Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
varma new heroine

ఈ సంచికలో >> సినిమా >>

బికినీలు వేసే వయసా శ్రీదేవీ?

sridevi in bikini

వయసు యాభై, అయినా అదేమీ బికినీకి అడ్డం కాలేదు. నిన్నటితరం అందాల హీరోయిన్‌ శ్రీదేవి, బికినీలో కన్పించేసరికి అవాక్కవ్వాల్సి వచ్చింది ఆమె అభిమానులకి. ర్యాంప్‌ వాక్‌పైనా, సినిమా ఫంక్షన్లలోనూ కూతుళ్ళతో పోటీ పడి అందాల ప్రదర్శన చేసినప్పటికీ, సినిమాలు మానేశాక శ్రీదేవి ఎప్పుడూ బికినీలో కన్పించలేదు. ఇప్పుడామె బికినీతో కన్పించేసరికి ఆశ్చర్యపోకుండా ఉండలేం కదా.

భర్త బోనీ కపూర్‌, ఇద్దరు కుమార్తెలతో కలిసి కొత్త సంవత్సర ప్రారంభ వేడుకల్ని విదేశాల్లో జరుపుకుంది శ్రీదేవి. ఆ ఎంజాయ్‌మెంట్‌ని ఇలా ఫొటోల రూపంలో అభిమానులకి తెలియజేసిందన్నమాట. ‘నీళ్ళలో దిగి ఎంజాయ్‌ చెయ్యాలంటే చీర కట్టుకోలేం కదా...’ అని బికినీని సమర్థిస్తారు హీరోయిన్లు. శ్రీదేవి కూడా అవే మాటలు చెప్పొచ్చు.

బికినీ వేసుకోవడం వింత కాదు, ఈ వయసులో అంటే 50 ఏళ్ళు వయసులో బికినీ వేసుకుని, ఫొటోలు పంపడమే ఆశ్చర్యం, వైపరీత్యమని కూడా అనొచ్చేమో.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam