Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Patashala-6 by bhaskarabhatla

ఈ సంచికలో >> సినిమా >>

బిస్కెట్ - చిత్ర సమీక్ష

Movie Review - Biscuit

చిత్రం: బిస్కెట్
తారాగణం: అరవింద్ కృష్ణ, డింపుల్ చొపాడె, వెన్నెల కిషోర్ , అలీ, తాగుబోతు రమేష్ , అజయ్ , చలపతిరావు, భరత్ తదితరులు
ఛాయాగ్రహణం: జైపాల్ రెడ్డి
సంగీతం: అనిల్ గోపిరెడ్డి
నిర్మాణం: గోదావరి ప్రొడక్షన్స్
నిర్మాతలు: స్రవంతి, రాజల్
దర్శకత్వం: అనిల్ గోపిరెడ్డి
విడుదల తేదీ: 1 జనవరి 2014

క్లుప్తంగా చెప్పాలంటే :
అశ్విన్ (అరవింద్ కృష్ణ), చిట్టిలింగం (వెన్నెల కిషోర్ ) మంచి స్నేహితులు. ఇద్దరికీ ఒకటే సమస్య. అదే వారి వారి బాస్ లు. శాడిస్టులయిన బాస్ ల కారణంగా ఇబ్బందులు పడ్తుంటారు అశ్విన్ , చిట్టిలింగం. అశ్విన్ , దీక్ష (డింపుల్)తో ప్రేమలో పడతాడు. ఓ రాత్రి ఇద్దరూ శారీరకంగా ఒక్కటవుతారు. ఇంకోపక్క అశ్విన్ , చిట్టిలింగం తమ బాస్ లకు బుద్ధి చెప్పాలనుకుంటారు. అనూహ్యంగా చిట్టి బాస్ చంపేయబడ్తాడు. అనుమానాలన్నీ చిట్టి, అశ్విన్ లపైకి మళ్ళుతాయి. ఈ గొడవ నుంచి అశ్విన్ , చిట్టి ఎలా తప్పించుకున్నారు? అశ్విన్ , దీక్ష ఒక్కటయ్యారా? లేదా? అనేది తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే :
అరవింద్ కృష్ణ అందంగా కన్పించాడు. అశ్విన్ పాత్రలో ఒదిగిపోయాడు. అతని నటనలో ఈజ్ , కాన్ఫిడెన్స్ బాగా కన్పించాయి. నటుడిగా రాణించడానికి అన్ని క్వాలిటీస్ అతనిలో వున్నాయి. అన్ని యాంగిల్స్ లోనూ బావున్నాడు. పెద్ద డైరెక్టర్ చేతిలో పడితే, స్టార్ అయ్యే అవకాశాలున్నాయతనికి. డింపుల్ చొపాడే గ్లామరస్ గా కన్పించింది. తన పాత్రకు న్యాయం చేసింది. సినిమా అంతా నవ్వులే నవ్వులు, దానిక్కారణం వెన్నెల కిషోర్ . తెరపై అతను కన్పించినంత సేపూ నవ్వుల జాతరే. తాగుబోతు రమేష్ , అలీ కూడా తెరపై నవ్వులు కురిపించడంలో తమవంతు పాత్ర పోషించారు. అజయ్ తన పాత్రకు సరిగ్గా సరిపోయాడు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధుల మేరకు రాణించారు.

డైలాగులు బాగున్నాయి, కామెడీ పంచ్ లు ఆకట్టుకున్నాయి. స్క్రిప్ట్ ఓకే, స్క్రీన్ ప్లే ఫర్వాలేదు, ఇంకాస్త బెటర్ గా వుంటే బావుణ్ణనిపిస్తుంది. ఆద్యంతం నవ్వులు కురిపించాలనే దర్శకుడి ప్రయత్నం సఫలమయినట్లే. అన్ని విభాగాల్నీ దర్శకుడు సరిగ్గా ఉపయోగించుకున్నాడు. సినిమాటోగ్రఫీ సినిమాకి అదనపు ఆకర్షణ. ఆర్ట్ డిపార్ట్ మెంట్ సినిమాకి సహజత్వాన్ని అందించింది. ఎడిటింగ్ ఓకే, ఇంకాస్త పనిచెప్పి వుంటే బావుండేది.

ఫస్టాఫ్ లో ఎక్కడా డల్ మూమెంట్ అనేది లేకుండా చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. సెకెండాఫ్ లో కాస్త నెమ్మదించిందన్పిస్తుంది. మెలోడ్రామా కొంచెం ఎక్కువైంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బావుంది. సినిమా ఆద్యంతం ఎంటర్ టైనింగ్ గా వుండడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ మెప్పించే అవకాశాలెక్కువ. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళే రావొచ్చు. ఓవరాల్ గా ఈ సినిమా నిర్మాతలకు ప్రాఫిట్స్ మిగిల్చేందుకు అవకాశమెక్కువ.

ఒక్క మాటలో చెప్పాలంటే: టైమ్ పాస్ కామెడీ ఎంటర్ టైనర్

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
Interview with Manchu Vishnu