Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
ajent ekambar

ఈ సంచికలో >> సీరియల్స్

ఓ కాలేజ్ డ్రాపవుట్ ప్రేమకథ

O college droup out  premakatha

.ఇలా పరిపరివిధాలా ఆమె ఆలోచనలు సాగుతున్న టైంలోనే హైదరాబాద్‌ నుంచి సుధాకర్‌ నాయుడు ఫోన్‌ చేసాడు.

సెల్‌ రింగవటంతో ఆమె ఆలోచలన్నీ చెదిరిపోయాయి.

సెల్‌ అందుకుంటూ తల దిండుమీద ఆన్చుకుని కూర్చుంది.

''హాయ్‌ డాడ్‌'' అంటూ పలకరించింది.

''ఏమిట్రా తల్లీ! ఇంకా నిద్రపోలేదా?'' అవతల్నుంచి పరామర్శించాడు నాయుడు.

''ఆ ప్రయత్నంలోనే వున్నాను డాడీ! కానీ మీరు పంపించిన వినోద్‌, అతన్ని తల్చుకుంటే ఒళ్ళు మండుతోంది. నాకు నిద్రపట్టకుండాచేస్తున్నాడు.''

''మైగాడ్‌...............ఏమైందమ్మా? అతను మన బ్రాంచ్‌ ఆఫీసుకు చేరుకున్నాడా?''

''చేరుకున్నాడు, అతని దగ్గర ఏదో మేజిక్‌ వుంది డాడీ! ఒక్క పూటలోనే స్టాఫ్‌ అందరికీ గురువైపోయాడు. కాన్ఫరెన్స్‌లో సూపర్‌గా మాట్లాడాడు. సమస్యల పరిష్కారానికి సూచనలిచ్చాడు. సేల్సు పెంచుకోడానికి పంచసూత్ర మార్గదర్శకపథకం చెప్పాడు. మధుసూదనరావు బాబాయ్‌ వినోద్‌ ప్రపోజల్స్‌ అన్నిటినీ టైప్‌ చేయిస్తున్నారు. మీ పరిశీలన కోసం వాటిని రేపు కొరియల్‌లో పంపిస్తారు. నో డౌట్‌! అతను జీనియస్‌'' అంటూ గడగడా ఉత్సాహంగా వివరించింది.

''ఫారిన్‌లో చదివిన కుర్రాడమ్మా........ జెమ్‌............. నేను మేనేజరుతో మాట్లాడతాగాని అంతమంచి కుర్రాడిమీద నీకు కోపం ఏమిటి? కుర్రాడు నచ్చలేదా?''

''నాకో డౌటు డాడీ, మీరు వినోద్‌ని ఇక్కడికెందుకు పంపించారు? నేను పరిశీలించి ఓ.కె. చేయటానికేగా?''

''అవుననుకో.........'' 

''అనుకోడం ఏమిటి? అతను ఆఫీసు పనులకు ఇస్తున్న ప్రాధాన్యతలో పదోవంతు కూడా నాకు ఇవ్వటంలేదు. నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. నా నుంచి తప్పించుకోవాలని చూస్తాడు. క్రికెట్‌ చూడాలంటాడు. మధుర వెళ్ళపోతానంటాడు. నాకేం అర్థం కావటం లేదు. మీ ప్రపోజల్‌ అతనికి తెలుసో లేదోనని డౌటుగా వుంది.......నా గురించి మీరు చెప్పారా?''

''చెప్పానమ్మా! అరటిపండు ఒలిచినట్టు వివరంగా చెప్పాను. మా అమ్మాయి ఇష్టపడితే నీకిచ్చి పెళ్ళిచేస్తానని స్పష్టంగా చెప్పాను. కానీ ఫారెన్‌లో చదివినా అతను నూటికి నూరుశాతం ఇండియన్‌. ఒట్టి కంగారు మనిషి, భయస్తుడు, బిడియం.... అందుకే అలా వుంటున్నాడు. నాలుగురోజులు మీ పరిచయం పెరిగితే హీవిల్‌బి ఆల్‌రైట్‌! ఇంతకీ కుర్రాడు నీకు నచ్చాడా లేదా చెప్పలేదు. ఇక్కడ మీ మమ్మీ, నేనూ టెంక్షన్‌లో వున్నాం.''

''టెంక్షన్‌ దేనికి డాడీ?''

''దేనికంటే........ ఆ కుర్రాడు, వినోద్‌ నీకు నచ్చుతాడని నేను, నచ్చడు అతన్ని ఇష్టపడదని మీ మమ్మీ చిన్న పందెం వేసుకున్నాం. మా ఇద్దరిలో ఎవరు విన్‌ చేసారో నువ్వే చెప్పాలి మరి.''

వరేణ్య నవ్వింది.

''బెట్‌ ఎంతో చెప్పండి, చెప్తాను'' అంది ఉత్సాహంగా.

''అదంతా ఎందుకులేగానీ అబ్బాయి నచ్చాడా లేదా చెప్పమ్మా?'' బ్రతిమాలుకున్నాడాయన.

''నథింగ్‌  డూయింగ్‌. బెట్టింగ్‌ ఎంతో చెప్పాల్సిందే'' పట్టుబట్టింది వరేణ్య.

''నేను ఓడిపోతే మమ్మీకి అయిదువేలు యిచ్చుకోవాలి.''

''మమ్మీ ఓడిపోతే?''

''అదేదో మీ మమ్మీనే అడుగు.''

క్షణం తర్వాత తల్లి భాగ్యం లైన్‌లోకొచ్చింది.

''ఏయ్‌ కోతీ! పెద్దవాళ్ళం, మా పందాల సంగతి నీకెందుకే, మర్యాదగా ఆ కుర్రాడు నచ్చాడా లేదా చెప్పు'' అంటూ దబాయించిందావిడ.

''నాకు తెలుసులే! డాడీ ఏదో చిలిపికోరికే కోరి వుంటారు. అయినా నాకెందుగ్గాని మమ్మీ, నువ్వు ఓడిపోయావని చెప్పటానికిమాత్రం విచారిస్తున్నాను.''

''ఏమిటే.....''

''అవును........ నువ్వు ఓడిపోయావు. వినోద్‌ నాకు బాగా నచ్చాడు. ఓ.కె.నా?'' అంటూ ఉత్సాహంతో అరిచి చెప్పి, లైన్‌ కట్‌చేసింది వరేణ్య.

ఇదే విచిత్రం, కొన్ని సందర్బాలు అలా కల్సి వస్తుంటాయి. ఈ మొత్తం వ్యవహారంలో బాధితుడు, పాపం ఒరిజినల్‌ వినోద్‌! బ్రాంచ్‌ ఆఫీసులోకి తన పేరుతో డూప్లికేట్‌ పాగా వేశాడన్న సంగతి మధ్యాహ్నం తను గమనించగానే ఫోన్‌చేసి సుధాకర్‌ నాయుడుగారికి చెప్పాల్సింది. ఆయన ముందు మరింతగా పరువుపోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో ఆయనకు ఫోన్‌ చేయలేదు. ఏం జరుగుతుందో ఒకటి రెండు రోజులు గమనించాక సీన్‌లోకి ఎంటరవుదామనే  ఉద్దేశంతో హోటల్‌ రూంలో పడుకున్నాడతను.

ఇక సుధాకర్‌నాయుడు ఇటు కూతురు వరేణ్యకి ఫోన్‌చేసినప్పుడు గానీ అంటే మేనేజరు మధుసూదనరావుతో మాట్లాడినప్పుడుగానీ, వినోద్‌ విశాఖపట్నం ఎప్పుడొచ్చాడో ఆడిగుంటే అప్పుడే విషయం బయటపడి పోయేది. ఉదయం రైలుదిగినవాడు వినోద్‌ అంటున్నారక్కడ మధ్యాహ్నం ఫ్లైట్‌ దిగిన వినోద్‌ గురించి ఇక్కడ ఎవరికీ తెలీదు. వినోద్‌ గురించి గొప్పగా చెప్పటం ఫోన్‌లో వినగానే సంతోషపడి అసలు విషయం మర్చిపోయాడాయన.

దానిఫలితంగా త్రివిక్రమ్‌కి మరికొంత సమయం దక్కింది.

ఆ రాత్రంతా  త్రివిక్రమ్‌ మీది తీపి ఆలోచనలతో  హేపీగా నిద్రపోయింది వరేణ్య.

''నాకు తెలియాలి.............. నాకిప్పుడే తెలియాలి. మీ ఇద్దరూ వైజాగ్‌ వెళ్ళకుండా, ఇక్కడే ఎందుకు వుండిపోయారో వెంటనే తెలియాలి.

''లాఠీ అందుకొంటూ పెద్దగా అరుస్తూ ముందుకొస్తున్న జైలర్‌ ఆంజనేయుల్ని చూసి వెంకటసామి, ధర్మారావు యిద్దరూ గజగజ వణికిపోయారు. బార్‌లో తాగిన విస్కీమత్తు మొత్తం పాదాల్లోకి దిగిపోయింది.

త్రివిక్రమ్‌ జైలునుంచి తప్పించుకుపోగానే నిన్న సాయంకాలమే ఆంజనేయులు వాళ్ళద్దరికీ నాలుగురోజులు శెలవులిచ్చి చెరో వెయ్యిరూపాయలు ఖర్చులకిచ్చి గప్‌చిప్‌గా వైజాగ్‌ వెళ్ళి త్రివిక్రమ్‌ ని పట్టుకుని వెనక్కు తీసుకురమ్మని పంపించాడు.

అప్పుడేమో బుద్దిమంతుల్లా తలాడించి, కార్యశూరుల్లా బోరవిరిచి బయటికెళ్ళారు. కాని వైజాగ్‌మాత్రం పోలేదు. సిటీలోనేవుండి జల్సాగా తిని తాగేస్తున్నారు. ఇవాళ చీకటిపడ్డాక వాళ్ళ టైం బాగోక వాళ్ళిద్దరూ బార్‌లో ఓ కానిస్టేబుల్‌ కంటపడ్డారు. వాడు జైలుకు ఫోన్‌చేసి చెప్పగానే జైలరు ఆంజనేయులు పంపించిన సెంట్రీలు వచ్చి వీళ్ళిద్దర్నీ పట్టుకుని లాక్కెళ్ళి ఆయనముందు పడేసారు.

''మీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాను. వాడ్ని ఎక్కడ, ఎలా పట్టుకోవచ్చో కూడా సూచించాను. కాని మీరు వైజాగ్‌ పోలేదు. ఎందుకని?'' మరోసారి కళ్ళెర్రచేస్తూ ప్రశ్నించాడాయన.

అప్పుడు కూడా  వాళ్ళిద్దరికీ నోరు పెగల్లేదు.

నీళ్ళు నములుతూ  దిక్కులు చూస్తూ నిలబడ్డారు.

మాట్లాడరేంరా? చెవుల్లో మద్దిచెట్లుగాని మొలిచాయా, లేక నోట్లో కరక్కాలున్నాయా? మీకు తెలుసా? పగలు ఒకడ్ని, రాత్రి ఒకడ్ని జైలు డ్రస్సువేసి సెంట్రీల్ని సెల్‌లో వుంచుతున్నాం. పరవులుపోకముందే ఆ త్రివిక్రమ్‌ని పట్టి లాక్కురమ్మని ఒక పెద్ద కార్యభారాన్ని మీ భుజాలమీదవుంచి పంపించాను. నన్ను మోసం చేసారు. దీనికి మీ సంజాయిషీ అడుగుతున్నాను. నా లాఠీకి పనిచెప్పకుండా మర్యాదగా చెప్తారా లేదా?'' చివరిసారిగా అడిగాడాయన.

అంతే

కూడబలుక్కుట్టుగా

ఆయన కాళ్ళమీద పడిపోయారు  వాళ్ళిద్దరూ

''క్షమించండి మహాప్రభ్రో! అల్పులం................అనామకులం, పిచ్చుకలమీద అణ్వస్త్రం ప్రయోగించకండి, దీనులను అనుగ్రహించండి'' అనరిచారు.

''ఛ............. లేవండి, లేచి నిబడండిరా'' అంటూ తన కాళ్ళు వెనక్కి తీసుకున్నాడాయన.

వాళ్ళిద్దరూ లేచి వినయంగా చేతులుకట్టుకుని నిలబడ్డారు.

వెంకటస్వామి గుడ్లగూబలా చూసాడు.

''క్షమించాలి సార్‌. వైజాగ్‌ వెళ్ళాలనే అనుకున్నాం, కాని మేం త్రివిక్రమ్‌కి ఇవ్వాల్సిన బాకీ గుర్తురాగానే రైలెక్కడానికి కాళ్ళు రాలేదు'' అన్నాడు.

''బాకీనా................ఏంబాకీ?'' ఆశ్చర్యంగా అడిగాడు ఆంజనేయులు.

''నేను నాలుగు వేలు ఇవ్వాలండి. పందాలు ఓడిపోయినబాపతు రెండు వేలు, మా అమ్మాయి పెద్దమనిషి అయినప్పుడు అప్పుగా తీసుకున్న రెండు వేలు కలిపి వాడికి నేను నాలుగువేలు బాకీపడ్డాను సార్‌.''

''అవునుసార్‌. నేను మూడు వేలు బాకీసార్‌, పందాలు ఓడిపోయిన బాపతు పదిహేనువందలు, మొన్నపండుగ ఖర్చులకి అప్పుగా తీసుకుంది పదిహేనువందలు, కలిపి మొత్తం మూడు వేలండి'' చెప్పాడు జైలర్‌.

''బాకీలకి, దీనికి ఏమిట్రా సంబంధం?'' విసుగ్గా అడిగాడు జైలర్‌.

''సంబంధం వుంది సార్‌'' చెప్పాడు వెంకటసామి.

''అప్పుడు మేం వైజాగెళ్ళి వాడ్ని పట్టుకున్నామనుకోండి. మావెంట రమ్మంటే రాడు. గట్టిగా అడిగితే నా బాకీసొమ్ము కట్టండి వస్తానంటాడు. వాడు పెద్ద జాదూగాడుసార్‌ వాడ్ని తీసుకురావటం మావల్లకాదన్పించింది. అందుకే వైజాగ్‌ రైలు ఎక్కలేకపోయాం'' అంటూ వివరించాడు.

'ఏడవలేకపోయారు. యూస్‌లెస్‌ఫెలోస్‌, తీసుకున్న డబ్బుతో ఖుషీ చేసుకుంటున్నారా?''

''లేదుసార్‌........బాధ..............ఇటు మీ ముఖం చూళ్ళేక, అటు విశాఖవెళ్ళలేక మేం నలిగిపోయాంసార్‌, ఆ బాధను దిగమింగటానికి బార్‌లోకొంచెం మందుకొట్టిన మాట వాస్తవంసార్‌. అలాగని మిగిలిన డబ్బు ఏదని మీరు అడిగినా లాభంలేదండి. ఇంట్లో మా ఆడాళ్ళు చొక్కాజేబులు వెదికి డబ్బు తీసుకున్నారండి'' అంటూ ధర్మారావు చెప్పాడు.

వాళ్ళ మాటలువిని పెద్దగా నిట్టూర్చాడు ఆంజనేయులు.

ఇక వాళ్ళనేమీ అనలేదు.

సిగరెట్‌ ముట్టించుకొని ఇన్‌చార్జి సుబ్బారావుని పిలిపించాడు అతను హడావుడిగా వచ్చాడు.

''మనం త్రివిక్రమ్‌ సెల్‌లో వుంచుతున్న సెంట్రీలు ఇద్దర్నీ ఇక్కడికి పంపించు. వాళ్ళ స్థానంలోకి వీళ్ళద్దిర్నీ తీసుకో.......... సుబ్బారావుతో చెప్పాడాయన. అది వింటూనే వాళ్ళిద్దరూ తలమీద పిడుగు పడినట్టు లాఠెత్తపోయాడు.

''సార్‌! ఇదేంన్యాయంసార్‌, బయట పులిలా తిరిగేవాళ్ళం మమ్మల్ని పిల్లినిచేసి, సెల్లో కూర్చోబెట్టడం ధర్మంకాదు సార్‌. ఆ డ్యూటీ వేరే వాళ్ళకు వేయండిసార్‌'' అంటూ అరిచి మొత్తుకున్నాడు.

''నథింగ్‌ డూయింగ్‌ మీ చేతకాని తనానికి ఇదే సరైనశిక్ష. మీకు నేను ఖర్చులకోసం ఇచ్చిన రెండువేలు మీ జీతంలో కట్‌చేసుకుంటాను. సుబ్బారావ్‌...........వీళ్ళను లోనకు పంపించేయ్‌.......'' అంటూ ఆర్డర్‌ వేసాడు జైలరు.

వెంకటస్వామి, ధర్మారావులు లోనకు వెళ్ళిపోయిన కొద్దిసేపటికి మరో ఇద్దరు కానిస్టేబుల్స్‌ జైలర్‌ ముందుకొచ్చి నిలబడ్డారు ఒకడి పేరు భద్రం, రెండో వాడి పేరు వీరభద్రం, షిప్టు పద్దతిలో త్రివిక్రమ్‌ సెల్లో కూర్చుంటోంది వీళ్ళే.

''మీకు వారం రోజులు సెలవు యిస్తున్నాను'' వాళ్ళిద్దర్నీ చూస్తూచెప్పాడు ఆంజనేయులు.

''ఎందుకో తెలుసా? మీ ఇద్దరూ వైజాగ్‌వెళ్ళి, ఆ త్రివిక్రమ్‌ని పట్టుకుని వెనక్కి తీసుకురావాలి ఆ డ్యూటీ మీకు అప్పగిస్తున్నాను మీరు ఆ ఫోర్‌ట్వంటీగాడికి ఏమన్నా బాకీలున్నారేమో, వుంటే ముందే చెప్పి తగలడండి. అంతేగాని వైజాగ్‌ వెళ్ళకుండా చీటింగ్‌చేస్తే మాత్రం మీ సీటుచిరిగిపోతుంది. వెళతారా? అనడిగాడు.

''మేం వాడికి బాకీలేం సర్‌.......ఏరా వీరభద్రం! నువ్వేమన్నా బాకీ వున్నావా?'' అనడిగాడు భద్రం.

''నేను బాకీలేను, పందెం డబ్బులు అప్పుడే యిచ్చేసాను'' చెప్పాడు వీరభద్రం.

''వెరీగుడ్‌ మీకు చెరో వెయ్యిరూపాయలు ఖర్చులకి ఇస్తున్నాను. మరో గంటలో వైజాగ్‌ రైలుంది. ఉదయం అక్కడ దిగ్గానే నాకు ఫోన్‌లో రిపోర్ట్‌చేయాలి. బీకేర్‌ఫుల్‌ క్రికెట్‌ జరిగే స్టేడియం పరిసరాల్లో వాడు మీకు దొరుకుతాడు'' అంటూ తగిన జాగ్రత్తలుచెప్పి చెరో వెయ్యిరూపాయలు ఖర్చులకిచ్చి వాళ్ళిదర్నీ పంపించాడు ఆంజనేయులు.

ఆ రాత్రి చాలా సేపటివరకు త్రివిక్రమ్‌ నిద్రకు దూరమాయ్యడు.

కంపెనీ ఆఫీసు అంటే ఒక ఆఫీసుగానే వూహించాడుగాని అక్కడ వరేణ్యవంటి ఒక హరిణి వుంటుందని అస్సలు వూహించలేదు.

ఏ యువతి కూడా తనను ఇంతగా డిస్ట్రబ్‌ చేయలేదు.

ఎంత వద్దనుకున్నా ఆమె సుందర రూపం కళ్ళముందు నిలబడి, మనసును పులకింపచేస్తోంది. ఎదలో తీయని వూహలు రేపుతోంది. వీణ మీటినట్టుంటే ఆమె తీయని గొంతు ఇంకా చెవిలో గుసగుసలు విన్పిస్తున్నట్టేవుంది.

దేనికయినా అదృష్టం వుండాలి.

ఆమె చేయి అందించినా తను అందుకోలేని స్థితిలో వున్నాడు జీవితంలో ఎండమావులు అంటే ఇంతకన్నా ఉదాహరణ ఏంకావాలి? అయినా ఒక్కరోజులోనే ఆమె తనతో ఇంత క్లోజ్‌గా మూవ్‌కావటం ఏమిటి? తలుచుకుంటే తనకే ఆశ్చర్యంగా వుంది.

తనది పలాయన వాదం.

ఇప్పుడు తనున్న పరిస్థితిలో తప్పించుకొని అవతలకు పోవటం ఎలాగా అనే ఆలోచన తప్ప మరో ఆలోచనకు తావులేదు. కాని వారించినా వినకుండా మనసు ఆమె గురించే ఆలోచిస్తోంది. వరేణ్యలాంటి యువతి భార్యగా దొరకటం అంటే నిజంగా అదృష్టమే.

ఆ రూపం, ఆ నడక, ఆ మాటతీరు, ఆ హుందాతనం, సహజమైన వెన్నెలకన్నా సహజమైన ఆ చిరునవ్వు...............ఆమె పక్కన వుంటే నిజంగా కాలం తెలీదు. ఎడారిలో వున్నా, ఆమె పక్కనవుంటే అది నందనవనంలాగే తోస్తుంది.

కాని..........

ఆమెను చేరుకోలేని ఆశక్తుడు తను, తన పరిస్థితి ఆమెకు ఎలా చెప్పుకునేది? ఛాన్సులేదు.

బాధగా నిట్టూర్చాడు.

ఇంతలో

''హలో బ్రదర్‌...........!'' అంటూ పిలుపు విన్పిస్తే ఉలిక్కిపడి తిరిగి చూసాడు.

పక్కన ఎవరూలేరు. అది అంతరాత్మ పిలుపు.

''మళ్ళీ తయారయ్యావా?'' అంటూ విసుకున్నాడు.

''నేను తయారవటం అలా వుంచు బ్రదర్‌. నీ పరిస్థితి తల్చుకుంటేనే చాలా చాలా బాధగా వుంది'' అంది అంతరాత్మ ఎంతో బాధపడిపోతూ.
కెందుకు బాధ?''

''లేదు లేదు. అదేంలేదు.''

''లేదు లేదనీ ఉన్నది నీలో ఎందుకు దాస్తావూ...........?''

''ఇప్పుడు సినిమాపాట అవసరమా?''

''మరి నువ్వెందుకు నిజం దాస్తావు? వరేణ్యను నువ్వు లవ్‌ చేస్తున్నావు. ఆ పిల్లకూడా నిన్ను లవ్‌ చేస్తోంది. నూరు అబద్దాలాడి ఓ పెళ్ళి చేయమన్నారు. నూరు అబద్దాలాడి కూడా లవ్‌ చేయొచ్చు. సమస్యల్నిపక్కన పడేసి ఆ అమ్మాయితో లవ్‌లో పడిపోయి, హేపిగా డ్యూయెట్టు పాడుకోవచ్చుగదా......... అనవసరంగా ఎందుకు నీకీ మానసిక వేదన?''

''ఇదిగో, పాడు సలహాలివ్వకు, నాకే మానసికా వేదనాలేదు. అయాం ఓ.కె. కాదంటే  ఆమెకు నామీద ఇంట్రెస్ట్‌ ఏమిటో అర్ధంగాక ఆలోచిస్తున్నానంతే.''

''కోతలు కోయకు బ్రదర్‌. జీవితంలో అవకాశం ఒక్కసారే వస్తుంది. నీకో సంగతి చెప్పనా? గొప్ప సీక్రెట్‌?''

''చెప్పు. ఏమిటది?''

''జీవితంలో నువ్వు ఎవరినయినా ప్రేమించవచ్చు, ఎంతమందినైనా ప్రేమించవచ్కు. అది గొప్ప విషయంకాదు. నిన్ను ప్రేమించే మనిషి దొరకటమే కష్టం. నిజమైన ప్రేమకు క్షమించే గుణం కూడా వుంటుంది. ఆ విధంగా చూస్తే నీ గురించి నిజం తెలిసినా, ఆ పిల్ల నిన్ను కాదనదు. నిన్ను అర్ధంచేసుకుని క్షమిస్తుంది.

''చెప్పుతో కొడుతుంది. ఏమిటి అర్ధంలేకుండా మాట్లాడుతున్నావ్‌? ఒక మనిషిస్థానంలో మరో మనిషి చెలామణి కావటం మోసమే అవుతుంది. పెద్ద నేరం తెలుసా? ఎవరూ క్షమించరు.''

''అరె కోప్పడకు బ్రదర్‌. ఇది నువ్వు కావాలని చేసిందేమి కాదు గదా?''

''కావాలని చేసినా కాకతాళీయంగా చేసినా తప్పుఒప్పయిపోదు. నేను ఆమెకు దూరంగా వుండటమే న్యాయం. అసలు ఈ రాత్రికే జండా ఎత్తేయాలన్న ఆలోచన వుంది.

తర్వాత ఆమె ఎవరో, నేను ఎవరో, ఇక నువ్వు పిచ్చి సలహాలివ్వక దయచేస్తే మంచిది. అవుట్‌.......... గెట్‌ అవుట్‌'' అంటూ అంతరాత్మను బలవంతంగా నెట్టేసాడు.

ఆ తర్వాత గదిలో వుండబుద్దికాలేదు.

తప్పించుకోడానికి అవకాశం వుంటుందేమో పరిశీలించే ఉద్దేశంతో లుంగీ ఎగ్గట్టి బయటకు వచ్చాడు. అది సాధ్యంకాదని అర్ధమైపోయింది. అడుగు బయట పెడితే చాలు.

ఏం కావాలి సార్‌? అంటూ నౌకర్ల హడావుడి. కారు డ్రయివరు తాతారావు కారుతోబాటు ఇక్కడ వుండిపోయాడు. గేటు దగ్గర షిప్టు పద్దతిలో పగలు రాత్రి ఇద్దరు సెక్యూరిటి.

ఏ రాత్రో తను బయటకు అడుగుపెడితే, పొరబాటున దొంగ అనుకుని తన తాటతీసేస్తారు వీళ్ళు.

ఈ రాత్రికి తను చేయగలిందిలేదు. రేపు పగలు ఏదో ప్లాన్‌చేసి తప్పించుకోవాలి. అనుకుంటూ వెనక్కివచ్చి బెడ్‌మీద పడుకున్నాడు. అంతలోనే మరో డౌటు.

ఉదయం వరేణ్య తనకోసం వస్తుందా?

టూర్‌కి తనతో తీసుకెళుతుందా?

అలా వెళ్ళటం జరిగితే తను రేపు కూడా తప్పించుకోలేడు. కాని ఆమె రాదు అనే చెప్తోంది అతరాత్మ.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kittugaadu - inter fail.. ias pass