Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Leukemia | Ayurvedic Treatment | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)

ఈ సంచికలో >> శీర్షికలు >>

Happy Sankranthi

పుస్తకసమీక్ష - -కళాసాగర్

book review

ఫేస్ బుక్ గైడ్ (వెర్షన్ 2.0)

ఈ ప్రపంచం తెరిచిన పుస్తకం లా వుండాలి. ప్రతి ఒక్కరూ తమ ఇష్టాయిష్టాలను స్వేఛ్ఛగా పంచుకోగలగాలి.  స్నేహబంధాలు ఖండాలు దాటాలి. అనే సదుద్దేశ్యం తో జుకెర్ బర్డ్ ఆలోచనతో రూపొందిన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ "ఫేస్ బుక్". ఫేస్ బుక్ ఎప్పటినుండో వాడుకలో ఉన్నా, మన భారతీయులలో ఫేస్ బుక్ వాడకం ఈ మధ్య కాలం లో బాగా పెరిగింది. ఫేస్ బుక్ స్వరూపం చూడడానికి కొద్దిగా గందరగోళం గా వుంటుంది. ఫేస్ బుక్ ను కొత్తగా వాడడం మొదలుపెట్టిన వారికి, వాడుతున్న వారికీ ఉపయోగపడేలా యువ జర్నలిస్టు నగేష్ బీరెడ్డీ రచించిన పుస్తకమే ఈ ఫేస్ బుక్ గైడ్.

సుమారు 13 కోట్ల మంది వినియోగదారులున్న ఫేస్ బుక్ ఇప్పుడు అన్ని వయసుల వారికి వేదికయ్యింది. కొంతమందికి వ్యసనమయింది కూడా, ఇలాంటి ఫేస్ బుక్ ని ఉపయోగించేటప్పుడు అనేక సమస్యలుంటాయి. సందేహాలు వుంటాయి. అలాంటి ఇబ్బందులను అధిగమించ డానికి, ఫేస్ బుక్ ను సక్రమంగా వినియోగించుకోవడానికి ఉపయోగపడే మంచి పుస్తకం ఇది. ఇందులో ఏముందో చూద్దాం. ఎందుకీ ఫేస్ బుక్, లైక్స్ ఎలా కొట్టేయాలి? కామెంట్ ఎలా సంపాదించాలి? తెలుగులో రాయాలంటే ఎలా? అమ్మాయిలకు కొన్ని జాగ్రత్త్తలు. ఫ్రెండ్స్ లో రకాలు, చిన్న వ్యాపారానికి పెద్ద లాభం, వాల్ అంటే ఏమిటీ? .. ఎలా  వాడుకోవాలి? నమ్మలేని నిజాలు, సమాజం పై ప్రభావం, కొన్ని చిట్కాలు, కొత్త ఫీచర్లు, ఫేస్ బుక్ సంబంధాలు, పాపులర్ అవ్వడం ఎలా? చేయాల్సినవి... చేయకూడనవి.... ఇలాంటి విషయాల గురించి చర్చిస్తూ మన నిత్యం ఎదుర్కొనే ఇబ్బందులను అధిగమించడానికి ఉపయోగపడే అనేక విషయాలను ఈ పుస్తకం లో పొందుపరిచారు.
సంవత్సర కాలం లోనే ద్వితీయ ముద్రణ చేసుకున్న ఈ పుస్తకం చివరలో ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకెర్ బర్గ్ విజయగాధను కూడా ఇవ్వడం స్పూర్తివంతంగా వుంది. ముగింపుగా షార్ట్ అండ్ స్వీట్ లాంగ్వేజ్ అంటూ ఇచ్చిన పదాలు చూస్తే ఫేస్ బుక్, మొబైళ్ళ రాకతో పదాలు ఎంతగా కుదించుకుపోయాయో అర్ధం అవుతుంది. ఉదాహరణకు W8=Wait, Omg=oh my god, Gn8= Good Night లాంటివి. విండోస్, మాక్ సిస్టం ల షార్ కట్స్ ఇవ్వడం కూడా ఉపయోగకరం గా వుంటుంది. ఇక బోనస్ గా పుస్తకం లో అక్కడక్కడా ఇచ్చిన లేపాక్షి గారి కార్టూన్లు మనల్ని నవ్విస్తాయి. ఇంత చక్కటి పుస్తకాన్ని రూపొందించి ఇచ్చిన నగేష్ బీరెడ్డీలు, ప్రచురించిన వాసిరెడ్డి పబ్లికేషన్ వారు అభినందనీయులు

పేజీలు: 96, వెల: రూ. 70/-
ప్రతులకు: వాసిరెడ్డి పబ్లికేషన్స్, బి.2, టెలికాం క్వార్టర్స్,
కొత్తపేట, హైద్రబాద్-500060
సెల్: 9000528717

-కళాసాగర్ 

మరిన్ని శీర్షికలు
sahiteevanam