కావాల్సిన పదార్థాలు : ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, మామిడి కాయ ముక్కలు మరియు చిన్న చేపలు. ముందుగా బాణలి లో కొద్దిగా నూనె వేసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. ఇప్పుడు చేపల్ని వేసుకొని, తగినంత పసుపు, ఉప్పు , కారం వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. తరువాత ఒకసారి కలుపుకొని మామిడి కాయ ముక్కల్ని వేసుకొని మూత పెట్టి ఉడికించాలి. ఒక పదిహేను నిమిషాల తరువాత ఒక సారి చూసి నీటి బుడగలు తగ్గి నూనె పైకి వచ్చాక ఘుమఘుమలాడే మామిడికాయలు - చిన్న చేపలు కూర రెడీ
|