Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
smart life book review

ఈ సంచికలో >> శీర్షికలు >>

6-12-2019 నుండి12-12-2019 వరకు వారఫలాలు - - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

ఈవారం పూజాదికార్యక్రమాలకు సమయం ఇవ్వడం మంచిది. ముందుగా గతంలో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మంచిది. తలపెట్టిన పనులను మిత్రుల సహకారంతో పూర్తిచేస్తారు. సంతానం నుండి నూతన విషయాలు తెలుస్తాయి, వాటి విషయంలో బాగా ఆలోచించి ముందుకు వెళ్లడం సూచన. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. సాధ్యమైనంత మేర వివాదాలకు దూరంగా ఉండుట సూచన. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. చిన్న చిన్న విషయాల్లో మీదైనా ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం వలన లబ్దిని పొందుతారు.

 

 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

ఈవారం బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలను సైతం పట్టించుకోవడం వలన మేలుజరుగుతుంది. మిత్రులనుండి వచ్చే సూచనలు మీలో నూతన ఆలోచనలు రేకిత్తే అవకాశం ఉంది. సంతానం విషయాల్లో కీలకమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ వద్దు, తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చర్చలకు దూరంగా ఉండుట సూచన.

 

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈవారం ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందిన, ఊహించని ఖర్చులకు ఆస్కారం ఉంది. సంతానం విషయంలో ఒకింత జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. స్త్రీ పరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. చిన్న చిన్న విషయాలకే అందోళన చెందుతారు. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. శుభకార్యక్రమాలకు సమయాన్ని కేటాయించే అవకాశం కలదు.

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈవారం దైవపరమైన విషయాల్లో సమయం గడుపుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను ఒకింత ఆలస్యంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను మిత్రుల సహకారంతో పూర్తిచేస్తారు. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా ఉపయోగపడుతుంది. కుటుంబంలో కీలకమయిన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. సాధ్యమైనంత మేర వివాదాస్పద వ్యాఖ్యలు చేయకపోవడం మంచిది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. తండ్రితరుపు బంధువులను కలిసే అవకాశం కలదు.

 

 

 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

ఈవారం చిన్న చిన్న విషయాల్లో మరింతగా శ్రద్ద తీసుకోవడం మంచిది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకొండి, నూతన పరిచయాలకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. మీమాటతీరు వివాదాలకు అవకాశం ఇచ్చేలా ఉండకుండా చూసుకోవడం సూచన. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. బంధుమిత్రులతో విభేదాలు రాకూండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ వద్దు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం కలదు.

 

 

 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

ఈవారం పెద్దలను కలిసే అవకాశం ఉంది, వారినుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. గతంలో చేపట్టిన పనుల వలన నలుగురిలో మంచి గుర్తింపు లభిస్తుంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. చిన్న చిన్న విషయాల వలన ఒకింత ఆందోళనకు లేదా యిబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. మీ మాటతీరు వివాదాలకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది, కాస్త సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి, అధికారుల నుండి సహకారం లభిస్తుంది.

 

 

తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

ఈవారం మిత్రులతో కలిసి నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది, చిన్ననాటి మిత్రులను కలిసే అవకాశం ఉంది. ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు, పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. రావాల్సిన ధనం చేతికి అందిన , ఊహించిన ఖర్చులకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కోపం వలన నష్టపోయే అవకాశం ఉంది , అందరిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. శుభకార్యక్రమాలు జరుగుటకు అవకాశం ఉంది, విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన.


వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈవారం సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. వారి విషయంలో బాగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ప్రయాణాలు చేయుటకు అవకాశం. మిత్రులనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. అవసరం అయితేనే ప్రయాణం చేయండి, ఏమాత్రం అవకాశం ఉన్న ప్రయాణాలు వాయిదా వేసుకోవడం సూచన. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుటకు ఆస్కారం ఉంది. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట, అలాగే అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. వాహనాల విషయాల్లో తప్పిసారిగా జాగ్రత్తలు తీసుకోండి , మంచిది.

 

 

ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారం కుటుంబంలో పెద్దలను కలుస్తారు, వారినుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన లావాదేవీల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. రావాల్సిన ధనం విషయంలో ఒకింత కఠినంగా వ్యవహరించుట సూచన. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుతాయి. పెద్దలతో మీకున్న పరిచయం ఉపయోగపడుతుంది. ఆశించిన మేర వేగంగా ఫలితాలు రాకపోవచ్చును, కొంత వేచిచూసే ధోరణి తప్పక మేలుచేస్తుంది. నూతన భాగస్వామ్య ఒప్పందాల విషయంలో తొందరపాటు వద్దు. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం.

 

 

 

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈవారం ఆత్మీయుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. గతకొంతకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు ముందుకు సాగుతాయి. కుటుంబంలో కీలకమైన చర్చలకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. చిన్న చిన్న విషయాల్లో చూసిచుడనట్లు వెళ్లడం మంచిది. పెద్దలతో కాస్త సర్దుబాటు విధానం సూచన. విలువైన వస్తువులను బహుమతిగా పొందుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేక బదిలీకి అవకాశం ఉంది. సంతానం విషయంలో నూతన నిర్ణయాలకు ఆస్కారం కలదు, చర్చల్లో కాస్త నిదానంగా వ్యవహరించుట సూచన.
 

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. పెద్దల సూచనల మేర ముందుకు వెళ్లడం సూచన. ఉద్యోగంలో ఒకింత పనిఒత్తిడి ఉంటుంది, నలుగురిని కలుపుకొని వెళ్లడం మంచిది. స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది, బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. అధికారులతో పనిచేసే విషయంలో ముఖ్యంగా వారి సూచనలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండుట సూచన. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. వేచిచూసే ధోరణి మంచిది.. 

 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

 ఈవారం మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. సంతానం విషయంలో కీలకమయిన ఆలోచనలు చేస్తారు. పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. కుటుంబపరమైన విషయాల్లో కఠినంగా వ్యవహరించుట సూచన. వాహనాలను కొనుగోలు చేసే విషయంలో నిర్ణయాలను వాయిదా వేయుట సూచన. ఆరోగ్యం విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. విదేశీప్రయాణప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. ఫలితాల కోసం వేచిచూస్తున్న వాటిలో అనుకూలంగా ఫలితాలు వస్తాయి.
 
 

 

మరిన్ని శీర్షికలు