Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Remix

ఈ సంచికలో >> సినిమా >>

పెదరాయుడు + యమధర్మరాజు ` ‘రౌడీ’

pedarayudu+yamadharmaraaju 'rowdy'

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, విలక్షణ నటుడు మోహన్‌బాబుతో ‘రౌడీ’ పేరుతో ఓ సినిమా రూపొందించనున్నాడు. తెలుగు సినిమాలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన వర్మ, మోహన్‌బాబుతో ఓ సెన్సేషనల్‌ మూవీ చేయడానికి అన్నీ పక్కాగా ప్లాన్‌ చేసుకున్నాడని ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ టాక్‌.

ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుంది? అన్న ప్రశ్నలకు సమాధానంగా ‘పెదరాయుడు, ఎం.ధర్మరాజు ఎంఎ’ కలిస్తే ఎలా వుంటాయో ఆ తరహాలో వుంటుందని అంటున్నారు. కంటెంట్‌ పరంగా, మోహన్‌బాబు నటన పరంగా హై ఓల్టేజ్‌ సినిమాలుగా పెదరాయుడు, ఎం.ధర్మరాజు ఎంఏ సినిమాల గురించి చెప్పుకోవాలి. ఆ రెండిటినీ కలిపి కొడితే, ఎంత పవర్‌ఫుల్‌గా వుంటుందో అలా వుంటుందట ‘రౌడీ’. మొదట ఈ సినిమాకి ‘ఒట్టు’ అనే టైటిల్‌ అనుకున్నా, అదిప్పుడు ‘రౌడీ’గా ఫైనలైజ్‌ అయ్యింది.

మోహన్‌బాబు ఈ సినిమాలో మేకప్‌ లేకుండా నటిస్తున్నారు. ఆయన తనయుడు విష్ణు కూడా ఈ సినిమాలో నటించనుండడం విశేషం. మోహన్‌బాబు నట విశ్వరూపం, వర్మ టేకింగ్‌ ఈ సినిమాకి హైలైట్‌ అవుతాయట. సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

మరిన్ని సినిమా కబుర్లు
pawan kalyan