Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nee peru talachina chalu

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమ ఎంత మధురం

prema enta madhram

గత సంచికలోని ప్రేమ ఎంత మధురం   సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue323/826/telugu-serials/prema-enta-madhuram/prema-enta-madhram/

(గత సంచిక తరువాయి)...ఆ రోజు ఆదివారం. మిత్రవిందకు సెలవు. సాధారణంగా ఆదివారం రోజు స్టాఫ్ అందరు తన కుటుంబాలతో సైట్ సీయింగ్ కు వెళ్ళిపోతారు. ఉదయం వెళ్ళి సాయంత్రం ఆరుగుంటలకు తిరిగివస్తారు. ఈ తతంగం ప్రతి ఆదివారం జరుగుతుంది. ఎంబసిలో చాల మంది బయటకు వెళతారు. ఇద్దరు తప్ప. వాళ్ళలో ఒకరు మిత్రవింద. ఆమె ఎక్కడికి వెళ్ళదు. వచ్చిన కొత్తలో పనిగట్టుకుని అన్ని ప్రదేశాలు చూసింది. ఇక చూడటానికి ఆమెకు ఏం కనిపించలేదు. అందుకే తన క్వార్టర్స్ లోనే ఉండిపోతుంది.

“టైం పాస్ కావటానికి పుస్తకాలు చదువుతుంది. కొంచం సేపు టీవి చూస్తుంది. తరువాత హాయిగా పడుకుంటుంది. ఆమెకు బయటకు వెళ్ళి ఎంజాయ్ చెయ్యాలనే ఆసక్తి కాని కోరిక కాని లేవు.

ఇకపోతే రెండవ వ్యక్తి పేరు రాజేష్. అతను ఎంబసిలో క్రిప్టాలజిస్ట్. క్రిప్టాలజిస్ట్ అంటే కోడ్ లో ఉన్న సమాచారాన్ని ఢీకోడ్ చెయ్యటం. డిఫెన్స్ డిపార్ట్ మెంట్ లో క్రిప్టాలజిస్ట్ కు ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాగే ఎంబసిలో కూడా. ఒక్కోక్కోసారి ఎంబసికి ముఖ్యమైన రహస్య సమాచారం వస్తుంది.  ఆ సమాచారం అంతా కోడ్ భాషలో ఉంటుంది. అప్పుడు క్రిప్టాలజిస్ట్ అవసరం ఎంతో ఉంటుంది. అతని సహయంతో కోడ్ లో వచ్చిన సమాచారాన్ని ఢీకోడ్ చేస్తారు. ఈ తతంగం చాల రహస్యంగా జరుగుతుంది. ఢీకోడ్ చేసిన సమాచారం అంబాసిడర్ కు క్రిప్టాలజిస్ట్ కు మాత్రమే తెలుసు. అంబాసిడర్ శత్రవులు కిడ్నాప్ చెయ్యటానికి ప్రయత్నించరు. అది చాల రిస్క్ తో కూడుకున్నది. అందుకే వాళ్ళు క్రిప్టాలజిస్ట్ ను అపహరించటానికి ప్రయత్నిస్తారు. అతని ద్వార దేశరహస్యాలు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు. అందుకే ఎంబసిలో పని చేసే క్రిప్టాలజిస్ట్ ను సాధారణంగా బయటకు పంపించరు. ఒక వేళ పంపించిన పూర్తి సెక్యురిటితో పంపిస్తారు. అలా తరుచు జరగదు. ఎప్పుడో ఒకసారి తప్పదనుకున్నప్పుడు జరగుతుంది.

అందుకే ఎంబసిలో ఎవరు వెళ్ళిన రాజేష్ మాత్రం తన క్వార్టర్స్ కు అంకితమైపోతాడు.ప్రతి క్వార్టర్స్ లో హడావిడి కనిపిస్తుంది. అందరు సైట్ సీయింగ్ కు వెళ్ళటానికి తయారవుతున్నారు. కాఫీ తాగుతూ క్వార్టర్స్ లోంచి బయటకు వచ్చింది మిత్రవింద. నిజానికి ఆమెకు కూడా ఎక్కడికైన వెళ్ళాలని ఉంది. కాని ఒంటరిగా కాదు. అబ్బాస్ తో. కాని ఆ కోరిక నెరవేరదని ఆమెకు తెలుసు. అయిన ఏదో తెలియని ఆశ. అందుకే అలవాటు ప్రకారం అబ్బాస్ కు కాల్ చేసింది. ఎప్పుడు జరిగినట్టుగానే అతని వైపునుంచి రెస్పాన్స్ లేదు. మాములు రోజులలో కంటే అధివారం అతను మరింత బిజీగా ఉంటాడు. అందుకే మిత్రవింద కాల్ కు రెస్పాండ్ కాడు.

విస్సుగా సెల్ ఆఫ్ చేసి కొంచం ముందుకు నడిచింది. ఆమెకు ఎదురుగా స్టాఫ్ క్వార్టర్స్ ఉన్నాయి. ప్రతి క్వార్టర్ లో సందడి కనిపిస్తోంది. పిల్లల అరుపులతో హడావిడిగా గందరగోళంగా ఉంది. అదృష్టవంతులు చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంది మిత్రవింద. గంట తరువాత స్టాఫ్ దాదాపు చాల మంది తమ వాహనాలలో వెళ్ళిపోయారు. ఎంబసిలో ఒక్కసారిగా నిశబ్ధం అలుముకుంది.

ఆ రోజు అంబాసిడర్ ఎంబసిలో లేడు. అర్జంట్ పనిమీద ఢిల్లీ వెళ్ళాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎవరికి ఏం చెప్పలేదు ఆయన. సెక్యురిటి వాళ్ళు గేటు మూసి తాళం వేస్తున్నారు. అప్పుడే రాజేష్ మిత్రవింద దగ్గరకు వచ్చాడు. ప్రతి ఆదివారం అతను మిత్రవింద దగ్గరకు వస్తాడు. ఇద్దరు కొంచం సేపు కబుర్లు చెప్పుకుంటారు. తరువాత రాజేష్ తన క్వార్టర్స్ కు వెళ్ళిపోతాడు. మిత్రవింద రొటిన్ పనిలో పడిపోతుంది.   “హలో రాజేష్ “అంది మిత్రవింద.

“హాలో మేడం. మీరు ఫ్రీగా ఉన్నారా”అడిగాడు అతను.

“ఎందుకు అడుగుతున్నావు? ఆశ్చర్యంగా అడిగింది మిత్రవింద.

“ఏం లేదు మేడం మీతో ఒక విషయం మాట్లాడాలి”అన్నాడు.

“అయితే ఇంట్లోకి రండి. అక్కడ ఫ్రీగా మాట్లాడుకోవచ్చు.”

“లోపలికి వద్దు. ఇక్కడే మాట్లాడుకుందాం.”

“సరే చెప్పు”అంది మిత్రవింద.

“నేను బయటకు వెళ్ళాలని అనుకుంటున్నాను”అన్నాడు అతను.

మిత్రవింద ఒక్కసారిగా నవ్వింది.

ఆమె ఎందుకు నవ్వుతుందో అతనికి అర్ధం కాలేదు. ఆశ్చర్యంగా చూశాడు.

అతని ఉద్దేశం గ్రహించింది మిత్రవింద.

“చూడు రాజేష్ ఈ మాటలు నువ్వు నా దగ్గర ఎన్నోసార్లు అన్నావు. నేను కూడా ఎన్నోసార్లు నీకు జవాబు చెప్పాను. అయిన మళ్ళి అడిగావు కనుక మళ్ళిచెప్తాను. నువ్వు బయటకు వెళ్ళటానికి నీకు అధికారం లేదు. పంపించటానికి నాకు కూడా అధికారం లేదు. నువ్వు బయటకు వెళ్ళాలంటే అంబాసిడర్ అనుమతి కావాలి. ప్రస్ధుతం అంబాసిడర్ గారు ఎంబసిలో లేరు. అర్జంట్ పనిమీద ఢిల్లీ వెళ్ళారు. ఎప్పుడు వస్తారో నాకు తెలియదు. ఆయన వచ్చిన తరువాత ఈ విషయం ఆయనతో చెప్పు. ఆయన పంపిస్తే నిరభ్యంతరంగా వెళ్ళు. నాకేం అభ్యంతరంలేదు”అంది మిత్రవింద.

“ఈ విషయం నాకు తెలుసు మేడం. ఇంతకుముందు అంబాసిడర్ గారిని ఎన్నోసార్లు అడిగాను. కాని ఆయన ఒప్పుకోలేదు”అన్నాడు రాజేష్.

“ఆయనకు అన్ని విషయాలు తెలుసు. అందుకే వద్దని చెప్పిఉంటారు. ప్రస్ధుతం మన రెండు దేశాల మద్య పరిస్ధితులు బాగా లేవు. పైకి మాత్రం స్నేహంగా ఉంటున్నారు. మొహం మీద నవ్వు పులుముకుని మాట్లాడుతున్నారు. కాని లోపల మాత్రం ఒకరిమీద ఒకరు అనుమానం పెంచుకున్నారు. దానికి కారణం బారముల్లాలో జరిగిన దారుణమైన సంఘటన. ఆ దాడిలో ఎంతో మంది అమాయకులు దారుణంగా చనిపోయారు. చాల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ రక్తపు మరకలు ఇంకా ఆరలేదు. ప్రత్యేక్షంగా కాదుకాని పరోక్షంగా రెండు దేశాల మద్య ఏదో తెలియని టెన్షన్ నెలకొని ఉంది. ఈ పరిస్ధితిలో నీ లాంటి క్రిప్టాలజిస్ట్ బయటకు వెళ్ళటాం చాల ప్రమాధం. ఒక రకంగా ఆత్మహత్యతో సమానం. ఈ విషయాలు నీకు తెలుసు. అయిన చిన్న పిల్లవాడిలా అడుగుతున్నావు. నేనేం చెయ్యగలను”అంది మిత్రవింద.

“అంతేనా మేడం. నేను బయటకు వెళ్ళే అవకాశం లేనేలేదా”అడిగాడు నిరుత్సాహంగా రాజేష్.

“ఎందుకు లేదు. ఖచ్చితంగా ఉంది. కాని అది ఇప్పుడుకాదు. ఇంకా కొన్ని రోజులు ఆగాలి. మన రెండు దేశాలమద్య మళ్ళి స్నేహభావం మొలకెత్తుతుంది. అప్పుడు పరిస్ధితులు ప్రశాంతంగా ఉంటాయి. అప్పుడు నువ్వు తప్పకుండ వెళ్ళవచ్చు.”

“ఆ సమయం ఎప్పుడు వస్తుంది. ఇరవైనాలుగు ఈ నాలుగుగోడల మద్య గడుపుతున్నాను. ఏం తోచక పిచ్చేత్తి పోతుంది. ఎంతసేపని టీవిచూడాలి. ఎంతసేపని పుస్తకాలు చదవాలి. ప్రతి అదివారం ఇలాగే చేస్తున్నాను. కొంచం కూడా మార్పు లేదు. నేను మనిషినే మేడం. నాకు కోరికలు సంతోషాలు ఉంటాయి. అందరిలాగే నేను కూడా జీవితాన్ని అనుభవించాలని అనుకుంటున్నాను. కాని ఒక్కరోజు కూడా నా కోరిక నెరవేరటం లేదు. ఇంకా ఈ నరకం ఎంతకాలం అనుభవించాలో”స్వగతంగా అన్నాడు రాజేష్.

అతని మొహం విచారంతో నిండిపోయింది. లోలోపల కోపంతో ఉడికిపోతున్నాడు అతను. కాని ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో అతనికి అర్ధంకావటం లేదు.

మిత్రవింద జాలిగా అతని వైపుచూసింది. అతని పరిస్ధితి ఆమె అర్ధంచేసుకోగలదు. అతనే కాదు అతని స్ధానంలో ఇంకేవరున్నా అలాగే ప్రవర్తిస్తారు. అతను కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతున్నాడు. అది బలవంతంగా కావచ్చు. కాని అతని స్దానంలో ఇంకేవరైన ఉంటే దొంగతనంగా ఎంబసినుంచి జారుకునేవారు. హాయిగా బయట ఎంజాయ్ చేసి వచ్చేవారు.

కాని రాజేష్ కు అంత ధైర్యం లేదు. అందుకే తన నిస్సహయతకు లోలోపలే కుమిలిపోతున్నాడు. మిత్రవిందతో ఇంకేం మాట్లాడాలో అతనికి తోచలేదు. నిద్రలో నడుస్తున్నవాడిలా తన క్వార్టర్స్ చేరుకున్నాడు. లాప్ టాప్ ముందు కూర్చుని ఫేస్ బుక్ ఓపన్ చేశాడు. అప్పుడే అతనికోసం నస్రీన్ ఎదురుచూస్తోంది. ఆమె అతనికి ఫేస్ బుక్ లో పరిచయం అయింది. అప్పటినుంచి ప్రతి రోజు ఆమెతో చాట్ చేస్తున్నాడు అతను.

ఆమె లైన్ లోకి రావటం అతనికి ఎంతో సంతోషం కలిగించింది. జరిగింది మరచిపోయి ఆమెతో చాట్ లో పడిపోయాడు రాజేష్.“ఆ గదిలో నిశబ్ధం ఘనీభవించని మంచులా ఉంది. ఆ గదిలో ముగ్గురు ఉన్నారు. ఒకరు పాకిస్ధాన్ రక్షణమంత్రి. ఇంకోకరు డిఫెన్స్ సెక్రటరి. మూడో వ్యక్తి అబ్బాస్. రక్షణమంత్రి ముందు ఒక ఎర్రపంగు ఫైలు ఉంది. దాని మీద టాప్ సీక్రేట్ అని ఎర్రరంగు ఇంకులో రాసి ఉంది. సరిగ్గా ఒక గంట ముందే ఆ ఫైలు రక్షణమంత్రి టేబుల్ మీదకు వచ్చింది. అది భారతదేశం నుంచి వచ్చిన ఫైలు.

అందులో బారముల్లాలో దాడిచేసిన ఉగ్రవాదుల గురించి పూర్తి వివరాలు ఉన్నాయి. దాంతోపాటు అధికారులు చేసిన దర్యాప్తు మిగత వివరాలు కూడా ఉన్నాయి.ఆ సమాచారం సేకరించటానికి భారత ఇంటలిజెన్స్ సంస్ధ ఎంతో కష్టపడింది. తన నెట్ వర్క్ పూర్తిగా యాక్టివేట్ చేసింది. రాత్రిపగలు కష్టపడిన తరువాత ఆ ఉగ్రవాదుల గురించి పూర్తి సమాచారం తెలుసుకుంది. వాళ్ళ వివరాలు మాత్రమే కాకుండ ఫోటోలు కూడా పంపింది.

అంతకుముందే భారత ఇంటలిజెన్స్ సంస్ధ డేటా బేస్ లో వాళ్ళ వివరాలు ఫోటోలు ఉన్నాయి. తమ సేకరించిన విషయాలను విపులంగా రాసి ఒక ఫైలు తయారుచేశారు. దాన్ని పాకిస్ధాన్ కు పంపించారు. దానికి ముఖ్యమైన కారణం ఉంది. అంత దారుణం చేసినవాళ్ళు ఇండియాలో లేరు. పని పూర్తిఅయినవెంటనే రహస్యంగా పాకిస్ధాన్ పారిపోయారు. అంతవరకు మాత్రమే భారతఅధికారులకు తెలుసు. వాళ్ళు పాకిస్ధాన్ లో ఎక్కడ ఉన్నారో ఎక్కడ దాక్కున్నారో తెలియదు. ఆ విషయం తెలుసుకోవలసిన బాధ్యత ఇప్పుడు పాకిస్ధాన్ మీద ఉంది.

ఆ ఫైలు చివరలో ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రాసిన ఉత్తరం కూడా ఉంది.

“ఆనరబుల్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ పాకిస్ధాన్.

“జరిగిన దారుణం గురించి నేను మీకు మళ్ళి చెప్పనవసరంలేదు. మీకు తెలుసు. మా అధికారులు రాత్రిపగలు కష్టపడి ఈ వివరాలు సేకరించారు. ఆ దారుణం చేసింది ఎవరో కూడా తెలుసుకున్నారు. కాని దురదృష్టవశతు వాళ్ళను పట్టుకునే అవకాశం మాత్రం మాకు కలగలేదు. అసైన్ మెంట్ పూర్తిచేసిన వెంటనే ఆ ముష్కరులు మీ దేశం పారిపోయారు. మీ దేశంలోనే ఎక్కడో రహస్యంగా దాక్కుని ఉన్నారు. వాళ్ళను పట్టుకుని మాకు అప్పగించాలి. అది మీ బాధ్యత. అప్పుడే మన సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. లేకపోతే ఆ దారుణం మీరు దగ్గరుండి చేయించారని నమ్మవలసివస్తుంది. ఆలా జరగటం మాకు ఇష్టంలేదు. అందుకే దయచేసి ఆ నేరస్ధులను తొందరగా కనిపెట్టండి. వాళ్ళ ఆచూకి తెలుసుకుని పట్టుకోండి. తరువాత వాళ్ళను సగౌరవంగా మాకు అప్పగించండి. మా దేశన్యాయవ్వవస్ధ ప్రకారం వాళ్ళకు తగిన శిక్ష విధిస్తాం. ఇది ఎంత తొందరగా జరిగితే అంత మంచిది. మన రెండు దేశాలు పరస్పర స్నేహభావంతో మెలగాలంటే వీళ్ళ ఆచుకి మీరు తప్పకుండ తెలుసుకోవాలి. అంతవరకు మన మద్య కొంచం కూడా సంబంధాలు ఉండవు. దయచేసి నన్ను అపార్ధంచేసుకోకండి. నేను నా ప్రభుత్వం ప్రతిపక్షాలనుంచి ఎంత వత్తిడి అనుభవిస్తున్నామో మీకు తెలియదు. నన్ను అర్ధంచేసుకుంటారని ఆశిస్తూ,

భారతరక్షణమంత్రి

అని కింద సంతకం సీల్ ఉంది.

ఆ ఉత్తరం చదవగానే పాకిస్ధాన్ రక్షణమంత్రి మొహం కత్తివాటుకు నెత్తురుచుక్కలేనంతగా పాలిపోయింది. సిగ్గు కోపం అతన్ని కలిసికట్టుగా కుదిపేశాయి. జరిగింది మాములు విషయం కాదు. నరమేధం జరిగింది. ఆ దాడిలో దాదాపు రెండువందలమంది పైన చనిపోయారు. కొన్ని వందలమంది తీవ్రంగా గాయపడ్డారు. బారముల్లాలో ఇంకా రక్తపుమరకలు పూర్తిగా ఆరలేదు. అక్కడ ఉంటున్న ప్రజలు ఇంకా మాములు స్దితికి రాలేదు. కొంతమంది ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. రోజు పోలీసులు అక్కడ కవాతు నిర్వహిస్తున్నారు. అయిన ప్రజల మనస్సులో ఇంకా భయం పోలేదు.

ఈ విషయాలన్ని పాకిస్ధాన్ రక్షణమంత్రికి తెలుసు. కాని అతను మాత్రం ఏం చెయ్యగలడు. కాని ఒక విషయంలో అతనికి చాల సంతోషంగా ఉంది. ఆ దారుణం చేసింది ఎవరో భారతప్రభుత్వం తెలుసుకుంది. వాళ్ళ గురించి పూర్తి వివరాలు ఫోటోలతో సహ పంపించింది. ఇప్పుడు వాళ్ళను పట్టుకోవలసిన బాధ్యత పాకిస్ధాన్ మీద ఉంది. అంతేకాదు పట్టుకున్న వాళ్ళను భారత్ కు కూడా అప్పగించాలి. ఈ పని ఒక్క అబ్బాస్ వల్లే సాధ్యమవుతుంది. ఈ విషయం చీఫ్ సెక్రటరికి చెప్పాడు రక్షణమంత్రి. అతను వెంటనే అబ్బాస్ కోసం కబురుపంపాడు.
ఒక్క నిమిషం ఆలస్యం అబ్బాస్ బయలుదేరాడు.అతను పావుగంటలో రక్షణమంత్రి చాంబర్స్ చేరుకున్నాడు. లోపల రక్షణమంత్రితో పాటు డిఫెన్స్ సెక్రటరి కూడా ఉన్నారు. ఇద్దరి చాల టెన్షన్ తో ఉన్నారు. వాళ్ళ మొహలలో కళ పూర్తిగా ఇంకిపోయింది. ఏదో తీవ్రమైన సమస్య వచ్చిందని అబ్బాస్ కు అర్ధమైంది. ప్రోటోకోల్ ప్రకారం ఇద్దరికి సెల్యుట్ చేశాడు.

“కూర్చో అబ్బాస్”అన్నాడు భారంగా రక్షణమంత్రి.

అబ్బాస్ కూర్చుని సాభిప్రాయంగా మంత్రి వైపు చూశాడు. రక్షణమంత్రి అతని ఉద్దేశం గ్రహించాడు. మెల్లగా ఫైలును అబ్బాస్ ముందుకు తోశాడు.

ఏమిటన్నట్టుగా అబ్బాస్ చూశాడు.

“ఈ ఫైలు భారత్ నుంచి వచ్చింది. నేను చదివాను. నువ్వు కూడా పూర్తిగా చదువు. తరువాత ఏం చెయ్యాలో నువ్వే నిర్ణయించు. నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను”అన్నాడు రక్షణమంత్రి.

“ఇక్కడే చదవమంటరా”ఫైలు అందుకుంటు అడిగాడు అబ్బాస్.

“ఇక్కడ కాదు. నీ ఆఫీసుకు తీసుకువెళ్ళి చదవు”అన్నాడు మంత్రి. ఫైలు తీసుకుని లేచి నిలబడ్డాడు అబ్బాస్. ఇద్దరికి మళ్ళి మర్యాదపూర్వకంగా సెల్యుట్ చేసి మంత్రి చాంబర్ నుంచి బయటకు వచ్చాడు. తన చాంబర్స్  చేరుకుని టేబుల్ ముందు కూర్చున్నాడు. ఫైలును మెల్లగా తెరిచాడు.

దాదాపు అరగంట పట్టింది అబ్బాస్ కు ఫైలు పూర్తిచెయ్యటానికి. అందులోభారత అధికారులు చేసిన దర్యాప్తు వివరాలు ఒకటికి పదిసార్లు చదివాడు. తరువాత వాళ్ళు పంపించిన ఆల్ ఖైదా ఉగ్రవాదుల ఫోటోలు చూశాడు.

అందులో ఒకడి పేరు నసీర్. అతను ఆల్ ఖైదా సంస్ధలో సీనియర్ సబ్యుడు. అతని డెసిగ్నేషన్ ఎక్జీక్యూషనర్. ఎక్జీ క్యూషనర్ అంటే గాలిలో ఎగురుతున్న విమానాలను పేల్చటం రైలులో బాంబులు పెట్టటం మొదలైన దారుణాలను చేసే వాడిని ఎక్జీక్యూషనర్ అంటారు. రెండోవాడిపేరు మజీద్ ఖాన్. వాడు కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ సంస్ధలో సబ్యుడు. సాధారణంగా రెండు ఉగ్రవాదసంస్ధలు కలిసి పనిచెయ్యవు. ఎవరి అజెండాలు ఆశయాలు లక్ష్యాలు వారికి ఉంటాయి. అయితే ఒక్కోక్కోసారి రెండు సంస్ధల ఎజండాలు ఒకటే ఉంటాయి. ఆ సమయంలో ఇద్దరు కలిసి పనిచేసే అవకాశం ఉంది. ఇలా ఎప్పుడో కాని జరగదు. ఇప్పుడు అనుకోకుండ ఆ అవకాశం వచ్చింది. ఇద్దరు భారత్ లో రక్తపాతం సృష్టించాలని తీర్మానించుకున్నారు.

అనుకున్నట్టుగానే చేశారు. ఆ దాడిలో మొత్తం అయిదుగురు పాల్లోన్నారు. ఇద్దరు గురించి పూర్తిగా తెలిసింది. ఇంకా ముగ్గురు మిగిలిఉన్నారు. వాళ్ళఅందరు నసీర్ తో ఉన్నారని అబ్బాస్ భావిస్తున్నాడు. కాని ఎక్కడ దాక్కున్నారో ఇంకా తెలియలేదు.
ఫైలు మూసి లేచి నిలబడ్డాడు అబ్బాస్. అటుఇటు తీవ్రంగా పచార్లు చెయ్యటం మొదలుపెట్టాడు. పదినిమిషాల తరువాత తన టేబుల్ దగ్గరకు వెళ్ళాడు. డ్రాయర్ తెరిచి అందులోంచి పాకిస్ధాన్ మ్యాప్ బయటకు తీశాడు. మ్యాప్ ను విశాలంగా టేబుల్ మీద పరిచి జాగ్రత్తగా చూశాడు. ఎక్కడెక్కడ దాక్కునే అవకాశం ఉందో ఎర్రపెన్సిల్ తో మార్క్ చేశాడు. తరువాత టెలిఫోన్ తీసి ఒక నెంబర్ కు కాల్ చేశాడు. అతను కాల్ చేసింది డిపార్ట్ మెంట్ ఇన్ ఫార్మర్ కు.

“నేను ఇప్పుడు రెండు ఫోటోలు పంపిస్తాను. వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనుక్కో. అలాగే ఆ ఫోటోలను నీ వాళ్ళందరికి పంపించు. సాధ్యమైనంత తొందరగా ఫోటోలో ఉన్నవాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకో. ఇది చాల అర్జంట్ పని. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చెయ్యటానికి వీలులేదు. అర్ధమైందా”అన్నాడు అబ్బాస్.

“తప్పకుండ క్యాప్టన్ నా వాళ్ళకు ఇప్పుడే ఫోటోలు పంపిస్తాను”అన్నాడు అతను.

అబ్బాస్ లైన్ కట్ చేసి ఇంకో నెంబర్ కాల్ చేశాడు. అతనికి కూడా అదే విషయం చెప్పాడు. ఇలా దాదాపు యాభైమందికి కాల్ చేశాడు. అందరికి సెల్ ద్వార ఫోటోలు పంపించాడు. తనకు అందుబాటులో ఉన్న నెట్ వర్క్ ను అంతా యాక్టివేట్ చేశాడు. వాళ్ళంతా కలిసి దాదాపు అయిదువందలమంది ఉంటారు. వాళ్ళంతా దేశంనాలుగుమూలల వ్యాపించిఉన్నారు. అందరుకలిసి దేశం మొత్తాని జెల్లెడ పడతారు. ఈ రోజు కాకపోయిన రేపయిన నసీర్ ఆచూకి తప్పకుండ తెలుస్తుంది. ఒకసారి అతని ఆచూకి తెలిస్తే అతన్ని పట్టుకోవటం అబ్బాస్ కు పెద్ద కష్టం కాదు.

ఈ తతంగం అంతా పూర్తయిన తరువాత అబ్బాస్ మిత్రవిందకు కాల్ చేశాడు. అప్పుడు టైం సరిగ్గా ఒంట గంట కావస్తోంది. అది లంచ్ టైమ్. మిత్రవింద ఫ్రీగా ఉంటుంది.

“చెప్పు అబ్బాస్”అంది ఉత్సాహంగా మిత్రవింద.

అబ్బాస్ రోజుకు ఒకసారి అయిన ఆమెకు కాల్ చేస్తాడు. అతను కాల్ చేసిన ప్రతిసారి ఉత్సాహంతో ఊగిపోతుంది ఆమె. తమ పెళ్ళి గురించి ఏదైన చెప్తాడేమో అని ఆమె ఆశ.

“నేను చెప్పేది జాగ్రర్తగా విను. మద్యలో అడ్డుప్రశ్నలు వెయ్యకు. ఈ రోజు సాయంత్రం సరిగ్గా ఆరుగంటలకు కారులో నువ్వు జిన్నా స్క్వేర్ దగ్గరకు చేరుకో. దాని ఎదురుగా ఒక పెద్ద మాల్ కనిపిస్తుంది. అందులో ఉన్న రిఫ్రెష్ రూమ్ లోకి వెళ్ళి బురఖా వేసుకో. ఆ డ్రస్సుతో మాల్ లోపలికి వెళ్ళు. కొంచం దూరం వెళ్ళిన తరువాత కుడివైపు ఇంకో ఎంట్రన్స్ కనిపిస్తుంది. అందులోంచి వస్తే వెనుకవైపు రోడ్డుకు చేరుకుంటావు. రోడ్డు కు అవతలవైపు నీ కోసం కాచుకుని ఉంటాను. నా పక్కన కారు ఉంటుంది. నువ్వు తేలికగా గుర్తుపట్టవచ్చు”అన్నాడు అబ్బాస్.

ఎందుకు ఎక్కడికి వెళుతున్నాం? అడిగింది మిత్రవింద.

“అంతా సస్పెన్స్. అక్కడికి వచ్చిన తరువాత నీకే తెలుస్తుంది.”

“కనీసం బురఖా ఎందుకు వేసుకోవాలో అయిన చెప్పు”

“అది కూడా సస్పెన్స్. ఇప్పుడు కాదు. ఇక్కడికి వచ్చిన తరువాత చెప్తాను. అంతవరకు ఏం మాట్లాడకు”అన్నాడు అబ్బాస్.

ఇంకేం మాట్లాడలేదు మిత్రవింద. అలాగే అని తలూపింది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్