Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
laajik ku andinadalla manchide

ఈ సంచికలో >> శీర్షికలు >>

మూర్ఖులు - బన్ను

selfish

"తివిరి యిసుకున తైలంబు దీయవచ్చు
తవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖుని మనసు రంజింప రాదు"

మూర్ఖులతో వాదించి మనం గెలవ లేము. మనం వాళ్ళ మంచికి చెప్పినా వాళ్ళ తలకి ఎక్కదు. 'మార్క్ ట్వైన్' ఇలా చెప్పారు: "మూర్ఖుల తో వాదానికి దిగకండి... వాళ్ల స్థాయికి మిమ్మల్ని లాగేసి, వాళ్ళ అనుభవం తో ఓడించేస్తారు" మూర్ఖత్వం ఓటమికి దారి తీస్తుంది. ఆలోచించి ఇష్టం తో చేసే పని, విజయానికి దారి తీస్తుంది.

మూర్ఖుల గురించి మనం పట్టించుకోపోవటమే మేలు! అలా అని మనం మేధావులం అనుకోకూడదు.

మనం మనుషులం. మనలో మంచీ, చెడూ రెండూ వుంటాయి. వీలైనంత వరకు మనకు మనం మంచి త్రోవలో వెళ్ళటానికి ప్రయత్నిద్దాం. మన మనసుని 'చెడు' డామినేట్ చేస్తే మనం మూర్ఖులలా మారతాం! 'మంచి' డామినేట్ చేస్తే సంఘ సేవకులమై మనం హుందాగా వుంటాం!!

మనం బ్రతికినంత కాలం ఎవరికైనా 'హాని' చేయకుండా బ్రతికితే చాలు. 'మేలు' చేస్తే మరీ మంచిది. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు చూసి చెప్పొచ్చన్నారు పెద్దలు. ఎదుటివాడి మెంటాలిటీ కూడా ఒక్క రోజులో గమనించవచ్చు.

మూర్ఖంగా ఆలోచించటం మానేద్దాం. మంచిగా ఆలోచిద్దాం... సమాజానికి సేవ చేద్దాం!!

మరిన్ని శీర్షికలు
swami vivekananda