Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jayajaya devam

ఈ సంచికలో >> శీర్షికలు >>

జ్యోతి పథం - పులివర్తి కృష్ణ మూర్తి

ఆనందాల కేళి ఈ హోలీ పండుగ

హోలీ పండుగ కోసం సంవత్సరమంతా ఎదురుచూసే వారెందరో మన భారతదేశం లో కనిపిస్తారు. కారణం, ఆ పండుగలో అంతటి మజా వుంటుంది. మనిషి సామాన్యం గా కోరుకునేది ఆనందమూ, సంతోషమూను. వీటి కోసమే నిరంతరం తపిస్తూ వుంటాడు. శ్రమిస్తూ వుంటాడు. అందుకే మన హిందూ ధర్మం లో వాటి కోసం గాప్రత్యేకం గా కొన్ని పండుగలను కేటాయించరనిపిస్తుంది.. ఈ పండుగలో మరో ప్రత్యేకత కూడా వుంది. ధేషం వున్న వారు, కోపం వున్న వారు, కొందరి విషయం లో ఏహ్య భావం కలిగిన వారూ, అన్నింటినీ మరిచిపోయి, ఆమందం గా ఆలింగనంగావించుకుని, అరమరికలు లేకుండా సంతోషం గా వసంతాన్ని ఆహ్వానించే మహత్తరమైన రోజు,, వయసుతో సంభంధం లేకుండా, పిల్లలూ, పెద్దలూ, స్త్ర్ర్లు, పురుషులూ, అందరూ జరుపుకునే ఈ వేడుకలు పాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటాము. ఉత్తర భారత దేశం లో వసంతోత్సవం గా పరిగణిస్తారు. ఒక విధం గా భారతదేశం లోని అన్ని ప్రాంతాల వారూ ఈ హోలీ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ విషయం లో రెండు కథలు ప్రచారం లో వున్నాయి. ఒకటి ప్రహ్లాదుడికి సంబంధించినదైతే మరొకటి గోపికలకు సంబంధించినది. శ్రీకృష్ణ పరమాత్మను పూజిస్తారు కొందరు ఆ రోజున.

ప్రహ్లాదుడు, రాక్ష రాజు - హిరణ్య కశిపుడు, లీలావతిల పుత్రుడు. బ్రహ్మ నుండి అమోఘమైన వరాలను పొందిన, హిరణ్య కశిపుడు అమితమైన గర్వం తోనూ, దుర్మధం తోనూ ప్రవర్తిస్తూ విష్ణు  ద్వేషిగా మారుతాడు. కానీ హిరణ్య కశిపునికి పుట్టిన నలుగురు పుత్రులలో అగ్రజుడైన ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడైనాడు. సర్వ వేళలా శ్రీమన్నారాయణుని మీదనే మనస్సు నిలుపుకుని, ఆయన దివ్య నామాన్నే జపించుకుంటూ, నిద్రాహారాలు మాని, ఊక్కోసారి జడుని మాదిరిగా ప్రవర్తించేవాడు. ఇది నచ్చని హిరణ్య కశిపుడు ఎంతగానో చెప్పి చూశాడు. కానీ లాభం లేకుండాపోయింది. సామ, దాన, భేధ దండోపాయాలను ప్రయోగించాడు. రక్కసులు అమితం గా హింసించారు. ఏనుగులతో తొక్కించాలని ప్రయత్నించాడు. విషసర్పాలను వదిలాడు. సముద్రం లో పడవేయించాడు. అందులో భాగం గా ఒకనాడు, రాక్షసి హోలిక ఒడిలో కూర్చుండబెట్టి, కట్టెలను పెట్టించి మంటపెడుతాడు. మంటలు ప్రజ్వరిల్లుతూ వుండగా, హరినే నమ్ముకున్న ప్రహ్లాదుడు స్వామిని ధ్యానించగా హోలిక మంటల్లో ఆహుతి అయిపోతుంది. దుష్టసమ్హారం జరుగుతుంది. ప్రహ్లాదునికి ఎలాంటి హానీ జరుగదు.

మంటలుసామాన్యం గా హోలికను ఏమీ చేయలేవు. కానీ ఆశ్చర్యకరం గా ఇలా జరుగుతుంది. హోలిక చనిపోయే ముందు, ప్రహ్లాదున్ని ఒక వరం అడుగుతుంది. తనను క్షమించమని ప్రాధేయపడుతుంది. ప్రహ్లాదుడు ఆమెకు ఒక వరం ఇచ్చాడు. ప్రతి సంవత్సరమూ తన పేరిట హోలీ జరుపుకుంటారని అన్నాడు. ఆ విధం గా మనమంతా హోలీ పండుగ ముందు రోజున  హోలిక రాక్షసి మరణించినందుకు పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ రోజున రంగురంగుల  పొడులతో కలిపిన నీళ్ళను ఒకరిమీదొకరు జల్లుకుంటారు. వసంతోత్సవం జరుపుకుని ఆనందిస్తారు. ముఖ్యం గా వేప, తులసి, పసుపూ, కుంకుమ పొడులను కలిపిన నీళ్ళను వాడుతారు. చలికాలం పోయి వసంత ఋతువు ఆరంభం లో, రక రకాల క్రిమిలను చంపే ఎద్ధేశ్యం తో మంటలు వేయడమే కాక ఈ నీళ్ళను మన మీద జల్లుకోవడం కూడా ఒక విధం గా ఆరోజ్యం గా వుండేందుకు దోహదపడుతుందని చెబుతారు. అయితే ఈ రోజుల్లో మాత్ర,ం అందుకు భిన్నం గా రసాయనాలను కలిపిన రంగులను ఉపయోగించడం మూలం గా ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నారు. కొందరు పిల్లలు తమ చూపు కూడా పోగొట్టుకున్న సంధర్భాలు లేకపోలేదు. కొందరికీ చర్మ వ్యాధులు వచ్చాయి. మరికొందరికీ శ్వాస సంబంధమైన వ్యాధులూ కలిగాయి. కొందరు బలవంతం గా అతి దారుణం గా వార్నిష్ పెయింట్లను కూడా ఉపయోగించడం పరమధారుణం. ఆ కలర్స్ ను వదిలించుకోవడానికి, నానా విధాలుగా కష్టపడాల్సి వస్తున్నది. డాక్టర్లును కూడా ఆశ్రయించాల్సి వస్తున్నది. ఇలాంటి ప్రమాదకరమైన పద్దతులనూ, హింసా ప్రవేత్తి మార్గాలనూ త్యజించాలి. అందుకు పెద్దలే ముఖ్యం గా నడుం కట్టాల్సి వుంటుంది. కావున ప్రకృతి సిద్ధమైన రంగులనే వాడాలి. కొన్ని ప్రాంతాల్లో ఒక రకమైన , ప్రత్యేక పానీయాన్ని సేవిస్తారు. దాన్నే "బంగ్" అంటారు. ఇక వివిధ రకాలైన తీపి తిని బండారాలను తయారుచేసి, బంధు మిత్రులకు పంచుతారు. కొన్నింటిని మెడలో మాలలుగా కూడా ధరించి  ఆనందిస్తారు.

కోపతాపాలకు దూరంగా "బంగ్ సేవించి మిత్రులవలె ఆలింగణం గావించుకుని మిత్రులుగా మారిపోతారు. ఇక రెండవ కథ, గోపికలూ, శ్రీ క్రిష్ణ పరమాత్మకు సంబంధించినది. పరమాత్మ లీలలు అధ్భుతం, అనంతం. ఆయన తన చిన్నతనం లో అల్లరిపిల్లవాడి గానూ, చిలిపితనాన్ని అడుగడుగునా ప్రదర్శించాడు. అందరినీ ఆటపట్టించి ఆనందించేవాడు. ఈ విశ్వాన్నంతటినీ పరిపాలించే విశ్వంభరుడు కేవలం సామాన్య గొల్లభామల ఇళ్ళలో వెన్న దొంగిలించేవాడు. అత్యంత అద్భుతమైన విషయం ఏమిటంటే, ఇంత అల్లరి చేసినా ఆ గోపికలందరూ ఎంత గాడంగానో ఆయనను ప్రేమిస్తారు, ఆనంద డోళికల్లో మునిగిపోతారు. పరమాత్మ ప్రేమ అనంతం కన్నా ! కృష్ణుడు బాలకృష్ణుడిగా ఒక్కసారి యశోదమ్మను ప్రశ్నించాడు, తానెందుకు నల్లవాడిలా వున్నాడు, రాధ ఎందుకంత ఎర్రగా వుందని. దానికి ఆ తల్లి ఆ చిన్న కృష్ణుడికి, తాను వెళ్ళి రాధకు తనకిష్టమైన రంగు పూయమంది. ఇక మరి ఓరుకోకుండా లగెత్తుకుని వెళ్ళి రాధకు రంగు పూయడం మొదలెట్టాడు. మిగిలిన గోపికలంతా వెంటబడితే కర్రలు పుచ్చుకుని , రాధమ్మ మాత్రం ఆ లీలా మానుష వేషధారికి రంగులు పూయనిస్తూ, తానూ ఆ స్వామితో వసంత కేళి జరిపి, పరమానందాన్ని అనుభవించింది. ఆ అద్భుత దృశ్యాన్ని కనులారా కాంచిన వారు ధన్యులే. నేటికీ కొన్ని చోట్ల కర్రలు పుచ్చుకుని ఆడవారు, రంగులు పూసే మొగవారి వెంట పడతారు. ఇదో రమణీయ దృశ్యం కదామరి. దీన్ని లాఠ్మార్ పండుగగానూ, వసంతకేళీ గానూ జరుపుకుంటారు. ఇక మూడో పండుగ కూడా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యం గా భావిస్తారు. అదే కామదహనం, లోకరక్షణార్ధం రతీదేవి కోరికను మన్నించి, కాముడు తన బాణాలను యోగనిద్రలో వున్న శివుడిపై ప్రయోగించగా కాముడు దహనం గావించబడిన రోజది. ఆ తర్వాత విషయం తెలుసుకుని అతగాడికి అద్రుశ్యుడిగా కలకాలం నిలిచేలా అనుగ్రహించాడు. అందుకే కామదహనం తరువాత కామదేవునికి చందనం అర్పించి , లేత మామిడికాయలతో ఉపశమనం కలిగిస్తాము.

లోకం కోసం త్యాగం గావించిన కాముడికి అందరూ కైమోడ్పులర్పిస్తారు.  భోళా శంకరుడి సాక్షిగా. ఇక మరో కథ కూడా ప్రచారం లో కొన్ని ప్రాంతాల్ల్లో వుందని తెలుస్తోంది. పూర్వం రోజుల్లో ధుండి అనే దుష స్వభావి, దేవతల అనుగ్రహం తో కామ రూపిగా వరం పొందింది. ఆమె వయసులో వున్న మగ పిల్లలను పట్టుకుని పీడించేదట. ఇలా జరుగగా, జరుగగా ఒకనాడు కొందరు ధైర్యవంతులైన యువకులు తెగించి కర్రలతో. రాల్లతో కొడుతూ వెంబడించారు. నా విధాలుగా దుర్భాషలాడుతూ వారా సమయాల్లో "బంగ్" అనే పానీయాన్ని సేవించి వళ్ళు మరిచి మరీ ఆ విధం గా రౌడీయిజంగా ప్రవర్తించారట. ఆ దుష్ట శక్తిని ఓరి నుండి తరిమివేశారట. అందుకే నేటి రోజుల్లో కూడా కొన్ని గ్రామాల్లో హోలీ రోజున, కుర్రకారు మితిమీరి ప్రవర్తించినా, అల్లర్లు చేసినా ఏమీ అనరట అదీ సంగతండీ...హోలీ పండుగకు ఎల్లలు లేవు. దేశం లోని అన్ని రాష్ట్రాల్లోనూ వివిధ రీతుల్లో జరుపుకోవడమే కాక కొన్ని ప్రపంచ దేశాల్లోనూ ఈ పండుగను అత్యంత వినోదాత్మకంగా జరుపుకుంటారు. బంగ్లాదేష్, గయానా, మారిషస్, నేపాల్, పాకిస్తాన్, ఆఫ్రికా, యూరప్, అమెరికాల్లోనూ ఈ రంగుల వేడుకను సౌబ్రాతృత్వానికి ప్రేమతత్వానికి చిహ్నం గా జరుపుకుంటున్నారు. భారత దేశ సంస్కృతీ, సభ్యతా, సఖ్యతా, స్నేహతా, మమతా, అనురాగాలకు ప్రతీకగా ఐక్యతా భావాన్ని నింపే మన పండుగలు సదా ఆభరణీయాలు. దైవ ప్రేరితాలు. ఆనందో బ్రహ్మ:

మరిన్ని శీర్షికలు
Migraine | Ayurvedic Treatment | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)