Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Interview with Singer Malavika

ఈ సంచికలో >> సినిమా >>

రాజా మ్యూజిక్ ముచ్చట్లు

పాటలు - పాట్లు

ప్రముఖ నిర్మాత సుందర్ లాల్ నహతా నిర్మాత గా రాజశ్రీ పతాకం పై తీసిన చిత్రాలెన్నో విజయం సాధించాయి. ఆయనకు హిందీ పాటలంటే ఇష్టం కనుక హక్కులతో సహా కొనుక్కుని తెలుగు వెర్షన్ లలో వాడుకునేవారు. 1959 లో వచ్చిన 'ఖైదీ నం. 911' లో 'మిఠి మిఠి బాతోంసె బచ్ న జరా' అనే పాట ట్యూన్ ని 'శాంతినివాసం' (1960) సినిమాలో 'ఆశలు తీర్చవె ఓ జననీ' పాటకు ఉపయోగించుకున్నారు.

ఖైదీ నం. 911 చిత్రాన్ని తమిళంలో 'ఖైదీ కనయా రామ్' (1960) గా పునర్నించినప్పుడు 'మిఠి మిఠి బాతోం సె' పాట ట్యూన్ తమిళంలో  'కొంజి కొంజి పేసి మది మయక్కుమ్ ' పాటగా మారింది. అదే 'ఖైదీ నం. 911' ని తిరిగి తెలుగులో 1962 లో 'ఖైదీ కన్నయ్య ' గా తీసినప్పుడు 'మిఠి మిఠి బాతోం సె' పాట వచ్చే సీను లో చిత్రీకరించాల్సిన 'తియ తీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు నమ్మవద్దూ' అనే పాటకు ఏ ట్యూన్ వాడాలి అన్నది ఓ సమస్య అయికూచుంది. ఎందుకంటే ఒరిజినల్ సినిమాలోని ఒరిజినల్ ట్యూన్ ని అల్రెడీ 'శాంతినివాసం' లో 'ఆశలు తీర్చవె ఓ జననీ' పాటకు వాడేసుకున్నారు. ఇప్పుడు మరో ట్యూన్ కావాలి.
 


తెలుగులో వచ్చిన 'ఇల్లరికం' (1959) సినిమా ఆధారంగా ఎల్వీ ప్రసాద్ గారు హిందీలో తీసిన 'ససురాల్' (1961) చిత్రం లోని 'తెరి ప్యారి ప్యారి సూరత్ కో కిసీకి నజర్ నా లగే చష్మే బద్దూర్'  అనే పాట ట్యూన్ నచ్చి ప్రసాద్ గారి దగ్గర్నుంచి తీసుకుని 'ఖైదీ కన్నయ్య ' లో 'తియ తీయని తేనెల మాటలతో' పాటకి వాడుకున్నారు. అదీ కథ.

ఈ పాటలన్నీ యూ ట్యూబ్ లో దొరుకుతాయి. విని పైన చెప్పిన కథనంతో పోల్చి చూసుకుంటూ ఎంజాయ్ చెయ్యొచ్చు. ( 'ససురాల్ ' లో 'తెరి ప్యారి ప్యారి సూరత్ కో' పాట సీన్ కు ఒరిజినల్ 'ఇల్లరికం' లోని 'ఎక్కడి దొంగలు అక్కడనే గప్ చుప్' పాటకు 'తుమ్ సా నహి దేఖా' (1957) సినిమా లోని 'యూ తో హమ్ నే లాఖ్ హసీ దేఖే హై' పాట ట్యూన్ ని వాడుకోవడం వేరే కథ)


పకడో పకడో
'ఆత్మబలం' పేరుతో డీవీడీ కవర్ మీదున్న నాగేశ్వరరావు, సావిత్రి ఫొటోలు 'మనుషులు - మమతలు' సినిమాలోని ' ఒంటరిగా వున్నావా ఒంటికి మంచిది కాదు' అనే పాటలోంచి తీసినవి.
 


ఆ పాటకు సంబంధించిన స్టిల్ పక్కనే వుంది. ఇక 'ఆత్మబలం' సినిమాలో హీరోయిన్ సావిత్రి కాదు ... బి. సరోజాదేవి. 'ఆత్మబలం' సినిమాకి ఒరిజినల్ డీవీడీ కవర్ చిట్ట చివర వుంది. గమనించండి.

మరిన్ని సినిమా కబుర్లు
aaditya hrudayam - vn adithya