Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
competion between glamarous aunties

ఈ సంచికలో >> సినిమా >>

ఆ డైరెక్టర్‌ అవేమీ పట్టించుకోడు

shanker never cares all like that

‘ఐ’ సినిమా వివాదాలకు కేంద్ర బిందువు అవుతుంది. సినిమా విడుదలవడం అనుమానమేనని తమిళ సినీ పరిశ్రమలో గాసిప్స్‌ వ్యాప్తి చెందుతున్నప్పటికీ వాటిని సంచలన దర్శకుడు శంకర్‌ పట్టించుకోవడంలేదు. శంకర్‌ సినిమా ప్రారంభం నుంచే సంచలనాలుంటాయి. కొన్నిసార్లు వివాదాలు వస్తాయే తప్ప, అవేవీ సినిమాకి ఆటంకాలు కలిగించవు. అది శంకర్‌ ధీమా.కాని హీరో విక్రమ్‌ అలా కాదు. అతనికి ‘ఐ’ సినిమా విజయం అత్యవసరం. శంకర్‌తో ఇదివరకు చేసిన ‘అపరిచితుడు’ పెద్ద హిట్‌. ఆ తరువాత విక్రమ్‌ సరైన హిట్స్‌ అందుకోని కారణంగా, ‘ఐ’ సినిమా ఎలాంటి వివాదాల్లేకుండా పెద్ద విజయం సాధించాలని విక్రమ్‌ ఆశిస్తున్నాడు.

విజయంపై విక్రమ్‌కి కూడా ధీమా వుంది. అది శంకర్‌ మీద నమ్మకమే. విక్రమ్‌ ఆందోళన, శంకర్‌ ధీమా అలా ఉంటే, సినిమా బిజినెస్‌ చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది. హాలీవుడ్‌ స్థాయి టెక్నాలజీని సినిమాకి వాడిన శంకర్‌, హాలీవుడ్‌ సినిమాలకు ఇండియన్‌ సినిమా తక్కువేం కాదని నిరూపించబోతున్నాడు. షాట్‌ మేకింగ్‌ దగ్గర్నుంచి, సంగీతం వరకు ఏ విషయంలోనూ శంకర్‌ కాంప్రమైజ్‌ అవలేదు. వివాదాల సంగతేంటని శంకర్‌ని అడిగితే, వాటిని గురించి పట్టించుకుంటే క్రియేటివిటీ దెబ్బ తింటుందని ఆయన సమాధానమిచ్చాడు.

మరిన్ని సినిమా కబుర్లు
when is the movie of  100crores budget...