Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
'express beauty' proved her

ఈ సంచికలో >> సినిమా >>

‘పీకే’ ఓ అద్భుతం

wonderful 'pk'

చాలా రోజులనుంచి సినీ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూశారు ‘పీకే’ సినిమా కోసం. రానే వచ్చింది ‘పీకే’ ప్రేక్షకుల ముందుకు. మంచి కథల్ని ఎంచుకుని, అత్యద్భుతమైన సినిమాల్ని తీసే రాజ్‌కుమార్‌ హిరానీ ‘పీకే’తోనూ నిరాశపర్చలేదు. అమీర్‌ఖాన్‌ మరోసారి అద్భుతమైన నటనా ప్రతిభతో ‘పీకే’లోని తన పాత్రకు వన్నెతెచ్చారు.

దాంతో ‘పీకే’ సంచలన విజయాన్ని నమోదు చేసింది. నాలుగు రోజుల్లోనే వంద కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టిన ‘పీకే’ బాలీవుడ్‌లో పాత రికార్డుల్ని తిరగరాసే దిశగా దూసుకుపోతోంది. అమీర్‌ఖాన్‌, అనుష్క శర్మ ఒకరితో ఒకరు పోటీపడి నటించారు. ‘పీకే’ సృష్టించే రికార్డులు ఎలా ఉంటాయో ఊహించడమే కష్టం అంటున్నారు బాలీవుడ్‌ ట్రేడ్‌ అనలిస్టులు.

ఇప్పటికి ఉన్న అంచనా ప్రకారం చూస్తే ‘పీకే’ 300 కోట్లు తేలికగానే దాటేయవచ్చు. నాలుగు వందల కోట్లు దాటేసినా ఆశ్చర్యపోనవసరం లేదని బాలీవుడ్‌ సినీ జనాలు అంచనా వేస్తున్నారు. కొన్ని రోజులు ఆగితే ‘పీకే’ సృష్టించబోయే కొత్త రికార్డుల వివరాలు తెలుస్తాయి. సెలక్టివ్‌గా సినిమాలు చేసే అమీర్‌ఖాన్‌, రాజ్‌కుమార్‌ హిరానీ, లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చామని ‘పీకే’తో నిరూపించారు.

మరిన్ని సినిమా కబుర్లు
gopika doing magic with her beauty