Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
kerala viharayatralu

ఈ సంచికలో >> శీర్షికలు >>

'ఆమె' అబల కాదు సబల.! - ..

aame abala kadu  sabala

ఒకప్పుడు ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ ప్రకటనల్లో కనిపించడానికి హీరోయిన్లు పోటీ పడేవారు. అలా ప్రకటనల్లో తళుక్కున మెరిస్తే, సినిమాల్లో అవకాశాలు వస్తాయన్నది చాలా మంది ముద్దుగుమ్మల నమ్మకం. అలా వచ్చి హీరోయిన్స్‌గా సత్తా చాటుతున్న ముద్దుగుమ్మలెందరో. కానీ, ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ ప్రకటనల్లో కనిపించడానికి ముద్దుగుమ్మలు ఆసక్తి చూపడం లేదు. ఎందుకో తెలుసా.? రంగు అనేది సహజసిద్ధమైనది అని, ఆ పేరు చెప్పి వర్ణ వివక్షకు అవకాశం కల్పించకూడదని. ఈ మధ్య ఈ తరహా వివాదాల్లో కొందరు ముద్దుగుమ్మలు అడ్డంగా ఇరుక్కున్న సంఘటనలు కూడా చూశాం. సరే ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ ప్రకటనల సంగతి కాసేపు పక్కన పెడితే, ఈ మధ్య సమీరారెడ్డి హాట్‌ హాట్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాని హీటెక్కించేసిన సంగతి తెలిసిందే. ఆమె ఎందుకలా చేసిందీ.. అంటే, లావుగా ఉన్నావని ఆమెను విమర్శించడమే అందుకు కారణం. నేనింతే లావుగానే ఉంటాను.. అంటూ తనపై వచ్చిన విమర్శలకు ఫోటోలతో కౌంటర్‌ ఇచ్చింది సమీరారెడ్డి.

మొటిమలుంటే హీరోయిన్స్‌గా పనికి రారా.? నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి మొటిమలతోనే నటించింది. మేకప్‌ లేకుండా, తన మొటిమలే హైలైట్‌ అయ్యేలా కనిపించి, శభాష్‌ అనిపించుకుంది. లావుగా ఉంటే, సినిమాల్లో అవకాశాలు రావా.? బొద్దుగుమ్మ నిత్యామీనన్‌ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మంచి నటిగా చెలామనీ అవుతోంది. ఇప్పుడు బాలీవుడ్‌నీ ఇంప్రెస్‌ చేస్తోంది. ఇప్పుడీ టాపిక్స్‌ని వరుసెట్టి ఎందుకు చర్చించుకుంటున్నామో అర్ధమయ్యేలా తెలుసుకుందాం పదండి. రంగు, బరువు, మొటిమలు.. ఇలా అందానికి సంబంధించిన అంశాలివి. ఇలాంటి వాటి కారణంగా చాలా మంది మహిళలు మానసికంగా ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. తద్వారా అనారోగ్యం పాలవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు సెలబ్రిటీలు ముందుకొచ్చి స్త్రీలలో పెరుగుతున్న ఈ తరహా మానసిక సమస్యలపై గళం విప్పుతూ, తమ వంతుగా అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలో మహిళా క్రికెటర్‌ సారా టేలర్‌ నగ్నంగా సోషల్‌ మీడియాలో ఓ ఫోటో షేర్‌ చేసింది. అందులో ఆమె ఓ సంస్థతో కలిసి మహిళల మానసిక, శారీరక సమస్యలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించింది. గతంలో మన మహిళా క్రికెటర్‌, తెలుగమ్మాయి మిథాలీ రాజ్‌ వస్త్ర ధారణపై ట్రోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. దానిని ఆమె లెక్క చేయలేదు సరికదా. ఫిట్‌నెస్‌ పట్ల మహిళలకు అవగాహన ఎంత అవసరమో చూపుతూ, డాషింగ్‌ ఫోటోస్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇలా మనం పైన చెప్పుకున్న సెలబ్రిటీలు చాలా మంది మహిళలకు తమ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే క్రమంలో పలు అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. అయితే, వారు ఎంచుకున్న మార్గాలు వేరేమో కానీ, చెప్పాలనుకున్న సిద్ధాంతం మాత్రం ఒక్కటే. ఆడది అంటే అబల కాదు, సబల అని నిరూపించడమే వారి ఉద్దేశ్యం. మహిళల్లో మానసిక ధృఢత్వం పెంపొందించడమే వారి లక్ష్యం. అవును, మానసిక ధృఢత్వం స్త్రీకి మరింత శక్తినిస్తుంది మరి. ఇది నిజంగా నిజం అంతే.

మరిన్ని శీర్షికలు
Prawns Fried Rice!