Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Ravi teja  is an  Ismart  girl

ఈ సంచికలో >> సినిమా >>

'సాహో'రే ప్రబాస్‌ మేనియా.!

Prabhas Mania.!

బాహుబలి' తర్వాత ప్రబాస్‌ నుండి వస్తున్న సినిమా కావడంతో, 'సాహో'పై వీర లెవల్లో అంచనాలున్న మాట వాస్తవమే. అయితే, నిన్న మొన్నటి వరకూ ప్రమోషన్స్‌లో కాస్త డల్‌ అనిపించిన 'సాహో' నెమ్మదిగా పుంజుకుంది. వరుస అప్‌డేట్స్‌ ఇస్తూ, ఊపు తెచ్చే ప్రయత్నం చేసింది ఆ క్రమంలో రొమాంటిక్‌ మోడ్‌లో ఉన్న ప్రబాస్‌, శ్రద్ధాకపూర్‌ స్టిల్స్‌ రిలీజ్‌ చేసింది. ఈ స్టిల్స్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రధారులైన నీల్‌ నితిన్‌ ముఖేష్‌, అరుణ్‌ విజయ్‌ లుక్స్‌ కూడా రివీల్‌ చేసింది. వీటికీ మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ముఖ్యమైన విషయమేంటంటే, 'సాహో' కోసం దేశ వ్యాప్తంగా నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్‌ పోస్ట్‌ పోన్‌ చేసుకున్నాయి. తమ సినిమాకి లైన్‌ క్లియర్‌ చేసినందుకు సోషల్‌ మీడియా వేదికగా ప్రబాస్‌ అండ్‌ టీమ్‌ వారికి కృతజ్ఞతలు తెలిపింది.

ఇక ఈ నెల 20న హైద్రాబాద్‌లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. అలాగే 27న దుబాయ్‌లో ప్లాన్‌ చేసిన ఈవెంట్‌కి బాలీవుడ్‌ నుండి ప్రముఖ నటీనటులకు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అమెరికాలో కూడా ఓ బిగ్‌ ఈవెంట్‌ ప్లానింగ్‌లో ఉందట 'సాహో' టీమ్‌. ఇదిలా ఉంటే, త్వరలోనే 'సాహో' ట్రైలర్‌ రానుందనీ తెలుస్తోంది. వరుసగా వస్తున్న 'సాహో' సర్‌ప్రైజ్‌లు ఇంకా ఇంకా అభిమానుల్ని ఉర్రూతలూగించనున్నాయట. ఇంతవరకూ ప్రమోషన్స్‌ విషయంలో ప్రబాస్‌, అభిమానుల నుండి చాలా ఒత్తిడి ఫీలయ్యాడు. ఆ ఒత్తిడి నుండి ఇప్పుడు కాస్త రిలీఫ్‌ అయ్యాడనే అనుకోవాలి. అయితే, అసలు సిసలు రిలాక్స్‌డేషన్‌ 'సాహో' రిలీజయ్యాక కానీ దొరకదు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రబాస్‌కి.

మరిన్ని సినిమా కబుర్లు
sampoo...