పిస్తానని అన్నాడు కాని అది అది అంత తేలిక కాదని అతనికి తెలుసు. ఇంతకుముందు ఎన్నోసార్లు ఇలాంటి విషయంలో చాల సార్లు తల్లి కొడుకుల మద్య వాగ్వివాదం జరిగింది. ఎంత బ్రతిమాలిన ఆవిడ అబ్బాస్ తో బయటకు రావటానికి ఒప్పుకోలేదు. అందుకే అప్పటినుంచి ఆవిడను  ఆహ్వానించటం మానుకున్నాడు.  మళ్ళి చాల రోజుల తరువాత ఆదే విషయం గురించి తల్లిని అడగబోతున్నాడు. ఈ సారి కూడా అదే జవాబు ఇస్తుందని అతనికి తెలుసు. అయిన మిత్రవింద తృప్తికోసం తల్లితో మాట్లాడాలని అనుకున్నాడు.

టైం చూశాడు. సాయంత్రం నాలుగు గంటలు కావస్తోంది. ఇంకో గంట వరకు అతను ఆఫీసులోనే ఉండాలి. ఏ సమయంలో అయిన ఏజంట్లు కాల్ చెయ్యవచ్చు. సాయంత్రం అయిదుగంటలవరకు వాళ్ళు ఆఫీసు లాండ్ లైన్ కు కాల్ చేస్తారు. అయిదుగంటలు దాటిన తరువాత అతని సెల్ కు కాల్ చేస్తారు.పది నిమిషాల తరువాత ఒక ఏజంట్ దగ్గరనుంచి కాల్ వచ్చింది. అతను కూడా పెద్దగా సమాచారం ఇవ్వలేదు. అందకు ఇచ్చినట్టుగానే రొటిన్ గా మాట్లాడాడు. గంటలోపు దాదాపు పది కాల్స్ వచ్చాయి. కాని ఎవరు సనీర్ గురించి కాని మజీద్ ఖాన్ గురించి కాని సమాచారం ఇవ్వలేదు. సరిగ్గా అయిదుగంటలకు తన చాంబర్స్ నుంచి బయటకు వచ్చాడు అబ్బాస్. ఆలోచిస్తూ మెల్లగా పార్కింగ్ స్పేస్ లో ఉన్న తన వాహనం వైపు నడిచాడు. అతని బుర్రఅంతా ససీర్ మజీద్ ఖాన్ నిండి ఉన్నారు. దాదాపు దేశంలో ప్రతి చోట వాళ్ళకోసం ఏజంట్లు గాలించారు. చివరకు హోజ్ టూ హోజ్ ఆపరేషన్ కూడా చేశారు. కాని ఇంతవరకు వాళ్ళ గురించి చిన్న క్లూ కూడా దొరకలేదు. దొరుకుతుందో లేదో అని అనుమానంగా ఉంది. ఇలాంటి పరిస్ధితి అబ్బాస్ కు ఎప్పుడు కలగలేదు. ఆలోచిస్తునే జీపులో కూర్చుని స్టార్ట్ చేశాడు. ఒక జెర్క్ ఇచ్చి జీపు వేగంగా ముందుకు కదిలింది. గమ్సస్ధానం చేరుకునేంతవరకు అబ్బాస్ ఆ ఉగ్రవాదుల గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. పార్కింగ్ స్పేస్ లో జీపు పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు. వెంటనే ఆర్డర్లీ వచ్చి అతని చేతిలో ఉన్న బ్రీఫ్ కేసు అందుకున్నాడు.

అబ్బాస్ సోఫాలో కూర్చుని బూట్లు విప్పి తల్లి గదిలోకి వెళ్ళాడు. యధాప్రకారం తల్లి నేలమీద కూర్చుని ద్యాన్యంలోఉంది. ఈ దృశ్యం అతనికి మాములే కనుక మెల్లగా వెళ్ళి ఆవిడ ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు.చప్పున కళ్ళు తెరిచింది షబ్నమ్. చిన్న పిల్లవాడిలా తన ఒడిలో పడుకున్న కొడుకును చూసి చిన్నగా నవ్వింది. ఆవిడ పెద్దగా స్పందించలేదు. ఎప్పుడైన ఏదైన చిన్న సమస్య వచ్చినప్పుడు ఇలా తల్లి ఒడిలో పడుకోవటం అబ్బాస్ కు అలవాటు. అందుకే ఈ విషయాన్ని షబ్నమ్ సీరియస్ గా తీసుకోలేదు. ఇంతకుముందులాగే ఏదో ఆఫీసు సమస్యతో సతమతమవుతున్నాడని భావించింది.“ఏమైంది అబ్బాస్. మళ్ళి ఆఫీసులో ఏదైన సమస్య వచ్చిందా”కొడుకు తలనిమురుతూ అడిగింది ఆమె.

“ఆఫీసు సమస్య అయితే ఏదో రకంగా కష్టపడి సరిచేసుకుంటాను. కాని నాకు వచ్చింది ఆఫీసు సమస్యకాదు”అన్నాడు భారంగా అబ్బాస్.   “అఫీసు సమస్య కాదా మరి ఇంకేమిటి”ఆశ్చర్యంగా అడిగింది షబ్నమ్.    అబ్బాస్ మాట్లాడకుండ లేచి కూర్చున్నాడు. తల్లివైపు జాలిగా చూసి సమస్య నీ వల్లే వచ్చింది “అన్నాడు.షబ్నమ్ బిత్తరపోయింది.“నా వల్ల సమస్య వచ్చిందా ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది”అంది మెల్లగా.“అవునమ్మా నువ్వు నాతో ఎక్కడికి రావు. ఇరవైనాలుగుగంటలు ఇంట్లో కూర్చునే ఉంటావు. సరదగా అలా బయటకు వచ్చి పది మందితో తిరగటానికి ఇష్టపడవు. నా అధికారం కాని హోదా కాని నిన్ను ఏ రకంగాను సంతోషపెట్టలేకపోతున్నాయి”అన్నాడు బాధగా అబ్బాస్.కొడుకు వైపు జాలిగా చూసిందామే.“నేను సంతోషంగా లేనని నీకు ఎవరు చెప్పారు. నేను చెప్పానా”అందామే.“నువ్వు వేరేగా చెప్పాలా. చూస్తుంటే తెలియటంలేదా. నాతో పనిచేస్తున్నవాళ్ళ తల్లి తండ్రులు ఎంతో కలుపుగొలపుగా ఉంటారు. మా ఆఫీసులో జరిగే ప్రతి శుభకార్యానికి వాళ్ళు కూడా వస్తారు. ఎంతో సరదాగా నలుగురితో కలిసి మెలిసి పోతారు. మాతో పాటు వాళ్ళు సంతోషంగా ఆడుతారు పాడుతారు. చిన్నపిల్లులా గెంతులువేస్తారు. కాని నువ్వు మాత్రం అందరికి బిన్నంగా ఉంటావు. ఎక్కడికి నాతో రావు. చివరకు నా పుట్టినరోజు ఫంక్షన్ కు కూడా మాతో కలవవు. ఇది నాకు ఎంత బాధ కలిగిస్తుందో నీకు తెలియదు. ఒక్కోక్కోసారి ఏడుపు వస్తుంది. ఇంత పెద్ద ఉద్యోగంలో ఉండి కన్న తల్లిని సంతోషపెట్టలేకపోతున్నానని రోజు బాధతో రగిలిపోతున్నాను. ఇది నీకు కొంచం కూడా అర్ధం కావటం లేదు. నీకోసం ఎన్నోఖరీదైన చీరలు నగలు కొనిచ్చాను. అయిన ఒక్కోరోజు కూడా ఆ ఖరీదైన చీరలు కట్టుకోలేదు. నగలు పెట్టుకోలేదు. నీ ఈడు వాళ్ళందరు ఎంతో అందంగా అలంకరించుకుని బయట తిరుగుతున్నారు.

కాని నువ్వు మాత్రం ఎప్పుడు ఈ గది దాటి బయటకు రావు. కనీసం నలుగురితో సరదాగా మాట్లాడవు”అన్నాడు అబ్బాస్.అతని కళ్ళు పూర్తిగా తడిఅయ్యాయి. చాల రోజులనుంచి బిగపెట్టుకున్న బాధ విచారం కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చింది. తన కోసం ఎంతో కష్టపడిన తల్లిని సంతోషపెట్టలేకపోతున్నందుకు అతను లోలోపల కుమిలిపోతున్నాడు.కొడుకు బాధ షబ్నమ్ కు అర్ధమైంది.ఆమె ఆప్యాయంగా కొడుకు చేతిని తన చేతులలోకి తీసుకుంది. “ఖరీదైన నగలు చీరలు మాత్రమే మనిషిని సంతోషపెట్టలేవు. అది మనస్సుకు సంబంధించింది. నేను సంతోషంగా లేనని నీకు ఎవరు చెప్పారు. నేను ఎప్పుడైన చెప్పానా. లేదే. నువ్వు ఏదేదో ఊహించుకుని బాధపడుతున్నావు. ఏ పరిస్ధితిలో మీ నాన్నగారు మనిద్దరిని విడిచివెళ్ళారో నీకు బాగా తెలుసు. ఆ రోజు నుంచి నా జీవితంలో సుఖసంతోషాలు దూరమైపోయాయి. నా లక్ష్యం ఆశయం ఒక్కటే. ఎలాగైన మీ నాన్నగారి ఆశయం నెరవేర్చాలి. అందుకే రాత్రి పగలు యంత్రంలా కష్టపడ్డాను. నిన్ను ఇంతవాడిని చేశాను. నువ్వు కూడా చక్కగా చదువుకుని మీ నాన్నగారి కోరికను తీర్చావు. చాల సంవత్సరాలనుంచి ఒక రకమైన జీవితానికి నేను బాగా అలవాటుపడిపోయాను. కష్టాలు తప్ప సుఖాలు ఎరుగను.

అప్పుడు నాకు ఇది లేదని అది లేదని ఎప్పుడు అనుకోలేదు. కాని ఇప్పుడు అవి ఉన్నా వాటి గురించి నేను పట్టించుకోవటం లేదు. నాకు ఈ ప్రాపంచిక విషయాలమీద ఆసక్తి నశించింది. నీకోసమే నేను బతుకుతున్నాను. నువ్వు తెచ్చిన చీరలు నగలు నేను వేసుకోలేకపోవచ్చు. కాని నా కోడలు పిల్ల వేసుకుంటుంది. వాటిలో నా కోడలు అందాలను తనివితీరా చూసుకుంటాను. ఇంతకంటే నాకు మాత్రం ఇంకేం కోరిక ఉంటుంది. సందర్భం వచ్చింది కనుక చెప్పుతున్నాను. నిజానికి నేను చాల సంతోషంగా ఆనందంగా ఉన్నాను. ఏ తల్లి లేనంత ఆనందంగా ఉన్నాను. త్వరలోనే నా ఇంటికి కోడలు రాబోతుంది. నువ్వు తను ఆనందంగా ఇంట్లో తిరుగుతుంటే ఈ కళ్ళతో చూసే భాగ్యం నాకు దొరకబోతుంది. ఇంతకంటే ఈ వయస్సులో ఇంకేం కావాలి. నిజంగా మీ నాన్నగారి మీద ఒట్టు వేసి చెప్పుతున్నాను. నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. నన్ను ఎంతో ప్రేమతో చూసుకునే కొడుకు నాలో తన తల్లిని చూసుకునే కోడలు పిల్ల దొరకటం నిజంగా నా అదృష్టం. నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం. దయచేసి ఇంకేప్పుడు  ఈ ప్రసక్తి తేకు. నేను తట్టుకోలేను”అంది షబ్మమ్.“అమ్మా రేపు మిత్రవింద పుట్టిన రోజు. చిన్న పార్టీ ఇవ్వాలని పట్టుపట్టింది. నేను కూడా సరే అన్నాను. కాని తను ఒక కండిషన్ పెట్టింది”అన్నాడు అబ్బాస్.“కండిషన్ పెట్టిందా ఏమిటది”అంది ఆశ్యర్యంగా షబ్నమ్.“పార్టీకి నువ్వు కూడా మాతో రావాలని అంది.”“నేనెందుకు మీ మద్యలో పానకంలా పుడకలా. మీరిద్దరు హాయిగా ఆనందంగా వెళ్ళిరండి”అంది షబ్నమ్. “లాభం లేదమ్మా. నువ్వు నన్ను సమాధానపరిచినట్టు మిత్రవిందను సమాధానపరవటం సాధ్యం కాదు. తను నీలాగే చాల మొండిది. నువ్వు వస్తే కాని తను నాతో రానని గట్టిగా చెప్పింది”అన్నాడు అబ్బాస్. “నిజంగానే అలా చెప్పిందా”అంది అనుమానంగా షబ్నమ్.“నీతో ఎప్పుడైన అబద్దం చెప్పానా. కావాలంటే మిత్రవిందతో మాట్లాడు”అని సెల్ తీసి ఇవ్వబోయాడు.

“అవసరంలేదు. నేను నిన్ను నమ్ముతాను”అంటు కళ్ళు మూసుకుంది షబ్నమ్.ఆమె ఏం ఆలోచిస్తుందో అబ్బాస్ గ్రహించాడు. అందుకే డిస్ట్రబ్ చెయ్యకుండ మౌనంగా ఉండిపోయాడు. క్షణం తరువాత కళ్ళు తెరిచింది షబ్నమ్. అబ్బాస్ వైపు చూసి చిన్నగా నవ్వింది.“సరే వస్తానని చెప్పు”అంది. ఒక్కసారిగా సంతోషంతో ఊగిపోయాడు అబ్బాస్. ఎగిరి గెంతులు వెయ్యాలనిపించింది అతనికి. అతికష్టంమీద తన ఉత్సాహాన్ని ఆపుకున్నాడు.“ఈ శుభవార్త వెంటనే మిత్రవిందతో చెప్పాలి వస్తాను’అని చువ్వలా లేచి గదిలోంచి బయటకు వెళ్ళాడు అబ్బాస్. కొడుకు వాలకం చూసి చిన్నగా నవ్వుకుంది షబ్నమ్. తరువాత యధాప్రకారం ఖురాన్ చదవటంలో మునిగిపోయింది.గదిలోంచి బయటకు వచ్చిన అబ్బాస్ సెల్ తీసి మిత్రవిందకు కాల్ చేశాడు. అతని కాల్ కోసమే ఎదురుచూస్తుంది మిత్రవింద. వెంటనే రెస్పాండ్ అయింది.
    “నీకో శుభవార్త మిత్రవింద. మనతో రావటానికి అమ్మ సంతోషంగా ఒప్పుకుంది”అన్నాడు అబ్బాస్. అతని గొంతులో ఎక్కడలేని సంతోషం ఆనందం కనిపిస్తోంది. ఒక అద్భుతమైన విషయం తెలుసుకున్నప్పుడు ఒక సెంటిస్ట్ ఎంతో సంబరపడతాడో అబ్బాస్ వాలకం కూడా ఇంచుమించు అలాగే ఉంది.

“మీ అమ్మగారు నా ప్రపోజల్ కు ఒప్పుకున్నారు అంతేగా”అంది మిత్రవింద నవ్వి.“అరే ఈ విషయం నీకు ఎలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగాడు అబ్బాస్.“అవిడ మనతో కలిసి రావటం కంటే నీకు ఇంకో సంతోషకరమైన వార్త ఇంకేం ఉంటుంది”“గుడ్ కరెక్టుగా ఊహించావు. తను రాకపోతే నువ్వు రావని చెప్పటంతో సరే అని ఒప్పుకుంది. సరే సమస్య తీరిపోయింది కనుక ఇక అసలు విషయానికి వస్తాను. రేపు సరిగ్గా ఆరుగంటలకు నువ్వు షాలిమార్ హోటల్ కు వచ్చేయ్. మాములుగా కాదు బురఖా వేసుకుని రా. నా కొలిగ్స్ తరుచుగా ఆ హోటల్ కు తమ ఫామిలితో వస్తుంటారు. నిన్ను కనుక చూస్తే అనుమానపడతారు. తరువాత లేని పోని సమస్యలు ఎదురుకోవలసివస్తుంది. బురఖా వేసుకుని వస్తే వాళ్ళు నిన్ను చూడలేరు. నువ్వు ఇండియన్ ఎంబసిలో పనిచేస్తున్న పొలిటకల్ అటాచి అని తెలుసుకోలేరు. నేను కూడా నువ్వు మా దూరపు చుట్టాలమ్మాయివని పరిచయం చేస్తాను.”

“అలాగే నువ్వు చెప్పినట్టుగానే వస్తాను. కాకపోతే నేను డైరక్టుగా హోటల్ కు రాను”అంది మిత్రవింద.“అంటే? “మీ ఇంటికి వస్తాను. నా చేతులతో నా అత్తగారిని అలంకరిస్తాను. కాని ఈ విషయం నువ్వు అత్తగారితో చెప్పకు. సస్పెన్స్ గా ఉండనివ్వు.”“అది అంత అవసరం అంటావా” అడిగాడు అబ్బాస్. “తప్పదు. నా చేతులతో ఆవిడను అలంకరించాలని నా ఆశ. ఆ కోరిక అవకాశం ఇంత తొందరగా తీరుతుందని నేను ఊహించలేను. ఇంకేం మాట్లాడకు అబ్బాస్. సరిగ్గా అయిదుగంటలకు మీ ఇంటికి వస్తాను. డ్రైవర్ తో కాదు. నేనే కారు డ్రైవ్ చేసుకుంటువస్తాను”అంది మిత్రవింద.సరే అన్నాడు అబ్బాస్.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్