Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఆర్.డీ.ఎక్స్ లవ్ చిత్రసమీక్ష

rdx love movie review

చిత్రం: ఆర్‌డిఎక్స్‌ లవ్‌
నటీనటులు: పాయల్‌ రాజ్‌పుట్‌, తేజుస్‌ కంచర్ల, ఆదిత్య మీనన్‌, నరేష్‌, తులసి, చమ్మక్‌ చంద్ర, ఆమని, ముమైత్‌ ఖాన్‌, విద్యుల్లేఖ రామన్‌ తదితరులు
సంగీతం: రధన్‌
సినిమాటోగ్రఫీ: సి. రామ్‌ప్రసాద్‌
నిర్మాణం: హ్యాపీ మూవీస్‌, సికె సినిమాస్‌
దర్శకత్వం: శంకర్‌ భాను
నిర్మాత: సి. కళ్యాణ్‌
విడుదల తేదీ: 11 అక్టోబర్‌ 2019

క్లుప్తంగా చెప్పాలంటే..

ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ సాధించే క్రమంలో ఎవరూ ఊహించని విధంగా ఓ కార్యక్రమం చేపడుతుంది అలివేలు (పాయల్‌ రాజ్‌పుత్‌). సేఫ్‌ సెక్స్‌, కుటుంబ నియంత్రణ వంటి విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించి, తద్వారా మీడియా దృష్టిని ఆకర్షించి, ముఖ్యమంత్రిని కలవాలన్నది అలివేలు ఆలోచన. ఈ ప్రయాణంలో హీరో తేజుస్‌ కంచర్లను వారధిగా చేసుకుంటుందామె. అసలు ముఖ్యమంత్రిని కలవాలని అలివేలు ఎందుకు అనుకుంటుంది.? ముఖ్యమంత్రిని అలివేలు కలవగలిగిందా.? కలిశాక ఆమె ఏం చేసింది.? అన్నది తెరపై చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే..

పాయల్‌ రాజ్‌పుత్‌ అనగానే మనకి హాట్‌ అప్పీల్‌ ముందు గుర్తుకొస్తుంది. కేవలం సెక్సప్పీల్‌తో మాత్రమే కాదు, నటనతోనూ హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందింది పాయల్‌ రాజ్‌పుత్‌. ఆమెలోని నటి మరోమారు ఈ సినిమాలో నట విఫశ్వరూపం చూపించేసింది. హాట్‌ కంటెంట్‌ విషయంలో అస్సలేమాత్రం రాజీ పడలేదు పాయల్‌. మేగ్జిమమ్‌ హాట్‌ అప్పీల్‌ పండించేసింది. ఓ వైపు హాట్‌ కంటెంట్‌, ఇంకో వైపు నటనతో పాయల్‌ రాజ్‌పుత్‌ తాను చెయ్యగలిగిందంతా చేసింది.

తేజస్‌ కంచర్ల పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. నెగెటివ్‌ రోల్‌లో ఆదిత్య మీనన్‌ బాగా చేశాడు. ముఖ్యమంత్రి పాత్రలో బాపినీడు ఓకే. సీనియర్‌ నటుడు నరేష్‌ తన అనుభవాన్ని రంగరించారు. మిగతా పాత్రధారులంతా తమ తమ పాత్ర పరిధి మేర ఫర్వాలేదన్పిస్తారు.

కథ పరంగా ఆలోచిస్తే ఇంట్రెస్టింగ్‌గానే అన్పిస్తుంది. నెరేషన్‌ విషయంలోనే దర్శకుడు తడబడ్డాడు. కథనం ఎక్కడా ఆకట్టుకునేలా అన్పించలేదు. డైలాగ్స్‌ ఓకే. కొన్ని డైలాగ్స్‌కి విజిల్స్‌ పడితే, మరికొన్ని చప్పగా సాగాయి. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. మ్యూజిక్‌ ఓకే. నిర్మాణపు విలువలు బాగానే వున్నాయి. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఓకే. ఎడిటింగ్‌ చాలా వీక్‌గా వుంది. చాలా వరకు కత్తెరలు వేసే అవకాశాల్ని వృధా చేసుకున్నారు.

ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఫిమేల్‌ సెంట్రిక్‌ మూవీ. మెయిన్‌ పాయింట్‌ వేరు, దాని చుట్టూ అల్లుకున్న అనవసరపు సన్నివేశాలు వేరు కావడంతో, కథలోకి వెళ్ళడానికే సమయం ఎక్కువ పట్టేసింది. పాయల్‌ని ఎలాగోలా గ్లామరస్‌గా వాడేసుకోవాలి అన్నట్లుగానే సేఫ్‌ సెక్స్‌ అంశాన్ని ఇందులో చొప్పించారా.? అన్న అనుమానం కలగక మానదు చూసే ప్రేక్షకులకి. హాట్‌ హాట్‌గా పాయల్‌ అలా కన్పిస్తోంటే, కుర్రకారుకి మాత్రం ఓ రేంజ్‌లో కిర్రెక్కుతుంది. అయితే, ఆ ఒక్కటే థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పిస్తుందనుకోవడం పొరపాటు. ఆర్‌ఎక్స్‌100 సినిమాలో అన్ని ఎమోషన్స్‌ బాగా పండాయి. ఇక్కడ ఎమోషన్స్‌ నీరుగారిపోయాయి. ఓవరాల్‌గా పాయల్‌ వరకూ మాత్రమే.. అన్నట్లు తెరకెక్కింది ఈ సినిమా. మంచి ఛాన్స్‌ని దర్శకుడు మిస్‌ చేసుకున్నట్లయ్యింది.

అంకెల్లో చెప్పాలంటే..
2/5

ఒక్క మాటలో చెప్పాలంటే
ఆర్‌డిఎక్స్‌.. పాయల్‌ గ్లామర్‌ బాంబ్‌ పేలిందిగానీ..!

మరిన్ని సినిమా కబుర్లు
churaka