Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Story in Letters

ఈ సంచికలో >> సినిమా >>

‘దాన కర్ణ’కి పిలుపొచ్చిందా?

తేజ పరిచయం చేసిన నటీనటులు చాలామంది తెలుగు తెరపై బాగానే పాపులారిటీ పొందుతున్నారు. అలా తేజ ‘స్కూల్‌’ నుంచి వచ్చిన ‘నందిత’, ‘ప్రేమకథా చిత్రం’ సినిమాతో మంచి హిట్‌ కొట్టింది. అంతే, ఆమె పాపులారిటీ అమాంతం పెరిగింది. నందితతో సినిమాలు చేయడానికి టాలీవుడ్‌లో పలువురు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.

అంతే, నందిత కూడా అమాంతం రేట్‌ పెంచేసిందని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. అదలా వుంచితే, దర్శకుడు మధుర శ్రీధర్‌ తాను తెరకెక్కించబోతున్న ‘దాన కర్ణ’ సినిమాలో హీరోయిన్‌గా నందితను అనుకుంటున్నాడట. హిందీలో వచ్చిన ‘విక్కీ డోనర్‌’ సినిమాకి ఇది తెలుగు రీమేక్‌.

హీరో ఇంకా ఎంపిక కాలేదు. ఆ పనిలో బిజీగా వున్న మధుర శ్రీధర్‌, ‘ప్రేమకథా చిత్రమ్‌’ సినిమాలో నందిత నటనను చూసి, తన ‘దానకర్ణ’లో ఆమె నటిస్తే, ఆ పాత్రకు న్యాయం చేయగలుగుతుందనే నమ్మకంతో వున్నాడట. అన్నీ అనుకూలిస్తే, నందిత ఈ సినిమాలో హీరోయిన్‌ అవడం ఖాయమేనని ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ అంటున్నాయి.

మరిన్ని సినిమా కబుర్లు
Vulavacharu Hotel in Hyderabad