Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sweet singing by pooja hegde

ఈ సంచికలో >> సినిమా >>

గ్లామర్‌ చెదిరి జీవితం మోడువారి

pity heroyin............

సినిమా రంగాన్ని గ్లామర్‌ ప్రపంచంగా పిలుస్తారు. గ్లామర్‌ ఉన్నంత కాలమే హీరోయిన్లకు వెలుగు. ఆ తరువాత ఆర్థిక ఇబ్బందుల్లో హీరోయిన్లు కూరుకుపోతారు. హీరోలు, ఇతర నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు కూడా కెరీర్‌ అనుకున్నట్లు సాగక, ఆర్థిక ఇబ్బందులతో దుర్భర జీవితం గడిపిన సందర్భాలున్నాయి. హీరోయిన్ల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది.

రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ వంటి మేటి హీరోల పక్కన హీరోయిన్‌గా నటించిన నిషా అనే ఒకప్పటి హీరోయిన్‌, జీవితపు చివరి రోజుల్ని దుర్భరంగా గడుపుతోంది. రోడ్డుపక్క అనాదలా పడి ఉన్న ఆమెను గుర్తుపట్టిన కొందరు ఆమె దయనీయ స్థితిని జాతీయ మానవ హక్కుల సంఘానికి తెలియజేశారు. స్పందించిన మానవ హక్కుల సంఘం, తక్షణం నిషాకు వైద్య చికిత్స అందించాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తున్నది.

తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా నిషా ఒకప్పుడు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. రజనీకాంత్‌తో ‘రాఘవేంద్ర’, కమల్‌హాసన్‌తో ‘టిక్‌ టిక్‌’ అనే సినిమాల్లో నటించారామె. 30 ఏళ్ళ క్రితం నాటి ఆమె సినిమా కెరీర్‌ ముచ్చట్లు ఇవి. ఇప్పుడామె స్థితి అత్యంత దయనీయం.

మరిన్ని సినిమా కబుర్లు
heroin speed