Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Numerologists

ఈ సంచికలో >> సినిమా >>

మసాజ్‌ పార్లర్ల గొడవ

Massage Parlours

ధనార్జన కోసం మసాజ్‌ పార్లర్లు విరివిగా వెలుస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించడానికి మసాజ్‌ పార్లర్లలో చాలా అసాంఫీుక కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు నిర్వాహకులు. పోలీసులు దాడులు చేయడం, మసాజ్‌ పార్లర్లను సీజ్‌ చేయడం నిత్యం జరుగుతున్నదే అయినప్పటికీ, వాటి పట్ల క్రేజ్‌ తగ్గటంలేదు. అన్నీ అక్రమంగా జరుగుతున్నాయని అనలేం కానీ సెలబ్రిటీలు ఇలాంటి రైడింగుల్లో పట్టుబడితే, వారికి చిక్కులు ఇంకా ఎక్కువ ఉంటాయి.

కానీ తక్కువ వయసులో పేరు సంపాదించుకున్న కొందరు సెలబ్రిటీలు విలాసాల కోసం ముందూ వెనుకా ఆలోచించకుండా మసాజ్‌ పార్లర్లను ఆశ్రయిస్తున్నారు. వారిపై ఎప్పుడూ మీడియా ప్రత్యేకంగా కన్ను వేసి వుంటుంది. తద్వారా అలాంటివారు మసాజ్‌ పార్లర్ల వివాదంలో దొరికితే వారిపై ఫోకస్‌ ఎక్కువ అవుతుంది.

మీడియాలో కన్పిస్తే తమ పరువు బజార్లో పడ్డట్టే అన్న భయం కొంతైనా ఉంటే ఇలాంటివి జరగవు. సెలబ్రిటీలు కన్పిస్తే మీడియాకి పండగే అని అందరికీ తెలుసు. కాని అలా కూడా పబ్లిసిటీ సంపాదించుకోవచ్చని కొందరు తాపత్రయ పడతారు. మసాజ్‌ పార్లర్ల వెనుక పెద్ద పెద్ద తలకాయలుండి నడిపించడం వల్ల కూడా తెరచాటు కార్యక్రమాలు జరుగుతాయని అంటుంటారు. సెలబ్రిటీలుగా నలుగురికి మార్గదర్శకంగా ఉండాల్సిన వారు అన్నీ ఆలోచించి తమ జీవన శైలిని మార్చుకుంటే మేలు.

మరిన్ని సినిమా కబుర్లు
Not at all those days