Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
The only known Jyotirlinga with 2 names

ఈ సంచికలో >> శీర్షికలు >>

13-12-2019 నుండి19-12-2019 వరకు వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

ఈవారం ముఖ్యమైన నిర్ణయాలలో తడబాటు ఉంటుంది. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత ఉండుట అవసరం. పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో అధికారులతో కలిసి పనిచేసే అవకాశం ఉంది. సాధ్యమైనంత మేర వివాదాలకు దూరంగా ఉండుట సూచన. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుటకు ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. చిన్న చిన్న విషయాల్లో సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. మిత్రులనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. ప్రయాణాలు కలిసి వస్తాయి.

 

 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

ఈవారం ముఖ్యమైన నిర్ణయాలలో తడబాటు ఉంటుంది. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత ఉండుట అవసరం. పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో అధికారులతో కలిసి పనిచేసే అవకాశం ఉంది. సాధ్యమైనంత మేర వివాదాలకు దూరంగా ఉండుట సూచన. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుటకు ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. చిన్న చిన్న విషయాల్లో సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. మిత్రులనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. ప్రయాణాలు కలిసి వస్తాయి.

 

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈవారం మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు, చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు మిత్రుల సహాకారం తీసుకోవడం సూచన. సంతానం విషయంలో ముఖ్యమైన సూచనలు తీసుకొనే అవకాశం ఉంది. ఊహించని ఖర్చులకు ఆస్కారం ఉంది. దూరప్రదేశంలో ఉన్న బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం లభిస్తుంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందకపోవచ్చును. వ్వ్యాపారంలో పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి, నూతన ఒప్పందాలకు అవకాశం ఉంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా లేకపోతే నష్టపోయే ఆస్కారం కలదు, జాగ్రత్త.
 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈవారం మొదట్లో ఉద్యోగంలో పనిఒత్తిడి ఉండే అవకాశం ఉంది, అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. చేపట్టిన పనులను పూర్తిచేయుటకు అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. రావాల్సిన ధనం కొంతమేర చేతికి అందుటకు అవకాశం కలదు. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది, విందులు వినోదాలలో సమయాన్ని గడుపుతారు. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న సమస్యలు తప్పక పోవచ్చును, తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

ఈవారం బంధువుల నుండి ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు. ఉద్యోగంలో అధికారుల అభిప్రయాలను పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళండి. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా నైనా విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. విదేశాల్లోఉన్నవారికి గతకొంతకాలంగా రానటువంటి ఫలితాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత మేర బంధువులతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. చిన్న చిన్న విషయాల్లో సైతం తగిన శ్రద్ధలు తీసుకోవడం తప్పక మేలుచేస్తుంది. 

 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

ఈవారం నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. చేపట్టిన పనులను మిత్రుల సహకారంతో పూర్తిచేసే అవకాశం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. బంధువులతో గతంలో మీకున్న విభేదాలు చాలావరకు సర్దుకుంటాయి. కుటుంబంలో పెద్దల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం సూచన. సంతానం విషయంలో ఒకింత ఆందోళలనకు గురయ్యే అవకాశం ఉంది. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట మంచిది. చర్చాపరమైన విషయాల్లో నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి, తొందరపాటు నిర్ణయాలు వద్దు. 

 

 

 

తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

ఈవారం సొంతనిర్ణయాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది, చేపట్టిన పనుల విషయాల్లో ఒకింత మొండిగా ప్రవర్తించే ఆస్కారం కలదు. ఉద్యోగంలో అధికారులతో ఊహించని విధంగా విభేదాలు ఏర్పడే ఆస్కారం ఉంది, కాస్త సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. సాధ్యమైనంత మేర కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. విదేశీప్రయాణాలు చేయువారికి అనుకూలమైన సమయం. కుటుంబపరమైన విషయాల్లో నూతన విషయాలపై చర్చలు చేయుటకు అవకాశం ఉంది. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం కలదు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. 


వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈవారం మొదట్లో ఊహించని విధంగా చిన్న చిన్న ఇబ్బందులు లేదా ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుతాయి. చర్చాపరమైన విషయాలకు సమయం ఇవ్వకపోవడం మంచిది. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు కలిసి వచ్చిన, ఆశించిన మేర ఫలితాలు రాకపోవచ్చును. దైవపరమైన విషయాల్లో పాల్గొనడం సూచన. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. విలువైన వస్తువులను లేదా వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది.  

 

ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారం పెద్దలనుండి వచ్చిన సూచనలను సీరియస్ గా పరిగణలోకి తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. మిత్రులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం కలదు. సోదరులతో విభేదాలు రాకూండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరమైన సమస్యలు తగ్గుతాయి, ఒకింత ఒత్తిడి తగ్గుతుంది. బంధువులతో మీ ఆలోచనలు లేదా నిర్ణయాలను పంచుకుంటారు. ఉద్యోగాల్లో మాత్రం పనిఒత్తిడి పెరుగుటకు అవకాశం కలదు, నలుగురిని కలుపుకొని వెళ్ళండి. 

 

 

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈవారం మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. సమయాన్ని అధిక భాగం విందులు లేదా వినోదాలకు ఖర్చుచేస్తారు. అధికారులతో లేదా పెద్దలతో విభేదాలు ఏర్పడే అవకాశం కలదు. చిన్న చిన్న విషయాల్లో సైతం అశ్రద్ధ పనికిరాదు. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచితం. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వస్తారు. విలువైన వస్తువులను నష్టపోయే అవకాశం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండటం సూచన. కుటుంబంలో సాధ్యమైనంత మేర చర్చలకు అవకాశం ఇవ్వకపోవడం వలన మేలుజరుగుతుంది. 

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారం రావాల్సిన ధనం విషయంలో స్పష్టత కలిగి ఉండుట సూచన. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటకు మిత్రుల సహకారం తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉన్న ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యక్రమాలు జరుగుటకు అవకాశం ఉంది. స్త్రీ పరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. అందివచ్చిన అవకాశాలను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. 

 

 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారం సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. చేపట్టిన పనులను జాగ్రత్తగా పూర్తిచేసే ప్రయత్నం మంచిది. వ్యాపారపరమైన విషయంలో కాస్త అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అధికారుల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుతాయి. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం కలదు.  
 
 

 

మరిన్ని శీర్షికలు
godari palakarimpu book review