Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Poetry on Sri Akkineni Nageswara Rao

ఈ సంచికలో >> సినిమా >>

పుస్తకంగా అక్కినేని సూక్తులు

Akkineni quotes as book

సినీ కళామతల్లి ముద్దుబిడ్డ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు, సినీ అభిమానుల్ని శోకంలోకి నెట్టేశారు తన మరణం ద్వారా. ఆయన మరణాన్ని ఇంకా ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే జీవించి ఉన్న రోజుల్లో ఆరోగ్యంగా ఎలా ఉండాలో అందరికీ అర్థమయ్యేలా చెప్పేవారయన. మంచి వ్యక్తిగా జీవనం సాగించడం గురించీ పలు సందర్భాల్లో చెప్పేవారు అక్కినేని.

వాటిల్లో కొన్ని విషయాలు తన అనుభవంలోనివి, కొన్ని తెలుసుకున్నవి ఉంటాయని అక్కినేని అనేవారు. వివిధ అంశాలను గురించి ప్రస్తావిస్తూ కొన్ని సూక్తులను ఆయన పేర్కొనడం జరిగేది. అలా అందరికీ ఉపయోగపడే సూక్తులను పుస్తక రూపంలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు ఊపందుకున్నాయి అక్కినేని మరణం తర్వాత. అక్కినేని ‘అఆ’లు పేరుతో ఓ పుస్తకం వచ్చింది అప్పట్లో. దాన్ని పునర్‌ముద్రించినా, అందులో చాలా సమాచారం దొరుకుతుంది.

‘అఆ’లు పుస్తకం మార్కెట్‌లో దొరకడం కష్టంగా ఉంది. అందుకనే అక్కినేని మాట్లాడిన మాటల రికార్డులను పరిశీలించి, ఓ కొత్త పుస్తకాన్ని రూపొందించడానికి ఆయన అభిమానులు, కొందరు పాత్రికేయులు ప్రయత్నిస్తున్నారని సమాచారమ్‌. అక్కినేని ఓ నిఘంటువు, ఆయన జీవితం, జీవన విధానం చాలా గొప్పవి. అవి భావి తరాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. అక్కినేని సూక్తులను పాటించగలిగితే ఆనందంగా జీవించవచ్చు ఎవరైనాసరే.

మరిన్ని సినిమా కబుర్లు
Traditional wear heros is there?