Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
when is the movie of  100crores budget...

ఈ సంచికలో >> సినిమా >>

డైరెక్టర్‌గారబ్బాయి హీరోగా వచ్చేస్తున్నాడు

director son coming as hero

బాల నటుడిగా కొన్ని సినిమాల్లో నటించిన పూరి ఆకాష్‌, హీరో అవ్వడానికి రంగం సిద్ధమైనట్టే కనిపిస్తున్నది. ‘ధోని’ అనే సినిమాలో బాల నటుడిగానే ఫుల్‌ లెంగ్త్‌ పాత్రలో కనిపించాడతడు. మరాఠీలో ఘనవిజయం సాధించిన ‘టైమ్‌పాస్‌’ అనే మరో సినిమాలో పూరి ఆకాష్‌ నటిస్తున్నాడు. అయితే ఇదికూడా బాలనటుడి ఛాయలున్న సినిమానే.మంచి హైట్‌తో హీరోకి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్‌తో హీరోగా ఎంట్రీకి రెడీగా ఉన్న పూరి ఆకాష్‌ని తానే పవర్‌ఫుల్‌ రోల్‌లో పరిచయం చేయాలనుకుంటున్నాడట ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌.

ఇదివరకు ఓ సారి తనకూ దర్శకత్వం వహించాలనే కోరిక వుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు పూరి ఆకాష్‌. ఆకాష్‌ బాబాయ్‌ సాయిరాం శంకర్‌ కూడా డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచే నటన వైపుకు మారాడు. హీరో ఇమేజ్‌కి వున్న కిక్‌ అలా ఉంటుంది.‘టైమ్‌ పాస్‌’ సినిమా తర్వాత పూరి ఆకాష్‌, పూర్తిస్థాయి హీరోగా మారొచ్చు. అయితే హీరోగా తన కొడుకు సినిమా కెరీర్‌ గురించి పూరి ఇప్పటికైతే ఎలాంటి స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదు. పూరి ఆకాష్‌, ‘టైమ్‌పాస్‌’ సినిమా వివరాల్ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడిరచాడు. అతనికి బెస్టాఫ్‌ లక్‌ చెప్దాం.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam