Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

రూమర్స్‌పై స్పష్టతనిచ్చిన రేణుదేశాయ్‌

renu clarify on rumors

పవన్‌కళ్యాణ్‌ ఒకప్పటి భార్య రేణుదేశాయ్‌, పవన్‌కళ్యాణ్‌తో విభేదాలపై స్పష్టతనిచ్చారు. పవన్‌కళ్యాణ్‌తో విడిపోయిన మాట వాస్తవమేననీ, అయితే దానికి గల కారణాలు తమకు మాత్రమే తెలుసుననీ, గొడవలతో తామిద్దం విడిపోలేదని ఓ అవగాహనతోనే విడిపోయామని చెప్పారు రేణుదేశాయ్‌.

విడాకుల కోసం 40 కోట్లు తాను డిమాండ్‌ చేశానన్న వార్తల్లో నిజం లేదని రేణు వివరించారు. ఒకే ప్రేమ, ఒకే పెళ్ళి అనే సిద్ధాంతానికి తాను కట్టుబడి ఉన్నట్లుగా చెప్పిన రేణు, భవిష్యత్తులో ఇంకెవరూ తన మనసులో చోటు సంపాదించుకోలేరని అన్నారు. అఖిరా, ఆధ్యలను బాగా చదివించుకోవడం, వారిని ఉన్నత శిఖరాల్లో చూడటమే తన బాధ్యత అని చెప్పారామె.

సినిమా రంగంలోకి వస్తాననే తాను ఎప్పుడూ అనుకోలేదనీ, నిర్మాణం, దర్శకత్వం కూడా అనుకోకుండా జరిగినవేనని చెప్పిన రేణు, పవన్‌కళ్యాణ్‌ ఎప్పటికీ తన గుండెల్లో ఉంటారని, ఆయన మీద అభిమానం, ప్రేమ ఎప్పటికీ తరగిపోవని రేణు స్పష్టంగా చెప్పారు. అంత గొప్ప మనిషిని కొన్ని కారణాలతో దూరం చేసుకోవాల్సి వచ్చిందని అన్నారు రేణు దేశాయ్‌.

మరిన్ని సినిమా కబుర్లు
memusaitam great commitment