Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
maro mithunam

ఈ సంచికలో >> శీర్షికలు >>

అందానికి, ఆరోగ్యానికి 9 సూత్రాలు! - డా: జి. విజయలక్ష్మి

లేని అందాలు/ఆరోగ్యం తెచ్చుకునే ప్రయత్నానికి ముందు మన అందాన్ని/ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ముఖ్యం! మీ చర్మాన్ని సున్నితంగా నిగనిగలాడేలా చేసుకోవటానికి 9 సూత్రాలు ఇక్కడ ఇస్తున్నాము.

1. రోజుకు 2 సార్లు మొహం కడుగుకోవాలి. అతి చల్లని, అతి వేడి నీళ్ళతో కడగరాదు. చల్లని నీళ్ళతోనే కడగాలి.

2. కనీసం వారానికి ఒక్కసారైనా నూనె (కొబ్బరి నూనె/ ఆలివ్ ఆయిల్) రాసుకుని ఆరాకా స్నానం చేయండి.

3. షాంపూ వాడేటప్పుడు మీకు 'డాండ్రఫ్' లేనట్టయితే ఆంటీ డాండ్రఫ్ షాంపూలు వాడరాదు. దానివల్ల జుట్టు ఊడే ప్రమాదం ఉంది.

4. శరీరానికి ఎండ తగలడం, చమట పట్టడం కూడా అవసరం. A/C నుంచి బైటకొచ్చి కొద్దిసేపు నీడలో నుంచుని అప్పుడు ఎండలోకి వెళ్ళాలి. అలాగే A/C లోకి వెళ్ళేప్పుడు కూడా !

5. పళ్ళు, కూరగాయల్ని కడగకుండా తినకండి. ఇప్పుడొచ్చే పళ్ళన్నిటికీ 'షైనింగ్' కొరకు ఒక విదమైన ఆయిల్స్ (జెల్) రాస్తున్నారు. బాగా కడిగి తినండి. పళ్ళు బాగా తినండి.

6. కనీసం 6-7 గంటల నిద్ర చాలా అవసరం. అది అందానికి, ఆరోగ్యానికి కూడా మంచిది.

7. మనం పెద్దగా పట్టించుకోని విషయం కానీ చాలా అవసరమైన విషయం - 'నీరు'! కనీసం రోజుకు 7-8 గ్లాసుల నీళ్ళు త్రాగాలి. ఇది చాలా అవసరం. విదేశాల్లో వుండేవారు నీరు బదులు జ్యూసెస్ లాంటి లిక్విడ్స్ తీసుకోవచ్చు. కానీ అందులో 'గ్యాస్' శాతం ఎక్కువ వుండకుండా చూసుకోండి.

8. వ్యాయామం కాని యోగా కాని చేయండి. పని ఒత్తిడి వున్నవాళ్ళు కనీసం 'వాకింగ్' చేయాలి. వాకింగ్ ప్రొద్దుటే చేయాలని లేదు - ఎప్పుడైనా చేయవచ్చు, కానీ భోజనం చేసిన వెంటనే చేయవద్దు!

9. మీరు తినే ఆహారంలో ప్రోటీన్, విటమిన్ A, మరియు C ఉండేలా చూసుకోండి. కేరట్, బొబ్బాసికాయల్లో మంచి 'A' విటమిన్ దొరుకుతుంది. వెన్న, చికెన్, చేప, బీన్స్, ఎగ్స్, పాలు, పెరుగుల్లో చక్కటి ప్రోటీన్ లభిస్తుంది. పచ్చిమిర్చి, జామకాయ, కాప్సికమ్, నిమ్మకాయ, ఆరెంజ్, స్ట్రా బెర్రీస్, కివిఫ్రూట్, బొప్పాయి లలో విటమిన్ C పుష్కలంగా లభిస్తుంది.

ఆరోగ్యమస్తు!

మరిన్ని శీర్షికలు
navvula jallu by Jayadev Babu