Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
tolywood got new beauty

ఈ సంచికలో >> సినిమా >>

కూల్‌ కూల్‌గా దూసుకుపోతున్నాడు

running cool

తెలుగు సినిమాల్లో ఎనర్జిటిక్‌ స్టార్‌ అంటే రవితేజనే. అంత ఎనర్జీతో తెరపై కన్పించాలనుకునే కుర్ర హీరోలు కొందరు అతన్ని ఫాలో అవుతారుగానీ, రవితేజలా ఎనర్జిటిక్‌ స్టార్స్‌ అవలేదు. రవితేజని ఇమిటేట్‌ చేస్తున్నట్లుండేలా కెరీర్‌ తొలినాళ్ళలో కనిపించిన యంగ్‌ హీరో నిఖిల్‌, ఇప్పుడు రూటు మార్చాడు. ‘స్వామిరారా’ సినిమాతో డీసెంట్‌ హిట్‌ కొట్టాక, అతని నుంచి వచ్చిన ఇంకో హిట్‌ ‘కార్తికేయ’
నిఖిల్‌ కెరీర్‌లో హిట్‌ అయిన రెండు సినిమాలు (తొలి సినిమా కాకుండా) అతని కూల్‌ పెర్ఫామెన్స్‌ కారణంగానే అని సినీ పండితులూ అభిప్రాయం వ్యక్తం చేయడంతో, నిఖిల్‌ కూడా కెరీర్‌లో ఇకపై కూల్‌ సినిమాలపైనే దృష్టిపెట్టాలనే నిర్ణయానికి వచ్చాడట.

డాన్సులు చేయడంలోనూ, యాక్షన్‌ సీన్స్‌ని ఇరగదియ్యడంలోనూ భేష్‌ అనిపించుకుని, మాస్‌ హీరో ఇమేజ్‌ కోసం హీరోలు ప్రయత్నించడం రివాజు ఇప్పటిదాకా. హీరో నితిన్‌ కూడా యాక్షన్‌ సినిమాలు చేయాలనుకుని బోల్తా కొట్టాడు. అతనికీ క్లాస్‌ సినిమాలతోనే వరుస సక్సెస్‌లు వస్తున్నాయి ప్రస్తుతం.

అందుకే నిఖిల్‌ కూడా, రవితేజలా ఎనర్జీని ప్రదర్శించడం కన్నా, నితిన్‌లా తనకు సూటయ్యే పాత్రల ఎంపికపై దృష్టిపెట్టాడంట. ఏ జోనర్‌లో తనకు బలం వుందో తెలుసుకున్నవాడే నిజమైన హీరో. ఓసారి స్టార్‌ డమ్‌ వచ్చాక, ఏం చేసినా అది ప్రయోగం అవుతుంది. అప్పటివరకూ నిఖిల్‌, తనను తాను నిరూపించుకోడానికి ట్రై చెయ్యాలన్న ఆలోచన చేయడం నిజంగా సూపర్బ్‌.

మరిన్ని సినిమా కబుర్లు
where the people who supported to shwetha