స్నేహగీతం, ఇట్స్ మై లవ్ స్టోరీ, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ వంటి వైవిధ్యమైన కథాంశాలతో యూత్ ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మధుర శ్రీధర్ తన తదుపరి చిత్రంగా 'లేడీస్ & జెంటిల్ మెన్'ను పి.బి. మంజునాథ్ దర్శకత్వంలో నిర్మించారు. జనవరి 30న విడుదల కానున్న ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ ప్రత్యేకంగా హైదరాబాద్ లో వీక్షించారు. "చాలా సహజత్వంతో కూడిన బోల్డ్ మూవీ తెలుగులో వస్తున్న నూతన పోకడలకు ఈ సినిమా నాంది అవుతుంది" అంటూ మధుర శ్రీధర్ ను అభినందించారు.
అనంతరం 'లేడీస్ & జెంటిల్ మెన్' రిలీజ్ పోస్టర్ ను మొబైల్ లో విడుదల చేశారు. సైబర్ క్రైమ్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పాటలు ఇంటర్నెట్, ఎఫ్.ఎమ్ రేడియోల్లో టాప్ టెన్ లో నిలవడం విశేషం. చైతన్య కృష్ణ, కమల్ కామరాజు, మహత్ రాఘవేంద్ర, అడవి శేష్, నిఖితా నారాయణ్, స్వాతి దీక్షిత్, జాస్మిన్ భాసిన్ నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం రఘు కుంచె.
|