Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with isha talvar

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష - ఆటోనగర్ సూర్య

Movie Review - Autonagar Surya

చిత్రం: ఆటోనగర్‌ సూర్య
తారాగణం: నాగచైతన్య, సమంత, సింగంపల్లి మురళి, సాయికుమార్‌, నందు, జయప్రకాష్‌రెడ్డి, అజయ్‌, రఘుబాబు, ఆహుతి ప్రసాద్‌, బ్రహ్మానందం తదితరులు
ఛాయాగ్రహణం: శ్రీకాంత్‌ నరోజ్‌
సంగీతం: అనూప్‌ రుబెన్స్‌
నిర్మాణం: మ్యాక్స్‌ ఇండియా ప్రొడక్షన్స్‌
దర్శకత్వం: దేవ్‌ కట్టా
నిర్మాత: అచ్చిరెడ్డి
విడుదల తేదీ: 27 జూన్‌ 2014

క్లుప్తంగా చెప్పాలంటే
ఆటోనగర్‌లో పెరిగి పెద్దవాడవుతాడు సూర్య (నాగచైతన్య). ఆటోమొబైల్‌ రంగమంటే ఇష్టం పెంచుకున్న సూర్య, అనుకోకుండా ఓ హత్య కేసులో జైలుకు వెళ్తాడు. జైలు నుంచి తిరిగొచ్చేసరికి, ఆటోనగర్‌లో పరిస్థితులు మారిపోతాయి. ఆటోనగర్‌లో మాఫియా నడుస్తుంటుంది. ఆ మాఫియాని నడుపుతూ, ఆటోనగర్‌ వాసుల్ని ఇబ్బందులకు గురిచేస్తుంటారు మేయర్‌ (మురళి), కార్పొరేటర్‌ ఇంద్ర (జయప్రకాష్‌రెడ్డి). మరోపక్క సూర్య, సిరి అనే అమ్మాయితో ప్రేమలో పడ్తాడు. ఆటోనగర్‌లో ముదిరిపోయిన మాఫియాని ఎలా ఎదుర్కొన్నాడు.? ప్రేమించిన సిరిని ఎలా సూర్య దక్కించుకున్నాడు? అనేది మిగతా కథ. అది తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే
నాగచైతన్యకి మంచి పాత్ర దక్కింది. తనవరకూ న్యాయం చేశాడు. పవర్‌ఫుల్‌ రోల్‌ దక్కింది నాగచైతన్యకి ఈ సినిమా ద్వారా. అయితే బరువైన పాత్ర కావడంతో, ఇంకొంచెం మెరుగ్గా వుండాల్సింది అతని నటన అన్పిస్తుంది. హీరోయిన్‌ సమంత సహజంగానే అందంగా కన్పించింది. సిరి పాత్రలో క్యూట్‌ క్యూట్‌గా ఒదిగిపోయింది. మిగతా పాత్రధారుల విషయానికొస్తే, తెరపై హావభావాలు పండించే విషయంలో మురళికి మంచి మార్కులు పడ్డాయి. అతని నటన ఆకట్టుకుంటుంది. జయప్రకాష్‌రెడ్డి మామూలే. నందు, సాయికుమార్‌ తదితరులు ఓకే. రఘుబాబు కాస్త నవ్వించాడు. బ్రహ్మీ కూడా నవ్వులు పూయించాడు. మిగతా పాత్రధారులంతా తమ పరిధుల మేర ఫర్వాలేదన్పించారు.

సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్‌ ఫర్వాలేదంతే. ఇంకాస్త బెటర్‌గా ఎడిటింగ్‌ చేసి వుండాల్సింది. కాస్ట్యూమ్స్‌ బావున్నాయి. సినిమా బ్యాక్‌గ్రౌండ్‌కి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్‌ విభాగం పనిచేసింది. దాంతో రియలిస్టిక్‌ ఫీలింగ్‌ కలుగుతుంది చూసే ప్రేక్షకులకి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకోదు. పాటలూ నిరాశపరుస్తాయి. స్క్రిప్ట్‌లో కొత్తదనమేమీ లేకపోయినా, స్క్రీన్‌ప్లేతో కాస్తంత ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. డైలాగ్స్‌ బావున్నాయిగానీ చాలా లెంగ్తీగా వుండి, కొంచెం అసహనానికి గురిచేస్తాయి. పవర్‌ఫుల్‌ స్టోరీ లైన్‌ తీసుకున్న దర్శకుడు, తెరపై పాత్రల్ని నడిపించడంలో కన్‌ఫ్యూజన్‌కి గురయ్యాడు.

మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్ట్‌ తగ్గితే అది సినిమాపై ఎక్కువ ప్రభావమే చూపిస్తుంది. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. సీరియస్‌ మాస్‌ మూవీ కావడం, దానికి తోడు సినిమా నిడివి ఎక్కువవడంతో ఆడియన్స్‌ బోరింగ్‌గా ఫీలవుతారు. ఫస్టాఫ్‌ యాక్షన్‌తోనూ, రొమాన్స్‌తోనూ ఫర్వాలేదన్పిస్తుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఓకే. సెకెండాఫ్‌లో సినిమా పైకి లేస్తుంది. కానీ ఎండింగ్ మళ్ళీ డల్‌ అయిపోతుంది. డల్‌ మూమెంట్స్‌ని ఎడిటింగ్‌లో తగ్గించి వుంటే, సినిమా బోరింగ్‌గా వుండేది కాదు.

ఒక్కమాటలో చెప్పాలంటే: పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌ అయినా డీల్‌ చేయడం కుదరలేదు

అంకెల్లో చెప్పాలంటే: 2.75/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka