Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

ajent ekambar

 కొంప దీసి అతనిచ్చిన  షాక్ కి "హై బీపి" గాని రాలేదు కదా! మనసులోనే అనుకున్నాడు.

ఏకాంబర్ అలా చొట్టూరా కలియ చూడ్డం చూసిన వాచ్మెన్ కూర్చోవడానికి కుర్చీ కోసం వెదుకుతున్నాడేమోనని గబాలున ఆ పక్కనే వున్న రెండు ప్లాస్టిక్ కుర్చీలు పట్టుకు వచ్చి వాళ్ళ ముందు పెట్టాడు. కుర్చీలను చూసి  ఏకాంబర్ తేరుకున్నాడు.

"సార్! కూర్చోండి! నిదానంగా చెప్పండి సార్1" అంటూ తను ఓ కుర్చీలో కూర్చున్నాడు. మిత్రులకేసి చూసి అబ్యర్ధనగా కళ్ళతోనే వెళ్దాం వుండంటూ సైగ చేసాడు ఏకాంబర్.అతను కుర్చీలో హుందాగా కూర్చుంటూ అన్నాడు.

"ఏభై లక్షలకు ఎంత ప్రీమియం కట్టాలో చెప్పండి. టర్మ్ కూడా ఎన్నాళ్ళు కట్టాలి. ఇయర్లీ ప్రీమియం బెటర్  మూడు నెలలకొకసారి కట్టడమంటే తలనొప్పి" స్టైల్ గా కాలు మీద కాలు వేసుకుని అన్నాడు."సార్! మీరేం చేస్తారు సార్!" నమ్రతగా అన్నాడు ఏకాంబర్."మీకు పాలసీ కావాలా? నా పర్సనల్స్ కావాలా ?" కొంచం కోపంగా అన్నట్టే అన్నాడతను.

"పాలసీ ఇచ్చే ముందు మీ "ప్రొఫైల్" తెలుసుకుందామని" వినమ్రంగా అన్నాడు ఏకాంబర్. "వీడెవడో గాని "ధీరు భాయ్ అంబాని" మూడో కొడుకులా వున్నాడు. ఎన్ని ఫ్యాక్టరీలున్నాయో!?! ఎన్ని కోట్ల వ్యాపారం చేస్తున్నాడో మనసులోనే  ఎదుటి వ్యక్తి ఆర్ధిక స్తోమతని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఏకాంబర్.

"పర్సనల్స్, ప్రొఫైల్స్ చూస్టేనే గాని పాలసీ రాయరా!" అతనన్నాడు.

"రాస్తాం సార్! మీ దగ్గర ప్రూఫ్స్ వున్నవి ఇవ్వాలి. ఇంత పెద్ద పాలసీ కడుతున్నారంటే మీ ఆదాయం వివరాలు కావాలి. మీ దగ్గర రెడీగా వుంటే ఇన్ కం టాక్స్ రిటర్న్స్ ఇవ్వాలి" చెప్పాడు ఏకాంబర్.

"ఇప్పుడే అవి అన్ని ఎలా వస్తాయి. ఎనీ హౌ! నాకో విషయం చెప్పండి. నేనిప్పుడు ఏభై లక్షలకు  ఇన్సూరెన్స్ చేస్తే వచ్చే నెలలో నాకు కావాలంటే ఒక్ నలభై లక్షలు అప్పుగా మీరివ్వ గలరా?" కళ్ళింత చేసుకుని అతనడిగాడు. ఏకాంబర్ కి బుర్ర తిరిగిపోయింది.

"మీరు మాట్లాడుతున్నది నాకర్ధం కాలేదు, కొంప దీసి మీరు ఏభై లక్షలకి "చిట్టీ" గిట్టీ కట్టాలనుకుంటున్నారా? చిట్టీ కడితే వచ్చే నెలలో పాడేసుకుంటే వాళ్ళు డబ్బు ఇస్తీరు. ఇన్సూ రెన్స్ లో కట్టిన వెంటనే ఎలా? అతన్నే తిరిగి అడిగాడు ఏకాంబర్.

"చిట్టి... ఐ మీన్ చిట్ ఫండ్... నో!నో! మీ ఇన్సూరెన్స్ కంపెనీలో అలాంటి "స్కీములు" లేవా! అడిగాడతను.

"మనీ బేంక్  పాలసీ! కనీసం మూడేళ్ళు మీరు కడితే మూడేళ్ళ కోసారి కొంత మొత్తం "మనీ బేంక్" పాలసీ తిరిగి వస్తుంది. అంతే" చెప్పాడు ఏకాంబర్.

"చట్! నా కంపెనీ పెట్టుబడికి అవసరమైతే... మీరు ఫండ్ ఇవ్వలేరనమాట" అతను మనసులో లొడుక్కున్నాడు.ఏకాంబర్ కి అతనికి ఏం కావాలో అర్ధం కాలేదు. ఏం మాట్లాడుతున్నారో అర్ధంకావడం లేదు. కానీ, ఏభై లక్షల పాలసీ... మళ్ళీ మరో నెలలో  ఏభై లక్షల పాలసీ... ఎల అతన్ని వదిలించుకోగలడు.

ఏకాంబర్ దిగ్గున లేచాడు. విషయం అర్ధమైంది. వీడెవడో "గాలి ధుమారం గాడు" మనసులోనే అనుకుంటూ లేచి నిలబడ్డాడు.అప్పటికే అతని మాటలను బట్టి "పిచ్చోడి" లా అనిపించి మిత్రులు ముగ్గురు ఏకాంబర్ దగ్గరకు వచ్చి భుజం మీద చేయి వేసి పదరా' అన్నట్టు తట్టారు.

అతను ఏకాంబర్ కేసి చురచురా చూసి అటూ ఇటూ చూసుకుంటూ గబాలున కుర్చీలో నుండి లేచి వెళ్ళిపోయాడు.మిత్రులు ముగ్గురికి నవ్వాగలేదు. ఏకాంబర్ కి మాత్రం ఒక్కసారే పంచ బక్ష పరమాన్నం ముందర పెట్టి ఎవరో లాగేసుకున్నట్టు డీలా పడిపోయాడు. అతను వెర్రి వాడో.. పిచ్చి వాడో కావచ్చు. కానీ, అంత మొత్తం పాలసీ కట్టేసినంత హడావిది చేసి "ఏకాంబర్" లో ఎన్నో ఆశలు వెలిగించాడు.

కానీ, అప్పుడే అనుకున్నాడు! అది ఆశ కాదు. ఆశయం గా మార్చాలి. ఎలాగైనా ఈ రెండు నెలల్లో "కొటి రూపాయల"  పాలసీ కాకపోయిన  పదిమంది చేతనైన ఒక్కసారే కట్టించి "కొటి" రూపాయలు చెయ్యాలనుకున్నాడు.

అది ఆశే! అని తెలిసినా ఆలోచించడం లో తప్పు లేదనుకున్నాడు ఏకాంబర్. మిత్రులు నుగ్గురూ పదే పదే అతన్నే తలుచుకుని నవ్వినా ఏకాంబర్ మాత్రం నవ్వలేకపోయాడు. పాపం! గాళ్ళో మేడలు కట్టుకుంటూ ఊహల్లో జీవిస్తున్న ఆ "అపరకుబేరుడి"  ఆశ.. ఆలోచన వింతగా అనిపించిన ఏకాంబర్ కు మాత్రం భాధనిపించింది.

"ప్రతి మనిషికి ఏదో ఆలోచన వుంటుబ్ది. ఆశయం వుంటుంది. దాన్ని సాధించాలంటే పట్టుదల వుంటే అతను విజయం సాధిస్తాడు" అనుకుంటూ మిత్రులతో కలిసి గేటు దాటి రోడ్డు మీదకు నడిచాడు ఏకాంబర్.

అతను సూట్కేసు పట్టుకుని అపార్ట్మెంట్ ముందే అటూ, ఇటూ తిరిగి రోడ్డు మీదకు వెళ్ళాడు.

ఇంతలో రాజనాల రాజేంద్ర బైక్ మీద నేరుగా వచ్చి అపార్ట్మెంట్ ముందు ఆగాడు. రోడ్డు మీదకు పోతున్న మిత్ర బృందాన్ని చూసాడు. బైక్ అక్కడే పెట్టి నడిచి  వెళ్తున్న  మిత్రుల్ని కేకేసి పిలిచాడు.

ఎవరో తమనే పిలిచేసరికి వెనక్కి తిరిగారు నలుగురూ, రాజనాలని చూస్తూనే ఆగారు. రాజనాల వాళ్ళ దగ్గరకు చేరుకున్నాడు. ఏకాంబర్ ముక్తసరిగా పలకరించాడు. మిగతా ముగ్గురు హుషారుగా ఉన్నారు.

"ఏరా! ఎకాంబర్ దగాలుగా వున్నట్టున్నాడే" అతన్ని చూడు" రాజనాల చెయ్యి పట్టి వెళ్ళిపోతున్న అతన్ని చూపించి అన్నాడు రామకృఇషణ.
"అతనా...ఆ!ఆ! అతను.. తెలుసు.. ఏమైంది?" ఆతృతగా అన్నాడు రాజనాక.

ఇక్కడకు వచ్చి మన వాడికి షాక్ ఇచ్చాడు నవ్వుతూ అన్నాడు ఆచారి.

"అంద్కేనా అపార్ట్ మెంట్లో బైక్ కూడా వదిలేసి మీతో అయోమయంగా వచేస్తున్నాడు"    అన్నాడు రాజనాల

"ఊరికే రోడ్డు మీదకు వచ్చాను. మా బైకులు కూడా అక్కడే వున్నాఇ కదా!" అనిల్ అన్నాడు. "అతనేమన్నాడు?" కుతూహలంగా అడిగాడు రాజనాల

"ఏమనలేదు. వచ్చీ రావడంతో నే మనవాడ్ని కలిసి కోటి రూపాయల పాలసీ కడతానని దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చాడు. అతను వెళ్ళిపోయాడు గానీ, మనవాడు ఆఆ షాక్ నుండి ఇంకా తేరుకోలేదు" రామకృష్ణ అన్నాడు

"అతనా... అయ్యో! భాధగా అన్నాడు రాజనాల.

"అదేంటన్న... ఆయన నీకు తెలుసా?" ఆశ్చర్యంగా అన్నాడు ఆచారి. ఏకాంబర్ కూడ వింతగా చూశాడు.

"ఆయన బేంక్ లో మేనేజర్ గా      పనిచేసాడ్రా! పాపం! చివరికి ఆయనకి ఈ గతి పట్టింది." విచారం గా అన్నాడు రాజనాల "అంటే...?! ఇంతకీ ఏమైంది?" ఆతృతగా అడిగారు మిత్రులంతా 

"ఈయన నాకు బాగా తెలుసు. మన బ్రాంచీకి వచ్చేవాడు. ఈయన పార్వతీ పురం లో కమర్షియల్ బేంక్ లో మేనేజర్ గా వున్నప్పుడు తెలివి తక్కువగా ప్రవర్తించి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అప్పట్నించి మానసికంగా దెబ్బ తిని ఇలా తిరుగుతున్నాడు" విచారంగా అన్నాడు రాజనాల
"తెలివి తక్కువ అంటే.. ? ఏం జరిగిందో చెప్పరా బాబూ!" అన్నాడు అనిల్.

'ఆయన గురించి ఈ మధ్య పేపర్ లో కూడా వచ్చింది. మీరు చదవలేదా?!" అన్నాడు రాజనాల.

"చదివినా ఎవరికి గుర్తుంటుంది. జరిగిందేమిటో చెప్పు!" ఏకాంబర్ ఆతృతగా అడిగాడు.

"యూరో లాటరీల గురించి తెలుసా మీకు?" అడిగాడు రాజనాల.

"అవునవును, సెల్ఫోనెకి రకరకాలుగా మెసేజ్ లు నాకు వచ్చాయి. అవన్నీ బోగస్ కదరా! ఎవరు నమ్ముతారు. అయినా, ఇప్పుడా విషయం ఎందుకూ!" చిరాగ్గా అన్నాడు అనిల్,

"నువ్వు నమ్మలేదు కదా, చాలామంది నమ్మరు. కానీ, కొంత మంది... అదీ ఇతను నమ్మేసాడంటే మీరు నమ్మగలరా?" చెపాడు రాజనాల.

"నిజమా?!" ముగ్గురూ ఒక్కసారే ఆశ్చర్యపోయారు. ఏకాంబర్ మాత్రం రాజనాల కేసి విచిత్రంగా చూస్తుండిపోయాడు.

"పాపం ఇతను నమ్మేసాడు. ఎంతలా నమ్మేసాడంటే..! ఇతని సెల్ నెంబర్కి వంద కోట్లు లాటరీ తగిలిందని మెసేజ్ రావడం తో కాకతాళీయం గానే ఆ నెంబర్ కి ఈయన ఫోన్ చేసాడట. వెంటనే వాళ్ళు ఇతని ఈ మెయిల్ అడ్రస్ అడిగి తీసుకుని వంద కోట్లు లాటరీలో తగిలినట్ళూ ఇతని సెల్ నెంబరు, పేరు అడ్రస్ తో ప్రింట్ చేసి వున్న యూరోపియన్ కంట్రీ తాలూకా ముద్రలతో ఒక సర్టిఫికెట్టు మెయిల్ పెట్టారట. అది చూసి సరదాగానే "అయితే ఎప్పుడు నాకు డబ్బు చేరుతుందని?" ఈయన తిరిగి మెయిల్ చేసాడట. అంతే! ఆ మాయగాళ్ళ ఉచ్చు లో ఈయన బిగుసుకుపోయాడు." చెప్పి ఆగాడు రాజనాల.

"ఎలా...?! సరదాగానే కదా అడిగాడు. మరెలా ఇరుక్కున్నాడు." ఆచారి అడిగాడు.

"నిజమే! ఇలాంటి సరదాలకే పల్లెల్లో ఒక బండ బూతు సామెత ఒక్టుంది. తెలుసా!" చిన్నగా నవ్వుతూ అన్నాడు రాజనాల.

"చెప్పు చెప్పు!" ఆత్రం గా అన్నాడు రామకృష్ణ.

"వీడికి బూతు అని వినిపిస్తే చాలురా! ఎగిరెగిరి పడుతాడు" అనిల్ జోక్ చేసాడు.

"సరదాకి "సమర్త" ఆడితే ఇంకెవర్తో కోక దొబ్బిందట. అని అంతుంటారు. అని రాజనాల చెప్పింది వింటూనే ఫకాలున నవ్వేసాడు ఆచారి. మిగతా అందరూ గొంతు కలిపారు.

"అసలేం జరిగిందన్నా?" ఏకాంబర్ సూటిగా ప్రశ్నించాడు.

'ఈయన సరదాగా అడిగేసరికి అతని ఇంటి అడ్రస్ తీసుకుని వెంటనే రిజిస్టర్ పోస్టులో లాటరీ వచ్చినట్టు సర్టిఫికెట్లు అన్నీ పంపించి దాంట్లో వంద కోట్ల ర్రూపాయలకు అడ్వాన్స్ టాక్స్, ఎక్స్చేంజ్  రుసుము లాంటి ఖర్చులు మీరే భరించవలసి ఉంటుందని ఆ వెంటనే మీ పేర మీ అకౌంట్ కి  వంద కోట్లు ట్రన్స్ఫర్ అవుతాయని అతని సేవింగ్స్ ఖాతా నెంబర్, ఇతర వివరాలు కూడా తీసుకున్నారుట. ఇతను ఆనందంగానే తన వివరాలు మెయిల్ చేసాడట" చెప్పాడు రాజనాల.

"అంతే కదా1.." అంతే అన్నాడు  రామకృష్ణ.

అక్కడీటో ఆగలేదు కదా1 ఈ నెలాఖరు లోగా మీ అడ్వాన్స్ టాక్సీ కింద కనీసం ఆరు లక్షలన్నా కడితే మీ లాట్రీ సొమ్ము ఈకు దక్కుతుందనేసరికి అప్పటికే నెల రోజులుగా "వంద కోట్లు" లాటర్ర్ వచ్చిందన్న భ్రాంతిలో .... ఆనందం లో రాత్రి, పగలు పగటి కలలు కంటూ కూర్చున్న ఈయన తనే చీఫ్ మేనేజర్ కావడంతో బ్యాంక్ లోనే అప్పు చేసి మరి ఆరు లక్షలు వాళ్ళు చెప్పిన అకౌంట్ కి జమ చేసాడట. అది కట్టిన నాలుగు రోజులకు మరో ఆరు ,అలా మరో ఆరు లక్షల చొప్పున ఒకసారి అడ్వాన్స్ టాక్స్ అని మరోసారి, సర్వీస్ టాక్స్ అని, మరో  సారి మనీ ఎక్స్ చెంజ్ అని అరవై లక్షల వరకూ ఈయన దగ్గర లాగేసారట.

ఈ డబ్బంతా రకరకాల బినామీ  పేర్లతో దొంగ లోన్లు రాసేసి బ్యాంకుల్లోనుండే వాళ్ళ అకౌంట్ కి పంపించారట.   అదిగో.. ఇదిగో ఈ వేళ .. రేపు... అంటూ అతన్ని ఊరించి ఊరించి అరవై లక్షల వరకు వసూలు చేసుకుంటున్నారట. చివరగా మరో పది లక్షలు కడితే వందకోట్లు మీకు చేరతాయని వాళ్ళు మెయిల్ చేసారట. దాన్ తో ఇతనికి ఒళ్ళు మండి పోయింది. అదీ గాక ఎక్కడా డబ్బు దొరకలేదు అప్పటికే బ్యాంక్ లో వున్న మిగతా సిబ్బందికి ఇతను చేసిన అప్పులు, తప్పులు అన్నీ తెలిసిపోయాయి. అప్పుడు తిరిగి ఈయన వాళ్ళకి మెయిల్ పెట్టాడట. వంద కోట్లలో కనీసం రెండు కోట్ల రూపాయలన్నా ముందుగా రిలీజ్ చేస్తే అందులో నుండి తిరిగి పది లక్షలు మీకు పంపిస్తారని రాసాడట. .. అంతే! రెండు నెలలు ఎదురుచూసిన అటునుంచి సమాధానం రాలేదట. ఇతను గంట గంటకి మెయిల్   పంపించిన సమాధానం రాలేదట. చివరికి ఆ మెయిల్ అడ్రస్ కూడా రద్దయిపోయిందని తెలిసిందట. అంత తెలిసే సరికి పుణ్య కాలం పూర్తయి పోయింది. బ్యాంక్ అదికారుల తనిఖీ లో ఇతను చేసిన తప్పుడు పనులన్ని దొరికిపోయాయి. ఆ వెంటనే ఉద్యోగం నుండి తొలగించారు. ఈ విషయమే అన్ని పేపర్ లోనూ వచ్చింది." అతని కథంతా చెప్పాడు రాజనాల.

"అయ్యో! అంత మోసం జరిగిందా?! ఇంత చదువుకున్న ఈయన ఇలా ఎలా తప్పు చేసాడు? సామాన్యులు కూడా ఇలాంటి మోసాలు నమ్మరే! నాకయితే రోజు ఇలాంటి మోసపూరిత కాల్స్ వస్తుంటాయి." ఆచారి విచారం వ్య్క్త పరుస్తూ అన్నాడు.

"ఈయన సామాన్యుడు కాదు. మహా మేధావి. అందువల్లే అంతగా ఆశపడి మోసపోయాడు. వంద కోట్లు లాటరీ వచ్చిందని తెలిసి ఏదో పెద్ద ఫ్యాక్టరీ పెడతానని భార్యకి చెప్పారట. కానీ ఈ వంద కోట్ల లాటరీ విషయం చెప్పలేదట. ఉద్యోగం మానేసి సొంతంగా ఫ్యాక్టరీ పెడతానని, తన దగ్గరే వందల మంది ఉద్యోగం చేస్తారని అనేవాడుట.

ఈ గొడవంతా జరిగాక అతని భార్య పోలీసుల ఎదుట వాగ్మూలం ఇస్తూ ఈ విషయం చెప్పింది." చెప్పాడు రాజనాల.

ఎంతో ఉన్నతమైన ఉద్యోగం పాడు చేసుకుని ఇప్పుడు పిచ్చివాడిలా రోడ్డు పట్టుకుని తిరుగుతున్న ఆయన కథ విన్న మిత్రులు నలుగురు కళ్ళల్లో నీళ్ళు దించుకున్నారు.

"మనిషికి ఏది నిజమో? ఏది అబద్దమో? ఏది మోసమో? ఏది యధార్థమో? గ్రహించాలంటే వారికి జ్ఞానం వుండాలి. అయా చిత్తంగా ఏది వచ్చిన  దాని వలన ఎదురయ్యేది ప్రమాదమేనని గ్రహించాలి. పేపర్లు చదివి"ప్రపంచం" వునికిని పరిశీలిస్తుండాలి!

మిత్రులందరూ అదే విషయం చర్చించుకుంటూ  అపర్ట్మెంట్ గ్రౌండ్ లో పార్క్ చేసిన బైక్ లు తీసుకుని ఇళ్ళకు బయలుదేరారు.
ఏకాంబర్ మనసు వికలమై పోయింది. పాపం! ఎలాంటి ఉద్యోగస్తుడు? ఎలా వున్మాదిలా మిగిలిపోయాడు? బాధపడుతూనే ఇంటికి చేరుకున్నాడు.

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
O college droup out  premakatha