Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Dana Karna Movie

ఈ సంచికలో >> సినిమా >>

తెలుగు దర్శకుడి ‘ఉలవచారు’

Vulavacharu Hotel in Hyderabad

సినీ ప్రముఖులు ఎక్కువగా ‘రెస్టారెంట్‌’ బిజినెస్‌పై ఇంట్రెస్ట్‌ చూపిస్తుంటారు. సినీ ప్రముఖులే కాదు, క్రికెటర్లూ అంతే. సచిన్‌ టెండూల్కర్‌ విషయాన్నే తీసుకుందాం. ఆయనకి ముంబైలో ఓ రెస్టారెంట్‌ వుంది. బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌, తనను తాను చెఫ్‌ అని చెప్పుకునేందుకు గర్వపడ్తాడు. కొన్ని రెస్టారెంట్‌లను ఆయన నిర్వహిస్తున్నాడు కూడా. తెలుగులో నాగార్జున, శర్వానంద్‌ వంటివారు రెస్టారెంట్‌ బిజినెస్‌లో వున్నారు.

ఈ లిస్ట్‌లో దర్శకుడు కూచిపూడి వెంకట్‌ కూడా చేరిపోయారు. హైద్రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోగల బాలకృష్ణ ఇంటిపక్కనే ‘ఉలవచారు’ అనే రెస్టారెంట్‌ ఒకటి పెట్టేశారయన. ఇది కాన్సెప్ట్‌ రెస్టారెంట్‌లా వుంది. సినీ ప్రముఖులు ఈ రెస్టారెంట్‌కి రాజపోషకులుగా మారారని చెప్పుకుంటున్నారు. పెద్దగా హడావిడి లేకుండా ఈ రెస్టారెంట్‌ని ప్రారంభించగా, వెరైటీ టేస్ట్‌లను కోరుకునేవారికి ఈ రెస్టారెంట్‌ ఆహారం భలేగా నచ్చుతోందట.

కృష్ణ భగవాన్‌, సిమ్రాన్‌ జంటగా ‘జాన్‌ అప్పారావు ఫార్టీ ప్లస్‌’ సినిమా రూపొందించాడీ కూచిపూడి వెంకట్‌. అంతేనా, ‘మొదటి సినిమా’కి ఈయనే దర్శకుడు. నవదీప్‌, పూనమ్‌ బజ్వా హీరో, హీరోయిన్లు ఆ సినిమాలో. ‘మొదటి సినిమా’ ఫర్వాలేదన్పించుకునే విజయాన్నే దక్కించుకుంది. ఏదిఏమైనా రెస్టారెంట్‌ బిజినెస్‌లోకి ఎంటర్‌ అయి, టాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించిన కూచిపూడి వెంకట్‌, ఆ రంగంలోనూ రాణిస్తే మంచిదేగా.

మరిన్ని సినిమా కబుర్లు