Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
swami vivekananda

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (నవంబర్ 29 - డిసెంబర్ 05) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున ధనము విషయంలో లాభంను పొందుటకు అవకాశం కలదు. నూతన పనుల కోసం ప్రయత్నం చేస్తారు. శని, ఆది వారాల్లో చేపట్టిన పనులకు సంబంధించిన విషయాల్లో లాభంను పొందుటకు అవకాశం కలదు. నలుగురిలో గుర్తింపును కోరుకునే అవకాశం ఉంది. స్త్రీ /పురుష సౌఖ్యంను పొందుటకు అవకాశం కలదు. సోమ, మంగళవారాల్లో స్వల్పంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులను పొందే సూచనలు కలవు. తలపెట్టిన పనుల పరంగా ఇబ్బందులు తప్పకపోవచ్చును. మోకాళ్ళనొప్పుల మూలాన సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నందున జాగ్రత్తలు పాటించ సూచన. బుధ, గురువారాల్లో కుటుంబంలో నూతన నిర్ణయాలను తీసుకొనే ముందు నిదానంగా వ్యవహరించుట మంచిది. అనుకోకుండా స్వల్ప విరోధములు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. వారం మొత్తం మీద తలపెట్టిన పనులలో గతంలో కన్నా అధికమైన శ్రమను కలిగి ఉంటారు. వ్యతిరేక వర్గం నుంచి వచ్చే ఇబ్బందులను తెలివిగా పరిష్కరించే ప్రయత్నం చేయండి. ఇతరులకు సేవ చేయాలనే తలంపును కలిగి ఉంటారు. అధికారుల వలన పని భారంను పొందు అవకాశం కలదు. కుటుంబ సభ్యులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. 

వృషభ రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున స్వల్ప అనారోగ్యం వలన శారీరక బాధను పొందుటకు అవకాశం ఉంది. పనులలో ఆటంకాలు కలిగే సూచనలున్నాయి. శని, ఆదివారాల్లో కుటుంబ వ్యవహారాలలో మంచిపేరును తెచ్చుకొనే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో సౌఖ్యంను పొందుతారు. నచ్చిన పనులకు సమయాన్ని కేటాయిస్తారు. ఇతరులకు సేవచేయాలనే తలంపును కలిగి ఉంటారు. మీ వలన తోటివారు సహాయం పొందుతారు. సోమ, మంగళ వారాల్లో తలపెట్టిన పనుల వలన లాభంను పొందుతారు. అందరిలోను ప్రారంభించిన పనుల వలన మంచిపేరును తెచ్చుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలిగే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. బుధ, గురు వారాల్లో అనారోగ్యపరమైన సమస్యలు కలుగుటకు అవకాశం కలదు. నూతన పనులను ఆరంభించక పోవడమే మంచిది. వారం మొత్తంమీద పనులలో ఉత్సాహంను కోల్పోయే అవకాశం కలదు కావున పనులయందు శ్రద్ధను చూపుట మేలు చేస్తుంది. తలపెట్టిన పనులలో ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయుట వలన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండవు. మంచి ఆహారాన్ని తీసుకొనే ప్రయత్నం చేయండి. చర్చలలో పాల్గొనే అవకాశం కలదు. విందులు, విననోదముల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు.

మిథున రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున బంధుమిత్రులతో మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది. నిదానంగా వ్యవహరించుట మంచిది. శని, ఆదివారాల్లో ఒక వార్త వినుట వలన బాధకు గురయ్యే అవకాశం కలదు. మానసికంగా దృడంగా ఉండుటకు ప్రయత్నం చేయండి. తలపెట్టిన పనులలో ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు వద్దు. అనుకోని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది. వాటిని తగించుకొనే ప్రయత్నం చేయండి. సోమ, మంగళ వారాల్లో పెద్దలతో కలిసి పనిచేసే ఆస్కారం కలదు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. నూతన అవకాశాలు కలుగుటకు అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో ధనాదాయం బాగుంటుంది. మిత్రులను కలుస్తారు. వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. వారం మొత్తం మీద తలపెట్టిన పనులలో ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు. ధనధాన్యసం వృద్దిని కలిగి ఉండే అవకాశం ఉంది. ప్రయత్నకార్యముల యందు విజయంను పొందుటకు అవకాశం ఉంది. శ్రమను కలిగి ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించుట మంచిది. ఉద్యోగంలో నిదానంగా వ్యవహరించుట మంచిది.

కర్కాటక రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున ఇష్టమైన వారిని కలుస్తారు. వారితో కలిసి సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. నచ్చిన విధంగా వ్యవహరించుట మూలాన ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులలో ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది, నూతన పనులను వాయిదా వేయుట మంచిది. సోమ, మంగళవారాల్లో అశుభవార్తను వినే అవకాశం ఉంది. తలపెట్టిన పనులలో శ్రమను కలిగి ఉండే అవకాశం ఉంది. బాగా ఆలోచించి ముందుకు వెళ్ళుట మంచిది. బుధ, గురువారాల్లో కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాల కోసం చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి. సమయాన్ని నచ్చిన విధంగా గడిపే అవకాశం ఉంది. వారం మొత్తంమీద బంధుమిత్రులతో కలిసి చేసిన పనులలో అనుకోని ఖర్చులు పొందుటకు అవకాశం ఉంది. మాట పట్టింపులకు పోకండి నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. సౌఖ్యంను కోరుకొనే అవకాశం ఉంది. మాత్రుసంభందమైన వారితో సమయాన్ని గడుపుతారు. ఖర్చులు తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. 

సింహ రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున మాటలను పొదుపుగా వాడుట, వ్యాపారపరంగా నూతన ప్రయత్నాలను చేయకపోవటం ఉత్తమం. శని, ఆది వారాలలో ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు. నచ్చిన పనుల కోసం సమయాన్ని కేటాయించే అవకాశం కలదు. సోమ, మంగళ వారాలలో బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది. కావున నిదానంగా వ్యవహరించండి. ప్రయత్న కార్యములు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. బుధ, గురు వారాలలో ఆరోగ్యపరమైన విషయాలలో తగిన జాగ్రత్తలు చేపట్టండి. అశుభ వార్తలు వినే అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు చేయకపోవటం మేలు చేస్తుంది. వారం మొత్తంమీద ప్రయాణాలలో ఆటంకాలు ఎదుర్కొంటారు. తలపెట్టిన పనులు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. కుటుంబంలో సర్దుబాటు విధానం అవలంబించుట మంచిది. స్నేహితులతో జాగ్రత్తగా వ్యవహరించ సూచన. వివాదాలకు దూరంగా ఉండండి. అధికారుల వలన ఇబ్బందులు తప్పక పోవచ్చును. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. వ్యతిరేక వర్గం వలన కలుగు ఇబ్బందులను తెలివిగా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి.
 

కన్యా రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున భోజన సౌఖ్యాన్ని కలిగి ఉంటారు. మృష్టాన్న భోజన ప్రాప్తి ఉంటుంది. సమయాన్ని సంతోషంగా గడుపుతారు. శని, ఆది వారాలలో ధనమునకు సంబంధించిన విషయాలలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవటం ఉత్తమం. సమయానికి భోజన చేయటం వలన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. సోమ, మంగళ వారాలలో నచ్చిన పనుల కోసం సమయాన్ని కేటాయిస్తారు. ఇష్టమైన వారి ఆలోచనలు పాటించే అవకాశం ఉంది. ఆర్ధికపరంగా మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. బుధ, గురు వారాలలో పనులయందు అధిక శ్రద్ధను కనపరుచుట మంచిది. తలపెట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు కలుగుతాయి. వారం మొత్తం మీద సంతానం వలన సౌఖ్యమును పొందుతారు. వారి వలన కీర్తిని పొందే అవకాశం కలదు. బంధుమిత్రులతో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. ప్రయాణాలయందు తగిన జాగ్రత్తలు పాటించుట శ్రేయస్కరం. నూతన పరిచయాలు లాభిస్తాయి. వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. ఉద్యోగ స్థానంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మంచి ఆలోచనలు చేయుట వలన మేలు కలుగుతుంది.

తులా రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున ఆలోచనలను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. అనుకోని ఖర్చులు కలుగుతాయి. వాటి వలన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. శని, ఆది వారాలలో తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసే అవకాశం కలదు. ఆర్ధికపరమైన విషయాలలో బాగుంటుంది. ఉత్సాహమును కలిగి ఉంటారు. సోమ, మంగళ వారాలలో అనుకోని ఖర్చులు కలుగుతాయి. మాటలను ఆచితూచి వాడుట మంచిది. అనారోగ్య సమస్యలు తప్పక పోవచ్చును. సమయానికి భోజనం చేయుట ఉత్తమం. బుధ, గురువారాలో ఇంతకూ ముందు నుంచి ఆశిస్తున్న విషయాలలో ఫలితాలు అనుకూలంగా వస్తాయి. మనోధైర్యమును కలిగి ఉండి ముందుకు వెళతారు. ధనలాభం ఉంటుంది. వారం మొత్తంమీద చేపట్టిన పనులలో ధన నష్టమును పొందుతారు. నూతన ప్రయత్నాలు చేయకపోవడం. తప్పక మేలు చేస్తుంది. సంచారం చేయటం వలన ఆయాసం కలుగుతుంది. ఇబ్బందులు తప్పక పోవచ్చును. చంచల మనస్సును కలిగి ఉండటం చేత సమస్యలను పొందుతారు. గృహ లాభమును పొందే అవకాశం కలదు. సౌఖ్యమునకు ప్రాధాన్యతనిస్తారు.


వృశ్చిక రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున బంధువులతో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. బంధు ప్రీతిని కలిగి ఉంటారు. ఆరోగ్యానికి ప్రాధాన్యతను ఇవ్వండి. శని, ఆది వారాలలో అధికమైన ఆలోచనలను కలిగి ఉంటారు. వాటిని అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయండి. ఆర్ధికపరమైన విషయాలలో ఇబ్బందులు తప్పకపోవచ్చును. సోమ, మంగళ వారాలలో ఆరోగ్య పరంగా బాగుంటుంది. ధన లాభమును పొందుతారు. ఉత్సాహమును కలిగి ఉంది నూతన పనులను చేపడతారు. బుధ, గురువారాలలో సమయానికి భోజనం చేయుట మంచిది. పనులు ఆశించిన విధంగా ముందుకు వెళ్లక పోవచ్చును. వారం మొత్తంమీద సమయానికి భోజనం చేయటం వలన ఆరోగ్యరీత్యా మేలు కలుగుతుంది. అందరికీ అనుకూలంగా వ్యవహరించే ప్రయత్నం చేయండి. బంధుమిత్రులతో మాట పట్టింపులకు పోకపోవుట మంచిది. ప్రయత్న కార్యములపైన శ్రద్ధను చూపుట వలన మేలు కలుగుతుంది. భోజన విషయంలో అశ్రద్ధ చేయకండి. చేపట్టిన పనులలో ఇబ్బందులు తప్పకపోవచ్చును.

ధనస్సు రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున తలపెట్టిన పనులలో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ఇష్టమైన పనులను చేపడుతారు. ఆర్ధికపరమైన విషయాలలో బాగుంటుంది. శని, ఆది వారాలలో బంధువులతో సమయాన్ని గడుపుతారు. భోజన సౌఖ్యమును పొందుతారు. ఆర్ధిక పరైన విషయాలలో బాగుంటుంది. సోమ, మంగళ వారాలలో ఆలోచనాపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికమైన ఆలోచనలకు అదుపులో ఉంచటం వలన సమస్యలకు అడ్డుకట్ట వేసే అవకాశం కలదు. అనుకోని ఖర్చులు కలుగుతాయి. బుధ, గురు వారాలలో ఉద్యోగములో బాగానే ఉంటుంది. అధికారులకు అనుగుణంగా నడుచుకోండి. వారం మొత్తంమీద ప్రయాణాల వలన ఇబ్బందులు తప్పకపోవచ్చును. ధన వ్యయమును పొందుతారు. మీ యొక్క ఆప్తుల అనారోగ్య విషయం మిమ్ములను ఒకింత బాధకు గురిచేసే అవకాశాలు కలవు. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు పాటించుట శ్రేయస్కరం. అల్పాహారం తీసుకునే అవకాశాలున్నాయి. బంధువులతో చర్చలు కొనసాగించే సూచనలున్నాయి. కుటుంబ సభ్యులకు సమయాన్ని కేటాయిస్తారు.

మకర రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున కుటుంబ సభ్యులతో నిదానంగా వ్యవహరించక పోయినచో మనస్పర్ధలు కలుగే సూచనలున్నాయి. శని, ఆది వారాలలో చేసే ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయ పరమైన విషయాలలో ముందుకు వెళ్ళు సూచనలు ఉన్నాయి. సోమ, మంగళ వారాలలో బంధువుల గృహములో సమయాన్ని గడుపుతారు. భోజన సౌఖ్యమును కలిగి ఉంటారు. ధనం విషయంలో లాభాన్ని పొందుతారు. బుధ, గురు వారాలలో అకారణమైన కోపాన్ని కలిగి ఉండే అవకాశాలున్నాయి. ఆర్ధికపరమైన ఇబ్బందులు కలుగుతాయి. జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. అనుకోని ఖర్చులు కలుగుతాయి. వారం మొత్తంమీద శుభ కార్యములలో పాల్గొనే అవకాశం కలదు. భోజనానికి ప్రాముఖ్యతనిస్తారు. అధికారులకు అనుకూలమైన పనులను చేపట్టు అవకాశం ఉంది. స్థాన చలనం కలుగుటకు అవకాశాలు ఉన్నాయి. అయిష్టమైన ప్రదేశాలలో సమయాన్ని కేటాయించాల్సి రావచ్చు. కుటుంబంలో చిక్కులు కలుగుటకు అవకాశాలున్నాయి. అకారణంగా కలిగే కలహాలకు దూరంగా ఉండటం వలన మేలు కలుగుతుంది.


కుంభ రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున అజీర్తి వలన ఇబ్బందులు తప్పకపోవచ్చును. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకొనుట ఉత్తమం. శని, ఆది వారాలలో కుటుంబంలో తీసుకునే నిర్ణయాల పట్ల సరైన అవగాహన కలిగి ఉండుట మంచిది. అకారణంగా కలుగుటకు అవకాశం ఉంది. సోమ, మంగళ వారాలలో బంధువుల యెడల ప్రీతిని కలిగి ఉంటారు. ఇష్టమైన పనుల పట్ల సరైన ఆలోచనతో ముందుకు వెళితే విజయం మిమ్ములను వరిస్తుంది. బుధ, గురు వారాలలో భోజన సౌఖ్యమును కలిగి ఉంటారు. ఇష్టమైన కార్యక్రమాలను ప్రారంభించి దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వారం మొత్తంమీద రాజకీయ వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించండి. అధికారులకు అనుగుణంగా నడుచుకునుట వలన మేలు కలుగుతుంది. ధనమునకు సంబంధించిన విషయాలలో నూతన అవకాశాలు కలుగుతాయి. సాధ్యమైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేయడం వలన మేలు కలుగుతుంది. తలపెట్టిన పనులలో నిరుత్సాహం పొందుతారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం వలన కొంత ఊరట లభిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధిని పొందుటకు చేయు ప్రయత్నాలు ముందుకు సాగుతాయి.

మీన రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున ప్రారంభించిన పనుల వలన ఆర్ధికపరమైన విషయాలలో లాభమును పొందుతారు. శని, ఆది వారాలలో పని ఒత్తిడిని కలిగి ఉంటారు. ఆరోగ్యపరమైన విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకొనుట మంచిది. సోమ, మంగళ వారాలలో కుటుంబ సభ్యులకు సమయాన్ని గడుపుతారు. అనుకోని ఖర్చులు పొందుతారు. ఉద్యోగపరమైన ఇబ్బందులు తప్పకపోవచ్చును. సర్దుబాటు ధోరణి వలన మేలు కలుగుతుంది. బుధ, గురువారాలలో పెద్దల సూచనలు పాటించుట చేత తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో సమయాన్ని గడిపే అవకాశం ఉంది. వారం మొత్తంమీద అనుకోని ఖర్చులను పొందుతారు. ధన నష్టం కలుగుట చేత మనో విచారం పొందుతారు. కుటుంబంలో చిన్న పాటి విభేదాలు తలెత్తుతాయి. ప్రయాణాల వలన అలిసి పోతారు. జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుట వలన మేలు కలుగుతుంది. ఉద్యోగ స్థానంలో ఇబ్బందులు తప్పవు. అధికారులకు అనుగుణంగా వ్యవహరించటం ఉత్తమం. అనుకోని ఖర్చులు కలుగుటకు అవకాశాలున్నాయి. నూతన ప్రయత్నాలకు దూరంగా ఉండడం అన్ని విధాలా శ్రేయస్కరం.


శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
tensions