Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
small movies celebration

ఈ సంచికలో >> సినిమా >>

జోరు, జోష్‌ కలిసొచ్చేశాయి

joru and josh

ఓ సినిమా ఓ హీరోయిన్‌ జాతకాన్ని మార్చేస్తుంది. హీరోయిన్లందరికీ ఇది వర్తించదు. ఓ హిట్‌ కొట్టి, ఆ తర్వాత తెరపై కన్పించకుండా పోయే హీరోయిన్లూ ఉన్నారు. రాశీ ఖన్నా అలా కాదు. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో వస్తూనే టాలీవుడ్‌ సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. ‘జోరు’ సినిమాలో నటించిన రాశి ఖన్నా, ఆ సినిమా విజయం సాధించకపోయినా, సినీ ఇండస్ట్రీని ఇంకా బాగా తనవైపుకు తిప్పుకుంది. టాలీవుడ్‌లో ఇప్పుడు బాగా దూకుడు చూపిస్తున్న హీరోయిన్లలో రాశి ఖన్నా పేరు కూడా బాగా విన్పిస్తోంది.

‘జోరు’ సినిమాలో ఆమె నటన కన్నా, ఆ సినిమా ప్రోమో సాంగ్‌లో రాశి ఖన్నా జోష్‌ చూసి ఫిదా అయిపోయారట సినీ ఇండస్ట్రీలో చాలామంది. అదే రాశి ఖన్నాకి హీరోయిన్‌గా మైలేజ్‌ తెచ్చింది.అందానికి అందం, అభినయనానికి అభినయం మెండుగా ఉన్న రాశి ఖన్నాకి అదనపు ఆకర్షణ ఆమెలోని సింగింగ్‌ టాలెంట్‌. ఒక్క సక్సెస్‌, అది కూడా మంచి సక్సెస్‌ దొరికితే టాప్‌ ఫైవ్‌ హీరోయిన్స్‌ లిస్ట్‌లో తన పేరు ఖచ్చితంగా చేరుతుందనే ఆత్మవిశ్వాసంతో రాశి ఖన్నా ఉంది. ఆల్‌ ది బెస్ట్‌ రాశి ఖన్నా.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam