Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mother is god for lawrence

ఈ సంచికలో >> సినిమా >>

టాలీవుడ్‌కి కొత్త బ్యూటీ దొరికింది

tolywood got new beauty

తెలుగు సినిమాని హీరోయిన్ల కొరత వెంటాడుతున్నది. అనుష్క, నయనతార లాంటోళ్ళు సీనియర్లు అయిపోగా, కాజల్‌, తమన్నా, శృతిహాసన్‌, సమంత తదితర హీరోయిన్లు కూడా సీనియర్లు అయిపోతున్నారు. కొత్త హీరోలకు కొత్త హీరోయిన్లు దొరకడం కష్టమవుతోంది. రిపీట్‌ కాంబినేషన్లు తప్ప కొత్త కాంబినేషన్లు కుదరని పరిస్థితి. ఈ టైమ్‌లో తెలుగు సినీ పరిశ్రమకి ఓ కొత్త బ్యూటీ దొరికింది. ఆమె పేరు పూజా హెగ్దే.

‘ఒక లైలా కోసం’ సినిమాతో మంచి మార్కులేయించుకున్న పూజా హెగ్దే, నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్‌తో ‘ముకుంద’ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇవి కాకుండా ‘ఒక లైలా కోసం’ ఇచ్చిన సక్సెస్‌తో హీరోలు, దర్శక నిర్మాతలు పూజా హెగ్దే డేట్స్‌ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో ఆమెకు అవకాశాలు బాగా వచ్చిపడ్తున్నాయట.

పూజా హెగ్దేతోపాటు రాశీ ఖన్నా కూడా హీరోయిన్‌గా దూసుకుపోనుంది తెలుగు సినిమాల్లో. ఆమె తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’. అందానికి అందం, గ్లామర్‌కి గ్లామర్‌ మెండుగా ఉన్న హీరోయిన్లు తెలుగు పరిశ్రమకు మరికొంతమంది రావాల్సి ఉంది. అప్పుడుగాని ఇండస్ట్రీకి హీరోయిన్ల కొరత తీరదు.

మరిన్ని సినిమా కబుర్లు
running cool