Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
telugu, tamil multi starrer

ఈ సంచికలో >> సినిమా >>

డబల్‌ కిక్‌ ఇవ్వనున్న రవితేజ

double kik raviteja

‘కిక్‌’ సినిమా తెలుగులో పెద్ద విజయం సాధించింది. ఆ సినిమా సాధించిన విజయంతోనే దాన్ని హిందీలోకి అనువదించుకున్నాడు బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌. హిందీలో కూడా ‘కిక్‌’ ఘనవిజయం సాధించింది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన తెలుగు ‘కిక్‌’కి కొనసాగింపుగా ‘కిక్‌`2’ రూపొందుతోంది.‘కిక్‌’లో రవితేజ సరసన ఇలియానా హీరోయిన్‌గా నటిస్తే, ‘కిక్‌`2’లో రవితేజ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. రవితేజ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇద్దరూ ఈ సినిమాలో రెండు విభిన్నమైన గెటప్స్‌తో కనిపించనున్నారట. పల్లెటూరి యువతిగా, మోడ్రన్‌ గర్ల్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కనిపించనుండగా, రవితేజ తన ఫిజిక్‌లో కొన్ని మార్పులు చేసుకున్నాడట రెండు పాత్రల కోసం.ఓ పాత్రలో రవితేజ ఫిట్‌గా కనిపిస్తే, ఇంకోపాటలో కాస్త సన్నగా కనిపిస్తాడని అంటున్నారు. రెండూ పాత్రలూ గ్లామరస్‌గా తీర్చిదిద్దాడట దర్శకుడు. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ‘కిక్‌`2’, ‘కిక్‌’ కన్నా కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించనుందట. ‘కిక్‌’తో పోల్చితే ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా రెండిరతల ఉంటుందనీ, యాక్షన్‌, గ్లామర్‌ కోణాల్లోనూ ‘కిక్‌`2’ ప్రేక్షకులకు డబుల్‌ కిక్‌ ఇస్తుందని సమాచారమ్‌.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam