Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
anthaku minchina vijayam sadhinchalede

ఈ సంచికలో >> సినిమా >>

అ ఆ లు

Poetry on Sri Akkineni Nageswara Rao

అ,ఆ లు అక్షరాలు- 
అవి దిద్దితే చదువు మొదలైనట్టు;
అ,ఆ లు అక్కినేని ఆలోచనలు -
అవి చదివితే జీవితాన్ని కాచి వడబోసినట్టు.

వెండితెర మీద స్టారు
వేదిక ఎక్కితే మాస్టారు
ఆయన ప్రతి వాక్యం ఒక పాఠం 
తిరుగులేని అల్టిమేటం

కట్టులో తెలుగుతనం,
మాటలో విశ్వమానవవాదం,
కాలంచెల్లని ఆదర్శం,
ఆయన సర్వస్వం.

అక్కినేని!
ఓ జ్ఞాన గని!...
ఎంత పుణ్యం చేసిందో-
కళా మతల్లి నిను కనిపెంచింది; 
ఎంత పాపం చేసామో-
నీ మరణ వార్త వినిపించింది.

-సిరాశ్రీ (22/01/2014- ఉదయం 6:05)

మరిన్ని సినిమా కబుర్లు
Akkineni quotes as book