Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Article on SV Ranga Rao by TVS Sastry

ఈ సంచికలో >> శీర్షికలు >>

జాతకచక్రం (జూన్ 22 నుండి 28 వరకు) - శ్రీ నంద

నా జాతకం ఎలా వుందో తెలుపగలరు, బగ్గు సూర్య తేజ, కాకినాడ
బగ్గువెంకట సూర్యతేజ గారు మీరు చిత్త నక్షత్రం తులా రాశికి చెందిన వారు మీకు ప్రస్థుతం ఏలినాటి శని ప్రభావం ఉంది.  అనారోగ్య సమస్యలు అలాగే ఆర్థికపరమైన సమస్యలు కలుగుటకు అవకాశం కలదు, జాగ్రత్తగా ఉండుట మంచిది. 2025 వరకు మే జాతకంలో గురుమహర్దశ నడుస్తుంది. ప్రస్తుతం గురు మహర్దశలో శని అంతర్దశ 2015 వరకు అంత వరకు జాగ్రత్తగా ఉండుట మంచిది. ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగిరాక పోవచ్చును. అలాగే ధనం ఖర్చును అదుపులో ఉంచుకోలేక పోతారు. అనుకోని ఖర్చులు పెరుగుట మూలాన చేతిలో డబ్బులు లేకపోవడం చేత ఇబ్బందులను పొందుతారు. కొన్ని కొన్ని విషయాల్లో అత్యుత్సాహం కలిగి ఉండుట చేత ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు. మీ కోపాన్ని మొండి తనాన్ని తగ్గించుకొనుట చాలావరకు సమస్యలకు పరిష్కారం చూపుతుంది. వాహనములు నడుపునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రమాదాలు జరుగుటకు అవకాశం కలదు జాగ్రత్తలు తెసుకోండి. గట్టిగా ప్రయత్నం చేయుట వలన ఉన్నత విద్యా అవకాశాలు మెరుగుఅవుతాయి ప్రయత్నం చేయుట ఉత్తమం. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. అలాగే శనివారం తప్పక ఆంజనేయ స్వామి ఆలయం వెళ్ళండి. ప్రతినెల ఒక మారు శివునకు అభిషేకం చేయుట మూలాన మేలు జరుగుతుంది. విష్ణుసహస్రనామం పారాయణ చేయుట మంచి ఫలితాలను ఇస్తుంది. 1.25 kg నల్లనువ్వులు అలాగే శనగలు దానం చేయుట అలాగే శనికి గురునకు జపాలు చేయుట మంచి ఫలితాలను ఇస్తుంది.

నా జాతకం, ఇప్పుడు నా స్థితి గతులు, వ్యాపారం కలిసివస్తుందా ?, పెళ్లి ఎప్పుడు అవుతుంది మరియు ఏలిన నాటి శని గురించి దయచేసి చెప్పగలరు. బగ్గు శ్రవణ్ కుమార్, కాకినాడ.
శ్రవణ కుమార్ గారు మీరు శ్రవణానక్షత్రం మకరరాశిలో జన్మించారు. ప్రస్తుతం రాహుమహర్దశ నడుస్తుంది. రాహు మహర్దశలో శుక్ర అంతర్దశ జూలై 2013 వరకు ఉంది. తదుపరి రవిఅంతర్దశ 2014 ఆగష్టు వరకు ఉంది. 2014 ఆగష్టు నుండి చంద్రమహర్దశ బాగుంటుంది. అనుకున్న పనులు నెరవేరే సూచనలు కలవు. వాహనములు నడుపునపుడు మాత్రం జాగ్రత్తగా ఉండుట మంచిది. మీరు మంచి ఆలోచనలు కలిగి ఉన్ననూ  ఖర్చును అదుపులో ఉంచుకోలేరు. కుటుంబరిత్యా కావచ్చును లేదా మిత్రుల కోసం, మీకోసం అధికంగా ఖర్చును చేసే స్వభావంను కలిగి ఉంటారు. జాగ్రత్తగా ప్రణాళికా ప్రకారం వెళితే ధనసంపాదన బాగుంటుంది. వ్యాపారంలో బాగానే రాణిస్తారు కాకపోతే ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే మిగులు ఉండకపోవచ్చును. 2014 లో వివాహ అవకాశాలు బాగున్నవి. ఈ సంవత్సరం అకారణంగా కలహములు కలుగుటకు అలాగే మిమ్మల్ని అపార్థం చేసుకొనే అవకాశం కలదు జాగ్రతగా ఉండుట మంచిది. 2013 జూలై నుంచి కొంత కష్టపడితే అందరిలోను గుర్తింపు వచ్చుటకు అవకాశం కలదు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ద చేయకండి. మీకు పాలకు సంభంధించిన రంగాలు అలాగే ఎలక్ట్రికల్, మందుగుండు సమాగ్రి అలాగే అగ్నికి సంభందించిన వ్యాపారంలో బాగారానిస్తారు. విద్యాలయాలు కూడ అనుకూలిస్తాయి. మంచి ఫలితాల కోసం 18 మంగళ వారాలు దుర్గాఆలయం వెళ్ళండి. ప్రతిరోజు సూర్యనమస్కారం చేయుట నెలకు ఒకమారు ఆదివారం వేంకటేశ్వరఆలయం వెళ్ళండి 60 ప్రదక్షిణలు చేయుట మంచిది.

గత 2 ఇయర్స్ నుండి ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్నాను.దయచేసి పరిష్కార మార్గాన్ని చూపండి. త్రికోటేశ్వర రావు రామరాజు, మాచెర్ల,గుంటూరు జిల్లా.
రామరాజు గారు మీరు మఖనక్షత్రం సింహరాశిలో జన్మించారు. ప్రస్తుతం రవి మహర్దశలో బుధ అంతర్దశ ఆగష్టు 2013 వారు కలదు. తదుపరి కేతు అంతర్దశ ఈ సంవత్సరం చివరివరకు కలదు. సహజధనాదిపతి అయిన గురుడు కేతువుతో కలిసి ఉండుట అలాగే ద్వితియాదిపతి అయిన చంద్రుడు కుజ, శుక్రులతో కలిసి త్రుతియంలో ఉండటం. ఇలాంటివి మీరు సుఖానికి ప్రాముఖ్యతను ఇచ్చుట వలన ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కోవడానికి కారణం అయ్యింది. మిత్రుల కోసం లేదా మీయొక్క కోరికల కోసం ధనంను ఖర్చు చేసే అవకాశం కలదు కావున మొదట కోరికలను నియంత్రించే ప్రయత్నం చేయండి. జూలై 2013 నుండి కొంతమేర బాగుంటుంది. గోచారరిత్యా మీకు 2014 జూన్ వరకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చును సరైన ప్రణాళికతో ముందుకు వెళితే ఆర్థికపరమైన సమస్యలు తగ్గుటకు అవకాశం కలదు. అలాగే మీరు కాలసర్పయోగంలో జన్మించారు కాబట్టి అనుకున్న పనులు నిదానంగా పూర్తిఅయ్యే అవకాశం ఉంది. కావున ప్రతి సంవత్సరం శ్రీకాళహస్తి వెళ్ళుట అక్కడ పూజలు చేయుట మూలాన మంచిజరుగుతుంది. 2014 చివరి నుండి చంద్రమహర్దశ ప్రారంభమవుతుంది. మీకు చంద్రుడు ద్వితియాదిపతి అవుతున్నాడు. కావున ఆర్థికంగా బాగానే ఉండే అవకాశం కలదు. కాకపోతే జాగ్రత్తగా ఉండుట మంచిది. ప్రతిరోజు సూర్యనమస్కారం చేయుట అలాగే ప్రతినెల ఒకమారు శివాభిషేకం చేయుట వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఆదిత్య హృదయం పారాయణ చేయండి తప్పక మీ సమస్యలు తీరుతాయి.

విదేశీ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పుడు అవుతుందో తెలుపగలరు, శివ కృష్ణ , సూరత్
శివకృష్ణ గారు మీరు పూర్వాభాద్ర నక్షత్రం మేనరాశిలో జన్మించారు. ప్రస్తుతం బుధమహర్దశ నడుస్తుంది. బుధలో చంద్రుడు 2013 డిసెంబర్ వరకు ఉన్నాడు. తదుపరి కుజ అంతర్దశ 2014 నుండి కలదు. మీకు ఆన్సైట్ అవకాశాలు తప్పక ఉన్నవి. 2014 లో మీరు తప్పక అవకాశాలు పొందుతారు. కాకపోతే అప్పటివరకు జాగ్రత్తగా ఉండుట అధికమైన శ్రమను కలిగి ఉండుట ప్రణాళికలతో ముందుకు వెళ్ళుట చేత రాణిస్తారు. మీకు ఏపనైనా త్వరగా కాకపోవచ్చును వేచిచూస్తూ ప్రయత్నం చేయుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో అశ్రద్దచేయకండి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కలదు. వాహనముల విషయంలో అలాగే ఆరోగ్యం విషయంలో అశ్రద్ద వద్దు. జీవితాన్ని అనుభవించాలి అనే ఆలోచనను కలిగి ఉంటారు. మీయొక్క విషయాలను త్వరగా అందరితోను పంచుకోకపోవచ్చును. అధికమైన ఆలోచనను కలిగి ఉంటారు. సుఖానికి ప్రాముఖ్యతను ఇస్తారు కొద్దిగా బద్ధకం ఉండే అవకాశం కలదు. ప్రతినెల ఒకమారు గణపతికి అభిషేకం చేయండి అలాగే శ్రీకాళహస్తికి వెళ్ళిరండి. అలాగే నవంబర్ నలలో సుబ్రమణ్య స్వామికి అభిషేకం చేయుట మూలాన మంచి ఫలితాలను పొందుతారు.

నాకు వుద్యోగం ఎప్పుడు వస్తుంది - బచ్చు గౌతమ్, గన్నవరం
గౌతం గారు మీరు మఖనక్షత్రం సింహరాశికి చెందినవారు. ప్రస్తుతం రవిమహర్దశలో కుజ అంతర్దశ నడుస్తుంది. 2013 ఆగష్టు, సెప్టెంబర్ లలో ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలావరకు కలవు. కొద్దిగా ప్రయత్నం చేయండి చాలు. 2013 సెప్టెంబర్లో రాహు అంతర్దశ ప్రారంభమవుతుంది. 2014 లో ఉద్యోగంలో అభివృద్దిని పొందుతారు. కాకపోతే ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండుట అనేది సూచన. ఖర్చును తగ్గించుకోండి. అనవసరపు ధనవ్యయానికి దూరంగా ఉండుట మంచిది. చేసేపనిలో పాజిటివ్ దృక్పదం అవసరం తప్పక చేయగలుగుతాను అని ఆరంభించుట మూలాన మేలుజరుగుతుంది. స్నేహితులతో చేపట్టే పనులలో నిదానం ఉండుట హద్దులు దాటకపోవడం మంచిది. అధికారులతో నిదానంగా ఉండండి. జూన్ 2015 నుండి 2016 వరకు వాహన ప్రమాదాలు సంభావించుటకు అవకాశం కలదు. కావున జాగ్రత్తగా ఉండుట ఉత్తమం. వాహనముల విషయంలో అలాగే ఆరోగ్యం విషయంలో తప్పక జాగ్రత్తలు పాటించాలి. 6 ఆదివారాలు శివునకు అభిషేకాలు 3 మంగళవారాలు దుర్గాదేవికి అర్చన చేయుంచుట వలన మంచిఫలితాలు కల్గుతాయి.

నాకు వుద్యోగం ఎప్పుడు వస్తుంది - రవితేజ, భీమడోలు
రవితేజ గారు మీరు శ్రవణానక్షత్రం, మకరరాశిలో జన్మించారు. ప్రస్తుతం రాహుమహర్దశ నడుస్తుంది. రాహులో బుధ అంతర్దశ అక్టోబర్ 2014 వరకు కలదు. తదుపరి కేతు అంతర్దశ. వేగంగా ఆలోచనలు చేయుట మూలాన అప్పుడప్పుడు ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిదానంగా ఆలోచనలు చేయుట మంచిది. అందరిని కలుపుకొని వెళ్ళు మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కాకపోతే మీకు అనుకూలంగా లేకపోతే వారితో అనుభందాలను తగ్గించుకొనే అవకాశం కలదు. ఉద్యోగానికి వస్తే సాఫ్ట్ వేర్, మేనెజ్మెంట్ రంగాలు బాగా అనుకూలిస్తాయి. అలాగే టీచింగ్ రంగం, విద్యాలయాలు కూడా  అనుకూలిస్తాయి. బాగాగుర్తింపును కోరుకుంటారు. ఫాషన్ రంగాలపైన మక్కువను కలిగి ఉంటారు. సెప్టెంబర్ తర్వాత ఉద్యోగం వస్తుంది. 2014 అక్టోబర్ లో ప్రమోషన్ వచ్చుటకు అవకాశాలు కలవు. కోపాన్ని తగ్గించుకొనుట వలన లాభం ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులను ప్రణాలిక లేకపోతే పొందుతారు. ప్రతిరోజు విష్ణుసహస్రనామం చదవండి, 17 బుధవారాలు గణపతి లేదా వేంకటేశ్వర ఆలయం వెళ్ళండి. దుర్గాదేవికి కుంకుమ అర్చన చేసి ప్రతిరోజు బొట్టుగా ధరించుట ఉత్తమం. నెలకు ఒకమారు గణపతికి అభిషేకం చేయండి.
 

వార ఫలాలు (జూన్ 22  - జూన్ 28)

 


మేష రాశి
ఈవారం ప్రతి పనిని ఆలోచించి చేపట్టుట మంచిది. వారం ఆరంభంలో అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం కలదు మీరంటే గిట్టని వారినుంచి కూడా సమస్యలను పొందుటకు అవకాశం ఉంది. స్నేహాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండుట సూచన. చేయుపనిలో పనిభారంను పొందుటకు అవకాశం కలదు. మీరు ఊహించని విధంగా సమస్యలను పొందుటకు అవకాశం కలదు. కుటుంభంలో చిన్న చిన్న సమస్యలను పొందుటకు అవకాశం కలదు కావున సర్దుకుపోవడం చేయండి మేలుజరుగుతుంది. వారం మధ్యలో మీరు పనులలో వేగంగా ముందుకు వెళ్తారు అనుకున్నప్రయత్నాలలో లాభాలను పొందుతారు. నూతన ఆలోచనలను కలిగి ఉండే అవకాశం కలదు ఇష్టమైన పనులను చేపడుతారు. బంధవుల యెడల ప్రీతిని కలిగి ఉంటారు మీ ఆలోచనలు వారికి లాభంను కలిగించేవిగా ఉంటవి. భోజనం విషయంలో ప్రత్యేకశ్రద్ధను కలిగి ఉంటారు. కుటుంభసభ్యులతో  సమయాన్ని మీకు నచ్చిన విధంగా గడుపుటకు అవకాశం కలదు. వారం మధ్యనుంచి ఆర్థికపరమైన అభివృద్దిని పొందుటకు అవకాశం కలదు. కాకపోతే వారం మొత్తం కూడా నూతన పనులను చేపట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుట సూచన. భాగస్వాములను తరచి చూసుకోవడం మేలుచేస్తుంది. నూతనంగా తలపెట్టిన పనులలో స్వల్పంగా ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు. అధికారుల విషయంలో మాత్రం నిదానంగా ఉండుట మంచిది వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కలదు. ఉద్యోగంలో మాత్రం కొంత నిరాశను పొందుటకు అవకాశం కలదు వేచిచూసే దొరని మేలుచేస్తుంది. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండుట నూతన ఆలోచనలకు దూరంగా ఉండుట సూచన. ఆరోగ్యం విషయంలో అశ్రద్ద చేయకండి అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండుట మంచిది. అనుకూలమైన ఫలితాల కోసం విష్ణుసహస్రనామం పారాయణ చేయుట,వేంకటేశ్వర స్వామికి ఆరాధన చేయుట అలాగే ప్రతిరోజు దుర్గాష్టకం చదవండి.        

వృషభ రాశి
ఈవారం మిశ్రమ ఫలితాలను కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది అనుకున్న పనులు జరుగుట మూలాన ఉత్సాహంను పొందుటకు అవకాశం కలదు. ఆలోచనల్లో వేగంను కలిగి ఉంటారు. తోటివారిలో కీర్తిని పొందుటకు అవకాశం కలదు ధర్మసంభంద కార్యక్రమాలలో పాల్గొంటారు. అధికారులతో నిదానంగా నడుచుకొనుట మంచిది,స్నేహితుల ఆలోచనల మూలాన ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు కావున మీ ఆలోచనలు వారికి తెలుపకపోవడం మంచిది. వ్యాపారస్థులు నిదానంగా వ్యవహరించుట మంచిది నూతన ఆలోచనలు వాయిదా వేయుట ఉత్తమం. వారం ఆరభంలో ఉన్న వేగం వారం మధ్యలో ఉండకపోవచ్చును. అజాగ్రత్తగా ఉన్నచో అనారోగ్య సమస్యలు బాదిస్తాయి మోకాళ్ళ నొప్పులు కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోండి. సమయానికి భోజనం చేయుట అలాగే మంచిఆహారాన్ని తీసుకోండి. కుటుంభంలో మనస్పర్థలు కలుగుతాయి వివాదములు కలుగుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో కూడా చిన్న చిన్న సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. ఒకవార్త మీలో నిరుత్సాహంను పెంచుటకు అవకాశం కలదు మానసికంగా దృడంగా ఉండుట మంచిది. వారం చివరలో అనుకున్న పనులను సమయానికి పూర్తిచేయుటకు అవకాశం కలదు. వారం చివరలో మొదటినుంచి ఎదుర్కొన్న సమస్యల నుంచి ఊరటను పొందుటకు అవకాశం కలదు. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు వీలయితే వాయిదా వేసుకోవడం ఉత్తమం. గాయములు అయ్యేందుకు అవకాశం కలదు తగిన జాగ్రత్తలు తీసుకోండి. బంధువులతో మాటపట్టింపులకు పోకపోవడం సూచన నిదానంగా వ్యవహరించుట మేలుచేస్తుంది. స్త్రీ / పురుష సౌఖ్యంను పొందుటకు అవకాశం కలదు. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం కలదు. నూతన ఆలోచనలు చేయుటకు పెద్దల సహకారం అవసరం నిదానంగానైన మీ ఆలోచనలు జరుగుటకు అవకాశం ఉంది. మంచి ఫలితాలు పొందుటకు సుబ్రమణ్య అభిషేకం,ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుట అలాగే గణపతిని ఆరాధన చేయుట మంచిది.  

మిథున రాశి
ఈవారం కొని విషయాల్లో అనుకూలమైన ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. బంధుమిత్రులతో ఏవైనా పనులను చేపడితే జాగ్రత్తగా మసలు కోవడం మంచిది. సమయానికి భోజనం చేయుట మంచిది సరైన ఆహారం తీసుకోవడం సూచన. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయగలుగుతారు. కుటుంభసభ్యులతో కలిసి నూతన ఆలోచనలు చేస్తారు సంతోషంగా గడుపుతారు. మీ ఆలోచనల మూలాన సమాజంలో గౌరవాన్ని పొందుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది ధనలాభంను పొందుటకు అవకాశం కలదు. వారం చివరలో మాత్రం అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు చేపట్టండి. వారం మధ్యలో చిన్న విషయానికే కుటుంభంలో మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది కావున జాగ్రత్తగా ఉండుట మంచిది. మీరున్న ప్రదేశంలో కాకుండా మరొక ప్రదేశంలో నివసించవలసి రావొచ్చును ప్రయాణాలు కలిసి రాకపోవచ్చును. బంధువులతో పనులు చేయునప్పుడు నిదానంగా ఉండుట మంచిది వారితో మాటపట్టింపులకు పోకపోవడం మేలుచేస్తుంది. అనుకోని ఖర్చులను పొందుటకు అవకాశం కలదు కావున జాగ్రత్తగా ఉండుట మంచిది. సహావాసం మూలాన లేని పోనీ ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు. చంచల మనస్సును కలిగి ఉండుట చేత సరైన నిర్ణయాన్ని తీసుకోవడంలో విఫలం చెందుతారు. ఉద్యోగంలో కొంత చిరాకును పొందుటకు అవకాశం కలదు మీరు ఆశించిన విధంగా ఉండకపోవచ్చును. నూతన పరిచయాల మూలాన కొత్త కొత్త ఆలోచనలు చేయుటకు అవకాశం కలదు చేయుపనిలో నిదానం అవసరం. ఉత్తమ ఫలితాల కోసం శివాభిషేకం,లక్ష్మీదేవికి అర్చన ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరం చదువుట మంచిది. 

కర్కాటక రాశి
ఈవారం మాములుగా ఉంటుంది ఉన్నదానిలో సర్దుకుపొండి మంచిది. వివిధపనుల నిమిత్తం అధికంగా ప్రయాణం చేయుట మూలాన అలసిపోవుట అలాగే ధనాన్ని ఖర్చుపెట్టుటకు అవకాశం కలదు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మేలు. వారం ఆరంభంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవడం మూలాన మీరు ఊహించని ఫలితాన్ని పొందుటకు అవకాశం కలదు. ఆశుభవార్త మూలాన భాదను పొందుటకు అవకాశం కలదు. నిదానంగా ఆలోచించుట మూలాన మేలుజరుగుతుంది. వారం మధ్యలో కుటుంభసభ్యుల సహకారంతో పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో నిదానంగా పుంజుకుంటారు. మీరు చేయు ఆలోచనల మూలాన తోటివారు లాభంను పొందుటకు అవకాశం కలదు అందువలన పేరును కలిగి ఉంటారు. వ్యాపారస్థులు నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు ఆలోచించి చేయుట మూలాన లాభంను పొందుటకు అవకాశం ఉంది. పనిభారం మూలాన వారం చివర్లో అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం కలదు తగిన జాగ్రత్తలు తీసుకొనుట అలాగే సమయానికి భోజనం చేయుట మంచిది. నూతన ప్రయత్నాలలో మొదట్లో నిదానంగా ఆరంభం అయినప్పటికిని వారం మధ్యనుంచి పనులలో విజయాన్ని పొందుటకు అవకాశం కలదు. బంధువులతో నిదానంగా వ్యవహరించుట మేలుచేస్తుంది లేకపోతే మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది. స్థానచలనం కలుగుటకు అవకాశం కలదు గతంలో ఉద్యోగంలో బదిలీకోసం ప్రయత్నం చేసిఉంటె అవిజరుగుటకు అవకాశం కలదు. నూతన వస్తువులను మాత్రం కొనాలి అని ఆలోచన చేస్తే వాయిదా వేసుకొనే ప్రయత్నం చేయుట మంచిది ఆలోచనలు తగ్గించుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. మంచి ఫలితాలకోసం సాయిబాబా ఆలయం వెళ్ళండి, ప్రతిరోజు శివాష్టకం చదువుట అలాగే ఆదిత్యహృదయం పారాయణ మేలు.   

సింహ రాశి
ఈవారం బాగుంటుంది నూతన ఆలోచనలు చేయుట ప్రణాలికా ప్రకారం వెళ్ళుట అలాగే శ్రమించుట చేత మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. నూతన పనులకు శ్రీకారం చుడతారు. వారం ఆరంభంలో మాత్రం మానసిక ఆందోళనను కలిగి ఉంటారు ఆలోచనలను అధికంగా కలిగి ఉండుటకు అవకాశం కలదు. అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం కలదు తగిన జాగ్రత్తలు పాటించుట మంచిది. బాగాఆలోచించి పనులను ఆరంభించుట మంచిది వారం మధ్యనుంచి అనుకున్న పనులు ముందుకు సాగుతాయి. కుటుంభసభ్యుల సహకారం అందుతుంది సంతోషంగా గడుపుటకు అవకాశం కలదు. సమాజంలో గుర్తింపు కోసం చేయు పనులు లాభిస్తాయి గౌరవాన్ని పొందుతారు. అధికంగా సంచారం చేయవలసి రావొచ్చును నిదానంగా ప్రవర్తించుట జాగ్రత్తగా పనులను కొనసాగించుట చేత ఇబ్బందులు తగ్గుటకు అవకాశం కలదు. బాగా ఉత్సాహంను కలిగి ఉంటారు కాకపోతే అదేఉత్సాహంను చివరి వరకు కొనసాగించుట చేత లాభాపడుతారు. గతంలో చేపట్టిన పనులకు సంభందించిన లాభంను పొందుతారు. అనేకములైన కార్యక్రమాలను చేపడుతారు శత్రువులను ఇబ్బంది పెట్టుటకు అవసరమైన ఆలోచనలను చేస్తారు విజయం సాదిస్తారు. చేపట్టిన పనులకు సంభందించి వారం చివరలో విజయంను పొందుతారు. భోజనం విషయంలో ప్రత్యేక ఇస్టంను కలిగి ఉంటారు భోజన సౌఖ్యంను కలిగి ఉంటారు. మీయొక్క సొంతగ్రామము పైన మక్కువను ప్రదర్శించుటకు అవకాశం కలదు. మంచి ఫలితాల కోసం దుర్గాదేవికి కుంకుమ అర్చన చేయుట,సుబ్రమణ్య అభిషేకం చేయుట అలాగే ప్రతిరోజు కనకధారస్తోత్రం చదువుట ఉత్తమం.      

కన్యా రాశి
ఈవారం కొద్దిగా అనుకూలమైన ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. ఉద్యోగులు అధికారులనుంచి ప్రశంసలు పొందుటకు అవకాశం కలదు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. రాజకీయాల పట్ల మక్కువను ప్రదర్శించుటకు అవకాశం కలదు. మీపై అధికారులతో సమాలోచనలు చేస్తారు. నిరుద్యోగులు గట్టిగా ప్రయత్నం చేయుట ద్వార రాణిస్తారు నిదానంగా వేచిచూసే దొరని వలన మేలుజరుగుతుంది. వారం ఆరంభంలో ఇష్టమైన వారిని కలుస్తారు వారితో సమాలోచనలు చేయుటకు అవకాశం కలదు మనోదైర్యంతో పనులను ఆరంభించుట మంచిది. వారం మధ్యలో ఆలోచనలు అధికంగా చేయుటకు అవకాశం కలదు ఆలోచనలు తగ్గించి వాటిని అమలుచేయుట ఉత్తమం. మీరు ఊహించిన ఫలితాలు రాకపోవడం చేత నిరుత్సాహంను భాదను పొందుటకు అవకాశం ఉంది. వారం చివరలో పెద్దల సూచనలతో కుటుంభసభ్యుల సహకారంతో పనులను ముందుకు కొనసాగిస్తారు ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. అనారోగ్య అవకాశాలు కలుగుటకు అవకాశం కలదు జాగ్రత్తగా ఉండుట మంచిది. కుటుంభంలో సర్దుకుపోవాలి అలాగే పనుల విషయంలో అలసత్వంగా ఉంటే పనులు ఆలస్యంగా ఆరంభమవుతాయి. మీ ఆలోచనలు తిరస్కరించబడినను వాటిని పట్టించుకోక ముందుకు వెళ్ళుట మూలాన మంచి జరుగుతుంది. అకారణంగా తిరుగుట మూలాన సమస్యలను పొందుటకు అవకాశం కలదు వీలయితే అనవసరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. స్త్రీలకు సంభందించిన విషయాల్లో తలదూర్చకండి వివాదములకు దూరంగా ఉండుట సూచన. ప్రతిపనిని నిదానంగా ఆలోచించి చేయుట తప్పక మేలుచేస్తుంది. మరిన్ని ఫలితాల కోసం ప్రతిరోజు దేవాలయం వెళ్ళుట,ప్రతిరోజు సూర్యనమస్కారం చేయుట అలాగే శ్రీరామరక్షాస్తోత్రం చదువుట మంచిది.   

తులా రాశి
ఈవారం ప్రతిపనిని జాగ్రత్తగా చేపట్టుట ద్వార మేలుజరుగుతుంది. మిత్రులతో సమాలోచనలు చేయునప్పుడు ఆచితూచి వ్యవహరించుట మంచిది కోపాన్ని అదుపులో ఉంచుకొనే ప్రయత్నం మంచి ఫలితాలను కలుగజేస్తుంది. అకారణంగా ఖర్చులను కలిగి ఉంటారు సాధ్యమైనంత వరకు నిదానంగా ఉండుట అలాగే నూతన ఆలోచనలకు కొంత సమయాన్ని తీసుకోవడం ఉత్తమం. మానసికంగా ఒత్తిడిని పొందుటకు అవకాశాలు కలవు. మీ మాటలను జాగ్రత్తగా వాడుట మూలాన సమస్యలు తగ్గుటకు అవకాశం కలదు. వారం మధ్యలో కొంత సమయం అనుకూలంగా ఉంది సమయాన్ని వృధాచేయకుండా ప్రణాలిక ప్రకారం వెళ్ళుట మంచిఫలితాలను కలుగజేస్తుంది. వారం చివరలో మీరుఊహించని సంఘటనలు జరుగుటకు అవకాశం కలదు నిరుత్సాహంను పొందుతారు. తప్పక అడ్జస్ట్ కావడం అనేది అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులను కలిగి ఉంటారు. వాహనముల విషయంలో జాగ్రత్తగా ఉండుట సూచన ప్రమాదాలు సంభవించుటకు అవకాశం ఉంది. మీ ఆలోచనలు తలక్రిందులు అవడం చేత సమస్యలను పొందుతారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. భోజనం విషయంలో అశ్రద్ద పాటించకండి సరైన సమయానికి భోజనం చేయుట మంచిది. పెద్దల సూచనలు పాటిస్తే లాభంను పొందుతారు లేకపోతే ఆలస్యంగా పనులు జరుగుతాయి దుఃఖాన్ని పొందుతారు. మంచి ఫలితాల కోసం ప్రతిరోజు నవగ్రహల చుట్టూత ప్రదక్షణలు చేయుట అలాగే ప్రతిరోజు దుర్గాస్తుతి చేయుట మంచిది.  

వృశ్చిక రాశి
ఈవారం మిశ్రమ ఫలితాలను పొందుతారు కాకపోతే చేసేపనిలో సమయపాలన అవసరం. మీయొక్క వ్యతిరేక వర్గం నుండి సమస్యలు పెరుగుటకు అవకాశం కలదు నిదానంగా ఉండుట వారికి మీ ఆలోచనలు తెలివకుండా జాగ్రత్తగా ఉండుట మంచిది. వారం ఆరంభంలో మృష్టాన్నభోజన ప్రాప్తిని కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది అనుకున్న పనులను నిదానంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. పనులలో ఉత్సాహంను కలిగి ఉంటారు కాకపోతే మీయొక్క మాటలను పొదుపుగా వాడుట మూలాన మేలుజరుగుతుంది. ఇష్టమైన వారిని కలుస్తారు సమాలోచనలు చేయుటకు అవకాశం కలదు. వారంచివరలో అతిగా ఆలోచనలు చేయుట మూలాన మానసికంగా ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు. తలపెట్టిన పనులలో ఆటంకాలు కలుగుటకు అవకాశం కలదు జాగ్రత్త. అశుభవార్తను వినుటకు అవకాశం కలదు కుటుంభంలో నూతన ఆలోచనలు చేయకండి అందరిని కులుపుకొని వెళ్ళుట మూలాన మేలుజరుగుతుంది. మీ ప్రవర్తన కొంత అనుమానించేదిగా ఉండుట మూలాన అవకాశాలు కోల్పోవుటకు అవకాశం ఉంది. అధికారులతో నిదానంగా ప్రవర్తించుట అలాగే వారికి అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. విందులు పట్ల మక్కువంను కలిగి ఉంటారు ఖర్చులను పొందుటకు అవకాశం కలదు. చేయుపనిలో అధికమైన శ్రమను పొందుటకు అవకాశం కలదు. మరిన్ని మంచిఫలితాల కోసం వేంకటేశ్వరస్వామికి అర్చన అలాగే గుడిలో 17 ప్రదక్షణలు చేయుట మంచిది అలాగే ప్రతిరోజు లలితాసహస్రనామం పారాయణ మేలుచేస్తుంది.        

ధనస్సు రాశి
ఈవారం బాగనే ఉన్నప్పటికిని నిదానంగా వ్యవహరించుట మంచిది. ఆవేశాలకు పోతే వివాదములు కలుగుటకు అవకాశం కలదు. చేపట్టిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు కలుగుటకు అవకాశం కలదు కాని శ్రమను పొందితే విజయాన్ని చేరుకుంటారు. వారం ఆరంభంలో ఆర్థికపరమైన ఇబ్బందులను పొందినను వెంటనే కోలుకొనే అవకాశం కలదు. మృష్టాన్నభోజనప్రాప్తిని కలిగి ఉంటారు.  వారంమధ్యలో పనులలో వేగాన్ని పొందుతారు తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. ఉత్సాహంను కలిగి ఉండి నూతనపనులను చేపడుతారు అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేయుటకు అవకాశం ఉంది. మీయొక్క మాటలను జాగ్రత్తగా వాడినచో సమస్యలు తగ్గుటకు అవకాశం కలదు. అనారోగ్యం విషయంలో కూడా అశ్రద్ద కూడదు తగిన జాగ్రత్తలు ముందే తీసుకోవడం మూలాన మేలుజరుగుతుంది. వారం చివరలో ఇష్టమైన వారిని కలిసే అవకాశం కలదు నూతన ఆలోచనలు చేస్తారు ఆదిశగా ముందుకు వెళ్తారు. చేపట్టిన పనులలో ధనలాభంను కలిగి ఉంటారు. ఇతరులకు సేవచేయుట ద్వార కీర్తిని పొందుటకు అవకాశం కలదు. అధికారులతో మీ ఆలోచనలను పంచుకొనుట వారికి అనుగుణంగా నడుచుకొనుట తప్పక ఫలితాలను కలుగజేస్తుంది. రాజకీయ వ్వహారాలలో రాణిస్తారు గత కొంత కాలంగా ఎదురుచూస్తున్న ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. అందరిలోను గుర్తింపుకోసం చేయుపనిలో రాణింపు ఉంటుంది అనుకున్న లక్ష్యాలను చేరుకొనే అవకాశం కలదు. కోపంను అదుపులో ఉంచుకొనుట నిదానంగా ఉండుట కూడా మేలుచేస్తుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది మీరు ఎదురుచూస్తున్న ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. ఉత్తమ ఫలితాల కోసం లక్ష్మీనరాయనున్ని ఆరాధన చేయుట,నరసింహాస్వామిని పూజించుట అలాగే ప్రతిరోజు లక్ష్మీఅస్టోత్తరం చదువుటమంచిది.

మకర రాశి
ఈవారం మిశ్రమ ఫలితాలను పొందుటకు అవకాశం కలదు అధికమైన ఫలితాలను కోసం ఆశించకుండా శ్రమించుట చేత ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేయుట వలన మంచి పేరును కలిగి ఉంటారు. ప్రయత్నాలలో విజయంను పొందుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది ధనలాభంను కలిగి ఉంటారు. వారం ఆరంభంలో బంధుమిత్రులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు భోజన సౌఖ్యంను కలిగి ఉంటారు ఉత్సాహంను కలిగి ఉండి చేపట్టిన పనులలో దూసుకుపోవుటకు అవకాశం కలదు. వారం మధ్యలో ఖర్చులను పొందుతారు మానసికంగా ఆలోచనలు పెరుగుటకు అవకాశం కలదు. అకారణంగా విరోధముల కలుగుటకు అవకాశాలు కలవు జాగ్రత్తగా ఉండుట చేత మంచి జరుగుతుంది. వారం చివరలో మాటను అదుపులో ఉంచుకొనుట అందరిని కలుపుకొని వెళ్ళుట ఉత్తమం. పెద్దల సూచనలు సలహాలను పాటిస్తూ ముందుకు వెళ్ళుట ద్వార మేలు జరుగుతుంది. సమయానికి భోజనం చేయుటకు వీలుగా మీ ఆలోచనలు కలిగి ఉండుట మంచిది. చర్చలలో పాల్గొంటారు మీ ఆలోచనలు అందరితోను పంచుకొనుటకు అవకాశం కలదు. వినొదములలొ పాల్గొంటారు వాటిపట్ల ఆసక్తిని చూపిస్తారు. అధికారుల వలన అలాగే ప్రమాదకర వస్తువుల వలన సమస్యలు కలుగుటకు అవకాశం కలదు జాగ్రత్తగా ఉండుట మంచిది. కుటుంభసభ్యుల వలన శ్రమను ఇబ్బందిని పొందుటకు అవకాశం కలదు. శత్రువులు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తారు. స్త్రీలకు సంభందించిన విషయాల్లో నిదానంగా ఉండుట బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొనుట మంచిది. మరిన్ని ఫలితాల కోసం శివాభిషేకం చేయుట ప్రతిరోజు శివస్తోత్రం చదవండి అలాగే సుబ్రమణ్య ఆలయం వెళ్ళుట మంచిది.    

కుంభ రాశి
ఈవారం మీ ఆలోచనల్లో మార్పులు చోటుచేసుకొనే అవకాశం కలదు. బంధుమిత్రుల మూలాన ధనవ్యయాన్ని పొందుటకు అవకాశం కలదు నిర్ణయాలలో కొంత తడబాటును పొందినను తెరుకొనెఅవకాశం కలదు. వారం ఆరంభంలో మీరుచేపట్టిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి వాటిని విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. ఇష్టమైన వారితో మీ ఆలోచనలను పంచుకొనే అవకాశం కలదు నచ్చిన పనులను చేపడుతారు. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు మృష్టాన్నభోజన ప్రాప్తిని కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ముందడుగు ఉంటుంది ధనలాభంను పొందుతారు. వారం చివరలో పనిఒత్తిడిని పొందుటకు అవకాశాలు కలవు అలాగే ఆలోచనల్లో ఇబ్బందులు కలుగుతాయి నిదానంగా ఉండుట మంచిది. చేయుపనిలో ఉత్సాహంను పొందుటకు ప్రయత్నం చేయుట వలన పనులనుముందుకు కొనసాగిస్తారు. బంధువులతో కలిసి పనిచేయాల్సి వస్తే నిదానంగా ఉండుట మాటపట్టింపులకు పోకపోవడం మంచిది. అకారణంగా భయంను పొందుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో మీ ఆలోచనలు మంచి ఫలితాలను కలుగజేస్తాయి. అధికారుల నుండి ప్రశంశలు పొందుటకు అవకాశం కలదు. కుటుంభంలో వచ్చిన చిన్న చిన్న మార్పులు మీలో సంతోషాన్ని కలుగజేస్తాయి. క్రిందిస్థాయి వారి వలన లాభంను పొందుటకు అవకాశం కలదు వారుచేపట్టిన పనులు మీకులాభంను తెచ్చిపెడతాయి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయుట మూలాన మీరు ఆశించిన ఫలితాలు కలుగుటకు అవకాశం అదేవిధంగా కొంత వేచిచూడడం మంచిది. ఉత్తమ ఫలితాల కోసం కనకధారాస్తోత్రం చదవండి, ప్రతిరోజు లక్ష్మీదేవిని ఆరాధన చేయుట అలాగే దక్షిణామూర్తి స్తోత్రం పాటించుట మంచిది.  

మీన రాశి
ఈవారం మీరు ఆశించిన ఫలితాలు నిదానంగా రావడానికి అవకాశం కలదు. ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుటకు అవకాశం కలదు అధికమైన ప్రయత్నం చేయుట మంచిది. ప్రయాణాలలో ఆటంకాలు ఎదుర్కొంటారు వీలయితే ప్రయాణాలు వాయిదవేయుట మంచిది. వారం ఆరంభంలో కొంత చికాకులను పొందుటకు అవకాశం కలదు ఆశించిన పనులలో స్వల్ప ఆటంకాలు కలుగుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో కూడ అసంతృప్తిని కలిగి ఉంటారు. అనారోగ్యం విషయంలో కొంత శ్రద్దచూపుట మంచిది. వారం మధ్యనుంచి మీరు ఆశించిన ఫలితాలు రావడం ప్రయత్నాలలో అనుకూలతలు పెరుగుతాయి. తలపెట్టిన పనులను సకాలంలో పూర్తిచేయుటకు అవకాశం కలదు. బంధువులతో లేదా మిత్రులతో కలిసి సమయాన్ని కేటాయించే అవకాశం ఉంది భోజన సౌఖ్యంను కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగుటుంది ధనలాభంను పొందుతారు. నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు. ఆలోచనలను అదుపులో ఉంచుకొనుట అకారణంగా వచ్చు ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేయుట మంచిది. ఇష్టమైన పనులలో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. కుటుంభంలో సౌఖ్యంను పొందుతారు అనుకున్న విషయాల్లో ముందుకు వెళ్తారు. మాత్రుసౌఖ్యంను కలిగి ఉంటారు మీ ఆలోచనలను అమ్మతో పంచుకొనే అవకాశం ఉంది వారినుంచి సహయంను పొందుతారు. ఆలోచనలో స్థిరంగా ఉంచే ప్రయత్నం చేయండి బాగా దైవద్యానం అవసరం ఓపికతో వేచిచూడడం అనేది ఫలితాలను కలుగజేస్తుంది. పెద్దలతో మీకున్న పరిచయాల మూలాన కొన్ని పనులు ముందుకు సాగుతాయి లాభంను పొందుతారు. ఆకస్మిక అపాయములు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండుట సూచన మంచి ఫలితాల కోసం సుబ్రమణ్య ఆరాధన, వేంకటేశ్వర ఆలయం వెళ్ళండి అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ మంచిది.

మరిన్ని శీర్షికలు
Golconda Fort