Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
shivakashi

ఈ సంచికలో >> శీర్షికలు >>

Happy Deepavali

వారఫలం (అక్టోబర్ 17 నుండి అక్టోబర్ 23వరకు ) - శ్రీకాంత్

మేష రాశి

ఈ వారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. ఆశించిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది కాకపోతే సరైన సమయంలో నిర్ణయం తీసుకోవడం అనేది సూచన. బంధువర్గంతో ఏవైనా చర్చలు చేయునపుడు వారి ఆలోచనలు పరిగణలోకి తీసుకోండి మాటపట్టింపులకు పోకపోవడం అనేది ఉత్తమం. ఉద్యోగంలో బాగానే ఉంటుంది నూతన పరిచయాలకు అవకాశం కలదు అలాగే కొత్త కొత్త ఆలోచనలు కలిగి ఉండి వాటికి సమయాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ధనమునకు సంభందించిన విషయాల్లో ఫలితాలు అనుకూలంగానే వచ్చుటకు ఆస్కారం ఉంది. దైవపూజలకు ప్రాధాన్యం ఇస్తారు  మానసికంగా సంతోశంను కలిగి ఉంటారు.

 

 

 

వృషభ రాశి

 ఈ వారం మొత్తంమీద చేపట్టు పనుల విషయంలో పూర్తిస్థాయి అవగాహనతో ముందుకు వెళ్ళడం మూలాన మేలుజరుగుతుంది. నలుగురితో కలిసి పనిచేసే సమయంలో అవతలి వారి ఆలోచనలు పాటించే ప్రయత్నం చేయుట ఉత్తమం. సోదరవర్గం నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది వాటికి సమయాన్ని ఇచ్చే ప్రయత్నం చేయుట మేలు. సంతానవిషయంలో ఊహించని ఖర్చులకు ఆస్కారం ఉంది ఈవిషయంలో బాగాఆలోచించి ముందుకు వెళ్ళుట సూచన. ప్రయాణాలు చేయుటకు నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు అవి ఫలించే అవకాశం లేకపోలేదు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోవడం వలన నూతన అవకాశాలు పొందుతారు. జీవితభాగస్వామితో చర్చలు చేపట్టుటకు అవకాశం ఉంది.   

 

    

 

మిథున రాశి

ఈ వారం మొత్తంమీద మీరు చాలావరకు జాగ్రత్తలు పాటించుట వలన మేలుజరుగుతుంది. మీయొక్క వ్యవహారశైలి మూలాన నూతన సమస్యలు పొందుతారు కావున జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. నచ్చిన వ్యక్తులను కలిసే అవకాశం ఉంది వారితో కలిసి ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ధనమునకు సంభంధించిన విషయాల్లో నూతన ఆలోచనలు పక్కనపెట్టి సంప్రదాయ విధానాలు పాటించుట ఉత్తమం. ప్రయాణాలు వాయిదావేయుట వలన మేలుజరుగుతుంది. వాహనముల మూలాన ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల మూలాన పనిఒత్తిడి ఉన్నను ఆశించిన స్థాయిలో మంచి గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది విందులలో పాల్గొంటారు.

 

 

 

 

కర్కాటక రాశి

ఈ వారం మొత్తంమీద చిన్న చిన్న పనులకు ప్రాధాన్యం ఇవ్వడం మూలాన పనులు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. నూతన ఆలోచనలు కలిగి ఉండే అవకాశం ఉంది. అధికారులకు అనుగుణంగా నడుచుకోండి. ఉద్యోగంలో సంతృప్తికరమైన ఫలితాలు వస్తాయి కొంత సర్దుకుపోవడం వలన మరింత మేలుజరుగుతుంది. సోదరివర్గం నుండి నూతన సమాచరం అందుకొనే అవకాశం ఉంది. కుటుంబంలో సభ్యులమధ్య సాన్నిహిత్యం పెంచుకొనే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. సంతానపరమైన విషయాలలో నిదానంగా వ్యవహరించుట మంచిది. పెద్దలతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది వారి ఆలోచనలను పాటించే ప్రయత్నం చేయుట ఉత్తమం. మిత్రులతో కలిసి దూరప్రదేశాలు ప్రయాణం చేయుటకు అవకాశం ఉంది.  

 

 

 

 

సింహ రాశి

ఈ వారం మొత్తంమీద అధికమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. నూతన ప్రయత్నాల విషయంలో ఆచితూచి వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు అనవసరమైన ఖర్చులకు తావివ్వకండి. స్త్రీ / పురుష సంభందమైన విషయాల వలన మాటపడవలసి రావోచ్చును కావున జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. ధనమునకు సంభించిన విషయాల్లో కొత్త కొత్త ఆలోచనలు కలిగి ఉండి ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది అవి ఆశించిన ఫలితాలు ఇవ్వడం అనేది ఊరట. పెద్దలతో అనుభందాలు పెంపొండుచుకొనే ప్రయత్నం చేయుట అనేది అవసరం లేకపోతే మీ మధ్య దూరాలు పెరుగుటకు అవకాశం ఉంది.   

 

 

కన్యా రాశి

ఈ వారం మొత్తంమీద బంధువులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. మిత్రులతో కలిసి విందులలో పాల్గొంటారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలిసి వస్తాయి కాకపోతే తొందరపాటు నిర్ణయాలు లేక ఆలోచనల మూలాన కొంత నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్త. ఉద్యోగంలో అధికారుల నుండి మంచి గుర్తింపును పొందుతారు పనుల విషయంలో మంచి ప్రణాళిక అవసరం. మాటను పోద్పుగా వాడుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచన. ఇష్టమైన వ్యక్తుల నుండి నూతన సమాచరం సేకరిస్తారు వారికి అనుగుణంగా ఆలోచనలు చేయుట మంచిది. దూరప్రదేశం నుండి ఒక సంతోషకరమైన వార్తను వింటారు.

 

 

 

తులా రాశి

ఈ వారం మొత్తంమీద చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది కావున సమయపాలన అలాగే చక్కటి ప్రణాళికను సిద్దం చేసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి వాటికి సమయం ఇస్తారు. బంధువులతో లేక మిత్రులతో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో బాగానే ఉంటుంది కాకపోతే మీ ఆలోచనల స్థాయిమార్పు అవసరం. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం ఊహించని ఖర్చులకు ఆస్కారం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. పెద్దలనుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించుట వలన మేలుజరుగుతుంది. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట మంచిది

 

వృశ్చిక రాశి

ఈ వారం మొత్తంమీద చర్చల్లో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది అలాగే పెద్దలకు అనుగుణంగా నడుచుకోవడం వలన లబ్దిని పొందుతారు. అధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది వారితో నూతన సమాలోచనలు చేయుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో తోడ్పాటు లభిస్తుంది కుటుంబసభ్యుల నుండి ఆశించిన సహకారం లభిస్తుంది. పనిభారం తప్పకపోవచును ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్ళుట సూచన లేకపోతే స్వల్ప ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయలలో నూతన పెట్టుబడులకు ఇది సమయం కాదు వేచిచూసే దొరని మంచిది. ఆరోగ్యం మూలాన చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు పాటించుట వలన మేలుజరుగుతుంది.   

 

ధనస్సు రాశి

ఈ వారం మొత్తంమీద విదేశీప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశం ఉంది ప్రయత్నం పెంచుట సూచన. స్వల్పఆరోగ్యసమస్యలు తప్పకపోవచ్చును సమయానికి భోజనం చేయుట మంచిది. పనులవిషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. అధికారులతో విభేదాలకు అవకాశం కలదు ఈ విషయంలో నిదానంగా వ్యవహరించుట సూచన. బంధువులతో కలిసి చేపట్టిన పనుల్లో అనుకోని ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నంలో విఫలం అవుతారు. దిద్దుబాటు చర్యలు పెద్దల సూచనల మేర చేయుట వలన నష్టంకొంత తగ్గుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటిలో ఇబ్బందులు కలుగుతాయి జాగ్రత్త. కుటుంబంలో నూతన నిర్ణయాలు తీసుకోకండి కొంతకాలం ఆగడం మేలు.   

 

 

మకర రాశి

ఈ వారం మొత్తంమీద పెద్దలతో గుర్తింపును పొందుతారు అలాగే వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను కాస్త నిదానంగా పూర్తిచేసే అవకాశం ఉంది శ్రమ,భారం తప్పకపోవచ్చును. ప్రయాణాలు చేయకండి అవసరమైతే వాయిదావేయుట వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులను తగ్గించుకోవడం వలన ఉద్యోగంలో అధికారులతో కలిసి చర్చల్లో పాల్గొంటారు అలాగే నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. సేవాసంభందమైన పనులను మొదలుపెడతారు నలుగురికి ఉపయోగపడే పనులను చేపట్టుట మంచిది. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి వివాదములకు దూరంగా ఉండుట సూచన. మిత్రులను కలిసే అవకాశం ఉంది.   

 

కుంభ రాశి

ఈ వారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుతారు. మీ ఆలోచనలే ఫలితాలను నిర్దేశిస్తాయి కావున ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళుట మంచిది. తలపెట్టిన పనులలో ఆశించిన ఫలితాలు వస్తాయి. కుటుంబంలో సభ్యుల ద్వార నూతన ఆలోచనలు చేస్తారు కాకపోతే సాధ్యాసాధ్యాలు ఆలోచించి ముందుకు వెళ్ళుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో బాగానేఉన్న దానికితగ్గట్టుగా ఖర్చులు పెరుగుటకు ఆస్కారం కలదు. మిత్రులతో స్వల్ప విభేదాలు రావడానికి అవకాశం ఉంది సర్దుబాటు చాలాఅవసరం. అనారోగ్యసమస్యలు తప్పకపోవచును తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సమయానికి భోజనం చేయుట ఉత్తమం. నూతన ప్రయత్నాల్లో పనిభారం ఉంటుంది నిదానంగా ముందుకు వెళ్ళుట సూచన.     

 

మీన రాశి

ఈ వారం మొత్తంమీద చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. చిన్న చిన్న తడబాటులు ఉన్న సర్డుకొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో గుర్తింపును పొందుతారు. మీ నిర్ణయాలు చాలామార్పులకు సంకేతం కావున బాగాఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. సంతానపరమైన విషయాల్లో సంతృప్తిని అలాగే సంతోశంను పొందుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు మాత్రం చేయకండి వాహనముల మూలాన ఇబ్బందులు తప్పక పోవచ్చును. నలుగురికి ఉపయోగపడే పనులను మొదలు పెడతారు అందరిలో గుర్తింపు లభిస్తుంది. అమ్మతరుపు వారి నుండి చిన్న చిన్న సమస్యలు తప్పక పోవచును సర్దుబాటు అవసరం.

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
sahiteevanam