Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
pawan kalyan

ఈ సంచికలో >> సినిమా >>

సంగీత ప్రధానంగా దేవ్‌ కట్టా

music based

‘ప్రస్థానం’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు దర్శకుడు దేవ కట్టా. ఆయన అంతకు ముందు ‘వెన్నెల’ సినిమా తీశాడు. విభిన్న చిత్రాల వైపే మొగ్గు చూపే దేవ కట్టా, సంగీత నేపథ్యంలో ఓ సినిమాను రూపొందించాలని అనుకుంటున్నాడట. సంగీత నేపథ్యం అనగానే సంప్రదాయ సంగీతం అనే అనుమానం కలగవచ్చు.

అయితే దేవ్‌ కట్టా మోడ్రన్‌ మ్యూజిక్‌ నేపథ్యంలో సినిమా చేయాలనే ఆలోచన చేస్తున్నాడు. దీనికి సంబంధించి బ్యాక్‌గ్రౌండ్‌ వర్క్‌ కూడా దేవ కట్టా పూర్తి చేసినట్లు తెలిసింది. నాగచైతన్య హీరోగా ‘ఆటోనగర్‌ సూర్య’ రూపొందిస్తున్న దేవ కట్టా, ఈ సినిమా తర్వాతనే తదుపరి ప్రాజెక్ట్‌ని ప్రకటిస్తాడట.

సంగీత నేపథ్యంలో సినిమా తీయడం, అందులోనూ మోడ్రన్‌ మ్యూజిక్‌ని బేస్‌ చేసుకుని సినిమా చేయడం అంటే సాహసం అనే చెప్పాలి. ఆ సాహసం చేయాలనుకుంటున్న దేవ కట్టా అభినందనీయుడే.

మరిన్ని సినిమా కబుర్లు
hrudaya kaleyam