Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
naa jnaapakaallomchi

ఈ సంచికలో >> శీర్షికలు >>

దక్షిణ కైలాసం - లక్ష్మీ పద్మజ దుగ్గరాజు

dakshina kailasam

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని కర్నూల్ జిల్లాలోని ప్రసిద్ద శైవ క్షేత్రం శ్రీశైలం . జ్యోతిర్లింగాలలో ఇది రెండవది . ఇక్ష్వాకులు , పల్లవులు , విష్ణు కుండినులు , చాళుక్యులు , కాకతీయులు , రెడ్డి రాజులు, విజయనగర రాజులు ,ఛత్రపతి శివాజీ వంటి ఎందరో సేవలు చేసిన మహా పుణ్య క్షేత్రం ఈ  శ్రీశైలం . 4 వైపులా 4 ద్వారములు , 4 విఅపులా 4 ఎత్తైన గోపురములతో అభేద్యమైన కట్టడం శ్రీశైలం . ఇక్కడ అమ్మవారు భ్రమరాంబిక దేవి . శ్రీశైల క్షేత్రం ఒక భాస్కర క్షేత్రం అని గోకర్ణ పురాణంలో ప్రస్తుతించడం జరిగినది . భ్రమరాంబ దేవి అష్టా దశ శక్తి పీఠాలలో ఒకటి .

తమిళ , తెలుగు , కన్నడ  భాషల్లో శ్రీశైల క్షేత్ర చరిత్ర ప్రస్తావన విస్తారంగా అగుపిస్తుంది . శ్రీశైలానికి శ్రీ పర్వతం , శ్రీగిరి , సిరిగిరి , శ్రీశైలము అని మొదలైన పేర్లు వున్నాయి .శ్రీ అంటే సంపద శైలం అంటే పర్వతం అని అర్ధం కనుక శ్రీశైలం అంటే సంపద్వంతమైన పర్వతం అని అర్ధం చెప్పబడినది . శ్రీశైలం ని శ్రీ కైలాసం అని దక్షిణ కైలాసం అని కూడా విశ్వసిస్తారు . క్రీ శ 1313 లోని ఒక శాసనం ప్రకారం పార్వతీ పరమేశ్వరులు ఈ పర్వతం పై నివసించారనే విశ్వాసం వున్నట్టు ప్రస్తావించడమైనది .

పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ విశ్వాన్ని పరిపాలించాడు . అతడు చాలా కాలం గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసాడు . అతడి తపస్సుకి మెచ్చి బ్రహ్మ అతడు కోరిన 2 వరాలు ఇచ్చాడు . అవేమనగా ద్విపదాలచే మరియు చతుష్పదాలచే తనకి మరణం లేకపోవడం  ( అనగా మనిషి చే గానీ జంతువూ చేతకానీ మరణం లేకపోవడం ) . ఈ వరం గురించి తెలుసుకున్న దేవతలు భయపడి ఆదిశక్తిని ప్రార్ధించారు . అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసురుడు తన భక్తుడని , అతడు గాయత్రీ మంత్రం జపిస్తున్నంత వరకూ అతడిని ఎవరూ ఏమీ చేయలేరని చెప్తుంది .అటుపిమ్మట దేవతలు తమ గురువైన బృహస్పతిని అరుణాసురుడి వద్దకు పంపిస్తారు .

అరుణాసురుడు బృహస్పతి రాకకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు . దానికి బృహస్పతి మనిద్దరం ఒకే మంత్రాన్ని జపిస్తూ అమ్మా వారిని పూజిస్తున్నాం అందుకే వచ్చానని సెలవిస్తాడు . కావున ఈ రాకలో వింత ఏమీ లేదని చెప్తాడు . అపుడు అరుణాసురుడు దేవతలు జపించే మంత్రాన్ని నేనెందుకు జపించాలి అని గాయత్రీ మంత్రాన్ని జపించడం మానేస్తాడు . దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలను సృష్టిస్తుంది ఆ భ్రమరాలు అన్నీ అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి .

శ్రీశైలం లోని శివుడిని మల్లికార్జున స్వామి గా ,,, అమ్మా వారిని భ్రమరాంబ గా పూజిస్తారు . శ్రీశైలంలో  శ్రీ భ్రమరాంబ  మల్లికార్జున స్వామి వారల దేవస్థానం ప్రసిద్ధమైనది . ఇక్కడ మల్లెల తీర్ధం లో స్నానం చేస్తే పాపాలు నశించి ముక్తి పొందుతామని అచంచల విశ్వాసం. శ్రీ శైల దేవస్థానం అభేద్యమైన ప్రాకరములతో అద్భుతమైన శిల్ప సంపదతో నిర్మించడం జరిగింది . ప్రధాన గర్భాలయం మాత్రం ఎటువంటి శిల్ప సంపద లేకుండా ముష్కరుల బారి నుండీ రక్షించాబడడానికి కట్టినట్టు గా వుంటుంది .

భ్రమరాంబిక  అమ్మవారి సన్నిధి మాత్రం అద్భుతమైన శిల్ప కళతో , అందమైన శిలా తోరణాలతో కూడిన స్థాభాలతో నిర్మించబడింది . అమ్మవారి గుడి వెనుక భాగాన గోడకి చెవి ఆనించి వింటే ఝుమ్మనే భ్రమర నాదం వినిపిస్తుంది . శ్రీశైల క్షేత్రం లో చూడ దాగిన దేవాలయాలు మరియు ప్రదేశాలు ఎన్నో మరెన్నో . అందులో ముఖ్యంగా,,,

మనోహర గుండం ,, ఇందులో నీరు చాలా చాలా స్వచంగా వుంటుంది . ప్రధాన దేవాలయం వెనుక భాగాన పంచ పాండవులు 5 గుడులు నిర్మించి 5 శివ లింగాలను ప్రతిష్టించారు

నాగ్ ప్రతిమలు  వృద్ధ మల్లికరుజున లింగం – ఈ లింగం ముడతలు పడిన ముఖంలా వుంటుంది . అందువల్ల దీనిని వృద్ధ మల్లికార్జును అని భావిస్తారు .

అద్దాల మండపం  పాతాళ గంగ – ఇక్కడి త్రేతా యుగం నాటి ఆంజనేయ స్వామి గుడి ప్రసిద్ది  శ్రీశైల శిఖరం .. ఇక్కడ నంది వంటి రోటిలో నవ ధాన్యాలు వేస్తూ తిరగలి తిప్పుతూ అనంత దూరం లో వున్నా శ్రీశైల శిఖరాన్ని చూడ దానికి ప్రయత్నించాలి . అటువంటప్పుడు శిఖర దర్శనం కలిగేతే వారికి త్వరలోనే మరణం సంభవించి మోక్షం పొందుతారని విశ్వాసం . 

పాల ధార , పంచధార,,,,, అది శంకరాచార్యుల వారు తపస్సు చేసిన స్థలం , సౌందర్య లహరిని స్తుతించిన స్థలం  శ్రీశైలం కి 2,౩,4 కిలో మీటర్ల దూరం లో అనేక చూడ దాగిన ప్రదేశాలు వున్నాయి. శ్రీశైలానికి రవాణా సౌకర్యం కేవలం రోడ్డు రవాణా మాత్రమే . హైదరాబాద్ , విజయవాడ , గుంటూరు నగరాలకు చేరుకున్న తర్వాత కర్నూల్ వరకు రైలు రవాణా మార్గం ద్వారా వచ్చి అక్కడి  నుండీ రోడ్డు మార్గాన శ్రీశైలం చేరుకోవచ్చు . శ్రీశైల క్షేత్రం  నల్లమల అడవుల్లో ఎత్తైన ప్రాంతంలో వుండటం వల్ల ఘాట్ రోడ్ మీద ప్రయాణం కొంచెం ఉద్వేగ భారితంగానూ వుత్సాహంగానూ కుడా వుంటుంది.

సర్వేజనా సుఖినో భవంతు
లోకా సమస్తా సుఖినో భవంతు 

మరిన్ని శీర్షికలు
ratribadi